Menu

చందమామలో భానుమతి ఉండాలొయ్

దివంగత పి.భానుమతి నవంబరు 1947 చందమామలో పాపాయిల కోసం రాసిన ఓ బుజ్జిగీతం

ఉండాలోయ్ ఉండాలి
పి.భానుమతి

ఫిలింకు పాట
పిల్లలకు ఆట
రాజుకు కోట
ఉండాలోయ్ ఉండాలి

అత్తకు నోరు
దేవుడికి తేరు
స్టారుకు కారు
ఉండాలోయ్ ఉండాలి

స్టేజీకి తెర
కత్తికి ఒర
చేపకు ఎర
ఉండాలోయ్ ఉండాలి

యింటికి అమ్మ
నిమ్మకి చెమ్మ
కొలువుకి బొమ్మ
ఉండాలోయ్ ఉండాలి

తలుపుకి గడి
దేవుడికి గుడి
అవ్వకు మడి
ఉండాలోయ్ ఉండాలి

జూదరికి పేక
గొడ్లకి పాక
గాంధీకి మేక
ఉండాలోయ్ ఉండాలి

అరవలకు పొగాకు
ఆంధ్రులకు గోగాకు
మళయాళులకు తేయాకు
ఉండాలోయ్ ఉండాలి

6 Comments
  1. bollojubaba December 13, 2008 /
  2. venkat December 13, 2008 /
  3. j.suryaprakash December 13, 2008 /
  4. అబ్రకదబ్ర December 23, 2008 /
  5. vihaari(kbl) January 24, 2009 /