అంతు ‘పట్టని’సినిమా-సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌

surya-lead

సినిమా:సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌
సంస్థ: ఆస్కార్‌ ఫిలిమ్స్‌
నటీనటులు: సూర్య, సమీరారెడ్డి, దివ్య, సిమ్రన్‌ తదితరులు.
కెమెరా: రత్నవేలు
ఆర్ట్ : రాజీవన్
నిర్మాత: వి.రవిచంద్రన్‌
దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవమీనన్‌
రిలీజ్ డేట్: 14 నవంబర్ 2008

ఒక జీవితాన్ని మొత్తాన్ని ఓ మూడు గంటలు సినిమాలో చూపెట్టడం కష్టమే. పోనీ ఎలాగోలా తిప్పలు పడి చూపించినా ఊహించని మలుపులు,ఎంటర్ టైన్ మెంట్ లేని ఆ సాదా సీదా జీవిత సారాన్ని భరించటం మరీ కష్టం. అదే సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా తేల్చి చెప్పిన సత్యం. అయితే గజనీ ఫేమ్ సూర్య డబుల్  రోల్ లో నటించటం,కాక కాక (ఘర్షణ) వంటి సూపర్ హిట్ చిత్రాన్ని  అందిచిన గౌతమ్ మీనన్ డైరక్టర్ కావటం,దశావతారం వంటి భారీ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన సినిమా కావంటం ఈ ఫిల్మ్ కు ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చాయి. కానీ విపరీతమైన భావోద్వేగాలు స్లో నేరేషన్ తో నడిచే కథనం  ఉన్న ఈ సినిమా చూడాలంటే టిక్కెట్టు రేటుతో పాటు గొప్ప ఓపిక కూడా ఉండాల్సిందే.

సూర్య (సూర్య)కి తన తండ్రి(మళ్ళి సూర్యానే) అంటే విపరీతమైన ఆరాధన. ఆయన్ని ఓ హీరోలా,  ఐకన్ లా చూస్తూంటాడు. అలాగే అతని తల్లి(మాలిని) కూడా నెమ్మదస్తురాలు,కుటుంబానికి మూలస్ధంబంలా ఉంటుంది. అతనికో చెల్లెలు. ఇలా ఫ్రెండ్స్ లా ఉండే ఫ్యామిలి మెంబర్స్ నీడలో ఏదీ అసాధ్యం కాదు అనే కాన్సెప్ట్ జీర్ణించుకుని సూర్య  పెరిగి పెద్దవుతాడు. టీనేజ్ లోకి రాగానే తొలిచూపులోనే మేఘన(సమీరా రెడ్డి)తో ప్రేమలో పడతాడు. అయితే ఆమె అతనికి అనుకోకుండా మిస్సయిపోతుంది. అది తట్టుకోలేని సూర్య డ్రగ్స్ కి ఎడిక్ట్ అవుతాడు. అప్పుడు ఆ తల్లి తండ్రులు ఆ బిడ్డను ఎలా రక్షించుకున్నారు. తిరిగి అతను జీవితంలో  పడి ఏం సాధించి సంపూర్ణతను సాధించుకున్నాడనేది మిగతా కథ.

జీవితం ఓ సర్కిల్ లాంటిది…ఎక్కడా ఆగదు…మన భాధ సంతోషాలతో దానికి సంభందంలేదు. ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది అన్న విషయం చెప్పటానికి గౌతమ్ మీనన్ నిజాయితీగా చేసిన ఈ ప్రయత్నం నవల రూపంలో అయితే గ్యారింటీగా  ఆదరణ పొంది ఉండేది. అదే సినిమా అనే సరికి కొంత డ్రామా,ట్విస్టులు,కామిడీ ఊహించుకోవటం సహజం. ఆ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవటం నిరాశ పరిచే అంశం. అందులో సినిమా దాదాపు  మూడు గంటలు ఉండటం కూడా పూర్తిగా ఇబ్బంది పెడుతుంది. అలాగే కథనాన్ని యాక్ట్ లుగా విభజన చేసేటప్పుడు మరింత జాగ్రత్త పడి ఉండాల్సింది. అలా చేయకపోవటంతో తండ్రి కొడుకుల అనుభంధంగా మొదలైన కథ, ఫెయిల్యూర్ లవ్ స్టోరి గా నడిచి,జీవితం ఓ చక్రం లాంటిది అనే కాన్సెప్ట్ తో ముగియటం జరిగింది.

ఇక దర్శకుడుగా టేకింగ్,షాట్ డివిజన్ విషయాల్లో  గౌతమ్ మీనన్, వెలుగు నీడల్ని భావాలకి తగ్గట్లుగా చూపటంలో కెమెరా మెన్ పోటి పడి మరీ  మంచి మార్కులే వేయించుకుంటాడు. నిర్మాణ విలువల్లో కూడా ఎక్కడా రాజీపడకపోవటం ఆస్కార్ రవిచంద్రన్ అభినందించాల్సిన అంశం. అయితే ఎన్నుకున్న కథ,కథనాలు సినిమాకు పనికొచ్చేవి కాకపోవటం తో ఆ శ్రమ మొత్తం నిష్ఫలమయింది.

సంగీతం గురించి మాట్లాడుకోవాలంటే నిజానికి హ్యారిస్ జయరాజ్ ఎప్పుడూ నిరాశపరచలేదు. ఈ సినిమాలో కూడా ఓ ట్యూన్ సినిమా నుండి బయిటకు వచ్చాక కూడా వెంటాడుతుంది. అలాగే అరవైలనాటి సంగీతాన్ని గుర్తుచేసే ట్యూన్స్,ఎనభైలనాటి రాక్ మ్యూజిక్ మంచి ప్రయోగమనిపిస్తాయి. నటులుగా ఈ సినిమా సూర్య షొ అని చెప్పాలి. సిమ్రాన్ కూడా తన వయిస్సుకు తగ్గ పాత్రల్లో జీవించింది. సమీరా రెడ్డి మేఘన గా లవ్ లీగా కనిపిస్తే…దివ్య స్పందన అనే అమ్మాయి ప్రియ గా క్యూట్ గా ఉంది.

కుటుంబ సంభందాలు,జీవన ప్రయాణం చర్చించే ఈ సినిమా అక్కడక్కడా ఏక్షన్ ఎపిసోడ్స్,ఎమోషన్ సన్నివేశాలు బోల్డన్ని,సూర్య సిక్స్ పాక్ బాడీ ఉన్నా ఆకట్టుకోవటం కష్టమే. అలాగే సిగెరెట్లు త్రాగితే సూర్య తండ్రికి ఈ సినిమాలో థ్రోట్ కాన్సర్ వస్తుంది. అయితే ఈ విషయాన్ని కళ్ళారా చూస్తున్నా…సినిమా ఎంత బోర్ అనిపిస్తుందంటే సిగెరెట్ కి మధ్యలో పదే పదే లేచి వెళ్ళాలనిపిస్తుంది.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

15 Comments to “అంతు ‘పట్టని’సినిమా-సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌”

  • ఆవకాయా బాగోలేదన్నారు. మన సూర్య కూడా బాగోలేదన్నారు. మళ్ళీ తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా కోసం మరి కొన్ని రోజులు వేచిచూడాల్సిందే. ఎన్నాళ్ళీ ఎదురుచూపులు?

    “అలాగే సిగెరెట్లు త్రాగితే సూర్య తండ్రికి ఈ సినిమాలో థ్రోట్ కాన్సర్ వస్తుంది. అయితే ఈ విషయాన్ని కళ్ళారా చూస్తున్నా…సినిమా ఎంత బోర్ అనిపిస్తుందంటే సిగెరెట్ కి మధ్యలో పదే పదే లేచి వెళ్ళాలనిపిస్తుంది.” ఇది సూపర్.

  • అదేంటోగానీ గౌతం మీనన్ సినిమాల్లో విజువల్స్ నాకు నచ్చవు. మొదటి సినిమా ‘మిన్నలే’ బాగానే తీశాడు కానీ, కాక్క కాక్క (దాని తెలుగుసేత ఘర్షణ) నుండీ వెట్టియాడు-వెల్లైయాడు (రాఘవన్) దాకా సినిమా మొత్తాన్నీ స్టెడీకేమ్, కొన్నిసార్లైతే ఏకంగా హేండ్‌హెల్డ్ షాట్లతో లాగించెయ్యటమే. మోషన్ సిక్‌నెస్ వచ్చేస్తుంది అవి చూస్తుంటే. ఇతను పూర్వాశ్రమంలో సినిమాటోగ్రఫరట!

    Btw, చిన్న సవరణ. సంగీత దర్శకుడు హ్యారిస్ (Haris)జయరాజ్ – ‘హరీష్’ కాదు.

  • @అబ్రకదబ్ర
    కరెక్ట్ చేశాము. తెలిపినందుకు ధన్యవాదాలు.
    కాకా కాక్క గొప్ప స్టైలిష్ సినిమా అండీ…మన వాళ్ళు పోకిరి దగ్గర్నుంచి ఇప్పుడొచ్చే సినిమాలన్నింటిలో కెమెరా అటూ ఇటూ తిప్పే శైలి అక్కడే మొదలవ్వకపోయినా అది బాగా పాపులర్ చేసింది. ప్రేక్షకుల మోషన్ సిక్ నెస్ సంగతేమో కానీ డైరెక్టర్స్ మాత్రం స్టైలిష్ డైరెక్టర్స్ అని పేరు కొట్టేస్తున్నారు ఈ కొత్త కెమెరా తిప్పుడుతో….

  • it is not dat much boaring movie ..can watch once. ..Narration wise a bit slow..it is out of commercial formula ..performence wise OUT and out SURY`S SHOW…he was grand successful as he played three different roles….very gud photography…it would have been more gud..if the narration was a bit fast..by and large..people who like movies outrighat `ACTION ORIENTED MOVIES ..those people better to avoid it..

    Venkat Balusupati

  • Well, I liked it very much. It was not that boring (BTW I watched in Tamil, so I din’t get half the dialogues, but It was never boring).
    How often you see a honest attempt to make a so-called “different” cinema ?
    And coming to surya’s performance, He reminded me of Robert de Nero ( The way he showed the variations between the father and son, and a teenager, drug-addict, army major… AWESOME).

    Kudo’s to Gautam menon and Surya.

    (BTW, the guy sitting next to me in the theater declared, it was a horrible movie, said it has no comedy, fights and entertainment… I was thinking to myself “Well, I don’t blame the film-makers, some people just don’t get it”)

  • ఇవ్వాళే చూశాను తమిళం లో.
    నాకు చాలా నచ్చింది. మీరు నవలగా బాగుండేది అన్నారు కదా. అయితే, నాకు సరిగ్గా నవలని సినిమాగా తీస్తున్నట్లు అనిపించింది ఈ సినిమా చూస్తూ ఉంటే. :-)

    మామూలుగా వచ్చే సినిమాలతో పోలిస్తే, ఎంటర్టైన్మెంట్ తక్కువే. నాకు మొదటి సగం సాగినట్లనిపించి, ఆపేద్దాం అనిపించింది. కానీ, అక్కడ్నుంచే ఆపకుండా చూడ్డం మొదలుపెట్టా. పాటలు కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదు! :-)

  • నాకు ఈ సినిమాలోని ఆటోబయోగ్రఫికల్ క్వాలిటీ నచ్చింది. సూర్యకు – సమీరా కు మధ్యనున్న ప్రేమ సన్నివేశాలు చాలా బాగా నచ్చాయి.

  • “పాత్ర తన కథ చెప్పుకోవటం లేదా పాత్ర ద్వారా కథ చెప్పించటం ” ( సినిమా బాషలో దీన్ని ఏమంటారో తెలిదు) సినిమాల్లో చాలబాగా పనికొస్తుంది. ఎన్నో చూపించలేని విషయాలని ఒక్క మాటలో దాటేయ వొచ్చు.
    ఉదా: నాన్న అంటే నాకు చాలా ఇష్టం. లేదా నాల్గు సంవత్సరాలు తెలియకుండా గడిచాయి.అని నాన్న ఫోటో చుపిస్తునో.. లేదా ఏదో కాఫీ తాగుతూనో చెప్పించొచ్చు. దాన్నే సన్నివేశం ద్వారా చూపించాలంటే.. బుర్ర పగల గొట్టు కోవాలి మరి. :)

  • ఈ మధ్య ఈ స్టైల్ లో వచ్చిన మూవీస్ చాలనే ఉన్నాయి.. హిట్టు కూడాను..
    హ్యాపీ డేస్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఏ మయ చేసావే, ౩ idiots…

  • ఈ సినిమాలో స్లో నెరేషన్ ఉన్నమాట నిజమే కానీ అదే ఈ సినిమాని ఆసక్తికరంగా మార్చింది. కథనం, విజువల్స్ పరంగా ఇది మంచి సినిమా…..

  • ౩ ఎళ్ళ తరవాత ఈ అర్టికల్ కు స్పందన వచ్చింది…నాకు ఈ సినిమా చూసిన తరవాత నాకు ౩౦ సంవత్సరాలు వయసు పెరిగిందెమో అని అనిపించింది…ప్రతి సినిమాలొనూ, మనకు ఒక ప్రతినాయకుడు లేదా ఒక అంతు చిక్కని సమస్యతొ కథానాయకుని పొరాటం చూస్తాం, కాని అన్నింటికి విరుద్ధంగా ఈ కథ లొ కథానాయకుని పొరాటం తనలొ అంతర్లీన్ంగా ఉండె భయభ్రాంతులు, ఒటమి గురించిన భయం కావడం. ఇలాంటి నెపథ్యం ఉన్న సినిమాలు, మన దేశంలొ చాలా కొంచెమె. ఒక మంచి ప్రయోగంగా, ఈ సినిమా గుర్తుండిపొతుంది…

  • ఎందుకో తెలీదు కానీ ఈ సినిమా చూసినంత సేపు నాకు మదన్ మోహన్ మ్యూజిక్ డైరెక్ట్ చేసిన లగ్ జా గలే సాంగ్ గర్తుకు వచ్చింది. ఒక నంబ్ ఫీలింగ్ నుంచి స్లోగా ఇమోషనల్ అయ్యే టెండెన్సీ ఉందా సినిమాలో . మౌనం అంటేనే మాటలు లేకపోవడం కాదు, మాటల్లో చెప్పలేకపో వడం కావచ్చు.నేను చె ప్పిన పాట, ఈ సినిమా ఇలాంటివే నని నా ఫీలింగ్

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories