మనస్సు దోచే ‘లక్కీ’నే…కానీ

ఈ సినిమా చూస్తుంన్నంత సేపూ కొద్ది పాటి అసహనం మనస్సులో కదులుతూనే ఉంది. అయితే ఒక్కసారిగా సినిమా పూర్తయి హమ్మయ్య అనుకుని బయిటకు వచ్చాక మరో సమస్య ఎదురైంది. విచిత్రంగా సినిమాలోని లక్కి పాత్ర మనస్సుని వదలి వెళ్ళనని మొరాయించటం మొదలపెట్టింది. అప్పుడర్ధమైంది డైరక్టర్ తన స్లో నేరేషన్ తో విసిగించినా మన మనస్సుని మొల్లిగా దొంగలించేసాడని. అందుకే ఆ సంఘర్షణ. అంటే అదే ఈ ‘లక్కి ఓయ్ లక్కి’ సినిమా స్పెషాలిటీ అనిపించింది.లక్కీ కదా…

కొద్ది పాటి ప్రేమ,వాత్సల్యం కోసం ఓ సామాన్యుడు చేసే నిరంతర అన్వేషణను లక్కీ పాత్ర ద్వారా దర్శకుడు నవ్విస్తూనే ఆర్ధ్రంగా చెప్పటానికి డైరక్టర్ ప్రయత్నించాడు. అలాగే డబ్బు,పేరు ప్రతిష్ట ముందు స్నేహం,ప్రేమ,రక్తసంభందం అనేవి నిలబడవని మరో సారి చెప్తాడు . దొంగ అని ముద్ర పడ్డాక తమ డబ్బులు తోనే ప్రాణం,జీవితం నిలబెట్టుకున్న ప్రాణ స్నేహితుడు సైతం తన సమయం రాగేనే తన దారి తాను చూసుకోవటాన్ని నిర్లిప్తగా వివరిస్తాడు. ప్రేమించిన అమ్మాయి అయినా ఓ రకంగా చూడ్డాన్ని ఆసక్తిగా గమనించమంటాడు. ఆఖరికి రక్తం సంభంధం సైతం ఎదురు తిరుగుటాన్ని ఆవేదనతో ఆవిష్కరిస్తాడు. ఈ క్రైమ్ కథలని ఛానెల్స్ చూపి రేటింగ్ పెంచుకోవాలనే వారిని ఫన్నిగా చూపెడతాడు. మిడిల్ క్లాస్ కుర్రాడు నుంచి మోస్ట్ వాంటెడ్ దొంగగా ఎదిగే ఎమోషనల్ జర్ని ఈ చిత్రం.

లక్కీ(అభయ్ డయోల్) మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు చెందిన డిల్లీ గల్లీ పిల్లాడు. తండ్రి(పరేష్ రావెల్) తన కళ్ళెదురుగానే తల్లిని కాదని వేరే ఆమెతో కాపురం పెడితే,ఆవిడేమో లక్కీతో నువ్వు రిషీ కపూర్ లా ఉన్నావంటూ మనస్సు పడుతుంది. ఈ స్ధితిలో ఎవరైనా ఎంత గొప్పగా ఎదుగుతారు.అచ్చం అలాగే మారాడు లక్కీ. అయితే ప్రేమ కోసం పరితపించే వాడు మంచితనాన్ని మాత్రం వదులుకోలేక పోయాడు.

లక్కీ లైఫ్ స్టయిల్ గమ్మత్తుగా ఉంటుంది. రిచ్ ఫ్యామిలీకి చెందాడన్న ఒకే ఒక కారణంతో ప్రక్క వీధి పిల్లాడని తీసుకొచ్చి తన్ని తన కసి తీర్చుకోగలడు. అలాగే నూనూగు మీసాలను సవరించుకుంటూ రోడ్డు మీద వెళ్ళే అమ్మాయికి లైట్ గా సైట్ కొట్టగలడు. అలాగే ఓ అమ్మాయికి గ్రీటింగ్ కార్డ్ ప్రెజెంట్ చేద్దామని డిస్కౌంట్ గ్రీటింగ్ షాప్ కి వెళ్ళి అక్కడున్న అమ్మాయిని ఇష్టపడి,ఆమెకే ఆ కార్డు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకోనుగలడు. ఆమెను తిప్పటం కోసం బైక్ దొంగతనానికి దిగగలడు. ఆ తర్వాత ఆ గ్రీటింగ్ కార్డ్ ని ఆమె కిస్తే …చదివి దానిపై గెట్ వెల్ సూన్ అని రాసి ఉంటే భగ్గుమంటే తలదించుకు వెళ్లిపోగలడు.

అలా అతను జీవితంలో ఓడిపోతూ…తనను తాను మానసికంగా,ఫైనాన్సియల్ గా సర్దుకుని నిలబడటానికి దొంగ(గజదొంగేమి కాదు..అలాగని మరీ చిల్లరి దొంగా కాదు)గా మారతాడు.అలాగని ఎప్పుడూ తుపాకి పట్టడు.ఎవరిపైనా చెయ్య ఎత్తడు. తన తెలివితోనే దొంగతనాలు చేస్తూంటాడు. పోలీసులకు సవాల్ విసురుతూంటాడు. గౌవరప్రదమైన దొంగగా బ్రతకాలనుకుంటాడు. అదో రకం గుర్తింపు అతనికి.దొంగతనానికి అది ఇది అని లేకుండా అన్ని ఎత్తుకుపోతూంటాడు. అది ఫ్రిజ్ అవచ్చు,కారు అవ్వచ్చు,కుక్క పిల్ల కావచ్చు,గుర్రం బొమ్మ కావచ్చు,ఓ ఫ్యామిలి ఫొటో కావచ్చు, ఓ కన్నిటి బొట్టు కావచ్చు. ఆ క్రమంలో అతనికి తోడుగా చిన్నప్పటి స్నేహితుడు బంగాలి(మను రిషి) ఉంటాడు. లక్కిది ఒకటే పాలసీ…నీకు లేకపోతే…పొందు అంతే..అలాగే అతని స్ట్రాంగ్ పాయింట్ అతని తెలివి.

దొంగిలించిన సొమ్మును గోగిభాయ్( మళ్ళి పరేష్ రావల్ )అనే దొంగ వస్తువులు అమ్మించే బ్రోకర్ ద్వారా మార్కెట్ చేస్తూంటారు. మరో ప్రక్క లక్కీ సోనియా(నీతూ చంద్ర) అనే కాలేజీ అమ్మాయితో లవ్ ఎఫైర్ ఏర్పడుతుంది. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతూంటుంది.ఈ లోగా అతనికి గోగిభాయ్ తో విభేదాలు రావటంతో అతని వద్ద నుండి బయిటకు వస్తాడు. ఈలోగా గోగి భాయ్ తనను వదిలేసాడనే కోపంతో పోలీసులకు అతని ఎడ్రస్ చెబుతాడు. అంతలోనే అతనికి ఓ వెటర్నరీ డాక్టర్ (మళ్ళి పరేష్ రావల్) పరిచయమవుతాడు.పెద్ద మనిషిలా కనిపించే అతని సాయింతో ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసి మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవుదామనుకుంటాడు.

అలాగే ఆ వెటర్నరి డాక్టర్ భార్య(అర్చనా పూర సింగ్) కూడా లక్కిని సోదరుడుగా పిలుస్తూ ప్రేమ ఒలకపోస్తూంటుంది. ఈలోగా ఆ డాక్టర్ సలహాతో ఓ కుక్కని మచ్చికచేసుకుని దొంగతనం చేస్తాడు. అది ఆయనకు తెలుస్తుంది. దాంతో రెస్టారెంట్ వ్యాపారానికి డబ్బు ఒకటే చాలదని బ్యాంక్ ఎకౌంట్,ఐటి రిటర్న్ పత్రాలు కావాలని అడుగుతారు. దానికి లక్కి తనదగ్గర లేదని తన మిత్రుడుని ముందుకు తోస్తాడు. అతని పేరు రెస్టారెంట్ తెరుస్తాడు. అయితే ఓపినింగ్ రోజే వాళ్ళు లక్కిని అవమానపరుస్తారు. దాంతో డబ్బు ఏదైనా చెయ్యగలదని,స్నేహ బంధాన్ని సైతం తెంచేయగలదని అర్ధమవుతుంది.అలా జీవితంలో ఒక్కో బంధమే తెలుసుకుంటూ..తేల్చుకుంటూ…తెంచుకుంటూ… మళ్ళి మళ్ళీ తన పాత వృత్తి లోకి వెళ్ళిపోతూ…

ఈ సినిమా కథగా రాయాలంటే కష్టమే. ఇది నిజానికి ఓ బయోగ్రఫి లాంటి సినిమా . లక్కీ క్యారెక్టర్ తప్పితే సినిమాలో మరేమి లేదు. అందులోనూ రెగ్యులర్ బాలీవుడ్ ప్యాట్రన్ లో సినిమా అస్సలు ఉండదు. ఓ ఐటం సాంగ్ కనపడదు,ఓ డ్యూయిట్ కి అవకాశమివ్వడు.ఓ సీన్ లో నవ్వేలోగా మరో వైపు వెళ్లిపోతూ మరొకటి చెపుతూంటాడు. అయితే కొన్ని సీన్స్ మాత్రం అవుట్ స్టాండింగ్ గా నిలుస్తాయి. ఇక ఈ సినిమా బంటి అనే పంజాబి దొంగ నిజజీవితంలోంచి తీసుకున్న కొన్ని సంఘటనల్లోంచి అల్లిందని ప్రచారం జరిగింది. అది హండ్రెడ్ పర్శంట్ కరెక్ట్. నిజానికి ఆ సీన్లే బాగా పండాయి కూడా.

ఓ ఇంటికి దొంగతనానికి వెళ్ళి అక్కడున్న టీవి ఎత్తుకొస్తూ..సెక్యూరిటి వాడి చేతే అది మోయించి,వాళ్ళ యజమాని కారు లోనే పారిపోయే సీన్ బాగుంటుంది. అలాగే మరో చోట ఓ ఇంట్లోంచి మ్యూజిక్ సిస్టమ్ ఎత్తుకొస్తూ…ఆ ఇంటిగలామె ఎదురయ్యి అడిగితే..వేరేది రీప్లేస్ చేసానని చెప్తాడు. అంతేగాక ఆమెకు ఆ రోజు బర్తడే అని తెలుసుకుని విషెష్ చెప్పి ఆనందపరుస్తాడు. తన మీద న్యూస్ చేసిన న్యూస్ రీడర్ ఇంటిలోనే దొంగతనం చేస్తాడు. అలా చిన్ని కృష్ణుడులా అతను దొంగతనాలు చేసి డిల్లీ వాసులుకు అతను ఇష్టమైన దొంగగా మారుతాడు.ఇదంతా క్యారెక్టర్ డ్రైవెన్ ఫిల్మ్. అయితే సీన్స్ రిపీట్ అవటం మాత్రం చిరాకుపుడుతుంది. దొంగతనం చేయటం.తప్పించుకోవటం అనేదే ఎక్కువ సార్లు జరుగుతుంది.

క్యాచ్ మి ఇఫ్ యు కెన్ సినిమా గుర్తు చేసే ఈ సినిమాలో అభయ్ డయోల్ అదరకొట్టాడు.ఇన్నాళ్ళకి అతనికి సరైన పాత్ర దొరికిందనిపించింది. ఇక పరేష్ రావెల్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. నీతు చంద్ర మాత్రం మొహమాట పడకుండా నటించింది.మిగతావాళ్లు…వీళ్ళు స్క్రీన్ లో ఉండగా వాళ్ళను గమనించటం కష్టమే. ఇక డైరక్టర్ గా దిబాకర్ బెనర్జీ. తను అనుకున్నదాన్ని స్పష్టంగా తెరకెక్కించాడు(అర్ధం కాకపోతే ?).కెమెరా,ఎడిటింగ్ చాలా బాగుంది.కానీ ఎందుకే లెంగ్త్ ఎక్కువయిన ఫీలింగ్ వచ్చింది. అది స్క్రీన్ ప్లే సమస్య కావచ్చు. ఓ కంటి’న్యూ ‘కాంఫ్లిక్ట్, ఫ్లాట్ పాయింట్స్ లేకపోవటం ఆ స్కీమ్ లకు అలవాటు పడిన వాళ్ళకు కష్టమే.

ఇక ఈ సినిమా బోర్ అనుకుంటే పెద్ద బోర్. కాదనుకుంటే కామెడీ మోర్. అయితే డైరక్టర్ గారి మొదటి సినిమా ఖోస్లా కా గోస్లా చూసి అలాగే ఎంటర్ టైన్ మెంట్ తో నిండి ఉంటుందని వెళ్ళితే మాత్రం పూర్తి నిరాశ తప్పదు. కాబట్టి వెళ్ళే ముందే ఆలోచించుకోండి. వెళ్ళిన తర్వాత మనసంతా లక్కీనే ఆక్రమించేస్తాడు…కాబట్టి ఇంకేమి ఉండదు. గట్టిగా ఆలోచన చేస్తే…ఒక్కటే తట్టుతుంది. రాత్రికి లక్కీ మనింటికి వస్తాడేమో అని గేట్లు తెరిచి వెయిట్ చెయ్యాలనిపించటం.ఇదో ప్రమాదం.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

6 Comments to “మనస్సు దోచే ‘లక్కీ’నే…కానీ”

  • “గట్టిగా ఆలోచన చేస్తే…ఒక్కటే తట్టుతుంది. రాత్రికి లక్కీ మనింటికి వస్తాడేమో అని గేట్లు తెరిచి వెయిట్ చెయ్యాలనిపించటం.ఇదో ప్రమాదం.”….సింప్లీ సూపర్బ్.

  • మొన్న శనివారమే చూసాను ఈ సినిమాను. చాలా బాగుంది సినిమా.

  • ఈ సినిమా చూస్తుండగా నాలో కలిగిన భావనలన్నింటినీ భాషరూపంలో ఇక్కడ చూస్తున్నాను. నేను రాసున్నా ఇంత తేటగా వుండేది కాదేమో! అభినందనలు. మీ సమీక్షలకి అలవాటుపడిపోతున్నానండోయ్. ఇకపై నేను సమీక్షలు రాయడం మానేసి కేవలం విశ్లేషణలతో సరిపెట్టుకుంటాను.

  • ’నవ’తరంగంలో అంతా పాత సినిమాల గోల అని ఒకప్పుడు టాక్. సూర్యప్రకాశ్ గారి ఎంట్రీతో మనకా లోటు తీరింది. జై సూర్య ప్రకాశ్.

  • ee navatarangam entoo,ee cinemaa pitchi entoo? kaani telugulo sameekshalu undatam,baagundi.lucky oye lucky oka different cinema.

  • ఓo
    శ్రీ సద్గురవే నమః
    అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాం .ఆత్మ లోఎరుక చైతన్యం .లేని స్ధానంలేదు

    ఈ మనస్సు ఎక్కడ నుంచి వచ్చింది అక్క డై మనస్సునిలిచి , నీ నిజస్వరూ పం బట్టబయలుగ అనుభూతి.కాగలదు. సూక్ష్మ చైతన్య..కంటికి కనిపించదు.అనుభవపూర్వకంగ గ్రహించాల్సిం చూడ చూడ కలుగును సూక్ష్మ చైతన్య.సాధన ద్వారా తెలుస్తుంది సూక్ష్మచైతన్యం ఎందెందు వెతికినా అందందే గలదు ఎలా బ్రహ్మం భావన సూక్ష్మతత్వం క్షణాన్ని ఎవరూ ఆలోచించలేదు -కొంతసమయాన్ని క్షణముగా గుర్తించినను మరో క్షణములుగా ముందుకు వెళ్లుతున్నారే గాని క్షణము తెలియక గడిచిన గత కాలమెంతో నేటికి తెలియుటలేదు సూక్ష్మదృష్టితో గాంచిన తానన్నా, జగమన్నా, బ్రహ్మమన్నా ఒక్కటే. తానుంటేనే జగమనేది ఉంటుంది. తాను లేనపుడు జగం లేదు సూక్ష్మతత్త్వము కాబట్టి. కాళిదాసు ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు మనస్సు ” మూలం. కనుక మానవుడు ముందుగా ఆత్మ “జ్ఞానం” సంపాదించాలి..ఆత్మసత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి … సూక్ష్మచైతన్యం.సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఈ .సమాధి..

    మనస్సునిలిపి సాధన ఆలోచనలు నెమ్మది,నెమ్మదిగా కట్టడిచేయబడి, చివరకుమనస్సులోఆలోచనలు కలుగనిస్థితిఏర్పడుతుంది.సమాధిస్థితి
    మనస్సునిలిపి నిశ్చల స్థితికి చేరుకుంటాయి ఈ .సమాధి.. ఈ విషయం మన మనస్సులో క్షణకాలం తెలుస్తుంది. ఇది సంధి స్థితి. అంటే, ‘తెలిసే స్థితి’ నుంచి ‘ఏమీ తెలియని స్థితి’ – లేదా సమాధిస్థితి” కి చేరే సమయం. ఒకసారి సూక్ష్మచైతన్యం క్షణముస్థితిలోకి వెళ్తే, ఎంతసేపో చెప్పలేంకాబట్టి, క్షణకాలం మనం సమాధిస్థితిలో వుంటాం. ఆ సమాధిస్థితినుంచి బయటకు వచ్చినప్పుడు, జాగృతావస్థలో, మన మనసుకు ఏదో తెలియని ఆనందం పొందినట్లుగా తెలుస్తుంది బ్రహ్మంసూక్ష్మచైతన్యం క్షణముపోందుతాము.
    నిద్రలో మనస్సులేదు దేహ స్మృతిలేదు. ఆ స్ధితిలోమనస్సు నీవు సూక్ష్మనిరాకార చైతన్యమై యున్నావు. తమను నిరాకారంగ భావించలేని వారలు నిరాకారముగ దైవమును ధ్యానించలేరు. పాలలోని వెన్నకు ప్రత్యేక నామరూపములు లేనట్లు సర్వత్ర అంతర్లీనముగనున్న సర్వేశ భగవత్ స్ధితికి నామరూపములు లేవని తెలియాలి.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories