చూస్తే అంతే!!(‘నేనింతే’ రివ్యూ)

nenu-lead

అరే..మేం నానాయాతన పడి,కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ సినిమా తీస్తే..మీరు ఆఫ్ట్రాల్ ఓ వంద రూపాయలుతో చూసి …సినిమా చెత్త.. ఫస్టాఫ్ బోర్,క్లైమాక్స్ వీక్ అంటూ మా వీక్ పాయింట్స్ కుప్పక్రింద పోస్తారా…అంటూ పూరీ రివ్యూ రైటర్స్ పై ఈ సినిమాలో గొంతు చించుకుని కోప్పడ్డాడు. ఆయన భాధ ఆయనది..కాదనం..కానీ రివ్యూ రాయటం కోసం చాలా సినిమాలను(ముఖ్యంగా నేనింతే వంటివి) చివరదాకా సమీక్షుకులు ఎంత కష్టపడి భరించాలి అన్న కోణంలో ఆయన ఆలోచించనట్లులేదు. ఇక ఇది ప్రక్కన పెడితే నేనింతే సినిమా పూరీ తను చూసిన సినీ ప్రపంచంపై ఓ సమీక్ష.అయితే ఆయనకు ఆవేశమే గానీ ఇలా సమీక్షలు(అంటే ఇలాంటి సినిమాలు)రాసే అలవాటు లేకపోవటంతో అన్నీ తప్పులతో,విషయం లోతుగా వెళ్ళక దారి తప్పింది.అయితే ఇంత బోరు సినిమాలోనూ రవితేజ మాత్రమే కాస్త రక్షించే అంశం.

కృష్ణానగర్ లో చాలామందిలాగానే రవి(రవితేజ) అసెస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తూ..అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తూంటాడు. ఇక సినిమాటిక్ గా అతనికో కాన్సర్ తల్లి(రమాప్రభ),విచిత్రమైన కష్టాలున్న గర్ల్ ప్రెండ్ సంధ్య(సియా)కామన్ . అలాగే రెగ్యులర్ మసాలా కోసం అతని గర్ల్ ప్రెండ్ ని వర్షం సినిమాలో విలన్ లా ఆమె బ్రోకర్ బావ(కృష్ణ భగవాన్) అమ్మేద్దామని() చూస్తూంటాడు.మరో ప్రక్క ఆమెను ఎట్లా అయినా అనుభవించాలని ఓ వీధి రౌడీ యాదు(సుప్రీత్) అదే పనిగా తిరుగుతూంటాడు.ఇలాంటి సమస్యలన్నిటితో పోరాడుతూ రవి తన జీవిత లక్ష్యమైన సినిమాని ఎట్లా తీసాడన్నది తెరపై చూసి ఆనందించాల్సిందే.

మొదటే అనుకున్నట్లుగా నేనింతే ..ఇన్నాళ్ళుగా తనను ఆదరించిన సినీ ప్రపంచాన్ని..అందులోని మంచి,చెడులను,కష్టాలను విశ్లేషిస్తూ..ఓ రివ్యూలా పూరీ రూపొందించిన చిత్రం. అయితే సినిమా చూడకుండా రీడర్స్ రివ్యూ చదివేటప్పుడు ఆ విశ్లేషణ ఎట్లా పూర్తిగా అర్ధం కాదో అట్లానే…సినీ పరిశ్రమ లోతుపాతులు,అక్కడి రాజకీయాలు గురించి తెలియని మామూలు ప్రేక్షకులకి ఈ నేనింతే సినిమా అర్ధంకాకుండా అసహనంగా మారిపోయింది. అందులోనూ గతంలో పూరీ-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన హిట్స్ ని దృష్టిలో పెట్టుకుని వచ్చిన వారికి నేనింతే లో సరైన కథ,కథనాలు లేకపోవటం మరింత నిరాశపరిచే అంశం.

ఇక ఈ సినిమా ఇంతలా బోర్ కొట్టడానికి ప్రధాన కారణం ..కథా..కథనం. హీరో చుట్టూతా రకరకాల సమస్యలు(తల్లి కాన్సర్,హీరోయిన్ వెంటపడే రౌడీ,అన్నీ ఆరిపోయి ఇల్లు సైతం అమ్ముకునే నిర్మాత,సినీ హీరోపై మితిమీరిన అభిమానంతో జీవితాన్ని నాశనం చేసుకునే ఓ కుర్రాడు,గాసిప్స్ రాశారని ఆత్మ హత్యకు ప్రయత్నించే ఐటం గర్ల్ ముమాయిత్ )తిరుగుతూంటారు గాని, ఎక్కడా హీరో మాత్రం పొరపాటున కూడా ఆ సమస్యలో పడడు. దాంతో ఎక్కడో ప్రీ క్లైమాక్స్ లో విలన్ వచ్చి అతన్ని సమస్యలో పడేసే దాకా కథ కదలదు. అలాగే స్క్రీన్ టైం మొత్తం ఎంత సేపు రివ్యూ రైటర్స్ పై డైలాగులు,ప్రేక్షకులు ఎలా సినిమా చూడాలనే సందేశాలు,గాసిప్స్ కాలమ్ పై విరుచుకు పడటం,హీరోయిన్ అందాలు చూపటమే సరిపోయింది. అలాగే పూరీ స్పెషలైజేషన్ అయిన క్యారెక్టరైజేషన్స్ సైతం ఈ సినిమాలో లోపించాయి.

ఇక సీరియస్ గా పూరీ తెలుగు పరిశ్రమలోని సమస్యలను భుజాన ఎత్తుకోదలిస్తే..ముందుగా పరిశ్రమలో పాతుకుపోయిన కులవివిక్షని తెగనాడాలి. అలాగే పెద్ద హీరోలు..చిన్న వాళ్ళను డేట్స్ విషయంలో ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చెప్పగలగాలి.తెలుగు హీరోయిన్స్ ను పరిశ్రమ ఎందుకు ఎంకరేజ్ చేయటం లేదో చెప్పాలి. అలాగే . ఎందుకు భార్గవి లాంటి వాళ్ళు ఆత్మహత్యలు లేదా హత్యలకు గురి అవుతున్నారో విశ్లేషించాలి. హీరోయిన్స్ అవుదామని వచ్చిన చాలామంది ఎలా వ్యబిచారంలోకి నెట్టబడుతున్నారో చెప్పాలి. నిర్మాతలు ఎలా హుస్సేన్ సాగర్ లో దూకాల్సిన పరిస్థితులు తెచ్చిపెట్టుకుంటున్నారో చెప్పాలి. అసెస్టెంట్ డైరక్టర్స్ ఎలా సఫరవుతున్నారో…పెద్ద డైరక్టర్స్ ఎలా వారిని చిన్న చూపు చూస్తారో చెప్పాలి. ఓ అధ్భుతమైన కాన్సెప్ట్ ప్రేక్షకుడుని చేరే లోగా ఎలా ఖూని అవుతోందో వివరించాలి. చిన్న నిర్మాతలను పెద్ద వాళ్ళు ఎలా సఫర్ చేస్తున్నారో ..కాంటింపరరీ ఇష్యూష్ ముట్టుకోవాలి.ఇవేమీ ఎక్కడా పొరపాటున కూడా ఈ సినిమాలో పూరీ టచ్ చేయలేదు. పోనీ అసెస్టెంట్ డైరక్టర్ గా రవి తేజ ఎట్లా సఫరయ్యి ఎంత ఫైర్ తో తిరుగుతున్నాడో ఎస్టాబ్లిష్ చేస్తే..అతనిలో ఐడెంటడిటి అయినా అయ్యే వారు. అలా కాకుండా చక్కగా అతనే కొ డైరక్టర్ లాగా అందరినీ కమాండ్ చేస్తున్నట్లు చూపెడతాడు.మరో ప్రక్క తెలుగు పరిశ్రమలో పాతుకుపోయిన హీరోయిజాలు గూర్చి కామెంట్ చేయలేకపోయాడు. హీరో చాలా ఉత్తముడన్నట్లు చూపెడతాడు.ఇలా ఎన్నో విషయాలు దాటేసిన ఈ సినిమా పాటల్లో కృష్ణా నగరే అన్న పాట ఒకటి బాగుంది. కెమెరా,ఎడిటింగ్ ..డైరక్షన్ కి తగినట్లే సాగాయి.ఎప్పుడూ డైలాగులు అధ్బుతంగా రాసే పూరీ ఈ సారి బాగా బూతులను ఆశ్రయించటం మరో దారుణం.

ఫైనల్ గా ఈ సినిమా చివరలో రవితేజతో పూరి “ఈ సినిమా హిట్టయినా ఫ్లాఫయినా సినిమాలు తీస్తూనే ఉంటాను” అనిపిస్తాడు. అంటే ఆయన ముందే ఫ్లాపని ఫిక్సయినట్లున్నాడు. ఇక ఆలోచించుకోవాల్సింది మనమే.అదీ సంగతి..

(ఇక ఈ సినిమా ద్వారా పూరీ చాలా ప్రశ్నలు అందరికి వేశాడు..ఆసక్తి ఉన్నవారు మాత్రమే చదవటం మేలు)

ఆయన మొదటి ప్రశ్న..ఎన్నారైలు ఎనిమిది డాలర్లు ఖర్చవుతాయని ఆలోచించి సినిమాకి వెళ్ళకుండా రివ్యూలు చదువుతున్నారని..అయితే పూరీ కున్నంత విచ్చలవిడి డబ్బు,టైమ్ వారి దగ్గర ఉండద్దా అనేది ఆలోచించి ఈ ప్రశ్న వేస్తే బాగుండేదనిపిస్తుంది.

అలాగే ముమాయిత్ ఖాన్ క్యారెక్టర్ ని చూపి ఆమెపై గాసిప్స్ వెబ్ సైట్స్ ,ప్రింటు మీడియా రాస్తున్నాయని,దానికోసం ఆమె ఆత్మహత్యా ప్రయత్నం దాకా వెళ్ళిందని చూపాడు. అయితే నిజంగా వాళ్ళు ముమైత్ వంటి వారు అంత నిక్కచ్చిగా బ్రతకుతున్నారా… అంత ఫీలియ్యే వాతావరణం అక్కడ ఉందా అనేది ప్రక్కన పెడితే క్రైమ్,సెక్స్ లేకుండా ఆయనెప్పుడన్నా సినిమా తీసాడా అన్నది ఆయన వేసుకోవాల్సిన ప్రశ్న.

ఇక రివ్యూ రైటర్స్ వల్ల ఓవర్ సీస్ మార్కెట్ పోతోందన్నాడు…కరెక్టే…కానీ నాణానికి రెండు వైపులా ఉన్నట్లే సినిమా హిట్ అని రివ్యూలు రాసినప్పుడు పూరీ లాభపడుతున్నాడుగా. ఫ్లాఫ్ అని రాసినప్పుడే ఈ భాధ అంతా. సినిమా ఓ మాదిరి హిట్ అయితే ఈ రోజు మీడియా దాన్ని సూపర్ డూపర్ హిట్ రేంజికి తీసుకెళ్ళోందన్నది అందరికీ తెలిసిన అంశమే.

చివరగా రివ్యూలు రాసేవారికి అంత తెలివి ఉంటే వాళ్ళే కథలు అమ్ముకోవచ్చు కదా అని సవాల్ విసిరాడు. కరెక్టే…వాళ్ళకి తెలివి ఉందా లేదన్నదన్నది ప్రక్కన పెడితే….ఆమ్లెట్ ఎలా ఉందో రుచి చూసి చెప్పే వాడికి కోడి గుడ్డు పెట్టడం తెలియాల్సిన పని లేదు కదా.

అలాగే రివ్యూ రైటర్స్ నాలెడ్జ్ ఎంత అని ప్రశ్నించిన ఆయన్ని ఎవరన్నా…మీరేమన్నా కె.విశ్వనాధా,జార్జ్ లూకస్సా,లేక ఆదిత్యా చోప్రానా,రామ్ గోపాల్ వర్మా.. మీ నాలెడ్జ్ ఎంతఅని అడిగితే…అంతే…ఒక వేలు ఎదుటి వారి వైపు చూపెడితే నాలుగు వేళ్ళు మన వైపుకే చూస్తూంటాయి. అవంతే. ఏం చెయ్యలేం.

నటీనటులు :రవితేజ,సియా,సుబ్బరాజు,ముమాయిత్ ఖాన్,కృష్ణ భగవాన్ ,సురేఖా వాణి,సుప్రీత్,బ్రహ్మానందం,వేణు మాధవ్,రమా ప్రభ,షాయాజీ షిండే తదితరులు.
సంగితం: చక్రి
కెమెరా: శ్యామ్ కె.నాయుడు
ఎడిటింగ్ :వర్మ
ఆర్ట్ :చిన్నా
ఫైట్స్ :రామ్-లక్ష్మణ్
నిర్మాత :డివివి దానయ్య
కథ,స్క్రీన్ ప్లే,డైలాగులు,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: పూరీ జగన్నాధ్
రిలీజ్ డేట్ :18 డిసెంబర్ 2008

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

56 Comments to “చూస్తే అంతే!!(‘నేనింతే’ రివ్యూ)”

  • సినిమా ఎలా ఉంటుందో ఏమో గానీ.. మీ రివ్యూ మాత్రం చాలా బావుంది.
    5వ పేరాలో ‘పూరీ’ ఏ అంశాలని స్పృశించాల్సింది అని మీరు రాసిన అంశాలు చాలా బాగున్నాయి.
    నిజంగా అవన్నీ చూపెట్టేంత దమ్ము, ధైర్యం ఉన్న దర్శకులు గానీ, నిర్మాతలు గానీ ఉన్నారని నేననుకోట్లేదు. అందుకే పూరి అలా తీసి ఉండవచ్చు.
    అంటే.. ఎవరికీ convinient గా ఉన్న విషయాల్ని వారు చూపిస్తారన్నమాట. అంతే..!
    నిజంగా అన్నీ విషయాలనీ సమదృష్టితో సినిమా తీసేంత సీన్ ఎవరికీ లేదని నాకనిపిస్తుంది.
    మీ రివ్యూ మాత్రం కేక :)

  • హతవిధీ! ఈ సంవత్శరం ముగిసేలోపు ఒక్క సినిమా అదీ తెలుగు సినిమా చూద్దామనుకున్నా ఈ నెలలో నాకాభాగ్యం లేనట్టుంది :(

  • పూరి తన కలాఖండం బుజ్జిగాడు ఫ్లాప్ అవ్వడానికి కారణం విమర్శకులు రాసిన సమీక్షకుల వల్లనే అని కోపంతో ఈ సినిమా తీశారా?
    లేక పూరీ అప్పుడెప్పుడో ఒక ఇంటర్వ్యూలో “నేను గనక సమాజాన్ని చైతన్య పరిచే సినిమా చేస్తే ధర్నాలు చేసి సినిమాను ఆపించేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నా సబ్జెక్టులో అంత పవరుంటుంది. అవి చూస్తే చాలా ప్రశ్నలు ఉద్భవిస్తాయి. దాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు” అని చెప్పినట్టు సినిమా పరిశ్రమ గురించి సమాజాన్ని చైతన్య పరిచే ప్రయత్నంగా ఈ సినిమా తీశారా?
    ఏదైతేనేం తెలుగు సినిమాలకంటే వాటి గురించి వచ్చే సమీక్షలే బావుంటూన్నాయని జనాల టాక్. ఈ టాక్ రావడానికి ముఖ్యకారణం ప్రకాశ్ గారి రివ్యూలే అని కూడా టాక్.

  • పూరీజగన్నాధ్ జీవితానికి చాలా దూరం వెళ్ళిపొయినట్లున్నాడు. ఒకప్పుడు తనుకూడా సహాయదర్శకుడే కదా, కనీసం తన కథ కూడా తియ్యలేకపోయాడంటే…ఇక సినిమాలు తియ్యడం మానెయ్యాలి లేకపోతే కొన్నాళ్ళు మామూలు మనిషిగా బ్రతికి, జీవితాన్ని బంజారాహిల్స్ నుంచీ కాకుండా బాపట్ల నుంచో, బర్కత్ పురా నుంచో చూడాలి.

  • కోట్లు ఖర్చు పెట్టి ఓ రెస్టారంట్ కట్టి, అందులో ఫుడ్ బావోలేకపోతే ఆ చుట్టుపక్కలకి ఒక్కళ్ళూ వెళ్ళరు. ( పూరీ గారితో సహా! ). రెస్టారేంటికెళ్ళేది మంచి ఆహారంకోసం. హంగుల కోసం కాదు. బంగారపు బుట్టలో పెట్టి అమ్మినా పుచ్చొంకాయలెవరూ కొనరు.

    అన్నేసి కోట్లు పెట్టి సినిమాలెవరు తియ్యమన్నారట? అంతా స్టార్ల జేబుల్లోకే కదా? చిన్న చిన్న ఆర్టిస్ట్ల నడిగితే చెబుతారు! ఎంత మంది వాళ్ళనటన్ని దోచుకుంటున్నారో? అమెరికాలో డాలర్లు చెట్లకు కాయవు. కష్టానికి పండుతాయి. ఎంతో కష్టపడి సినిమాతీస్తున్నామని సినిమావాళ్ళూ రోదిస్తున్నట్లుగానే, అంతే కష్టపడి సంపాదించిన డబ్బు ప్రేక్షకులూ చెత్తకి ధారపోయలేరు కదా? మరి ఇదే నిర్మాతలూ, దర్శకులూ డబ్బిచ్చి చెత్తని కూడా మంచి గా రివ్యూలు రాయించుకున్నప్పుడు ఏమయ్యింది?

    జోస్యుల గారూ, మీరెత్తిన ప్రశ్నలకి జవాబులు వాళ్ళకీ తెలుసు. పైకి అనే ధైర్యంలేదంతే!
    వేలిత్తిన ప్రశ్నల్ని వెనక్కి విరిచేసారంతే! బావుంది మీ సమీక్ష.

  • బాగుంది సమీక్ష.

    మేమూ అదే అడుగుతున్నాం. పని ఒత్తిడి తో విసిగి, “ఫ్లాష్” న్యూసులు చూసి, చదివి భయపడి, కాస్తంత రిలీఫ్ కోసం, కష్టపడి సంపాదించిన సొమ్ము తో, ఓ వందరూపాయలపెట్టి టికెట్టుకొనుక్కొని ధియేటర్ కొస్తే ఈ “చెత్తా” మా మొహాన కొట్టేది? అని.

    రాజేంద్ర గారూ: మీ కోరిక తీరదు గానీ, మీ పాత కలక్షన్ ని దుమ్ము దులిప్ ఏ “జగదేకవీరుని కధో” ” గుండమ్మ కధో” చూసి ఈ సంవత్సరాన్ని ఆనందంగా ముగించండి.

  • Puri’s specialty is Characterization? You kidding me ?
    I have been lucky enough to see only two of his movies.
    He sucks thoroughly in all aspects of film making.

    Its darn hilarious that he should write a review on all the things that he himself is perpetuating in the industry synonymous with scandal ! Not to mention those high on thigh posters he put all over the state !

    Looks like someone’s days are numbered.

  • @ఉమాశంకర్, :) పాత తెలుగు సినిమాలెప్పుడూ మా యింట్లొ నిత్యపారాయణాలేలెండి,ప్రస్తుతం తోడికోడళ్ళు ఒరిజినల్ డివిడికోసం వెతుకుతున్నాం,పిల్లలకు శెలవలు వస్తున్నాయి కదా మరికొన్ని క్లాసిక్స్ తోపాటు
    @సాయి గారు …”బంగారపు బుట్టలో పెట్టి అమ్మినా పుచ్చొంకాయలెవరూ కొనరు” అదిరింది :)

  • review cinema gurinchi rayandi. who are you criticise puri or some one else. correct yourself first. If do not like the movie, do not go watch it. Control yourself. I think you are over reacting for this movie

  • write the review in a constructive way, OK? the way you wrote the review was boring, lack of narration. you were not good even at writing 20 lines of text. how would you be qualified to criticize a movie/director/actor.

  • జగన్, ముందు మీరు ఈ రివ్యూ గురించి ఓవర్ రియాక్ట్ అవ్వకండి. ఇట్స్ ఒకే. టేకిట్ ఈజీ. ఇలాంటి సమయంలోనే మనసు కంట్రోల్ లో ఉంచుకోవాలి.

  • జాన్,
    రెండు లైన్లు సరిగ్గా రాయలేవు. నువ్వెందుకువయ్యా మాట్టాడ్డం.

  • జగన్ & జాన్: కొత్తగా నవతరంగం గడపతొక్కినట్టున్నారు. మీకు ఈ సినిమా నచ్చుంటే మీ తరఫునుంచీ మరో “మంచి సమీక్ష”ని అందించండి. అంతేతప్ప, సమీక్షకుడికి సమీక్ష ఎలా రాయాలో మీ అపోహల్ని అభిప్రాయాలుగా చెప్పడం మానండి.

    టికెట్టుకొని సినిమా చూసి నిరాశపడిన ప్రతి ప్రేక్షకుడికీ సినిమా బాగోగులు చెప్పేహక్కుంది. దానికోసం ఫిల్మ్ స్టడీస్ చదవనూ అక్కరలేదు రచయితగా,దర్శకుడిగా అనుభవమూ అక్కరలేదు.

  • సూర్యప్రకాష్‍గారూ, మంచి ప్రశ్నలు సంధించారు. వాటన్నిటికీ త్వరలో ’మీరింతే’ అనే సినిమాలో జవాబిస్తారు మన పూరీగారు.
    ఏదో ఫంక్షన్‍లో సినిమావాళ్ళందరూ స్వీట్ మెమరీస్‍లో దాచుకొనే సినిమా అన్నాడు. చూడబోతే అది నిజంలానే ఉంది కధ వింటుంటే.

  • సూర్యప్రకాశ్ గారూ రివ్యూ అదిరింది..నాకో విషయం గుర్తు శివ సినిమా హిట్ అయితే నాగేశ్వరరావ్ గారు రాముని పిలిచి నీ సినిమా హిట్ చేసినందుకు ప్రజలకి థేంక్స్ చెబుతూ స్టేట్మెంట్ ఇమ్మన్నారట.దానికి మన రాము కాదు, వాళ్లే నాకు థేక్స్ చెప్పాలి వారు ఖర్చుపెట్టిన డబ్బుకి సరిపడ వినోదానిచ్చినందుకు అన్నాడట . పూరితెలుసుకోవాలి

    @శంకర్ ‘మీరింతే ‘ అదిరింది

  • @Author

    Very very very very very very very very very very very very very very bad review…year ending lo itlaanti review chadavaalsi raavadam naa kharma…parama dari dramga vundhi ee review…….ee review chadividthey antey sangathulu………………………..emi chedaam….review raayadam chetha kaani vaallu kooda rasthey….ilaane vuntadhi

    correct ee puri ki ila sameekshalu raase alavaatu ledhu so aayana tappuga teesadu aukundham…mari mana priyatam josyula surya prakash ki cinema teesina anubhavam vundhaa..cinema gurunchi raayadaaniki?

    ee cinemalo sadaru reviewer gaarki poori cinemalloni hero characterization kanipinchaledha? aayana cinema baaga choosinaatlu leru……….mari, ee saari addalu pettukoni choodandi appudu kanapaduthaayi characterizationsuuuuuuuuuuuu?

    asalu NRI vallaki telugu cinemalu vaadhu…vicachala vidiga time leni NRI’s ki telugu cinemaalu enduku..akkadi hollywood cinemaale choodacchu kadha?…NRI valla peru meedhaa….Web reviewers baagane cash chesukuntunnaru …ee vishayam andarki telisindhe…..(Best example ante Great andhra and idlebrain).

    ante meelanti reviewrs ni prasnicha taanikki..Oka K.Viswanatho..leka tamaru paina perkonna valle ayundaala..chaala santosham……..mee moorkathvaaniki…..mee laanti vallu reviews raayadam….danni…alantivallu prasnichadam….mee laatni vallani adagadaaniki..mamulu valle chaala ekkuva..naalugu pusthakaalu chadivi….edho peekesam ane bramalo vuntaaru.

    reviews raase vaariki telivi vunda ledha anedhi pakkana pedithey annaru asalu enduku pakkana pettalo mundu cheppandi, ante pasa ledhu ane kadhaaa…………ee cinemalo oka dialogue vundhi…

    meeku nijam ga cinema ante antha interest vunte….maa cinema songs vinandi, trailers choodandi..interest vunte randi..leka pothey ravaaddhu..antey kaaani evado review pi aadarapadddhu ani chepparu, mari meeru deeni gurunchi cheppaledhu enduakni………….

    aakariga cinemalo cheppinattu chaala mandhi reviews chadivi cinema ki vellaru ani chepparu and thats a true fact…..mee sameekshaki vacchina comments choosthey ne artham avutundhi..adhi…….cinema choodakundaane choosina vallaki anna baaga chepthaaru stories….elagantee…guddu tinna vaadi kantey pakkana vundhi vaasana choosina vaaadu cheppinattu……………………………………….

    bye for now

  • Good review. Mr. Suryaprakash.

    Another well written review.. kinda shocking and sad at the same time…
    http://www.fullhyderabad.com/profile/movies/2663/2/
    Quote:
    “”"
    Neninthe is perhaps the film with the maximum number of scenes of men being beaten brutally on their testicles in Tollywood. It is also the first time in Tollywood (at least as far as this writer knows) that the “nee am****i d****” abuse is used in a movie, thus bravely crossing the final frontier. And the heroine has her hand resting practically on Ravi Teja’s crotch in a scene shown in 3 zoom-outs.
    It hits a new low this time. It has atrociously vulgar language including the “l****k*****” and the “d***a” words. It has all the skin show you expect from a Puri Jagan movie including an item song by Mumaith.
    “”"

    And this fellow is considered the Top director in Tolllywood… ?!
    Pathetic. Disgusting.
    Where the hell is Tollywood heading?

    After these generous doses of expletives, i think discerning audiences will permanently shun Puri’s films.

  • ఆమ్లెట్ ఎలా ఉందో రుచి చూసి చెప్పే వాడికి కోడి గుడ్డు పెట్టడం తెలియాల్సిన పని లేదు కదా….is the highlight of this review…..

  • నాకొక విషయం నిన్నటివరకూ అర్థమయ్యేది కాదు. ఇంత మంది ఇక్కడ తెలుగు సినిమాలకి పట్టిన తెగులు గురించి తెగ రాస్తున్నా ఇంకా సినిమాలు ఎలా హిట్ అవుతున్నాయబ్బా అనుకునేవాడిని. శశాంక్ నా అనుమానం తీర్చాడు. తెలుగు ప్రేక్షకులు మెజారిటీ మన శశాంక్ లాంటి వాళ్ళే అనుకుంటా..శశాంక్ కమాన్ సేవ్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ

  • శశాంక్ గారు ……
    మోత్తం మీద నాకు మీ కమెంట్ చూసిన తర్వత నాకు ఒక విషయం అర్ధం అయింది……పూరి లంటి దర్శకులకి మీలాంటి వారి అండదండలు ఉన్నంత వరకు తెలుగు ప్రక్షకులని హింసించే
    ఇటువంటి సినిమాలు ..
    1.చిరుత.
    2.దేసముదురు.
    3.బుజ్జిగాడు.
    తాజాగ “నేనింతే”…శంకర్ గారు చెపినట్టు రేపు “మీరింతే”లాంటి సినిమాలు తీస్తునేఉంటారు.నాకు తెలిసి “పూరి” “నేనింతే” కి సీక్వెల్ గా “మీరింతే” కథ ని కూడ మొదలు పెట్టాలి ….మనము వేచి చుద్దాం …….

  • @ john apparao gaaru

    telugu industry tegulu emi pattaledhu ani naa abhipraayam…………….tegulu gurunchi intha raasthunna cinemalu hit ayyayi ante ne artham avuthudhi…………..ekkuva mandhi itu vaipe vunnaru ani..

    ayina cinema antene oka business boss, manam dabbulu isthunnam vallu manaki entertainment isthunnaru..antaku minchi ekkuva aalochinchi burralu paaduchesukovadam waste…..evvaru balavanthanga cinemaki vellaru…mari dabbulu ekkuvaithey vetikaina donate cheyyachhu kadha…anthey kaani cinemalu baagundavu ani telisina kooda povadam…malla vacchi baagaledhu ani bloglu, discussionlu pettadam endukandi avasarama ivanni…………………..

    @ vishnu vardhan reddy gaaru

    poori meminthey ani teeyacchu leka pothey kaali veelinthey ani kooda teeyacchu……………….manam kooda manaminthey ani ilaane aa cinema review ki kooda kinda comments raasukuntu vundaam…………………..

  • మీ కాన్సట్రేషన్, వ్యక్తుల మీద కంటే, సినిమా మీద ఉండుంటే బాగుండేది.

  • @శశాంక్: ఈ క్రింద లంకెలోని వ్యాసాన్నొకసారి చదవండి.
    http://navatarangam.com/2008/05/for-the-good-of-telugu-cinema/

    మీరు నవతరంగానికి కొత్తకాకపోయినా, రెగ్యులర్ విజిటర్ మాత్రం కాదనేది మీ వ్యాఖ్యలతో తేటతెల్లమవుతోంది.ఇక్కడ సినీసమీక్షలు ప్రాపగాండా కాదు. ప్రేక్షకులు సినిమాను ఎలా అనుభవించారో అలాగే ఉంటాయి అంతే!

    మీ దగ్గర ఈ సినిమాని చూసే కరెక్ట్ ధృక్కోణం ఉంటే దాన్ని కూడా ఇక్కడ విశదంగా పంచుకోండి. దానినీ చదివి హర్షించే సహృదయత నవతరంగం పాఠకులకుంది. ఒకే సినిమా గురించి వంద విభిన్నమైన అభిప్రాయాలకు ఇక్కడ స్థానముంది. మీరు ఉటంకించిన మిగతా తెలుగు సినిమా వెబ్సైట్లకూ నవతరంగానికీ ఉన్న తేడా అదే.

    ముఖస్తుతికోసమో సినీపరిశ్రమలోని వారి మెప్పుపొందాలనో లేక వారిమీద పనిగట్టుకుని కత్తిగట్టాలనో ఇక్కడ ఎవరూ రాయరు. ఆ అవసరం కూడా ఎవరికీ లేదు. తెలుగు సినిమాని అభిమానించి ప్రేమించేవాళ్ళు కాబట్టే ఇక్కడొక కూటమిగా ఏర్పడి కృషిచేస్తున్నారు. కాబట్టి, మీ అసహనాన్ని తెలుగు సినిమా అభివృద్ధికి ఉపయోగపడేలా ఏమైనా చెయ్యగలరేమో ఆ చర్యలవైపు direct చెయ్యండి.

  • ఇందులో బ్రహ్మానందానికి తన పేరడీ పేరు ఇడ్లీ(పూరీ) విశ్వనాధ్(జగన్నాధ్) అని పెట్టాడు కదా, ఆ క్యారెక్టర్‍లో తన ఐడెంటిటీని ఏమైనా చూపించుకున్నారా పూరీ జగన్నాధ్‍గారు ?…

  • రివ్యూలు రాయడానికి సినిమాతీసిన అనుభవం అవసరమా? కొన్నిరోజులు ఆగితే సినిమా చూడడానికి ఎంజాయ్ చెయ్యడానికి కూడా సిననిమా తీసిన అనుభవం ఉండాలంటారేమో!
    @శశాంక్,
    దయచేసి మీ కామెంట్లు తెలుగులోనే వ్రాయడానికి ప్రయత్నించండి. చదవడానికి చాలా కష్టంగా ఉంది. అందులోనూ మీ కామెంట్లు చాలా విలువైన ప్రశ్నలను లేవనెత్తుతుంటాయి. అవి అందరూ తెలుకొనవలసినవి.

  • It might be a bad movie. however I feel it is not the right way of expressing it. This is just all I wanted to say.
    Sorry if I hurt your ego JOHN APPARAO. Merru pakkavallani criticise chesthunnaru, adevidham gaa vallu mimmalni criticise chesinappudu positive gaa theesukovadam theliyaali.

  • @ మహెష్ కుమర్ గారు నెను నవతరంగానికి రెగులర్ గ ఈమి రాను అప్పుదప్పుదు చదువుథాను, మీరు పంపిన లింక్ ని చదివాను నాకు ఎమి అర్థం కాలెధు ఇంకొక రెందు మూదు సార్లు చదివి కాని దాని మీధ ఎమి చెప్పలెను అధి కూద అర్థం ఐథె నె

    ఇక నా దగ్గర ఈ సినిమాని చూసే కరెక్ట్ ధృక్కోణం అంతె నెను దాన్ని కెవలం బుసినెస్స్ గ నె చూస్థున్న (కల ల కాధు) దబ్బులు ఇస్థున్నం వెల్థున్నం అంతె కాని బలవంతంగా ఎవ్వరు వెల్లరు కధా, సినిమా గురుంచి ఎవ్వరైనా చెప్పచ్చు, కెవలం సినిమా గురుంచి చెబితె మంచిధి అంతె కాని, సినిమా సమీక్ష అని ఒక వ్యక్తి గురుంచి చెప్పదం బాగలెధు.

    ముఖస్తుతికోసమో సినీపరిశ్రమలోని వారి మెప్పుపొందాలనో లేక వారిమీద పనిగట్టుకుని కత్తిగట్టాలనో ఇక్కడ ఎవరూ రాయరు. ఆ అవసరం కూడా ఎవరికీ లేదు: మరి సమీక్షల పెరుథొ ఇవన్ని రాయదం దెనికి

    తెలుగు సినిమాని అభిమానించి ప్రేమించేవాళ్ళు కాబట్టే ఇక్కడొక కూటమిగా ఏర్పడి కృషిచేస్తున్నారు: మరి ఆ క్రుషి కి ఎమన్న ఫలితం వచ్చింధా

    కాబట్టి, మీ అసహనాన్ని తెలుగు సినిమా అభివృద్ధికి ఉపయోగపడేలా ఏమైనా చెయ్యగలరేమో ఆ చర్యలవైపు direct చెయ్యండి: నాధి అసహనం కాదు, బాధ అంథ కన్న కాదు, ఇంతల విమర్సించదం అవసరమా అని అంతె.

    @ శంకర్ గారు

    ఇక తెలుగు లొ వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

  • @శశాంక్: ‘నేనింతే’ సినిమాని దాదాపు semi-biopic తరహాలో పూరీ జగన్నాధ్ ప్రమోట్ చేసిన తరువాత అతను సినిమాలో చెప్పదలుచుకున్న విమర్శలకు ప్రతివిమర్శలు చెయ్యకూడదంటే ఎలా? ఇక్కడ పూరీజగన్నాధ్ సినిమాల గురించి తను public domain ఇచ్చిన statements ఆధారంగానే బేరీజు చెయ్యడం జరిగిందేతప్ప సమీక్షకుడికి పూరీ జగన్నాధ్ వ్యక్తి గతంగా తెలిసీకాదు లేక ప్రత్యేకమైన విద్వేషం ఉండీ కాదు.

    సినిమా అనేది సగం సృజనాత్మకత, సగం వ్యాపారం అనేది అందరికీ తెలిసిందే. పైగా ఈ మధ్యనే ‘వినాయకుడు’ దర్శకుడు సాయికిరణ్ నవతరంగంలో మళ్ళీ ఈ విషయాన్ని ఉటంకించాడుకూడాను. అదే వ్యాపారాత్మకత ప్రేక్షకుడి తరఫునుంచీ కూడా ఉందికదా! డబ్బిచ్చి చెత్త చూసిన తరువాత, ప్రేక్షకుడు తన అక్కసు వెళ్ళగక్కకూడదంటే ఎలాగా?

  • Well Said john

    “Merru pakkavallani criticise chesthunnaru, adevidham gaa vallu mimmalni criticise chesinappudu positive gaa theesukovadam theliyaali.”

    విమర్శించడం ఒక నిమషం పని అని అదే పని మీద ఉంటారు. అదే పని వాళ్ళ మీద చేస్తే వారికి చిర్రెత్తుకు వస్తాది.

    “విమర్శనలను ఈజీగా తీసుకోలేని వాళ్ళకు విమర్శించే హక్కు లేదు”

  • కేవలం పెద్ద దర్శకులు హీరోలు బడ్జెట్ వున్నా సినిమాలనే సమీక్షిస్తారా ?? రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే “నేనింతే ” సమీక్ష చూసాను . బయట కూడా mixed reaction వుంది . కాని చూసిన వాళ్ళు అందరు చూడ వచ్చు అంటున్న, అందరు కొత్త వాళ్లే చేసిన “నచ్చావులే ” గురించి నవతరంగం లో వూసే లేదు . కాస్త మీరు చెప్తే weekend లో చూద్దామని .

  • @అజయ్: కుబేరులు,దొంగలబండి,వినాయకుడు వగైరా వగైరాలు “పెద్ద దర్శకులు హీరోలు బడ్జెట్ “సినిమాలు కాదే! ఎవరు చూసిన సినిమా గురించి వారు స్వఛ్చందంగా రాయడమే తప్ప, నవతరంగంలో టార్గెట్లు, రెమ్యూనరేషన్లూ, కాంప్లిమెంటరీ పాసులూ లేవు. మీరు వీలైతే “నచ్చావులే” చూసి మీ అభిప్రాయాల్ని రాయండి.

  • ఫార్మాట్ తెలియక రాసినందుకు క్షమించాలి . సూర్య ప్రకాష్ గారు “నేనింతే ” ని సమీక్షించిన విధానం చాల బావుంది . అందుకే మెల్లిగా గిచ్చుదామని ట్రై చేసాను , త్వరగా review ఇస్తారేమో అని :) . ఇంత లోనే మీరు వోచ్చేసారు . ఇంకా నేనేమి చేయలేను . సరదాగా క్షమించెయ్యండి .

  • @అజయ్: మీరు సరదాగా అన్నారు. నాకు తోచింది నేను చెప్పాను. అంతే! దానికి మళ్ళీ `సారీ’ లెందుకు లెండి. కాకపోతే ఒక్క విషయం మాత్రం మళ్ళీ చెప్పగలను, మీలాంటి ఔత్సాహికులు సినిమాల గురించి రాయాలి. ప్రయత్నించండి. నవతరంగం ఎదురుచూస్తూ ఉంటుంది. ఒక శాంపిల్ వ్యాసం రాసి navatarangam@googlemail.com,navatarangam@gmail.com కు పంపండి.

  • అజయ్ గారు …..నవతరంగం లో ప్రతి సినిమ గురించి
    వ్రాయటానికి ప్రయత్నిస్తున్నాము ….. మీరు అడిగిన నచ్చవులే సినిమ ఇక్కడ(బెంగళురు) లో ఇంకా విడుదల కాలేదు….. మహెష్ గారు చెప్పి నట్టు గా మీరు మీ అభిప్రాయం తెలియపరచగలరు అని కోరుకోంటునామ్……

  • సినిమ చూసిన ప్రతి ఒక్కరికి దాన్ని క్రిటిసైజ్ చేసే హక్కు ఉంది.

    దాన్ని ఎవరూ కాదనలేరు. కాకపోతే అది నిర్మాణాత్మకం గా ఉందాలి.

    కుమార్

  • @కుమార్: దయచేసి సమీక్షలోని ఐదో పేరా చదవండి..మీ సౌలభ్యం కోసం దాన్ని నేను మళ్ళీ ఇక్కడ అతికిస్తున్నాను. ఇంతకంటే నిర్మాణాత్మకంగా ఇంకేదైనా వెబ్సైట్లో ఎవరైనా ఈ సినిమాని సమీక్షించుంటే దయచేసి తెలుపగలరు.

    “ఇక సీరియస్ గా పూరీ తెలుగు పరిశ్రమలోని సమస్యలను భుజాన ఎత్తుకోదలిస్తే..ముందుగా పరిశ్రమలో పాతుకుపోయిన కులవివిక్షని తెగనాడాలి. అలాగే పెద్ద హీరోలు..చిన్న వాళ్ళను డేట్స్ విషయంలో ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చెప్పగలగాలి.తెలుగు హీరోయిన్స్ ను పరిశ్రమ ఎందుకు ఎంకరేజ్ చేయటం లేదో చెప్పాలి. అలాగే . ఎందుకు భార్గవి లాంటి వాళ్ళు ఆత్మహత్యలు లేదా హత్యలకు గురి అవుతున్నారో విశ్లేషించాలి. హీరోయిన్స్ అవుదామని వచ్చిన చాలామంది ఎలా వ్యబిచారంలోకి నెట్టబడుతున్నారో చెప్పాలి. నిర్మాతలు ఎలా హుస్సేన్ సాగర్ లో దూకాల్సిన పరిస్థితులు తెచ్చిపెట్టుకుంటున్నారో చెప్పాలి. అసెస్టెంట్ డైరక్టర్స్ ఎలా సఫరవుతున్నారో…పెద్ద డైరక్టర్స్ ఎలా వారిని చిన్న చూపు చూస్తారో చెప్పాలి. ఓ అధ్భుతమైన కాన్సెప్ట్ ప్రేక్షకుడుని చేరే లోగా ఎలా ఖూని అవుతోందో వివరించాలి. చిన్న నిర్మాతలను పెద్ద వాళ్ళు ఎలా సఫర్ చేస్తున్నారో ..కాంటింపరరీ ఇష్యూష్ ముట్టుకోవాలి.ఇవేమీ ఎక్కడా పొరపాటున కూడా ఈ సినిమాలో పూరీ టచ్ చేయలేదు. పోనీ అసెస్టెంట్ డైరక్టర్ గా రవి తేజ ఎట్లా సఫరయ్యి ఎంత ఫైర్ తో తిరుగుతున్నాడో ఎస్టాబ్లిష్ చేస్తే..అతనిలో ఐడెంటడిటి అయినా అయ్యే వారు. అలా కాకుండా చక్కగా అతనే కొ డైరక్టర్ లాగా అందరినీ కమాండ్ చేస్తున్నట్లు చూపెడతాడు.మరో ప్రక్క తెలుగు పరిశ్రమలో పాతుకుపోయిన హీరోయిజాలు గూర్చి కామెంట్ చేయలేకపోయాడు. హీరో చాలా ఉత్తముడన్నట్లు చూపెడతాడు.ఇలా ఎన్నో విషయాలు దాటేసిన ఈ సినిమా పాటల్లో కృష్ణా నగరే అన్న పాట ఒకటి బాగుంది. కెమెరా,ఎడిటింగ్ ..డైరక్షన్ కి తగినట్లే సాగాయి.ఎప్పుడూ డైలాగులు అధ్బుతంగా రాసే పూరీ ఈ సారి బాగా బూతులను ఆశ్రయించటం మరో దారుణం.”

  • ఆమ్లెట్ ఎలా ఉందో రుచి చూసి చెప్పే వాడికి కోడి గుడ్డు పెట్టడం తెలియాల్సిన పని లేదు కదా.. This answered most of the comments above. Good job Prakash.

  • గుంటూరు హరిహర్ లో ఈ సినిమాను చూసాను .రివ్యూ లు చదివి సినిమాకు వెళ్ళటం లేదనేది నిజం.నేను యువరాజు (హిందీ) చూడాలని ఎదురు చూసాను .కాని రివ్యూ చదివి మానేసాను.

    ఈ సినిమా గురించి చెప్పాలంటే

    మ్యూజిక్ అస్సలు బాగోలేదు .సాంగ్స్ సాహిత్యం బాగోలేదు. పూరి కి అలీ బిగ్ ఎసెట్ .సినిమాలో లేడు.
    చాలా విషయాలు కవర్ cheesadu.ముఖ్యం గా ఫాన్స్ గురించి ,లవ్ గురించి ,లేచిపోటం గురించి ,నిర్మాత ల బాధలు .

    వేణు మాధవ్ చెప్పిన పిట్ట కథ బాగా నచ్చింది .నీ బ్లాగ్ మిద బురద చల్లే వారు నీ శత్రువులు కాదు ,పొగిడేసే వారు అందరు మిత్రులు కాదు .

    చివరగా ఒక మాట .పూరి ఈ సినిమాను డైరెక్ట్ చేసినట్లు లేడు .అసిస్టెంట్ దిరేక్టర్స్ కు ఎక్కువ అవకాసం ఇచినట్లు ఉన్నాడు.

  • I liked the movie because it is like democracy.. Neninte is about ciniwallas, for ciniwallas and by ciniwallas. Humourous & Clever movie too. Cinema may be business. But Cinema is Art too.
    I liked Neninte because I expected an altogether different movie. You never know the impact of movies on general public. In this movie, Raviteja had some good lines to say. Nevertheless Neninthe isnt that Bad. Its better than normal Love story we watch in Telugu Movies. By the way, we must watch a Telugu movie like it is a Telugu movie. Better than Rab Ne Banadi Jodi. Neninte is believable minus the action (Fightings) !!! :D :D :D :D

  • arunak గారు గుంటూరు హరిహరమహల్ లో చూసారా,కొంపదీసి అదే మెయిన్ థియేటరా??
    అసలు మామూలుగా అందులోకి వచ్చేవన్నీ :( కేటగిరీకి చెందినవీ,ఎవరూ తీసుకోనివి,లేదా సెకండ్ థియేటర్ స్థాయి.

  • కృతజ్ఞతలు
    స్పందించిన అందరికీ…ముఖ్యంగా కె.మహేష్ కుమార్ గారికి…
    అయితే ఈ సందర్భంలో ఓ విషయం…నిజానికి నాకు రివ్యూ రాసిన తర్వాత ఓ డౌట్ వచ్చింది.పూరీ రివ్యూ రైటర్స్ ని ఏదో అన్నాడేమోనని నేను ఆవేశంగా రాసేనేమోనని..అలాగే ఈ సినిమాకు అంత సీన్ లేదేమోనని..
    అయితే ఒకే ఒక ధైర్యం ముందుకు నడిపించింది. అది నేను ఇంతకాలంగా రివ్యూ లు రాస్తూ వస్తున్నా…ఎప్పుడూ కంటెంట్ నే (సినిమా కథ,కథనాలు,టెక్నికల్ విషయాలను) మాత్రమే తెలిసినంతలో రివ్యూ చేస్తూ వస్తున్నాను.(పాపం నా పాఠకులు కూడా మంచివాళ్ళే..పాపం వీడికింతే తెలుసులే..అని సర్ధిపెట్టుకుంటూంటారు).అయితే ఇన్నాళ్ళలలో పర్శనల్ గా ఏ దర్శకుడుని,రచయితని,ఎవరని విమర్శించలేదు.విమర్శించను..అవసరం లేదు కూడా…ఎందుకంటే సినిమా ప్రపంచం అంటే ప్రాణం కాబట్టి…అందులో తిరిగే వాళ్ళంతా మహానుభావుల్లా ఫీలవుతూంచాను…అలాంటి నా చేత టెంప్ట్ చేయించి ఇలాంటి రివ్యూ ఎటెమ్ట్ చేయించారు..పూరి…ఆ క్రెడిట్ ఆయనిదే…అయితే ఇదే చివరి సారి ఇలాంటి రివ్యూ రాయటం కావాలనేది కోరిక.

    పై కామెంట్స్ లో కొందరు సినిమా చూసాం…వచ్చాం…ఇక ఇలాంటి చర్చ అవసరమా…ఎందుకు…అంటూ కామెంట్ చేసారు. సంతోషం..ప్రేమికుల చేష్టలు బయిట నుంచి చూసేవాళ్ళకు విచిత్రంగా కనిపిస్తాయి..ఏం చెయ్యలేం..మనం విపరీతంగా ప్రేమించే వ్యక్తుల గురించి ఎంతలా ఆలోచించి…నిద్రలేని రాత్రులు గడుపుతామో సినిమా ప్రేమికుల పరిస్ధితీ అంతే…వాళ్ళు చూసాం..వచ్చాం అనుకుని ఉండలేరు..సినిమా మీద ప్రేమ వేరు…ఆ లోకం వేరు…అందుకే ఇలాంటి వెబ్ సైట్స్..కాదంటారా
    సూర్యప్రకాష్ జోశ్యుల

  • మీ విశ్ల్ షణ మరియు అభిప్రయాలు చాల బాగ రాస్తున్నారు

  • పూరి ఎంటొ పెద్ద పిస్తానా … చెప్పెది ఒకటి … చూపించెది ఒకటి… తిక్క కుదిరింది…
    ఈ సినిమా అ౦త బావు౦దా … ఐతె తప్పక చూడకూడదు!!

  • జోస్యుల గారు…మీరు గమనించారో లేదో కాని…ఈ సినెమా వల్ల మన వాల్లకి ఈ సినెమాల ki రివ్యులు అంటు ఒకటి వుంటాయని….సినెమాలకి వెల్లే ముందు అవి చదవాలని…పూరి గారు సినిమా సమక్షంగా చెప్పినట్లైంది…
    I believe there are some people who dont know reviews exist on web…atleast this movie will fire a thought
    about reviews…and their importance….

  • >> “మీరు గమనించారో లేదో కాని…ఈ సినెమా వల్ల మన వాల్లకి ఈ సినెమాల ki రివ్యులు అంటు ఒకటి వుంటాయని….సినెమాలకి వెల్లే ముందు అవి చదవాలని…పూరి గారు సినిమా సమక్షంగా చెప్పినట్లైంది”

    అదే నిజమైతే, Puri has just shot himself in the foot :-)

  • HI All

    After a long time, I have seen ‘Nenu Inte’, that make me write again. Mahesh, I like your comments.

  • ఉత్తర గారు,మేము అనాలా మాట :)
    పునఃస్వాగతం

  • అసలు ఇక్కడ చెప్పాలిసిన ఒక విషయం ఏవైతే పూర్ పూరి చెప్పాలని సినిమా తీసాడో అవే చెత్త తో నింపేసాడు. ముమైత్ ఖాన్ ఐనా, హీరోఇన్ ఐనా ….. okate question when you are asking people that why you treat us like this ? then the answere lies in the same great movie ( not for me) ….over actions,banda boothulu, raktham, exposing all in all…so poori has to think that who are making mistakes …… is it us ? is it the reviewers?

  • అప్రియమైన జొస్యులు గారికి మీరు దయ చేసి ఈ రివ్యులు అవి రాయటం మానివెయ్యవలసిందిగ ప్రార్ధన.నా తల్లి తండ్రులు నన్ను చెడు మాటలు రాకుండా పెంచారు.దయ చేసి ఆ రికార్ద్ ను బ్రేక్ చెయ్యించొద్దు.గురువు గారు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నటు వుంది మీ వ్యాసం. మంచిని పంచండి మరియు పెంచండి. అంతే కాని పక్కవాడి మీద బురద మాత్రం చల్లకండి. ఇది నా విన్నపం.

  • ‘నా తల్లి తండ్రులు నన్ను చెడు మాటలు రాకుండా పెంచారు.దయ చేసి ఆ రికార్ద్ ను బ్రేక్ చెయ్యించొద్దు’…… కానీ ఈ సినిమా చూసే పిల్లలకు ఆ సౌలభ్యం లేదు. కావల్సినన్ని చెడు మాటలు నేర్చుకోవచ్చు.

    ’మంచిని పంచండి మరియు పెంచండి’…….. అదే ఇక్కడ చేస్తుంది.

    ’అంతే కాని పక్కవాడి మీద బురద మాత్రం చల్లకండి’…….. ఇది ఎవరికి చెప్పాల్సిన మాటో ఒకసారి మనసుపెట్టి ఆలోచించమని మనవి.

  • @జగదీష్: సమీక్ష అంటే వీక్షించిన సినిమాను మనకు తెలిసిన జ్ఞానం, ఆ సినిమా మనకు పంచిన అనుభూతిని బేరీజుచేసి ఇతరులకు చెప్పే ప్రక్రియ. ఇందులో objectivity ఉండదు. సమీక్షకుడి జ్ఞానం మరియూ స్వానుభూతీ ఉంటాయి.ఈ సమీక్ష మీకు నచ్చకుంటే ఈ సినిమా చూసి మీ సమీక్షను అందించండి.
    అంతేతప్ప ‘బూతులు రావు కాబట్టి తిట్టలేను’, ‘మీరు చెడు పంచుతున్నారు’ అర్థమొచ్చే ఎకసెక్కాలాడ్డం మానేసి కూసింత ఉపయోగపడే పనులు చెయ్యండి. ఇక్కడ బురద జల్లుతోంది మీరే అనే విషయం గ్రహిస్తే మంచిది.

  • సూర్య ప్రకాష్ గారు…
    కింద మీ వాక్యాలు ఒక సారి చడవండి.

    “ఇక సీరియస్ గా పూరీ తెలుగు పరిశ్రమలోని సమస్యలను భుజాన ఎత్తుకోదలిస్తే..ముందుగా పరిశ్రమలో పాతుకుపోయిన కులవివిక్షని తెగనాడాలి. అలాగే పెద్ద హీరోలు..చిన్న వాళ్ళను డేట్స్ విషయంలో ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చెప్పగలగాలి.తెలుగు హీరోయిన్స్ ను పరిశ్రమ ఎందుకు ఎంకరేజ్ చేయటం లేదో చెప్పాలి. అలాగే . ఎందుకు భార్గవి లాంటి వాళ్ళు ఆత్మహత్యలు లేదా హత్యలకు గురి అవుతున్నారో విశ్లేషించాలి. హీరోయిన్స్ అవుదామని వచ్చిన చాలామంది ఎలా వ్యబిచారంలోకి నెట్టబడుతున్నారో చెప్పాలి. నిర్మాతలు ఎలా హుస్సేన్ సాగర్ లో దూకాల్సిన పరిస్థితులు తెచ్చిపెట్టుకుంటున్నారో చెప్పాలి. అసెస్టెంట్ డైరక్టర్స్ ఎలా సఫరవుతున్నారో…పెద్ద డైరక్టర్స్ ఎలా వారిని చిన్న చూపు చూస్తారో చెప్పాలి. ఓ అధ్భుతమైన కాన్సెప్ట్ ప్రేక్షకుడుని చేరే లోగా ఎలా ఖూని అవుతోందో వివరించాలి. చిన్న నిర్మాతలను పెద్ద వాళ్ళు ఎలా సఫర్ చేస్తున్నారో ..కాంటింపరరీ ఇష్యూష్ ముట్టుకోవాలి.ఇవేమీ ఎక్కడా పొరపాటున కూడా ఈ సినిమాలో పూరీ టచ్ చేయలే”

    – అసలు పూరి గారు ఇండస్ట్రి లొ ఉండాలా వద్దా?
    మీరు పైన చెప్పిన విషయాలు అన్ని సినిమాలొ పెడ్తె పూరి గారి బాక్స్ బద్దలు అవ్వదు? మల్లి సినిమ ఇండస్ట్రి లొ ఇంకో సినిమ తీయగలడ? ఎన్ని రాజకీయాలు, ఎన్ని కులాధిపథ్యాలు, అవన్ని తట్టుకుని పూరి గారు నిలబడగలరా? అందుకె ఆయన మానాన ఆయన మాడిన అట్టేసుకుని తింటుంటె, మీరు ఆయన్ని కదిలించటం మంచిది కాదెమో?

    మీరు చెప్పినట్టుగ అవన్ని సినిమ లొ పెట్టాలి అనుకుంటె అప్పుడు పూరి గారు సీరీల్ తీయల్సి వస్తుంది. అప్ప్డు కాని ఇవన్ని ప్రేక్షకులకు అర్డం అయ్యేలా చూఇంచలేరు.

    నెనెదో ఫురి సినిమా ని పొగుడ్తున్నను అని అనుకొవద్దు. అసలు సినిమ లొ ‘క్రిష్నా నగరు మామా అన్న సాంగ్ తప్పితె మిగతా సాంగ్స్ ఏమి బాలెవు. స్టోరి విషయంలో ఎక్కడ అంత డెప్త్ గ ఆలొచించి తేయలెదు అన్నది స్పస్టంగ కనపడ్తుంది.

  • @జగదీప్ గారు……డైలాగులు బాగానే చ్చెపారు కాని ఇక్కడ ఎవరు ఎవరి మీద బురద చల్లటం లెదు…….మీరు మీ మీద బురద చల్లుకొని అ బురద లో కూరుకొని పొయినట్టు ఉన్నారు ….దయచేసి బయటకు రావలసింది గా మనవి ……..

  • After watching the movie, I felt that what is the Sin I did to sit for 2 hrs for this film. So much violence, no clarity in director’s thought, it seems like he just rush to make a film. It seems like we are paying so much money to get violence into our head. I’m sure it damages our brain and organs. In his films hero reactive so violently, why not a spectator react to such nonsense he shows in the name of entertainment.

  • puri cheppina vishayaalu chaalaa varaku correcte gaani thidam lo ne lopam undi, screen play lo bigi ledu ademaina pokiri laanti entertainment subject kaadu kadaa, dry subject ayi poye, alaanti cinemaa thiyadam kastame, kaani idedo english lo vachindemo teliyaalcndi, endukante anthaku munde ‘kadanaayakudu, ani rajani subject cini field mida vachindi kaada/… review la gurinchi manamemi udukkonavasaram ledu adi anthe manaminthe…

  • comments bagunnyi…………………review kante……….

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories