కేరళ ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ చే నిర్వహించ బడే పన్నెండవ కేరళ చలన చిత్రోత్సవం ఈ సంవత్సరం డిశెంబరు 12 నుంచి 19 వరకూ జరగనుంది. తిరువనంత పురంలో జరిగే ఈ ఉత్సవంలో గత సంవత్సర కాలంలో ప్రపంచ దేశాల్లో నిర్మించబడిన అత్యుత్తమ చిత్రాలెన్నింటినో ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ చిత్రోత్సవంలో ’కాంపిటీషన్’ విభాగంలో 14 చలనచిత్రాలు ప్రదర్శిస్తుండగా, డాక్యుమెంటరీ విభాగంలో 18 చిత్రాలు, ’ఇండియన్ సినిమా టుడే’ విభాగంలో 5 ఉత్తమ భారతీయ చలనచిత్రాలు, ’మలయాళం సినిమా నౌ’ విభాగంలో 7 సమకాలీన మలయాళ సినిమాలు ప్రదర్శించనున్నారు.
ఇవి మాత్రమే కాకుండా ’ప్రపంచ సినిమా’ విభాగంలో 55 చలనచిత్రాలు 25 ’లఘుచిత్రాలు’ ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
Competition
- 1) Refugee Dir:Reis Celik (106’/Turkish-German-Kurdish/2007)
- 2) My Marlon and Brando Dir:Huseyin Karabey (92min/Turkey/2008
- 3) The Yellow House Dir:Amor Hakkar (84min/Algeria,France/2008)
- 4) Farewell Gulsary Dir:Ardak Amirkulov (102min/Kazhakstan/2008)
- 5) Parque Vie Dir:Enrique Rivero (86min/Mexico/2008)
- 6) Dreams of Dust Dir:Laurent Salgues (86min/Burkino Faso,France/2007)
- 7) Hafez Dir:Abolfazl Jalili (98min/Iran,Japan/2007)
-
The Photograph Dir: Nan Achnas (94min/Indonesia/2007) - 9) Machan Dir:Uberto Pasolini (109min/Sri Lanka, Germany/2008)
- 10) Postcards from Leningrad Director: Mariana Rondon (90min/Venezuela/2008)
- 11) Firaaq Dir: Nandita Das (101min/Hindi/2008)
- 12) Gulabi Talkies Dir: Girish Kasarvalli (125min/Kannada/2007)
- 13) Castles in the Air Dir: K. P Kumaran(106min/Mal/2007)
- 14) The Imprints Dir: M.G Sasi (99min/Mal/2007)
Indian Cinema Today
- 1) Kanchivaram (Tamil/117 min/) Dir: Priyadarshan
- 2) Roots/Yarwng (Kokborok(Tripura)/95 min/)Dir: Joseph Pulinthanath
- 3) Shortchanged/Barah aana (Hindi/95 min/)Dir: Raja Menon
- 4) Little Zizou (English/101 min/)Dir: Sooni Taraporevala
- 5) First Time/Mudhal Mudhal Mudhal Varai(Tamil/145 min/)Dir: Krishnan Seshadri Gomatam
Malayalam Cinema Now
- 1) Screen Play/Thirakkatha (India/120 min/2008)Dir: Renjth
- 2) Kadha parayumbol (India/130 min) Dir: M. Mohanan
- 3) Thalappavu (India/110 min/2008) Dir: Madhupal
- 4) Laptop (India/109 min/2008) Dir: Rupesh Paul
- 5) Beyond the veil/Vilapangalkkappuram(India/110 min/2008)Dir: T V Chandran
- 6) Lucky Red Seeds/Manjadikkuru(India/117 min/)Dir: Anjali Menon
- 7) Gulmohar (India/104 min/2008) Dir: Jayaraj
ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్న చలనచిత్రాల పూర్తి వివరాల కొరకు ఇక్కడ చూడండి.
మేడేపల్లి శేషు says:
వీటిల్లో కొన్ని చిత్రాలు ప్రస్తుతం ఢిల్లీలో ఇండియన్ పనోరమ, 2008 లో ప్రదర్శింపబడుతున్నాయి (గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడినవి). నేను ఈ శని, ఆదివారాల్లో నాలుగు సినిమాలు చూశాను. వాటిలో కాంజీవరం (తమిళం) ఒకటి. ఇది స్వతంత్రం రావటానికి పూర్వం తమిళనాడులో పట్టు నేత కార్మికుల సమస్యలకు, వాళ్ల జీవితాలకు సంబంధించినది. పై జాబితాలో పేర్కొన్న మరికొన్ని చిత్రాలు కూడా ఈ వారమంతా జరిగే చిత్రోత్సవంలో ప్రదర్శింపబడుతాయి.