Menu

Monthly Archive:: December 2008

‘ఆలోచన’కు అక్షరాభ్యాసం చేయించిన బి. నర్సింగరావు

‘ఆలోచన’కు అక్షరాభ్యాసం అన్న ఈ శీర్షిక పేరు చూడగానే “అంటే! అంతకుముందు వచ్చిన చిత్రాలు ఆలోచనలను రేకెత్తించేవి కావా?” అని ఆవేశానికి లోనవకండి. కావొచ్చు. కానీ, ఆ ఆలోచనలకూ, నర్సింగరావు రేకెత్తించే ఆలోచనలకూ చాలా తేడా ఉంది. ఏ సగటు తెలుగు సినిమాను తీసుకున్నా, అది తయారుచేయటానికి ముడిసరుకు (ఫార్ములా అని మనం అనేది) ఒకటే. ఒక హీరో, హీరోయిన్, ఏదో ఒక రూపంలో విలన్ లేదా విలనిజం – ఇవి తప్పకుండా కావలసిన దినుసులు. బిర్యానీలో

హిట్ ఫార్మూలా అంటూ ఏదయినా వుందా?

సాధారణంగా సినిమాలు తీసేవారు రిస్కు తీసుకోటానికి ఇష్ట పడరు. సినిమా నిర్మాణం డబ్బుతో కూడిన వ్యవహారం. కాబట్టి ఒక్క సారి నష్టం వస్తే దాదాపుగా దివాళా తీయటం తప్ప వేరే మార్గం లేదు. అలాగే నష్టం పూడ్చుకోవాలన్నా ఇంకో సినిమా తీయటం తప్ప మరో దారి లేదు. ఇటీవలే ఒక నిర్మాతను కలవటం తటస్థించింది. ఆయన చాలా మంచి సినిమాలు నిర్మించాడు ఒకప్పుడు. మాటల సందర్భంలో ఆయన సినిమాలు తీయటం ఎందుకు మానేశాడో చెప్పాడు. హిట్ సినిమాలు

ది క్యూరియస్ కేస్ ఆఫ్ ‘బెంజిమన్ బటన్’

న్యూఆర్లియన్స్, లూసియానా 2005. కత్రీనా కన్ను ఆ నగరం పై పడ్డ వేళ.. ఓ ఆసుపత్రిలో మరణశయ్యపై ఓ వృద్ధురాలు. పక్కనే ప్రౌఢ వయస్సులో ఉన్న అమె కూతురు. ఆమె చేతిలో ఓ పుస్తకం. అది వేరెవరిదో కాదు మన కథానాయకుడు ‘బెంజిమన్ బటన్’ రాసుకొన్న డైరీ. ఇక్కడి నుంచి కథ ప్రారంభం అవుతుంది. అక్కడ ఒక్కో పేజీ తిప్పుతూంటే ఇక్కడ బెంజిమన్ జీవితంలో ఒక్కో ఘట్టం మన ముందుకు వచ్చి పోతూంటుంది. ఏ కథకైనా ప్రారంభం,

సావిత్రి స్మృతిలో

నిన్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో “మహానటి సావిత్రి” అన్న పుస్తకం కొన్నాము, రెండొందల రూపాయలు పెట్టి. సావిత్రిని గురించి రకరకాల వ్యక్తులు రాసిన రకరకాల వ్యాసాల సంకలనం. సంకలనకర్త – హెచ్.రమేష్‍బాబు. పుస్తకం ఒక్కోపేజీ చదువుతూ ఉంటే, మనసంతా అదోలాగా అయిపోయింది. అదేపనిగా చదివితే కళ్ళలోంచి నీళ్ళొస్తాయేమో అన్న అనుమానం కొద్దీ అనేక విరామాల మధ్య చదివాను పుస్తకాన్ని. సావిత్రి జీవితంలోని విషాదాల ప్రస్తావన అన్ని వ్యాసాల్లోనూ ఉండటమే దీనికి కారణం. అయితే, ఈ సందర్భంలోనే

ఎకనామిక్ టైమ్స్ లో

ఈ వారం ఎకనామిక్ టైమ్స్ లో “Techie’s Reel Side” అని ఒక వ్యాసం ప్రచురించారు. అందులో నా గురించి కూడా వ్రాసారు. నిజానికి నేను నవతరంగం గురించి కూడా చాలా వ్రాసాను. కానీ వాళ్ళు దాని గురించి ఏమీ ప్రస్తావించకపోవడం కొంచెం బాధ కలిగింది. ఎకనామిక్ టైమ్స్ లో వచ్చిన వ్యాసమూ, మరియు దానితో పాటు అంతకు ముందు వాళ్ళు నన్ను చేసిన ఇంటర్వ్యూ క్రింద ప్రచురిస్తున్నాను. చదివి మీ అభిప్రాయాలు తెలియచేయండి. ధన్యవాదాలు TECHIES’