Menu

‘మనసు’మంగళి – ఇక నా ముగింపు

గమనిక:ఇది నేను గతంలో ప్రచురించిన విలువల వలువలున్న సినిమా అనే వ్యాసానికి కొనసాగింపు.

సినిమా మెలో డ్రామానా లేక ఇంకోటా అనే విషయాన్ని ప్రక్కన పెడితే, మనం తప్పక అర్ధం చేసుకోవలసిన పాయింట్ ఈ సినిమాలో ఉంది. అదే మనిషి జీవితం లో విలువలు. వాటి ప్రాధాన్యం.

అలాగే మరో పాయింట్ ‘మాన్/హీరో వర్షిప్’. ప్రేమ అంటే ఏంటనే  దానికి  చాలా అర్ధం ఈ సినిమాలో వెతుక్కోవచ్చు.

నాకు దర్శకుడెవరో తెలీదు. ఎందుకంటే ఆ సినిమా చూసి పదిహేనేళ్ళు అయింది. సంగీతం కూడా నిన్నటి దాకా నాకు తెలీదు. ‘సాక్షి’ దిన పత్రిక లో ఇచ్చే పాట క్రింద చూశాను.

నటీనటులు నాకు తెలిసి గుర్తుంది అక్కినేని, సావిత్రి, రేలంగి, (గుమ్మడున్నాడో లేడో, జగ్గయ్య ఉన్నట్టు గుర్తు. సావిత్రికి అతనితోనే పెళ్లి చేయాలనుకుంటాడు నాగేశ్వరరావు)

కానీ కమ్మని పాటలున్నాయి.

మచ్చుకు… “కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమీ? … కలలే!”

“వలపు వలే తీయగా వచ్చినావు నిండుగా”

“సిగలోకి విరులిచ్చి చెలి నొసట తిలకమిడి” (ఈ పాట నాకు బాగా నచ్చింది).

“కొత్త పెళ్ళికూతురా రా! రా! – నీ కుడికాలు ముందుమోపి రా! రా!”
ఈ పాట వికక పోతే మనది ఆంద్ర ప్రదేశే కాదు.

అసలు విషయానికి వద్దాం. అక్కినేనిని సావిత్రి ప్రేమించటం తో మొదలైన కథ చివరకి ఆ అక్కినేని తనని వేరే పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు విషం త్రాగి మరణించటం తో ముగుస్తుంది. ఇలా చెపితే ఎలా ఉంది. మెలో డ్రామాలా లేదూ. కానీ ఆ కోణం లోంచీ కాదు. మరో కోణం లో ఆలోచిద్దాం.

ఆ కోణాన్ని ఆ సినిమా ప్రేమికులు, ఆ సినిమా బోరికులు ఇద్దరూ మిస్ అయ్యారు. ఆ పాయింట్ గురించి చెప్పాలంటే మరో కథ నాకు గుర్తుకు వచ్చింది. ఈ సినిమాని నేను బోరింగు అని ముద్ర వేసి మళ్ళీ చూడనట్టే… ఆ కథని కూడా చెత్త అని మళ్ళీ చదవలేదు. నిన్నటి దాకా.

మళ్ళీ ఈ వ్యాసం వ్రాయటానికి ఆ కథని చదివాను. చెత్త కాదు. విలువైన పాఠం అని తెలుసుకున్నాను.

ఈ వ్యాసాన్ని నేను ఎంత కుదిద్దామన్నా నాకు వీలు పడలేదు. అసలు ఆ కథని నేను చెప్పాలన్న ప్రయత్నమే నాకు పెద్ద పని పెట్టింది. ఎందుకంటే ఈ సినిమా కన్నా ‘విషయాన్ని’ డైరెక్ట్ గా చెప్పిందా కథ. ఒకే ఒక్క డైలాగ్. “నేను నా భర్తని తప్ప వేరెవరినీ ప్రేమించను.. అతను నాతో సంతోషంగా ఉండలేక పోతున్నాడు. అందుకే నిన్ను సాకుగా పెట్టి అతను నాకు విదాకులిచ్చేలా చేశాను. నేను నీతో ఉండలేను. అతనే నా అత్యుత్తమ విలువ అతనిని తప్ప నేను వేరే ఎవరినీ ప్రేమించలేను. I can not take anything less than the best. ప్రేమ లేని చోట నేనుండలేను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి. నేను ఇక్కడ దిగిపోతున్నాను.”

సావిత్రి అక్కినేనిని ప్రేమిస్తుంది. ఎంతలా అంటే తన ప్రాణం కన్నా. More like she worships him. Not like an ordinary ‘భర్తే దైవం’ టైపు.

ప్రేమంటే “ప్రేమంటే తమ అత్యుత్తమ విలువలను వేరొకొరిలో చూసి, తమ విలువలకు పట్టం గట్టడమే” అనే సెన్స్ లో తీసుకుంటే ఆమె నిజంగానే ప్రేమించింది. She can not bear anything less than the best. ఆ విషయాన్ని తన భర్త అర్ధం చేసుకోడు. తను చెప్పలేదు. అప్పటికే చాలా మానసిక క్షోభని అనుభవించింది. తన విలువలని కాపాడుకోవటం కోసం తన ప్రాణాన్నే త్యాగం చేసింది. త్యాగం అనేది చాలా చిన్న మాట. విలువలని కోల్పోవటం కన్నా మరణించటమే  మంచిది అనుకుంది. అదే చేసింది. భర్త చెప్పినట్టు చేసి మానసిక వేదన తో ఎటూ న్యాయం చేయలేని పరిస్థితిని కల్పించుకోలేదు.

ఇక నేను చెప్పిన కథలోనూ అంతే. అదేదో మన సినేమాల్లో చూపించే పిచ్చి త్యాగం కాదు. అద్భుతమైన పని. “I can not take anything less than the best.” అని ఎంతమంది చెపుతారు? అలా ఎంతమంది ఉండగలరు? (అలా ఐతే ప్రతీ దానికీ చావటమేనా? అంటారా? అది మన మానసిక పరిస్థితిని బట్టీ ఉంటుంది. ఇక్కడ విషయం విలువలకి కట్టు బడటం గురించి.).

ఎవరో క్రితం భాగం లో వ్యాఖ్యానిస్తూ “త్యాగాలు చేస్తే విలువలున్నట్టా?” అన్నారు. ఇక్కడ ఎవరూ త్యాగం చేయలేదు. తమని తాము కోల్పోకుండా రక్షించుకున్నారు. సావిత్రి తన భర్త చెప్పినట్టు చేసి  ఉంటే అది త్యాగం.

ఒకసారి ఆలోచించండి. సావిత్రి అక్కినేని చెప్పినట్టుగానే పెళ్లి చేసుకుంది. ఆ భర్తకీ అదే దౌర్భాగ్యం పట్టింది. మళ్ళీ అతను అదే సలహా ఇస్తాడు. మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. ఇంతేనా జీవితం. ఒక విలువ ఉండదా? తాను ప్రేమించిన (నిజమైన ప్రేమ) వ్యక్తి ముఖ్యమా? లేక తన సుఖం ముఖ్యమా? ఇలా ఐతే ఎవరూ ఒక్క పెళ్ళితో ఆగరు.

అందుకే మనిషి తన విలువలకి కట్టు బడి ఉండాలి. ఇతరుల కన్నా మన గురించి మనకే బాగా తెలుస్తుంది. మీకు ‘ఐసు బిప్పు’ రూలు తెలుసా? (ఐసు – బిప్పు రూలు ను thinkquisistor.blogspot.com చూడండి).

అలాగన్న మాట.

ఈ విషయాన్నే నేను ఆలోచించింది. నిజమైన ప్రేమని, ‘మాన్/హీరో వర్షిప్’ ని, విలువల ప్రాధాన్యాన్ని, తెలిపిన సినిమా ఇది. అందుకే ఎంత బోరింగు సినిమా (నా కళ్లు పేలి పోవుగాక) అయినా దాని గురించి ఆలోచించకుండా ఉండలేక పోయాను.

అందుకే ఇది ‘మనసు’మంగళి.

నోట్: సినిమా కి సంగీతం… కేవీ మహదేవన్ ట. తెలుగు వికీ చెప్పింది. అందుకు దానికి ధన్యవాదాలు. పాటలు ఆత్రేయ. అందుకే అంత అద్భుతమైన భావాలు పలికాయి. ఇది నాకు తెలుసు.

ఏమీ తెలీని వాడివి ఎలా వ్రాశావ్? అంటారా నేను దేనికోసం వ్రాశానో గట్టిగానే చెప్పాను కదా! 🙂

ఆ కథ Ayn rand వ్రాసిన THE HUSBAND I BOUGHT. దాని గురించి తరువాత నా బ్లాగులోచేపుతాను. ఎప్పుడైనా.

The words I told here on love are purely my feelings. Others might have told. But I don’t know. అది నేను స్వయంగా తెలుసుకున్న సత్యం.

31 Comments
 1. ravi November 4, 2008 /
 2. nietzsche niche November 5, 2008 /
 3. శ్రీ లక్ష్మి కళ November 5, 2008 /
 4. chaitanya November 5, 2008 /
 5. శ్రీ లక్ష్మి కళ November 5, 2008 /
 6. శ్రీ లక్ష్మి కళ November 5, 2008 /
 7. శ్రీ లక్ష్మి కళ November 5, 2008 /
 8. శంకర్ November 6, 2008 /
 9. nietzsche niche November 7, 2008 /
 10. Priya Iyengar November 9, 2008 /
 11. శ్రీ లక్ష్మి కళ November 9, 2008 /
 12. నీషీ నిష్ November 10, 2008 /
 13. నీషీ నిష్ November 10, 2008 /
 14. Srujana November 11, 2008 /
 15. Srujana November 11, 2008 /
 16. గీతాచార్య November 13, 2008 /
 17. గీతాచార్య November 13, 2008 /
 18. గీతాచార్య November 13, 2008 /
 19. గీతాచార్య November 13, 2008 /
 20. గీతాచార్య November 13, 2008 /
 21. ravi November 13, 2008 /
 22. శ్రీ లక్ష్మి కళ November 17, 2008 /
 23. గీతాచార్య November 22, 2008 /
 24. గీతాచార్య November 22, 2008 /
 25. శ్రీ లక్ష్మీ కళ November 23, 2008 /
 26. Dhanaraj Manmadha May 24, 2009 /