Menu

Monthly Archive:: December 2008

Oye Lucky! Lucky Oye!

సీ. ఉన్నది, లేనిది, చిన్నది, పెద్దది, సొంతము కాదని చూసుకోడు మెచ్చిన వస్తువు నచ్చినరీతిన చంకనవేసుకు జారుతాడు బాకులు కత్తులు పట్టని చోరుడు, మాయలు నేర్చిన మాటకారి తీయని తేనెల మాయల మాటల మూటలు మోసిన మోసగాడు ఆ. ఎట్టివారి నైన బుట్టలో పడవేయ బూటకాల నల్లు ఆటగాడు రెప్పపాటులోపె తప్పుకు పోతాడు హుళకి చేసి సొత్తు హొయల ‘లక్కి’ దివాకర్ బెనర్జీ దర్శకత్వంలో వచ్చిన రెండవ చిత్రం ఓయే లక్కీ లక్కీ ఓయే తెర వెలిగించిన

అర్ధసత్య (1983) – ఒక పరిచయం

సినిమా: అర్థసత్య నటీనటులు: ఓంపురి,స్మితా పాటిల్, అమ్రిష్ పురి, సదాశివ్ అమ్రపుర్కర్, నసీరుద్దీన్ షా మొదలైన వారు దర్శకత్వం: గోవింద్ నిహలాని సమకాలీన భారతీయ సినిమాలలో అత్యంత చర్చనీయమైన, ఆర్ధికంగాకూడా సఫలమైన చిత్రాలలో గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించిన ‘अर्थ् सत्य् – అర్ధసత్య’ ఒకటి .  Mainstream యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్ పాత్రలకి ధీటుగా అర్థవంతమైన,ఆలోచనాత్మకమైన,అత్యంత సహజమైన, సందిగ్ధభరితమైన angry young man ను ‘అనంత్ వేలాంకర్’ (ఓంపురి) పాత్రద్వారా భారతీయ తెరకు

Mandi

ఒక చిన్న కధ నుంచీ మొదలు పెట్టి ఈ సినిమా తీసారు.  ఇండియా లో మంచి మంచి నటులందరూ శ్యాం బెనగల్ దర్శకత్వంలో జీవాన్ని పోస్తూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించి, మండీ (అంగడి) సినిమాని ఒక లలితమయిన కళారూపంగా మన ముందు ఉంచుతారు.  థియేటర్ ఆర్టిస్టులు స్టేజ్ ను ఏలి నట్టు, ఈ నటీ నటులంతా స్క్రీన్ ను ఏలేస్తారు. ఎపుడో చిన్నపుడు చూసిన సినిమా యూ ట్యూబ్ లో ఉచితంగా దొరికితే హాయిగా

రబ్నే బనాదీ “సిల్లీ” జోడీ (నా ‘వ్యూ’)

నిన్ననే ‘రబ్నే బనాదీ జోడీ’ ఈ సినిమా చూసాను. నవతరంగంలో సమీక్ష చదివిన తరువాత కూడా ప్రజకు సినిమాలు చూడ్డం మానెయ్యరనడానికి నేనే ఒక ఉదాహరణ. ‘అహనాపెళ్ళంట’ సినిమాలో నూతన్ ప్రసాద్, రాజేంద్రప్రసాద్ తో “ప్రేమరా కృష్ణా..ప్రేమ” అనే డైలాగ్ టైపులో “సినిమాల మీద ప్రేమరా కన్నా ప్రేమ” అనుకోవాలేమో! యష్ చోప్రా నిర్మాణం, ఆదిత్య చోప్రా తృతీయ చిత్రం పైగా షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం చూడకపోతే ఎట్లా!? చూసేసాను. అలా అనడంకన్నా, ‘భరించాను’ అనడం

నవ్వుల (రాజు) బాబు…:)

“నీ జడ పిన్ను నా తలరాతకు పెన్ను నీ సిగపువ్వు అదేంటమ్మా… ఆ.. బుజబుజరేకుల నవ్వు” ” రాజమండ్రి స్టేషన్లో రైలెక్కి బొంబాయి స్టేషన్లో దిగుదామా!” “ఏయ్ ! వాన్ని నేను నలికేత్తాను తల్వాతేమయిందో చెప్పూ” “చాకిరేవుకాడా నీ సోకు, చూడగానే జిల్లంది నాకు” ఈ పాటలు వింటుంటే ఎవరు గుర్తొస్తున్నారు??  వెదురు బద్దలా గాలికి ఊగుతున్నట్టుగా అటు ఇటు ఊగుతూ, అమాయకపు నవ్వులతో మనకు కితకితలు పెట్టే నవ్వుల రాజు .. రాజబాబు.  అంతే ఈ