నవతరంగంలో 500 వ్యాసాలు

ఇది నవతరంగంలో 504 వ వ్యాసం. ఏడాది క్రితం నవతరంగం మొదలుపెట్టిన దగ్గర్నుంచి దాదాపుగా ప్రతి రోజూ కనీసం ఒక వ్యాసమైనా ప్రచురిస్తూ వస్తూ, కొన్ని రోజులు మూడు నాలుగు వ్యాసాలు కూడా ప్రచురించి చివరికి ఈ రోజున 500 పోస్టుల మైలు రాయిని చేరుకుంది నవతరంగం. ఈ సందర్భంగా వ్యాసాలు ప్రచురించిన నవతరంగం సభ్యులకూ, వ్యాసాలు పంపించిన అతిధులకూ, అలాగే నవతరంగంలో తమ వ్యాసాలను ప్రచురించడానికి అనుమతినిచ్చిన ప్రముఖులకూ మరియు నవతరంగాన్ని మొదట్నుంచీ ఆదరిస్తూ వచ్చిన పాఠకులకు ధన్యవాదాలు.

నవతరంగంలో ఇప్పటివరకూ వచ్చిన వ్యాసాల వివరాలు:

సినిమా సమీక్షలు

మొత్తం సినిమా సమీక్షలు 163. అందులో వందకు పైగా భారతీయ సినిమా సమీక్షలు కాగా మిగిలినవి ప్రపంచ సినిమా సమీక్షలు. భారతీయ సినిమా విభాగంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ సినిమాలే కాకుండా మరాఠీ మరియు అస్సాం సినిమా సమీక్షలు కూడా చోటు చేసుకున్నాయి. అలాగే ప్రపంచ సినిమా విభాగంలో ఆమెరికా, జపాన్, ఇంగ్లండ్,హంగరీ, ఫ్రెంచ్, ఇటలీ,చైనా, కొరియా, జర్మనీ దేశాల సినిమాలే కాకుండా రొమానియా,పాకిస్తాన్, పోలండ్, ఉరుగ్వే, శ్రీలంక, భూటాన్, ఫిన్లాండ్ దేశాల సినిమా సమీక్షలు కూడా చోటు చేసుకున్నాయి.

సినిమా విశ్లేషణ

నవతరంగంలో ఇప్పటివరకూ వచ్చిన సినిమా విశ్లేషణలు 72. ఇందులో యాభైకి పైగా భారతదేశపు సినిమా విశ్లేషణలు కాగా మిగిలినవి ప్రపంచ సినిమా విశ్లేషణలు.

వీడియోలు

మొత్తం వీడియోల సంఖ్య 35. ఇందులో 15 లఘు చిత్రాలు, 4 పూర్తి నిడివి చిత్రాలు ఉన్నాయి.

ముఖాముఖి

ముఖాముఖి విభాగంలో ఆరుగురు దర్శకుల తో నవతరంగం జరిపిన ఇంటర్వ్యూలు ప్రచురించాము.

ప్రముఖులు

ఈ విభాగంలో చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖుల పరిచయ వ్యాసాలు, వార్ ఫిల్మోగ్రఫీలతో పాటు ప్రముఖ చలనచిత్రకారులు స్వయంగా రచించిన వ్యాసాలు కూడా ప్రచురించాము. ఈ విభాగంలో మొత్తం వ్యాసాల సంఖ్య 68.

అభిప్రాయాలు

వివధ చలనచిత్రాల గురించి, మరియు చలనచిత్రాల్లోని ఇతర అంశాల గురించి పాఠకులు 26 వ్యాసాల ద్వారా తమ వ్యక్తిగత అభిప్రాయాలు తెలియచేశారు.

అలాగే నవతరంగంలో సంగీత సాహిత్యాల గురించి, ఫిల్మ్ మేకింగ్ లోని వివిధ ప్రకియల గురించి కూడా వ్యాసాలు వచ్చాయి. వీటితో పాటు ఇతర సైట్ల నుంచి డౌన్ లోడ్ చేసుకోగల స్క్రిప్టుల వివరాలు, ఆసక్తికరమై విషయాలు కూడా లంకెల విభాగంలో ప్రచురించాము.

మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే నవతరంగంలో రెండు కథలు, మూడు కవితలు కూడా ప్రచురింపబడ్డాయి.వాటి వివరాలు:

కవితలు

కథలు

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

4 Comments to “నవతరంగంలో 500 వ్యాసాలు”

  • మన అందరికీ ముఖ్యంగా ఈ విజయానికి కారకులైన పాఠకమహాశయులకు నాహృదయపూర్వక ధన్యవాదాలు,అభినందనలు.

  • హాయ్ వెంకట్ గారు……..
    నవతరంగం 500ల వస్యముల మైలురాయ్ ని దాటినంధుకు గాను ఇంధులొ వస్యముల వ్రాసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవధములు.ఇదె విధముగా నవతరంగం ధిన ధిన అభివ్రుధి చందాలని కొరుకొంటునాను.

    రీగర్ద్స్

    విష్ణు వర్ధన్ రెడ్డి

  • మంచి డేటా ఇచ్చారు. నవతరంగంతో నా పరిచయం దాదాపు నెలరోజులదే కాబట్టి పెద్దగా కామెంట్ చేయలేను. వీలైనంతవరకు పాత పోస్టులు ఆసక్తికరంగా అనిపించినవి చదువుతున్నాను.

  • మీ అడ్రస్ తెలియజేస్తే త్వరలో రిలీజవుతున్న “సినిమా తీయడం ఎలా?” అనే నా పుస్తకాన్ని
    మీ అమూల్యమైన అభిప్రాయం కోసం కాంప్లిమెంటరీగా పంపించగలను.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories