సినిమాటోగ్రాఫర్ విఎస్సార్ స్వామి మృతి

vsr-swamy-lead

నిన్న రాత్రి  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విఎస్సార్ స్వామి మచిలీపట్నంలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారని సమాచారం. మచిలీపట్నానికి ఆయన ఒక పెళ్లికి హాజరు కావడానికి వెళ్ళారు. అక్కడే ఆయనకు గుండెపోటు వచ్చింది వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది.  ఆయన భౌతిక కాయాన్ని చెన్నై తరలించారు. స్వర్గీయ ఎన్టీ రామారావు నటించిన కథానాయకుడు సినిమాతో ఆయన తెలుగు సినీ రంగంలో సినిమా కెమెరామన్ గా రంగప్రవేశం చేశారు.చివరి సినిమా ప్రభాస్ హీరోగా బి.గోపాల్ రూపొందించిన అడవి రాముడు.

చిరంజీవి నటించిన ఖైదీ, ఇంద్ర సినిమాలకే కాకుండా బాలకృష్ణ నటించిన లక్ష్మీనరసింహ, బలేవాడివి బాస్ వంటి చిత్రాలకు ఆయన పనిచేశారు. బాపు దర్శకత్వం వహించిన భక్త కన్నప్ప సినిమాకు, విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరిసిరిమువ్వ సినిమాకు ఆయన కెమెరామన్ గా పనిచేశారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు, మోసగాళ్లకు మోసగాడు సినిమాలకు కూడా ఆయన పనిచేశారు. అందాలరాముడు, దేవుడు చేసిన మనుషులు సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.ఈ మధ్య శ్రీకాంత్ హీరోగా ఓ సినిమా డైరక్ట్ చేయటానికి ఆ మధ్య ఆయన సమాయుత్తమయ్యారు. కానీ ఎందుకనో  ఆ ప్రాజెక్టు ముందుకెళ్ళలేదు. అలాగే అంతకుముందు ఆయన ఎదురీత అనే సినిమాను డైరక్ట్ చేసారు.
సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక వ్యక్తిత్వంతో మంచి మనిషిగా తెరవెనక సైతం పేరు తెచ్చుకున్న ఈ సినీ మేధావి మృతికి నవతరంగం శ్రధ్ధాంజలి ఘటిస్తోంది.

–సూర్యప్రకాశ్

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

8 Comments to “సినిమాటోగ్రాఫర్ విఎస్సార్ స్వామి మృతి”

  • ప్రకాష్ గారు,మీరన్నట్లు స్వామిగారు ఎదురీత కు కాదండి,మహాశక్తిమాన్ అన్న సినిమాకు దర్శకత్వం వహించారు.ఆయనకు వచ్చినన్ని వైవిధ్యభరితమైన సినీమా అవకాశాలు,కధాంశాలు చాలా తక్కువ మందికి భారతీయ సినీ జగత్తులోనే వచ్చుంటాయి.అలాంటి ప్రతిభావంతుడిని కోల్పోయి ఇవ్వాళ సినీపరిశ్రమ బీదదయ్యింది.ఆ ‘స్వామి’కి నా హృదయపూర్వక అశృనివాళి.

  • రాజేంద్ర కుమార్ దేవరపల్లి garu

    క్షమించండి…
    ——–సూర్య ప్రకాష్

  • స్వామి గారికి నివాళి. మోసగాళ్ళకి మోసగాడు చాల టాప్ ఫోటోగ్రఫి. అప్పట్లో స్వామి గారూ చాలా జేమ్స్ బాండ్ సినిమాలకి పని చేసారు. ఒక గొప్ప ఫోటోగ్రాఫర్.

  • ఎంత తిట్టు తిట్టారు ప్రకాష్ గారు :)

  • May his soul rest in peace! A great technician and a great fan of NTR, it is ironic that his most effective work has always been for non NTR starrers, especially Krishna’s movies.

    Case in point: Mosagallaku Mosagadu, Alluri Sitarama Raju, Andala Ramudu and Simhasanam.

    Re edureeta discussion: VSR Swamy was the producer of edureeta (Indira Productions was the banner). A remake of Amanush, it was directed by V. Madhusudana Rao.

  • అబ్బో బల్లే చెప్పారే ప్రకాష్ గారు

  • alluriseetharamaraju cinema ki’ vastadunaaraju eeroju’song chuste swamygari panitanam appude entha bagachesaro anipistundi…….cnu.

  • nenu ippude telusukunnanu…..tanu chanipoyarani…..ayana aatmaki shanti kalagalani devudini korutu

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories