Menu

Monthly Archive:: December 2008

ట్వైలైట్

కం. పొరబడి పేరంటంలో జొరబడి చతికిలబడి మనసొప్పనిదైనా స్థిరపడినందుకు వ్యధపడి భరియించి తుదకు త్వరపడి బయటపడితిరోయ్ క్లుప్తంగా చెప్పాలంటే అలాంటిదే ట్వైలైట్ అనుభవం కూడాను. శనివారం ఉదయం పదకొండు గంటల సమయానికి ఇంటిదగ్గర ఉన్న హాలులో యస్ మాన్ ఆడుతోందేమో చూద్దామనుకొని వెళ్ళి, త్వరలో ఆటేదీ లేదని తెలిసాక, మరో ఐదు నిమిషాలలో ట్వైలైట్ ప్రారంభం కానున్నదిని గమనించి, అది మొదటి వారంలో అమెరికాలో ఢంకా మ్రోగించిందని లీలగా గుర్తురావడం వలన ఆబతో డబ్బుపెట్టేయడం ఆ అనుభవానికి

ప్రకటన-వెంటనే కావలెను

వెంటనే కావలెను-ప్రేక్షకులు: తెలుగు సినిమా వేగంగా అభివృధ్ది చెంది దేశంలోనే రెండో స్ధానంలో ఉండి మరింత విస్తరించటానికి రెడీ గా ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు ఈ క్రింద తెలిపిన అర్హతలు కల వారు కావెలెను. భారీ బడ్జెటులతో నిర్మించే మా నీచమైన చిత్రాలకు భారీగా ప్రేక్షకులు కావలెను. అర్హతలు రెండు కళ్లతో సరిగ్గా చూడగలిగినారు (మెదుడు లేకపోవటం మరీ బెస్ట్) ఎటు వంటి చెత్త చిత్త తీసినా ఆహా..అధ్బుతం అనుకుంటూ చూసే ఓపిక ,తీరిక అత్యవసరం.

ది మెజెస్టిక్

హాలీవుడ్ హాస్య చిత్రాలనగానే నేటి తరం ప్రేక్షకులకి గుర్తొచ్చే మొదటి పేరు: జిమ్ క్యారీ. ‘ది మాస్క్’, ‘ఏస్ వెంచురా: పెట్ డిటెక్టివ్’,  ‘లయర్-లయర్’, ‘డంబ్ అండ్ డంబర్’, ‘హౌ ది గ్రించ్ స్టోల్ క్రిస్మస్’,  ‘బ్రూస్ ఆల్‌మైటీ’ వంటి హిట్ చిత్రాలతో హాస్యనటుడిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడీ ప్రతిభావంతుడు. క్యారీ పేరు చెప్పగానే అతని ఎలాస్టిక్ ముఖమే మదిలో మెదులుతుందెవరికైనా. ఐతే జిమ్ క్యారీ హాస్య చిత్రాలకే పరిమితమవకుండా ‘ది ట్రూమాన్ షో’, ‘ఎటర్నల్ సన్‌షైన్

Oh my god! (2008) – మరో వ్యూ

ఈమధ్యే వస్తున్న బాలీవుడ్ సినిమాలలో కాస్త వైవిధ్య భరితమైన కథలతో మన ముందుకొస్తున్న వాటిలో వినయ్ పాథక్ సినిమాలు ప్రధానమైనవి. కథ పూర్తిగా కొత్తది కాకపోవచ్చు కానీ, ఇతని సినిమాల దర్శకులంతా కూడా వీలైనంత సృజనాత్మకతను కథనంలో చూపిస్తూ ఉండటంతో ఈ సినిమాలు కాస్త భిన్నంగా అనిపిస్తున్నాయి. దస్విదానియాకి పేరు వచ్చినన్ని రోజులు కాలేదు, ఇంతలోపే మరో సినిమా వచ్చేసింది. “ఓ మై గాడ్” కేవలం పందొమ్మిది రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుందని ఏదో సైటులో చదివాను.

ఏప్రిల్ 1 విడుదల

ఆరేళ్ల క్రితం ఓ ఆంగ్ల పత్రిక వంశీని ఇంటర్వ్యూ చేస్తూ ‘మీరు తీసిన సినిమాల్లో మీకిష్టమైన సినిమా?’ అని అడిగితే, దానికి వంశీ సమాధానం: ‘సితార లో కొంత భాగం, ఏప్రిల్ 1 విడుదల లో కొంత భాగం’ అని. మనం ‘సితార’ గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇప్పుడిక ‘ఏప్రిల్ 1 విడుదల’ గురించి. తెలుగు సినిమాల గురించి ఏమాత్రం ఆసక్తి ఉన్నవాళ్ల దగ్గరైనా ఈ సినిమా పేరు చెప్పి చూడండి. అప్రయత్నం గానే వాళ్ల ముఖంలో