గోవా బంగారాలు ఇవే ..

iffi-2008

గోవాలో నవంబరు 22న మొదలైన 39వ ఇఫి చిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి నటుడు కమల్‌హాసన్‌, గోవా ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌ హాజరయ్యారు. ఈ ముఫ్ఫై తొమ్మిదివ ‘ఇఫి’ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ముగింపు రోజు అవార్డుల ప్రకటన జరిగింది. అందులో కజకస్థాన్‌ చిత్రం ‘తల్పన్‌’ బంగారు నెమలి(గోల్డెన్‌ పీకాక్‌) పురస్కారాన్ని గెలుచుకుంది. జర్మనీ, స్విట్జర్లాండ్‌, రష్యా, పోలెండ్‌ సహకారంతో దీన్ని నిర్మించారు.సెర్గి డివోర్ట్‌ సెవాయ్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఔత్సాహిక దర్శకుడి అవార్డును కూడా ఆయన దక్కించుకున్నారు. అలనాటి సోవియట్‌ యూనియన్‌లో భాగమైన కజకస్థాన్‌కి చెందిన ఓ యువకుడు నేవీలో శిక్షణ పొందిన అనంతరం అల్లుకున్న పరిస్థితుల ఆధారంగా దీన్ని రూపొందించారు. గతంలో కూడా తల్పన్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డుని,గోల్డెన్ ఐ అవార్డుని మోనోట్రియల్,జ్యూరిచ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గెలుచుకుంది.అలాగే ఈ చిత్రం ఈయేటి ఆస్కార్ విదేశీ విభాగం కేటగిరిలో కజికిస్దాన్ నుండి అఫీషియల్ ఎంట్రిగా వెళ్ళింది. ఈ అవార్డ్ ని ఆయన అందుకుంటూ…సినిమాలు ప్రపంచాన్ని మార్చకపోవచ్చు కానీ..మనుష్యులను మారుస్తాయి..వారు ప్రపంచాన్ని మారుస్తారు అంటూ ఉద్వేగంగా చెప్పుకొచ్చారు.

ఇక గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు కింద రూ.40 లక్షల నగదు బహుమతి అందిస్తారు. గతంలో రూ.10 లక్షలుగా ఉన్న ఈ బహుమతిని ఈ ఏడాది నుంచి భారీగా పెంచారు. శ్రీలంక నటి మాలిని ఫోయెన్‌సెకా ‘ఆకాశ కుసుమ్‌’ చిత్రానికి స్పెషలీ జ్యూరీ అవార్డు (వెండి నంది) సొంతం చేసుకుంది. ఈ విభాగంలో బహుమతి కింద రూ.15 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందిస్తారు. మహాసత్తా (మరాఠీ), ప్రియదర్శన్‌ రూపొందించిన ‘కాంచీవార’(తమిళ్‌) చిత్రాలు కూడా బరిలో నిలిచాయి. హాంగ్‌కాంగ్‌కి చెందిన పీటర్‌ చాన్‌ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. నటి టబు కూడా కమిటీలో సభ్యురాలు. 40 దేశాలకు చెందిన సుమారు 225 చిత్రాలను ఇఫిలో ప్రదర్శించారు. ముంబయి ప్రేలుళ్ళ విషాదంతో ఇఫి ఆర్గనైజర్స్ చాలా పోగ్రామ్స్,ఏక్టివిటీస్ ఆపు చేసారు. వచ్చే ఫెస్టివల్ నాటికి నవతరంగం సభ్యుల్లో కొందరైనా సినిమాలు తీసి ప్రదర్శించాలని కోరుకుంటూ…అవార్డులు అందుకున్న వారికి మనసారా శుభాకాంక్షలు తెలుపుతోంది.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

3 Comments to “గోవా బంగారాలు ఇవే ..”

  • వెండి నంది ?? అచ్చుతప్పు?

  • కొత్తపాళీ గారూ,
    ఇప్పుడు సరి చేశాము.తెలియచేసినందుకు ధన్యవాదాలు.
    వెంకట్

  • తల్పన్ చాలా మంచి సినిమా. కజికిస్దాన్ లాంటి చిన్న దేశాలనుంచి ఇప్పుడిప్పుడే మంచి సినిమాలు వస్తున్నాయి. అలాగే వాటికి మంచి గుర్తింపు కూడా లభిస్తోంది. 2005 లో వచ్చిన స్కీజో అనే మరో కజకిస్థాన్ సినిమా కూడా బావుంటుంది.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories