యువరాజ్

తారాగణం:సల్మాన్ ఖాన్,జియాద్ ఖాన్,అనీల్ కపూర్,కత్రినా కైఫ్,బొమన్ ఇరానీ తదితరులు.
సంగీతం: ఎఆర్ రహమాన్
కెమెరా :కబీర్ లాల్
కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం,నిర్మాత:సుభాష్ ఘయ్

యువరాజు..ఒకరోజు

అమాయికత్వంలోంచే క్రియేటివిటీ పుడుతుంది. అన్నీ తెలిస్తే ఏమీ సృజించలేము అని చాలా సార్లు విన్నాను. చెప్పేది క్రియేటివిటి చచ్చిపోయిన వాళ్ళే కాబట్టి నమ్మాలా…వద్దా అనే డైలమా ఉంటూండేది. అయితే ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ సృజించిన యువరాజ్ చూసిన తర్వాత వారు చెప్పేది కరెక్టే అని ఋజువైపోయింది. అందులోనూ విజిలింగ్ వుడ్స్ అనే ఇనిస్టిట్యూట్ పెట్టిన నాటి నుండి ఆయనలో ఏదో చెప్పాలన్న టీచింగ్ తాపత్రయం మరీ ఎక్కువ అవుతున్నట్లుంది. దాంతో కలసి వుంటే కలదు సుఖం,దురాశే అన్ని బాధలకు మూలం వంటి సిద్దాంతాలు మూట కట్టుకుని యువరాజు అంటూ ధియేటర్స్ లోకి దూకాడు. ఫలితం ప్రేక్షకులకు ప్రత్యక్ష్య నరకం.దాంతో యువరాజు-ఒకరోజు మాత్రమే ధియోటర్స్ ని ఏలగల్గాడు.

ఇదే ఆ కలిసిరాని కధ

మోడ్రన్ యూత్ కి ప్రతిబింబాలుగా తిరిగే దేవన్(సల్మాన్ ఖాన్),డానీ(జియాద్ ఖాన్)లు అన్నదమ్ములు. వారి సవితి అన్న జ్ఞానేష్(అనిల్ కపూర్)అంటే వారికి పడదు. కారణం వాళ్ళ నాన్న కోట్ల ఆస్ధిని అన్న పేర రాసి చచ్చిపోయాడు. ఆయనకు చిన్నప్పటినుంచి అన్న అంటేనే ప్రాణం. ఎందుకంటే జ్ఞానేష్ మానసికంగా పూర్తిగా ఎదుగదల లేనివాడు(రెయిన్ మ్యాన్ పాత్ర). అయితేనేం సంగీతంలో జీనియస్. దాంతో అటువంటి వాడిని రక్షించటానికి అన్నట్లు ఆ పెద్దాయన ఆస్ధిని అట్లా రాసి,తన స్నేహితుడు అయిన సికిందర్ మీర్జా(మిధున్ చక్రవర్తి)అనే అటార్నిని కాపలాగా పెట్టి హ్యాపీగా పైకి పోయాడు . దాంతో అన్నదమ్ముల ఇద్దరి ఆశలు కుప్పకూలిపోతాయి. ఎందుకంటే ఆ ఆస్ధి చేజారటం వల్ల దేవన్ కి అతని గర్ల్ ప్రెండ్ (కత్రినా కైఫ్) శాశ్వతంగా దూరమవుతుంది. ఆమె తండ్రి డాక్టర్ పి.కె.బర్టన్(బొమన్ ఇరాని)ఆస్ధి లేని వాడికిచ్చి చేయనని మరో ఎన్నారై సంభందం చూస్తాడు. అలాగే కులాసాగా పబ్స్,నైట్ క్లబ్స్ అని విలాసమంత జీవితం గడిపే డానీకి డబ్బు చేతిలో ఆడకపోవటంతో సమస్య వచ్చిపడుతుంది. ఆ స్ధితిలో తమ అన్నని మోసం చేసి డబ్బు పొందాలనుకుంటారు. అయితే అన్న జ్ఞానేష్ తన మంచితనంతో,అమాయికత్వంతో అపరిమితమైన సంగీత జ్ఞానంతో వాళ్ళలో పరివర్తన తీసుకొస్తాడు మానవత్వాన్ని మేలు కొల్పుతాడు.డబ్బే ముఖ్యం కాదని తేలుస్తాడు. సరిగ్గా అప్పుడేం జర్గుతుంది. తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి వెలిగే ఉంటుంది. అదేంటో చెప్పేస్తాను.ఆ జ్ఞానేష్ ను లేపేసి ఆ ఆస్ధిని హస్తగతం చేసుకోవాలని ఎన్నాళ్ళగానో క్లైమాక్స్ దాకా ఆగి (ఎదురు చూస్తున్న) విలన్(అంజన్ శ్రీవాస్తవ)మాస్టర్ ప్లాన్ చేస్తాడు. అప్పుడు ఈ అన్నదమ్ములు ఇద్దరూ ఫైట్ చేసేసి, తన అన్న గారిని ఎలా రక్షించేసుకున్నారన్నది తెరపై ఓపికుంటే చూడండి.

ప్లాబ్లం ఏంటంటే

టీవి సీరియల్ కధలా ఉండటమే ఈ చిత్రం ప్లాబ్లం అని చదివిన వాళ్ళకు అర్ధమవుతూనే ఉంటుంది. అయితే నిజానికి ఆ పై నేరేషన్ లో కధ నడవదు (అర్ధం కావటానికి ఓ పద్దతిలో రాయిటం జరిగింది). సినిమా ఓపినింగ్ అయిన చాలాసేపు కత్రినా కైఫ్ తో సల్మాన్ ప్రేమేయణం చూపెడతాడు(తెరవెనుక సల్మాన్ లవ్ స్టోరీని కథను గుర్తు చేద్దామనే డైరక్టర్ గారి అధ్బుత ఆలోచన కావచ్చు..కారీఆన్). వెంటనే మనం ఓహో ఈ కధ అంతా వీళ్ళిద్దరి మధ్యా జరగబోయే ప్రేమ…పరిణామాలు అయ్యుంటుంది కాబోసు అని ఫిక్స్ అవుతాం. అలా అమాయికంగా ఫాలో అవుతూంటాం. అయితే మెల్లిగా మన అంచనా తప్పని డైరక్టర్ సాబ్ జెల్ల కొడతారు. ఓ ట్విస్ట్ లా సల్మాన్ తండ్రి చచ్చిపోతే ఆ ఆస్ధి వస్తుందని చెప్తాడు. అంతేగాక సల్మన్ ఖాన్ చేత కత్రినా తండ్రితో ఓ నలభై రోజుల్లో మిలియనీర్ అవుతానని ఛాలెంజ్ చేయిస్తాడు. అలా ప్రేమకధ వదిలి అన్నదమ్ముల కథగా మారుస్తాడు. సరే ఇక్కడన్నా ఫిక్స్ అవుతాడని అనుకుంటే…లేదు..లేదు మరో ట్విస్ట్ ఉంది. అది అనీల్ కపూర్ అనే రెయిన్ మ్యాన్ క్యారెక్టర్ తో అంటాడు. అతను వీరి జీవితాలని మారుస్తాడంటారు. అప్పుడు మనం అర్ధం చేసుకుంటాం సుభాష్ ఘయ్ మారలేదు. ఇంకా ఆ రోజులనాటి డ్రామానే ప్లే చేస్తున్నాడని. వెంటనే వద్దు వద్దు అని కేకలు పెట్టి బయిటపెడతాం. ఇలా మరీ పురాతన కథతో వచ్చిన ఈ సినిమాకు కథనంకూడా లోపమై ప్రేక్షకుల పాలిట శాపమైంది.

అయితేనేం విజువల్ ట్రీట్

కధ ఎలా ఏడిస్తేనేం ఈ సినిమా మంచి విజువల్ ట్రీట్ లా ఆస్ట్రియా,లండన్ అందాలు పట్టిస్తుంది. చక్కగా ఇండియా వదిలి అక్కడ సెటిలవ్వాలనిపించేంత కోరిక పుట్టించేంత గొప్ప పెయింటింగ్ లా కెమెరామెన్ కబీర్ లాల్ తీర్చిదిద్దాడు. మరో ప్రక్క ఎ.ఆర్.రహమాన్ తన స్వరాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. సెట్స్ అయితే చాలా అధ్బుతంగా కనిపిస్తాయి.

ఫైనల్ గా

కునుకుపట్టి లేచినా కొంచెం కూడా కధ కదలని ఈ సినిమాలో రెండు చోట్ల అద్బుతమనిపిస్తుంది. అవి ఇంటర్ వెల్ ,శుభం .చక్కగా రెండు సార్లూ బయిటకు వచ్చి గాలి పీల్చుకోవచ్చు. బోర్ వదిలించుకోవచ్చు. ఇక మనకు శత్రువులు ఎవరన్నా ఉంటే ఈ సినిమాకి వెళ్ళేలా ఏర్పాటు చేస్తే తర్వాత మనం చాలా హ్యాపీ ఫీలవవచ్చు.

Filed Under: featuredleadభారతీయ సినిమాసమీక్షహిందీ

Tags: , , , , ,

Comments (8)

Trackback URL | Comments RSS Feed

  1. “కునుకుపట్టి లేచినా కొంచెం కూడా కధ కదలని ఈ సినిమాలో ”
    “తన అన్న గారిని ఎలా రక్షించేసుకున్నారన్నది తెరపై ఓపికుంటే చూడండి.”
    ha ha ha. good one.

  2. “ఫైనల్ గా” మీరు చెప్పినవాటితో ఏకీభవించి ఈ సినిమా చూసే బాధ తప్పించుకున్నాను. ధన్యవాదాలు.

  3. వెంకటాచలపతి says:

    ఈ సినిమా ప్రకటనలు చూస్తుంటే నాకు “Legends of the Falls(Brad fitt)”అనే ఇంగ్లీష్ సినిమా గుర్తువస్తొంది.

  4. srikanth says:

    “అమాయికత్వంలోంచే క్రియేటివిటీ పుడుతుంది. అన్నీ తెలిస్తే ఏమీ సృజించలేము అని చాలా సార్లు విన్నా….!!!”
    Nice Review…!!!

  5. రత్నాకర్ సదస్యుల says:

    Worst cinema. Subash Ghai retire avatam manchidi. Rainman cinema ni mari ila khooni cheyala. Nakkajituulu mamayalu, rabandhuvulu laanti bandhuvul, ivaani 80’s, 90’s tho outdated ayipoyaayi.

  6. అవునూ.. యాదే,కృష్ణ తర్వాత కూడా సుభాష్ ఘాయ్ ఇంకా సినిమాలు తీస్తున్నాడా??

  7. కృష్ణ?
    ఇదేం సినిమా?

  8. Chetana says:

    I think he meant Kisna..

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.