ప్రముఖ ఆడియోగ్రఫర్ హెచ్.శ్రీదర్ మృతి

Dec 1st, 2008 | రచయిత: జోస్యుల సూర్యప్రకాశ్ | వర్గాలు: featuredప్రముఖులు

నాలుగు సార్లు నేషనల్ అవార్డ్స్ పొంది సినీ సంగీత ప్రపంచంలో ఎంతో పేరు పొందిన హెచ్. శ్రీధర్ (శ్రీధర్ హరి హరన్ )నిన్న రాత్రి చెన్నై లో మరణించారు.గుండె పోటుతో ఈ మరణం సంభవించిందని డాక్టర్స్ నిర్దారించారు. శ్రీధర్ భారతీయ సినిమా గర్వించతగ్గ దర్శకులైన మణిరత్నం,రామ్ గోపాల్ వర్మ,అశుతోష్ గోవార్కర్,కె.బాల్ చందర్,శంకర్,కమల్ హాసన్,పి.సి.శ్రీరామ్,భారతీరాజా,ప్రియదర్శన్ వంటి ప్రముఖుల సినిమాలకు పనిచేసారు.

అలాగే డిజెటిల్ సౌండ్ ఇక్కడ పాపులర్ కావటానికి ఆయన కృషే కారణమని చెపుతూంటారు.అలాగే ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ వద్ద రోజా సినిమా నుండి పనిచేస్తున్నారు. లగాన్,మహానది,దిల్ సే,అమృత(ఈ నాలుగు చిత్రాలకు బెస్ట్ ఆడియోగ్రఫి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి),రంగీళా,సత్య,జీన్స్,ఖుషి,సఖి,జోధా అక్బర్ వంటి ఎన్నో గొప్ప చిత్రాలకు పనిచేసారు. దాదాపు రెండు వందలు చిత్రాలకు పైగా పని చేసిన శ్రీధర్ గణితంలో గ్యాడ్యుయేషన్ పూర్తి చేసారు. సంగీతం పై ఉన్న విపరీతమైన ఇష్టంతో ఆయన సౌండ్ ఇంజనీర్ గా ట్రైనింగ్ అయి కెరీర్ ప్రారంభించారు. అలాగే ఆయన పలు ఇంటర్ నేషనల్ ప్రాజెక్ట్స్ కు సైతం పనిచేసారు. తనదైన ప్రత్యేక శైలితో సినిమాలకు పనిచేసి మెప్పించే ఆయన మరణం తమిళ పరిశ్రమనే కాక పరిచయమున్న అందరిని షాక్ కి గురిచేసింది. ఆయనకు మనసారా శ్రధ్ధాంజలి ఘటిస్తూ…

ఇవి కూడా చదవండి

నిశ్శబ్ద్
12వ కేరళ చలనచిత్రోత్సవం

2 comments
దయచేసి వ్యాఖ్యలు తెలుగులో వ్రాయండి. తెలుగులో వ్రాయడానికి lekhini.org లేదా బరహా సాఫ్ట్ వేర్ ఉపయోగించండి. »

  1. సినిమాకు సంబంధించి తెరమీద కనపడే నటీనటుల గురించి తెలిసినంతగా మనకు తెరవెనుక పనిచేసే సాంకేతిక నిపుణుల గురించి తెలియదు. అసలు సినిమాకు సంబంధించిన వివిధ విభాగాల గురించి సాధారణ ప్రేక్షకుల పరిజ్ఞానం పెద్ద ‘గుండుసున్న’. కెమెరమ్యాన్ గురించి కొద్దిగా తెలుస్తుందేమో గాని, ఎడిటింగ్ అంటే, సౌండ్ రికార్డింగ్ అంటే, కళ అంటే ఏమిటో మన వాళ్లకు తెలిసింది చాల తక్కువ. అలాంటి విభాగాల గురించి సాధారణ ప్రేక్షకులకు రచనల ద్వారా తెలియజేసే వారూ తక్కువే. ఇది ఒక పెద్ద లోపం. ఒకవేళ అటువంటి సాంకేతిక నిపుణులకు అవార్డులు, రివార్డులు వచ్చినా మనం పెద్దగా పట్టించుకోం.

    అలాంటి ఒక గొప్ప సాంకేతిక నిపుణుడి గురించి పట్టించుకొని ‘నవతరంగం’ తెలియజేయడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఆయన మరణం ఒక పెద్ద లోటే. ఇటువంటి వారి గురించి పరిశోధించి అయినా సరే, ‘నవతరంగం’ లో మంచి వ్యాసాలు రాయించండి.

    - శేషు, కొత్త డిల్లీ

  2. హెచ్.శ్రీధర్ ఆడియోగ్రఫీ నిపుణుని మరణం నాకు చాలా దుఃఖానికిగురిచేసింది.సినిమాభాషలో సౌండ్ మిక్సింగు చాలా ముఖ్యమైనదశ అందులో సిద్దహస్తుడు మనశ్రీధర్.మణిరత్నం సినిమాల్లో శబ్దాలు ఎంత స్పస్టంగావినిపించి ,రెహమాన్ పాటల్లో మాధుర్యాని కి సొగసులు శ్రీధర్ అందిచినవే.శ్రీధర్ తోకలిసిపనిచెయ్యాలన్న నా కోరిక కోరికగానే ……శ్రద్ధాంజలిఘటిస్తూ

దయచేసి వ్యాఖ్యలు తెలుగులో వ్రాయండి. తెలుగులో వ్రాయడానికి lekhini.org లేదా బరహా సాఫ్ట్ వేర్ ఉపయోగించండి.