Menu

‘అష్టాచెమ్మ’ భార్గవి మృతి

ఎన్నాళ్ళో ఎదురు చూసిన ఒక కల పూర్తవకుండానే ముగిసింది.అష్టాచెమ్మ భార్గవి ఈ రోజు (మంగళవారం)అనుమానాస్పద స్థితిలోమరణించింది. సినీ కళా ప్రపంచంలో ఎదుగుదామని గుంటూరు జిల్లా గోరంట్ల నుండి బయిలుదేరి కలలనే పెట్టుబడిగా పెట్టి ఎదుగుదల కోసం ఎదురు చూసిన ఆమె చిరకాల స్వప్నం ఇవాళో రేపో పూర్తవబోతున్న దశలో నే అంతమయిపోయింది. అష్టాచెమ్మ హిట్టుతో పదిసినిమాలు పైగా ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. ఈ సమయం కోసం ఆమె చాలా కాలం నుంచి ఎదురుచూస్తోంది.

అష్టాచెమ్మ సినిమాలో రెండో హీరోయిన్ గా చేసిన భార్గవి సోమవారం అష్టాచెమ్మా సినిమా విజయోత్సవ సభకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె వెళ్లలేదు. మంగళవారం ఉదయం ఎస్ఎస్ కుమార్ దర్శకత్వంలోని సినిమా షూటింగ్ కు వెళ్లాల్సి ఉంది. తన కోసం వచ్చిన సినీ సిబ్బంది వాహనంలో ఎక్కడానికి కిందికి వచ్చిన భార్గవి నగలు మరిచిపోయానంటూ పైకి వెళ్లిందని, ఎంతకీ ఆమె తిరిగి రాకపోవడంతో సిబ్బంది పైకి వెళ్లి చూశారు. రెండు శవాలు మంచంపై పడి ఉండడంతో వారు ఎస్ఎస్ కుమార్ కు చెప్పారు.

ఆమెతో పాటు మరో వ్యక్తి ప్రవీణ్ కుమార్ (బుజ్జి) కూడా మరణించాడు.అక్కడున్న సూసైడ్ నోట్ ప్రకారం వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకున్నారని..గత ఏడాదిగా విడిపోయి ఉంటున్నామని రాసి ఉంది. ప్రస్తుతం ఆమె హాలిడేస్ అనే సినిమాలో నటిస్తోంది. తన భర్తతో పాటు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే ఆమెను హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు సైతం మీడియా,పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

అష్టాచెమ్మ సినిమా హిట్టయ్యాక ప్రవీణ్ ని అవాయిడ్ చేయటానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఇక ప్రవీణ్ కి ఇది మూడో పెళ్ళి. ఇక నాలుగేళ్ల క్రితం ఆమెకు పెళ్లయింది. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. హైదరాబాదు బంజారాహిల్స్ లోని వెంకటేశ్వర నగరులో ఆమె తన సొంత అపార్టుమెంటులో తల్లితో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది.

భార్గవి సినిమాల్లో చేయక ముందు జస్ట్ యల్లో వారి అమ్మమ్మ డాట్ కాం,అమృతం,జీ టీవి వారి ఆట,మా ఊరి వంట అనే పోగ్రామ్స్ లో చేసి పాపులర్ అయింది.రాష్ట్రవాప్తంగా తనకంటూ అభిమానులను సంపాదించుకుంది. అయితే ఆమెకు సినిమా అన్నది చిరకాలపు కల. ఓ ప్రక్క టీవీల్లో చేస్తూనే అన్నవరం,పాండురంగడు వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.

ఇక అష్టా చెమ్మా సినిమాను ప్లాన్ చేస్తున్నప్పుడు మోహన్ కృష్ణ కి అమృతంలోని ఆమె పాత్ర గుర్తు వచ్చింది. అప్పుడొక ఇంటర్వూలో నేను మొదట ఆ పాత్ర అనుకున్నప్పుడు స్టీరియో టైప్ తెలివితక్కువ దద్దమ్మ తరహా పల్లె అమ్మాయి కోసం వెతకలేదు..కాస్తంత సంప్రదాయంగా కనపడుతూ బాగా తెలివిగా ఉన్నట్లు బిహేవ్ చేస్తూ కామిక్ సిట్యువేషన్స్ క్రియేట్ చేయాలనే అమ్మాయి కోసం వెతికాను. అలాగే అచ్చతెలుగు అమ్మాయి గా తెరపై కవ్వించింది. అలాంటి అమ్మాయి ఈ రోజు లేదు అనిపించటం భాధాకరమే.ఆమె పర్శనల్ లైఫ్ ని ప్రక్కన పెడితే ఇప్పుడిప్పుడే ఒక కలలా కళా ప్రపంచంలో ఎదుగుతున్న మంచి నటిని తెలుగు పరిశ్రమ కోల్పోయింది. ఆమెకు మనసారా శ్రధ్ధాంజలి ఘటిస్తూ…

9 Comments
  1. Satya Shyam KJ December 16, 2008 /
  2. Sai Brahmanandam Gorti December 16, 2008 /
  3. నియంత December 16, 2008 /
  4. BhargaviFan December 17, 2008 /
  5. shree December 17, 2008 /
  6. kumar December 18, 2008 /
  7. Raghunadharaju December 21, 2008 /
  8. VENKAT December 23, 2008 /