హలో బ్రదర్,శివ చిత్రాలు కలిపి తీస్తే ఎట్లా ఉంటుందో చూడాలంటే మా ‘కింగ్’ చూడండి..అంటూ శ్రీను వైట్ల ఈ సినిమా గురించి ఊరించి..ఊరించి చెప్పుకొచ్చాడు.అయితే అసలు ట్విస్టు ఏమిటంటే..బాలీవుడ్ హిట్ ‘వెలకమ్’ లోని కథను తీసుకుని దానికి మరో బాలివుడ్ హిట్ చిత్రం ‘రేస్’ ట్విస్ట్ నిస్తే పుట్టిందే ‘కింగ్’.అలాగే ఈ సినిమాని ఆ రెండు (హలో బ్రదర్,శివ)సినిమాలతో పోల్చి చూస్తే..అస్సలు పొరపాటున కూడా నచ్చదు(అఫ్ కోర్స్ నాగార్జున వీరాభిమానులు కు కూడా ).ఏదో టైం పాస్ కోసం వెళ్ళాం..వాళ్ళేదో..తీసారు..మనమేదో చూసాం అని ఫిక్సియి వెళ్తే అధ్బుతంగా నచ్చేస్తుంది.
ఓ మంచి దాదా బొట్టు శ్రీను(నాగార్జున) .అలాగే సిటీలో అప్పటికే ఆ వృత్తిలో సెటిలయిన లోకల్ డాన్ జ్ఞానేశ్వర్(శ్రీహరి). ఓ సుముహూర్తాన అతన్ని శ్రీను ఎదిరిస్తాడు.పాపం మంచివాడూ,అమాయికుడూ అయిన జ్ఞానేశ్వర్ ఓ ఎగ్రిమెంట్ కి వచ్చి తన ఏరియాని అఫ్పచెపుతాడు. ఈ లోగా శ్రీను అతని ముద్దుల చెల్లెలు శ్రావణి(త్రిష)తో ప్రేమలో పడతాడు. అయితే సింగర్ గా ట్రై చేస్తున్న శ్రావణి ల జీవితాశయం ఈ దాదాగిరిలకు సంభంధం లేకుండా ఓ మంచి కుర్రాణ్ని చూసి పెళ్ళి చేసుకోవాలని. అందులో భాగంగా ఆమె.. శ్రీను ని శరత్ (సునీల్) అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ అనుకుని పొరబడి మనసిచ్చేస్తుంది. సర్లే ఎలాగయితేనేం ఆమె ప్రేమలో పడటమే ముఖ్యమనుకున్న శ్రీను..శరత్ ని తప్పించి ఆ ప్లేసులో కంటెన్యూ అవుతూ ఆమెతో ప్రేమ గీతాలు పాడుతూంటాడు. ఇదంతా జ్ఞానేశ్వర్ మొదట అనుమానించినా తింగరోడు అవటం వలన తర్వాత నమ్మి ఓ రోజు ఎంగేజమెంట్ ఫిక్స్ చేస్తారు. అయితే ఆ సమయంలో శ్రీనుకి ఓ అనుకోని ట్విస్టు (ప్రేక్షకుడుకి కాదు)ఎదురవుతుంది. అతన్ని కింగ్ అని పిలుస్తూ కొందరు వెంబడించి చంపటానికి ప్రయత్నిస్తారు. ఇంతకీ కింగ్ ఎవరు..శ్రీనుకి..కింగ్ కి సంభంధం ఏమిటి…శరత్ గా శీను ఆడుతున్న నాటకం బయిటపడిందా..అన్నది తెరపైన చూడాల్సిందే..
సోర్స్ ఎక్కడిదయినా సోల్ పట్టుకుని స్టోరీ అల్లితే సినిమా సూపర్ అనటానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారన్నది తెలిసిందే.ఒకరు మరొకరు ప్లేసులోకి వెళ్ళటం,అలాగే ఒకరు మరొకరులా నటించటం అనే ప్రూవ్ అయిన రెండు కామెడీ అంశాలునే తీసుకునే కింగ్ కథ అల్లారు. అయితే కథలో మలుపులు ఎక్కువ అవటం దెబ్బ తీసింది. ఎక్కడో క్లైమాక్స్ ట్విస్ట్ లో విలన్ ఎవరో తెలియటంతో..అతన్ని ఎదిరించటానికి..ఎత్తు కు పై ఎత్తు వేయటానికి స్క్రీన్ టైమ్ మిగలకుండా పోయింది. దాంతో కథ కొంత దూరం వెళ్ళే సరికి ప్రక్క దారి పట్టి చంద్రముఖిని,చంద్రలేఖను(నాగార్జున) పేరడీ చేయాల్సి వచ్చింది. మరికాస్సేపటికి ప్రముఖ సంగీత దర్శకుడు జయసూర్య (బ్రహ్మానందం)పాత్రతో చక్రి ని సెటైర్ చేయిస్తూ కామిడీ పండించే ప్రయత్నం చేయించింది. మరో కథకు పెద్ద సంభందం లేకపోయినా లేడీ విలన్ (మమతా మోహన్ దాస్)ని ఎంటర్ చేయిస్తుంది.
సరే అనుకునే లోపే వేరే వాళ్ళు (జయప్రకాష్ రెడ్డి,షాయిజి షిండే,కృష్ణ భగవాన్) విలన్స్ అని తేలుస్తుంది. మరి కాస్సేపటికి అబ్బెబ్బె..అసలు విలన్ ఎరవంటే అనే మరో ట్విస్టు విప్పుతుంది. అలా ఎక్కడో క్లైమాక్స్ లో అసలు ట్విస్టు విప్పుతుంది. ఇలా ఇన్ని ముళ్ళు ఉన్నా శ్రీను వైట్ల స్పాంటినిటి,జోక్స్ బాగా పండటం ప్లస్ పాయింట్. పాటల్లో కింగ్ టైటిల్ సాంగ్ బాగుంది. విడివిడిగా ఉన్నా బ్రహ్మానందం కామిడీ సన్నివేశాలు బాగా పండాయి.ఇక శ్రీహరి క్యారెక్టర్ పూర్తిగా అమాయికత్వంతో కూడింది కావటంతో సెకెండాఫ్ లో అతన్ని నాగార్జున టీజ్ చేస్తుంటే నవ్వు బదులు జాలి వేస్తుంది. అలాగే రెడీ,ఢీలలో అదరకొట్టిన మాస్టర్ భరత్ ఇందులో పెద్దగా ఉపయోగించుకోలేదు.డైలాగులు మరింత షార్పుగా ఉంటే ఇంకా బాగా పేలేవి. ఓం శాంతి ఓం తరహా స్పెషల్ సాంగ్ హడావిడిగా చుట్టేసిన ఫీలింగ్ తీసుకొచ్చి అందరూ ఊహించినంత కిక్కు ఇవ్వలేకపోయింది. ప్రసాద్ మురెళ్ళ కెమెరా,వర్మ ఎడిటింగ్ పనితనం బాగుంది. అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం డిజప్పాయింట్ చేస్తుంది. ఇక కథా రచయితలుగా గోపీ మోహన్,కోన వెంకట్ మరికాస్త మనస్సు పెట్టి స్క్రిప్టు వంటకం చేస్తే బాగుండేది.
మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఎక్కువ ఎక్సెపెక్ట్ చేయకుండా వెళ్ళి ,కొన్ని లోపాలుని పూర్తిగా వదిలేస్తే…హ్యాపీగాబయిటపడవచ్చు. అలాగే పూర్తిగా నాగార్జున చరిష్మా మీద నడిచిన ఈ చిత్రం అసభ్యత,అశ్లీలం లేకపోవటం ఫ్యామిలలకి నచ్చే అంశం. ఇక సెకెండాఫ్ లో కొంత ట్రిమ్ చేస్తే బాగుండుననిపించే ఈ చిత్రం టైం పాస్ కి పనికొస్తుంది. ఓ సారి ట్రై చేయచ్చు. అయితే పై కండీషన్స్ తోనే సుమా…
బ్యానర్:కామాక్షి కళా మూవీస్
తారాగణం:నాగార్జున,త్రిష,మమతా మోహన్ దాస్,శ్రీహరి,బ్రహ్మానందం,షాయీజి షిండే,కృష్ణ భగవాన్,గీత,ధర్మ వరపు,చంద్రమోహన్ తదితరులు.
కథ :కోన వెంకట్,గోపీ మోహన్
ఆర్ట్ :ఎస్. ప్రకాష్
ఎడిటింగ్: వర్మ
సంగీతం:దేవిశ్రీ ప్రసాద్
కెమెరా:ప్రసాద్ మురెళ్ళ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల
నిర్మాత:శివప్రసాద్ రెడ్డి
రిలీజ్ డేట్ :25 డిసెంబర్ 2008
karim says:
chala baaga raasaru, thxx
విష్ణువర్థన్ రెడ్డి says:
నేను ఏక్కువగా ఉహించకుండా…..మామూలుగానే ఈ సినిమా కి వెళ్ళను…..కథ లో ట్విస్టులు చూసి చిరాకు పుటింది అండి బాబు…….సంగీతం విషయంకి వస్తే…..
1.టైటిల్ సాంగ్,
2.”ఎంతపని చేస్తివిరో ఓ మన్మదుడా” (బాగున్నప్పటికి) ……. అనే పాట ని కన్నడ లో “సంగమ” అనే చిత్రం నుంచి కాపీ చేసారు)
a2zdreams.com says:
“ఏదో టైం పాస్ కోసం వెళ్ళాం..వాళ్ళేదో..తీసారు..మనమేదో చూసాం అని ఫిక్సియి వెళ్తే అధ్బుతంగా నచ్చేస్తుంది.”
— GOOD CHANGE
Please maintain the same standards for all movies and all heroes. సినిమా ఏ ఉద్దేశ్యంతో తీసారో అన్న పాయింట్ ని రివ్యూ వ్రాసేవాళ్ళు అందరూ గమనించాలి.
మీ రివ్యూ మొత్తం చదవలేదు. సినిమా చూసాక చదువుతా. థాంక్స్ ఫర్ యువర్ రివ్యూ.
sasank says:
“ఏదో టైం పాస్ కోసం వెళ్ళాం..వాళ్ళేదో..తీసారు..మనమేదో చూసాం అని ఫిక్సియి వెళ్తే అధ్బుతంగా నచ్చేస్తుంది.”, I liked this point very much and the review is very good. Keep it up Sir.
K మహేశ్ కుమార్ says:
మరో మంచి(?) mindless entertainer ! మనక్కావల్సింది ఇదే అయితే “తధాస్తు” అన్నమాట! చూద్ధాం.
nagaprasad says:
శ్రీను వైట్ల సినిమాల్లో అసభ్యత, అశ్లీలాలు వుండవు. అలాగే బూతు కామెడీ కూడా వుండదు. అందుకే కొద్ది పాటి హింస, మందు సీసా వున్నప్పటికీ, ఈ డైరెక్టరు సినిమాలంటే నాకు ఇష్టం.
బ్లాగుల్లోనే ఎక్కడో ఈ సినిమా “చిక్కడు దొరకడు(రాజేంద్రపసాద్)+చంద్రముఖి = కింగ్” అని చదివినట్లు గుర్తు.
Anyway Good Review, Thanks.
గిరి says:
సూర్యప్రకాశ్ గారు,
ఏది ఏమైనా మీ ఓపిక గణనీయ మైనది. వరుస పెట్టి విడుదలైన ప్రతి సినిమా చూసి సమీక్ష వ్రాసే సత్తా కేవలం వృత్తినిపుణుల (professionals) సొత్తు కాదని మీ వ్రాతలు చూస్తే తెలుస్తుంది.
గిరి
Srilu says:
Preview
నేను చూశాను ఈ మూవీ బాగానే ఉంది ఒకసారి థియటర్ కి వెళ్ళి చూడొచ్చు చివర చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ చేత చెప్పించే డైలాగులు శ్రీహరి చేత చెప్పించేటప్పుడు నవ్వు వస్తుంది.
ఎన్నో మలుపులు ఉన్నా చివరికి అన్నీ జాగ్రత్తగా కలిపాడు ఎవరెవరో విలన్ అనుకుంటాము కానీ చివరికి అక్కడ కూడా ట్విస్ట్ పెట్టాడు(నేనైతే ఊహించాను ఎన్నో సినిమాలు చూసిన ప్రభావంతో :p ). ఆ ట్విస్ట్ ఇక్కడ చెపితే బాగుండదు అది ఏదో తెర మీద చూసి ఆశ్చర్యపోండి
సూర్యప్రకాష్ జోశ్యుల says:
మొర ఆలకించి…’కింగ్’ సినిమాను పది నిముషాల పాటు ట్రిమ్ చేసారు. ఈరోజు(శనివారం) నుండి ఇది అమల్లోకి వస్తుంది.
-సూర్యప్రకాష్
Lakram says:
కింగ్ చూడక ముందు రోజు, నేనింతె సినిమ చుసాను. అందులొ రవితేజ కలలొ ఒక సినిమ తీస్తె, సినిమ చుసి వస్తున్న వాల్లను అడిగితె ఒకడు ‘బొంగులా’ ఉంది సినిమ అంటాడు. అలానె కింగ్ బొంగులా ఉంది అనొచ్చు. లేకపొతె ఎంటి… నాగార్జున & శ్రీను వైట్ల సినిమా లాగ ఉందా అసలు?
పాతిక సినిమాల స్టొరి కొంచెం కొంచెం తీసుకొచ్చి దాన్ని కింగ్ అంటాద. మరీ అంత ఎధవల్లా కనపడ్తున్నారా? అసలు సినిమ తీసెవాల్లకు రోజు రోజుకు మెడదు మోకలు డాటి అరి కాలికి దిగుతున్నట్టుంది.
కొంచెం బుర్ర పెట్టి సినిమ తేస్తె మంచిది.
విష్ణువర్థన్ రెడ్డి says:
ట్రిమ్ చేయకపోతే ఎలా ప్రకాష్ గారు……సినిమా కనీసం 25 రోజులో లేక సంక్రాతి వరకు అన్న అడాలి కదా……పాపం
శనివారం నుండి చూసే ప్రజలు కొంత సేవ్ అయ్యరు…మన లాంటి సినిమా పిచ్చి ఉన్నవాళ్ళు మాత్రం బుక్ అయిపొయాం ……
ప్రదీప్ says:
సినిమా బానే ఉంది కానీ.. ట్విస్ట్‌లు ఎక్కువయ్యాయ్. ఇన్ని ట్విస్ట్‌లకు మెదడు మొద్దుబారి పొయ్యింది..
మీరన్నట్టు, వాళ్ళేదో తీసారు .. మనమేదో చూసాము అనుకుంటే, మంచి mass-masala సినిమా…
Good review. Keep posting.
సూర్యప్రకాష్ జోశ్యుల says:
‘కింగ్’లో బ్రహ్మానందం జయసూర్య అనే సంగీత దర్శకుడిగా కనిపిస్తారు. ఆ పాత్ర, హావభావాలూ సినీ సంగీత దర్శకుడు చక్రిని ఉద్దేశించినదనే అందరూ భావించారు.అయితే ‘కింగ్’ దర్శకుడు శ్రీను వైట్ల వాటిని ఖండించారు. నిన్న(శుక్రవారం) శ్రీనువైట్ల హైదరాబాద్‌లో మీడీయాతో మాట్లాడుతూ ”జయసూర్య పాత్రకు చక్రికి ఎలాంటి సంబంధమూ లేదు. ఆ పాత్ర కేవలం కల్పితం మాత్రమే. చక్రి నాకు సన్నిహితుడు. చాలా మంచివాడు. ఆయన్ని దృష్టిలో ఉంచుకొనే ఆ పాత్రను మలచినట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదు.ఈ విషయంమై చక్రి బాధపడ్డాడని తెలిసింది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి నేను అంతకన్నా బాధపడుతున్నాను. జయసూర్య పాత్రలో కనిపించిన చెడు లక్షణాలు చక్రిలో మచ్చుకైనా లేవు.
టీవీల్లో వచ్చే లైవ్‌షోలలో జడ్జిలు తమకు తెలిసిన జ్ఞానాన్ని ప్రదర్శించడానికి చిన్న వారిని సైతం ఏడిపించడం నాకు నచ్చలేదు. అలా అల్లుకున్న పాత్రే అది. మా రచయితల్లో ఒకరైన గోపీమోహన్ మస్తిష్కం నుంచి పుట్టిన పాత్ర. గోపీ మరొక దర్శకుడికి ఈ పాత్రను గురించి చెబితే వద్దన్నారట.. నా సినిమాకు సరిపోతుందని నేను పెట్టుకున్నాను” అని పేర్కొన్నారు. అలాగే రేస్ సినిమా ట్విస్టు ఆధారంగా తాను అల్లుకున్నానన్నది నిజం కాదని ”రేస్ సినిమాను తను చూడనేలేదని.. చంద్రముఖి సినిమా తనకు బాగా ఇష్టం కనుకనే ఆ పేరును ప్రస్తావిస్తూనే కొన్ని సన్నివేశాలను మలచుకున్నామ”ని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.