Menu

అర్ధసత్య (1983) – ఒక పరిచయం

సినిమా: అర్థసత్య

నటీనటులు: ఓంపురి,స్మితా పాటిల్, అమ్రిష్ పురి, సదాశివ్ అమ్రపుర్కర్, నసీరుద్దీన్ షా మొదలైన వారు

దర్శకత్వం: గోవింద్ నిహలాని

సమకాలీన భారతీయ సినిమాలలో అత్యంత చర్చనీయమైన, ఆర్ధికంగాకూడా సఫలమైన చిత్రాలలో గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించిన ‘अर्थ् सत्य् – అర్ధసత్య’ ఒకటి .  Mainstream యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్ పాత్రలకి ధీటుగా అర్థవంతమైన,ఆలోచనాత్మకమైన,అత్యంత సహజమైన, సందిగ్ధభరితమైన angry young man ను ‘అనంత్ వేలాంకర్’ (ఓంపురి) పాత్రద్వారా భారతీయ తెరకు పరిచయం చేసిన సినిమాకూడా ఇదే. దేశవ్యాప్తంగా ఫిల్మి స్కూల్స్ లో ఏ సిలబస్సూ విస్మరించని చిత్రం. సినీఔత్సాహికులూ,సినీప్రేమికులూ,సినీరంగంపట్ల ఆసక్తి,అనురక్తీవున్న అందరూ ఖచ్చితంగా చూసి తీరవలసిన చిత్రం ఇది. ఎన్నో వేల పేజీల విశ్లేషణ ఇప్పటికే చేసివున్న ఈ చిత్రానికి పరిచయ వ్యాసం రాసే ధైర్యం,తెగువ,జ్ఞానం ఏవీ నాకు లేవనే ప్రఘాఢ నమ్మకంతో, ఆ చిత్ర మూల అంశాన్ని ఉటంకించే కవితను ఇక్కడ రాసి, దాని తెలుగు అనువాదాన్ని అందిస్తాను. I think this poem is the perfect introduction to such a great film. ఈ కవితను సినిమాలో ఓంపురి పాత్ర చదివేప్పుడు తన ముఖంలో పలికించే భావాలను చూసి “నటనంటే ఇది!” అని అనని వారుండరనుకుంటాను. 

चक्रव्यूह मे घुस्ने से पगलॆ
कैन्था मै और कैसा था
ए मुझे याद ही न रहॆ !
चक्रव्यूह मे घुस्ने के बाद
मेरा और चक्रव्यूह के बीच
जान लॆवा निकट्ता थी
इस्का मुझॆ पताही नहि चला !

चक्रव्यूह से बाहर निकल्ने पर
मै मुक्त हॊजाऊ भलॆही
फिर भी चक्रव्यूह की रचनामॆ
कॊई फर्क ही नही पडॆगा !
मरू या मारू
मारा जाऊ या जान से मारू
इस हा फैसला कभि नही हॊपायॆगा !

सॊयाहुवा आदमी
जब नींद से उठ्कर चल्ना शुरू करता है
तब सप्नॊं का संसार उसॆ
दुबारा दिखी नही पायेगा
उस रॊशनी मे जॊ निर्णय की  रॊशनी है
क्या सबकुछ समान हॊजायॆगा?

ऎक पलडॆ मे नपुंसक्ता
दूसरॆ पलडॆ में पौरुष
और ठीक तराजू के काटॆ पर ‘अर्थ् सत्य्’
– दिलीप चित्रॆ

చక్రవ్యూహ ప్రవేశానికి మునుపు
నేనెవరో..ఎలాంటివాడినో
నాక్కొంచెమైనా జ్ఞాపకం లేదే!
చక్రవ్యూహ ప్రవేశానంతరం
నాకూ దానికీ మధ్య
ప్రాణాంతక సామీప్యం తప్ప మరేమీ లేదు
అయినా ఆ అనుభూతి స్పృహకూడా నాలో రాదే!

చక్రవ్యూహాన్ని ఛేధించాక
ముక్తుడిగా నేనే మిగిలినా…
ఈ చక్రవ్యూహ సృష్టిలో
మార్పేమైనా కలిగేనా?
చచ్చినా చంపైనా
చనిపోయినా, ప్రాణాలే తీసినా
ఈ నిర్ణయం జరిగేనా?

నిద్రనుంచీ లేచి నడిచే మనిషికి
మళ్ళీ కలల ప్రపంచం కనిపించేనా!
వెలుగులో..
తీర్పుచెప్పే క్షణాల వెలుగులో
అన్నీ సరిసమంగా తూగేనా?

ఒకత్రాసులో పుంసత్వం
మరొక త్రాసులో నపుంసకత్వం
ఈ రెంటినీ తూల్చే తూలికలో…
సరాసరిమధ్యన ‘అర్థసత్యం’
హిందీ మూలం- దిలీప్ చిత్రే
తెలుగు స్వేఛ్చానువాదం – కె.మహేష్ కుమార్

వ్యవస్థ అనే చక్రవ్యూహంలో చిక్కిన సాధారణవ్యక్తి, తన పుంసత్వానికీ పరిస్థితులు అతడిద్వారా ఆశించే నపుంసకత్వానికీ మధ్య  నలిగిపోతూ, తన అస్థిత్వాన్ని త్రాసులోని అర్థసత్యలా మిగిల్చిన వైనాన్ని గురించి ఇంతకన్నా బలంగా చెప్పిన కవిత మరోటి లేదు. ఇదే కవితకి దృశ్యరూపమిచ్చిన చిత్రమే అర్థసత్య.

ఈ సినిమా అన్ని షాపుల్లోనూ దొరుకుతుంది. తప్పకచూడండి. చూసి అనుభవించండి. హైదరాబాద్ లో ఉన్నవాళ్ళతో DVD పంచుకోవడానికి నేను సర్వదాసిద్ధం.

9 Comments
  1. pappu December 26, 2008 /
  2. sriram velamuri December 26, 2008 /
  3. sriram velamuri December 26, 2008 /
  4. satyam January 11, 2009 /