ఒక సమస్య-రెండు పరిష్కారాలు

ఈ నెల ఫోకస్ శీర్షికలో అబ్బాస్ కియరస్తోమీ గురించి వ్యాసాలు, ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా సమీక్షలు ప్రచురిస్తున్న నేపథ్యంలో తన కెరీర్ మొదట్లో కియరస్తోమీ నిర్మించిన కొన్ని లఘు చిత్రాలు నవతరంగం పాఠకుల కోసం ఇక్కడ అందిస్తున్నాము.

ఇప్పుడు మీరు చూడబోయే సినిమా-’2 Solutions for One Problem’. ఈ సినిమాని కియరస్తోమీ ’Centre for the Intellectual Development of Children and Young Adults’ అనే సంస్థ కోసం రూపొందించారు.

ఇలాంటివే మరి కొన్ని లఘు చిత్రాలు త్వరలో నవతరంగంలో  ప్రదర్శించే ప్రయత్నం చేస్తాము. అప్పటివరకూ ఈ లఘు చిత్రాన్ని చూసి ఆనందించండి.

Filed Under: featuredleadలఘు చిత్రాలువీడియో

Tags: , , , , ,

Comments (5)

Trackback URL | Comments RSS Feed

  1. నాలుగు నిమిషాలలో చక్కని నీతి కధని బోధించాడు. విచిత్రమేంటంటే ప్రతి సమస్యకూ ఇలానే రెండు పరిష్కారాలు ఉన్నా అందరూ మొదటి తరహా పరిష్కారానికే మొగ్గుచూపుతారు ;)

  2. ఈ లఘు చిత్రం నేను ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్(MIFF) లో ఒక సారి చూసాను. అద్భుతం అనిపించింది. ఇంత చిన్న చిత్రంలో అంతర్జాతీయ రాజకీయాల్నీ, మానవసంబంధాల్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఈ దర్శకుడు అభినందనీయిడు.

  3. మేడేపల్లి శేషు says:

    ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా చిత్రాలుగా తీయవచ్చునని ఆలోచన రావటమే ఒక గొప్ప విషయం. ఇది కూడా ఒక సినిమాయేనా అనుకునే వాళ్లకు ఏం చెప్పలేంగాని, ఇందులోని నీతిని గ్రహించే పిల్లలకు (పెద్ద వాళ్లకు కూడా) ఎంతో ఉపయోగపడుతుంది. ఇటువంటి లఘుచిత్రాలు, స్కూళ్ళల్లో ప్రదర్శిస్తే, పిల్లల మానసిక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

  4. మేడేపల్లి శేషు says:

    అబ్బాస్ కియరస్తోమీ లఘు చిత్రాన్ని చూసిన తర్వాత, నేనెప్పుడో యూ-ట్యూబులో చూసిన ఈ ఒక నిమిషం లఘు చిత్రం గుర్తు వచ్చింది. ఇలాంటివి సందేశాత్మకంగా ఉంటాయా అనే సందేహం ఉన్నవాళ్ళకు ఇది చూశాక ఆ అనుమానం తీరుతుందనుకుంటాను.
    http://www.youtube.com/watch?v=YWF-wWV06jI

  5. అద్భుతం, ఒక్క మాటలో……. ఈ మధ్య కాలంలో నేను చూసిన అతి చక్కని వీడియో ఇదే. Thanks for making my day.

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.