Menu

సచిత్ర సృష్టికర్తకు 75 వసంతాలు

4 ఆగస్టు, 2007.

సామ గార్డెన్స్ (హైదరాబాదు) లో “సుందరకాండ” సినిమా షూటింగ్ .

“ఆకూ వక్కా తాంబూలం…” పాట. సాయంత్రం నాలుగు కావొస్తోంది.

డైరెక్టరు అనుకున్న షాట్లు ఇంకా పూర్తి కాలేదు. ఆరింటికి pack up చెప్పాలి. లైటు తగ్గుతోంది. కెమెరా మెన్ రాజు గారు లైటింగు సరి చేస్తున్నారు.  లైట్ బాయ్స్ లైట్లు సర్దుతుతూ పరుగులు తీస్తున్నారు. అంతేమరి షూటింగు లో ప్రతి నిమిషము విలువైనది. డైరెక్టరు గారు స్క్రిప్ట్ చూసుకుంటున్నారు. ఈ షాటు తర్వాతి షాటు, దాని తర్వాతి షాటు ప్లాన్ చేసుకుంటున్నారు. అసిస్టెంట్ వచ్చి water కావాలా సార్ అని అడిగాడు. ఇప్పుడు disturb చేయకు ఆన్నారు డైరెక్టర్. ఇంతలో ఓ పదేళ్ళ పిల్లాడు తుర్రున వచ్చి చెయి ఇస్తూ (షేక్ హ్యాండ్) “సాయిచంద్” అన్నాడు. డైరెక్టరు గారు ఓపిగ్గా “ఏంటమ్మా?” అన్నారు చేయి ఇస్తూ.
“సాయిచంద్”.
“ఆహా ..” (చిరు నవ్వుతో)
“మీ పేరు?”
“నా పేరు లక్ష్మినారాయణ”
ఆ పిల్లాడు తన చెయ్యి లాక్కుని తుర్రున వెళ్ళిపోయాడు.

ఆ లక్ష్మినారాయణే మన బాపు గారు. నా అదృష్టం ఏంటంటే “సుందరాకాండ” షూటింగ్ మొత్తం చూసే అవకాశం దోరికింది. ఆ సమయంలో నేను అక్కడే వున్నాను. బాపు గారు లేని తెలుగు సినీ మరియు సాహితి చరిత్ర వుండదు. ఆ బాపు గారికి ఈ రోజు (15 డిసెంబరు)కి డెబ్బైఅయిదు వసంతాలు నిండాయి. ఈ సందర్భంగా “సుందరాకాండ” షూటింగ్ అనుభవాలు కొన్ని ఇక్కడ పంచుకుంటాను.

సుందరాకాండ సినిమా (అప్పటికి ఆ పేరు అనుకోలేదు) షూటింగ్ గురించి తెలియగానే బాపు గారికి ఫోన్ చెసి మీ షూటింగ్ చూడాలని చాలా ఆశగా వుంది నేను షూటింగ్ కి రావొచ్చా అని request చేసా. ఓ తప్పకుండా, కో-డైరెక్టరు శ్రీనివాసు గారికి చెబుతాను అన్నారు. అంతే ఢాం అని పేద్ద శబ్దం. ఎగిరి గంతేసాను కదా పక్కన వున్న కుర్చి కింద పడిందన్న మాట. వెంటనే ఆఫిస్ లో 40 రోజుల లీవు అడిగాను. ప్రైవేట్ కంపెనీల్లొ అన్ని రొజుల లీవు అంటే అంత సులభం కాదు. కాని, అన్నీ మంచి శకునములే అన్నట్టు లీవు మంజూరయ్యింది.

షూటింగ్ కి అయితే వెళ్ళాను కాని, బాపు గారికి డిస్టర్బెన్స్ లేకుండా వీడియో తీయాలని చాల మటుకు సైడ్ పోజ్ లలో లేకపోతే బాక్ సైడ్ నుంచి తీస్తున్నాను. గమనించట్లేదు అనిపించినపుడు ముందు నుంచి కూడా తీసాను. కోన్ని రోజులు (ఓ పది రోజులు అనుకుంట) తర్వాత, బాపు గారు ఒకసారి మీరు తీస్తున్న వీడియో చూపించండి అన్నారు. మంచి ఇంప్రెషన్ కొట్టేద్దామని కొంచం vibrant కలర్స్ తో షూటింగ్ అయిన సీన్ల కేసెట్ వేసి చూపించా. కొంచెం సేపు చూసి, వీడియో ముందు నుంచి తీయండి, actors కి చెపుతున్నపుడు కూడా తీయండి అన్నారు. మీకు డిస్టర్బెన్స్ గా వుంటుందేమోనని అని నేను అంటుంటే, ఏం పర్వాలేదు అని ధైర్యం చెప్పారు.

“అనుకోకుండా ఒక రోజు”లో ఛార్మి నటన చూసి బాపుగారు మెచ్చుకొని ఛార్మిని హీరోయిన్ గా తీసుకున్నారని మనకు తెలిసిందే. ఛార్మి కూడా బాపు గారితో సినిమా చేయడము చాలా అదృష్టంగా భావించి షూటింగ్ కి హాజరైన ప్రతి రోజు బాపు గారి ప్రక్కన కుర్చి వేయించుకొని కూర్చునేది. వాళ్ళిద్దరి మాటలు సరదాగా సాగేవి. ఒకసారి షూటింగ లో దోమలు కుడుతుంటే “ఎన్ని దోమలో” అని ఛార్మి వాపోతుంటే, “మగ దోమలు అయ్యుంటాయి” అని చమత్కరించారు. (ఇంకా చాలా వున్నాయి.)

ఈ సినిమా షూటింగ్, రీ-రికార్డింగ్, ఎడిటింగ్ ఇలా అన్ని కవర్ చేసే అవకాశం లభించింది (౩౦ గంటలకు పైగా వీడియో). ఆ వీడియో నుంచి ఒక 30 నిమిషాల నిడివితో “సుందరకాండ నిర్మాణం” (Making of Sundarakanda) చేసాను (తక్కువ సమయములో ఆ వీడియోలని కింద చూడవచ్చు.

ఈ వీడియో చిత్రీకరణ కు రమణ గారు కూడాఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. (వీడియో మొదటి భాగం లో రమణ గారు స్క్రిప్ట్ వ్రాయటం వుంది). అన్నట్టు బాపు మంచి నటుడు కూడా. Actor బాపు ని చూడాలనుకుంటే, మూడో భాగం వీడియో చూడండి. ఆ యాక్టర్, డైరెక్టర్, ఆర్టిస్ట్, కార్టూనిస్ట్ బాపు గారికి మరో మారు జన్మదిన శుభాకాంక్షలు.

—-విజయవర్థన్.బి

———–మేకింగ్ ఆఫ్ సుందరాకాండ-వీడియో—————

మేకింగ్ ఆఫ్ సుందరాకాండ-మొదటి భాగం

మేకింగ్ ఆఫ్ సుందరాకాండ-రెండవ భాగం

మేకింగ్ ఆఫ్ సుందరాకాండ-మూడవ భాగం

మేకింగ్ ఆఫ్ సుందరాకాండ-నాలుగవ భాగం

మేకింగ్ ఆఫ్ సుందరాకాండ-ఐదవ భాగం

–విజయవర్థన్ బి

20 Comments
 1. ఉమాశంకర్ December 15, 2008 /
 2. చిలమకూరు విజయమోహన్ December 16, 2008 /
 3. మేడేపల్లి శేషు December 16, 2008 /
 4. VENKAT December 16, 2008 /
 5. Madhura vaani December 16, 2008 /
 6. విజయవర్ధన్ December 16, 2008 /
 7. voleti venkata subba rao December 18, 2008 /
 8. శంకర్ December 18, 2008 /
 9. విజయవర్ధన్ December 21, 2008 /
 10. విజయవర్ధన్ December 23, 2008 /
 11. విజయవర్ధన్ December 23, 2008 /
 12. sirisha December 23, 2008 /
 13. విజయవర్ధన్ December 23, 2008 /
 14. అసంఖ్య December 28, 2008 /
 15. విజయవర్ధన్ December 31, 2008 /