సీతారామయ్య గారి మనవరాలు

సాంకేతిక పరిజ్ఞానం అంతగా పెరగక పోవడం కూడా అప్పుడప్పుడు మంచి సినిమాలు రావడానికి కారణం అవుతుందేమో. ఇప్పుడు ఉన్నట్టుగా పల్లెటూళ్ళలో కూడా టెలిఫోన్ లు, ప్రతి మూడో మనిషి దగ్గర మొబైల్ ఫోన్లు పదిహేడేళ్ళ క్రితం ఉండి ఉంటే మనమంతా ”సీతారామయ్య గారి మనవరాలు’ అనే ‘తెలుగు’ సినిమాను మిస్ అయ్యేవాళ్ళం కదా! ఆర్ద్రత నిండిన కథ, కథనం, పాత్రోచిత నటన, కథనానికి ప్రాణం పోసే సంగీతం ఈ సినిమా ని క్లాసిక్ గా మార్చాయి. నా స్నేహితుల్లో కొందరు దీనిని ‘చివరి తెలుగు సినిమా’ అని అంటుంటారు. కథగా చెప్పాలంటే ఇది మూడు లైన్ల కథ. ఇచ్చిన మాటకీ ప్రాణం ఇచ్చే తండ్రికి, ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేయలేని కొడుక్కి మధ్య ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్. ఫలితంగా ఆ కొడుకు కుటుంబానికి దూరం అవడం తిరిగి తన కూతురి ద్వారా కుటుంబాన్ని కలుసుకోవాలనుకోవడం. క్రాంతి కుమార్ దర్శకత్వం, కీరవాణి సంగీతం, నాగేశ్వర రావు , రోహిణి హట్టంగడి, మీనా ల నటన ఈ సాధారణ కథ ఓ అసాధారణ సినిమా గా రూపు దిద్దుకోడానికి తోడ్పడ్డాయి.

‘మానస’ రాసిన ‘నవ్వినా కన్నీళ్ళే’ నవల ఆధారంగా (ఈ నవల ఎక్కడ దొరుకుతుందో ఎవరికైనా తెలిస్తే తెలియజేయగలరు) ఈ సినిమా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను అందుకుంది. అంతకు మించి, ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణ ‘మంచి సినిమా’ భవిష్యత్తు పట్ల ఆశలు రేకెత్తించింది. కథాస్థలం గోదావరి తీరంలోని ‘సీతారాంపురం’ అనే గ్రామం. ఆ ఊరి పెద్ద సీతారామయ్య (అక్కినేని), ఆయన భార్య జానకమ్మ (రోహిణి హట్టంగడి) కొడుకు శ్రీనివాస మూర్తి (రాజా). ‘మా సీతారాంపురం గ్రామానికి విచ్చేసిన మీకందరికీ స్వాగతం’ అనే బాలు వ్యాఖ్యానంతో సినిమా ప్రారంభమవుతుంది. ముందే చెప్పినట్టు, పెళ్లి విషయంలో తండ్రి, కొడుకుల మధ్య వచ్చిన అభిప్రాయ బేధం కారణంగా కొడుకు తను ప్రేమించిన సుమతిని పెళ్లి చేసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. ఇరవై ఏళ్ళ తరువాత అతని కూతురు సీత (మీనా) తన మేనత్త కూతురి పెళ్లికి సీతారాంపురం రావడంతో అసలు కథ ప్రారంభమవుతుంది. మనవరాలి పట్ల మనసులో ఎంతొ ప్రేమ ఉన్నా దానిని వ్యక్తం చేయని తాతగారు, మనవరాలి లో తన కొడుకుని చూసుకుని మురిసిపోయే బామ్మ, సీత రాకతో ఆస్తిలో తనకి వాటా రాదేమోనని బెంగ పడే ఇంటి అల్లుడు (తనికెళ్ళ భరణి) ఆమెకి తన కొడుకునిచ్చి పెళ్లి చేయడం ద్వారా సీతారామయ్య ఆస్తి ని సొంతం చేసుకోవాలనుకునే అతని వియ్యంకుడు వీరభద్రయ్య (కోట) ల ప్రయత్నాలతో కథ సాగుతూ ఉంటుంది.

అమెరికా నుంచి శ్రీనివాస మూర్తి ఫ్రెండ్ (మురళి మోహన్) రావడం తో సీత తల్లితండ్రులు ఓ ప్రమాదం లో చనిపోయరనే విషయం ప్రేక్షకులకు తెలుస్తుంది. ఆ నిజాన్ని సీత తన తాతయ్యకి ఎలా చెప్పిందన్నది చిత్రం ముగింపు. ఇది తెలుగుదనం ఉన్నకథ. నేపధ్యం గోదావరి ప్రాంతం కావడం తో అక్కడి భాష, సంస్కృతులను సినిమా లో ఉపయోగించారు. బరువైన పాత్రల్లో నటించడం అక్కినేని కి కొత్త కాదు. ఈ సినిమాలో ఆయన తొలిసారి విగ్ లేకుండా నటించారు. బాలనటి గా సినిమాల్లోకి వచ్చిన మీనా కి నాయిక గా ఇది తొలి సినిమా. సీనియర్ల తో సమానంగా నటించి ప్రసంసలు అందుకుంది.

నాకు ఈ సినిమా లో బాగా నచిన పాత్ర జానకమ్మ. భర్త, కొడుకు ల మధ్య నలిగిపోయే ఇల్లాలిగా రోహిణి హట్టంగడి నటన అసామాన్యం. ఆమె మాతృ భాష తెలుగు కాకపోయినా, భాషను, పాత్రను బాగా అర్ధం చేసుకుని నటించారు. అమాయకత్వం, ఆపేక్ష కలబోసిన పాత్ర. ముఖ్యంగా ‘మౌన వ్రతం’ సీన్ లో ఆవిడ నటన చూసి తీరాలి. ‘షష్టిపూర్తి’ సీన్ లో నిండు ముత్తైదువ గా చాల సహజం గా కనిపిస్తారు. ఐతే ఆ పాత్రను అర్ధాంతరంగా ముగించారనిపిస్తుంది.

‘సుబ్బరాజు’ అనే ఓ చిన్న పాత్రలో దాసరి కనిపిస్తారు. ఈ పాత్ర పట్ల ఆయన ఇష్టం, తర్వాతి కాలంలో ఆయనచేత ‘సుబ్బరాజు గారి కుటుంబం’ అనే సినిమా తీయించింది. భరణి ది కామెడీ విలనీ కాగా సుధాకర్ ది కమెడియన్ పాత్ర. ‘మాయబజార్’ లో పాట పేరడి కూడా ఉంది అతనిపై. గణేష్ పాత్రో ఈ సినిమాకి తేలిక గా ఉండే పదాలతో బరువైన సంభాషణలు రాసారు. ‘నాన్న మన దగ్గరికి రారు తాతయ్య, మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి’ లాంటి సంభాషణలు కదిలిస్తాయి.

క్రాంతి కుమార్ లో ఉన్నమంచి దర్శకుడిని తెలుగు సినిమా పరిశ్రమ సరిగా ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది ఈ సినిమా చూసాక. మనవరాలి పట్ల పైకి కఠినంగా ఉంటూనే, సీతారామయ్య ఆమె పట్ల ప్రేమని రహస్యంగా ప్రదర్శించే సన్నివేసాలు, మనవరాలు తెచ్చిన వీడియో లో కొడుకుని ఆత్రం గా చూసుకోవడం, జానకమ్మ చనిపోయిన తర్వాత ‘మీ నాన్న వెంటనే రావాలమ్మా సీతా’ అని చెప్పే సన్నివేశం, ఏంచేయాలో తెలియక గోదారి ఒడ్డున సీత పిచ్చిగా పరిగెత్తే సన్నివేశం…ఇలా చాలా సన్నివేశాలను ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసేవిధంగా చిత్రీకరించారు. అలాగే చాలా బరువుగా ఉండే క్లైమాక్స్ సన్నివేసం కూడా.ఈ సినిమాలో సీత డైరీ ని సీతారామయ్య చదివి నిజం తెలుసుకోవడం అనే సీన్ ని ఆ తరువాత చాలా సినిమాల్లో కాపి చేసారు. (ఇంక్లుడింగ్ ‘గోదావరి’). స్ట్రయిట్ నేరేషన్ లో సాగే ఈ సినిమా (మధ్యలో ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్) బాలు వ్యాఖ్యానం తోనే సినిమా ముగుస్తుంది. ఈ సినిమా ను ‘ఉధార్ కి జిందగి’ పేరు తో హిందీ లో తీసారు. తాతయ్య పాత్రను మిదున్ చక్రవర్తి, మనవరాలి గా కాజోల్ నటించారు. ఆ తరువాతి కాలం లో అగ్ర నాయిక గా ఎదిగిన కాజోల్ కి ఇది తొలి చిత్రం. అక్కడ ఈ సినిమా విజయం సాధించలేదు.

తల్లిని తండ్రిని కోల్పోయిన ఓ టీనేజ్ అమ్మాయి ఆ రహస్యాన్ని తన తాతయ్య దగ్గర ఎలా దాచ గలిగిందన్నది అర్ధం కాదు. శ్రీనివాస మూర్తి చనిపోతూ, ‘ఈ వార్త తాతయ్యని బాగా ప్రిపేర్ చేసి చెప్పమ్మా’ అని సీత నుంచి మాట తీసుకుంటాడు. కానీ, సీత అలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. కథ, కథనాలపట్ల చూపిన శ్రద్ధ, హాస్యం పై చూపలేదని అనిపిస్తుంది. హాస్యం కొన్ని చోట్ల ముతకగా మరికొన్ని చోట్ల పేలవంగా ఉంటుంది. ‘నువ్వు-నేను’ సినిమా తో ‘తెలంగాణా’ శకుంతల గా అందరికి తెలిసిన నటి, ఈ సినిమాలో కోటకి సుబ్మిస్సివ్ భార్య గా హాస్య పాత్ర పోషించింది.

సంగీతాన్ని గురించి చెప్పకుండా ఈ సినిమా గురించి చెప్పడం పూర్తి కాదు. క్రాంతి కుమార్ చేసిన బొమ్మ కి కీరవాణి తన సంగీతం తో ప్రాణం పోసారు. మొత్తం పాటల్లో ‘పూసింది పూసింది పున్నాగ’ పాట అంటే కీరవాణి కి ప్రత్యేకమైన ఇష్టం అనుకుంటా. అదే ట్యూన్ ని కొంచం మార్చి ‘అన్నమయ్య’ లో ‘ఏలే ఏలే మరదలా’ పాట చేసారు. ‘కలికి చిలకల కొలికి’ పాటలో మేనత్త కోడళ్ళ మధ్య అనురాగాన్ని చిత్రించిన తీరు గుర్తుండి పోతుంది. ఇక నా ఛాయస్ ‘బద్దరగిరి రామయ్య…’ విషాద గంభీరంగా సాగుతుందీ పాట/కీర్తన. ‘షష్టిపూర్తి’ పాటలో జిక్కి గొంతు వినిపిస్తుంది ‘ఆ పైన ఏముంది..’ అంటూ. సినిమా తాలూకు మూడ్ ని క్రియేట్ చేయడంలో నేపధ్య సంగీతానిది కీలక పాత్ర. ఒక్కసారి ఈ సినిమా ని mute లో చుడండి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాధాన్యత ఏమిటో అర్ధం అవుతుంది.

ఈ సినిమా సాధించిన విజయం పుణ్యమా అని ఇలాంటి కథ, కథనాలతో ఓ అరడజను సినిమాలు వచ్చాయి అప్పట్లో. కానీ అవేవి పెద్దగా విజయం సాధించలేదు. ఈ సినిమా ప్రభావం గురించి ఒక మాట చెప్పాలి. అంతవరకు ఎవరైనా అమ్మాయి లంగావోణి లో కనిపిస్తే ‘బాపు బొమ్మలా ఉంది’ ఆనేవారు. ఈ సినిమా విడుదలయ్యాక ‘సీతారామయ్య గారి మనవరాలిలా ఉంది’ అనడం మొదలు పెట్టారు. ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది మిగిలి పోయింది అనిపించడం కూడా ఈ సినిమా ప్రత్యేకత అనుకుంటా!

-మురళి

Filed Under: featuredleadభారతీయ సినిమావిశ్లేషణ

Tags: , , , , ,

Comments (26)

Trackback URL | Comments RSS Feed

  1. avatar thinkfloyd says:

    Nice write up Murali.
    A small correction: Jitendra played the lead role in “Udhaar ki zindagi”, not Mithun C.
    Though Hindi version is not on par with its original, this particular song stands out:
    http://www.youtube.com/watch?v=0sabFDc9Khs

  2. avatar venkat says:

    very gud analysis mr murali

  3. avatar మురళి says:

    @thinkfloyd: thank you very much for the correction
    @venkat: thank you

  4. మురళి గారు, బాగా రాశారు. మీరొక విషయం గమనిస్తూ ఉండండి! ఈ మధ్య సాక్షి దిన పత్రిక వాళ్ళు ఇలా క్లాసిక్ సినిమాలు గా పేరు తెచ్చుకున్న చిత్రాల గురించి విశ్లేషణ ప్రచురిస్తున్నారు. సీతారామయ్య గారి మనవరాలు గురించి ప్రచురించి one month కూడా కాలేదు. అది చదివిన వాళ్ళకి వెంటనే ఈ విశ్లేషణ అంత బాగా ఎక్కదు. మీ విశ్లేషణ చాలా బాగుంది.నేను లేడీస్ టైలర్ గురించి రాద్దామనుకుంటుండగానే వాళ్ళు వేసెయ్యడంతో విరమించాను.

    అన్యధా భావించరని తలుస్తాను.

  5. avatar మురళి says:

    సుజాత (మనసులో మాట) గారికి ధన్యవాదాలు. ఇందులో అనుకోడానికి ఏమి లేదు. నేను ‘సాక్షి’ వ్యాసం చదివాను. ఒక ప్రేక్షకుడిగా నా అభిప్రాయాన్ని మీ అందరితో పంచుకోడం కోసమే ఈ ప్రయత్నం. ‘సాక్షి’ వ్యాసం తో duplication లేకుండా ఉండడానికి ప్రయత్నించాను. మీడియా చాల విస్తృతమైన నేపధ్యంలో మంచి సినిమాల గురించి ఎక్కడో అక్కడ వ్యాసాలు వస్తూనే ఉంటాయి. అంతమాత్రం చేత మన అభిప్రాయాలూ పంచుకోడం మనేయనవసరం లేదని నా భావన. మీరు చెప్పిన విషయం గురించి మన మిత్రులు ఏమంటారో చూద్దాము.

  6. ‘సాంకేతిక పరిజ్ఞానం అంతగా పెరగక పోవడం కూడా అప్పుడప్పుడు మంచి సినిమాలు రావడానికి కారణం అవుతుందేమో’.. వంద శాతం నిజం. అప్పుడప్పుడూ కాదు, ఎప్పుడూను… హాలీవుడ్ వాళ్ళు అందుకే 2008లో కూడా 1950ల నాటి కధలను ఎంచుకుంటారు. డ్రమటైజ్ చెయ్యడానికి అవకాశం ఎక్కువ. ఈ రొజుల్లో ఓ రెండు పాత్రలు కొంతకాలం పాటు మాట్లాడుకోవడం కుదరలేదని చూపిస్తే సెల్‌ఫోన్లున్నాయి కదా అంటారు విమర్శకులు ;)
    క్రాంతి కుమార్ గారు స్వాతి,సీతారామయ్యగారి మనవరాలు, 9 నెలలు లాంటి మంచి సినిమాలతో పాటు అరుంధతి, రాజేశ్వరి కళ్యాణం లాంటి అనామక చిత్రాలు కాడా తెరకెక్కించారు. సరిగా గుర్తు లేదు కాని నాగార్జున క్రిష్ణంరాజులతో ఒక సినిమా ( సిద్ధార్ధ అనుకుంటా) కూడా తీసారనుకుంటా. పాటలు బావుంటాయి, అంతే.

  7. నవతరంగం ముఖ్య ఉద్దేశ్యంలో ప్రేక్షకులు తమ అభిప్రాయాల్ని తెలియచేయడం ఒకటి. అలా చూస్తే మురళి గారి వ్యాసం చాలా బావుంది. అయితే మురళి గారూ, ఇంతటితో ఆగకుండా భవిష్యత్తులో మీరు వ్రాయబోయే (మిగిలిన సభ్యులు కూడా) వ్యాసాల్లో ముఖ్యంగా పాత సినిమాల గురించి వ్రాసేటప్పుడు సినిమాలోని మరిన్ని విషయాల గురించి (అంటే దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పరంగా ఆయా సినిమాల్లో కనబర్చిన ప్రతిభ, మెళుకువలు…etc) కూడా ప్రస్తావిస్తే ఇంకా బావుంటుంది. అప్పుడు నవతరంగం స్థాయి పెరుగుతుంద అని నా అభిప్రాయం.

  8. మంచి పరిచయం/విశ్లేషణ. నిజమే, చాలాకొద్ది “తెలుగు”సినిమాలొచ్చిన ఆ సమయంలో సీతారామయ్యగారి మనవరాలు ఎడారిలో ఒయాసిస్సే!

    @సుజాత: ఎక్కడో వచ్చేసిందని మీ వ్యాసం ఆపెయ్యడం బాగాలేదు. ఒకే సినిమా మీద వందమంది రాస్తే వందరకాలుగా వుంటుంది. అదీగాక,మనది నవతరంగం. ఒకే సినిమా గురించి ( విభిన్నంగా) వందవ్యాసాలు రాసినా, ప్రచురించడానికి అభ్యంతరాలుండవు.మీరు లేడీస్ టైలర్ గురించి రాయాల్సిందే. నేను రాజేంద్రప్రసాద్ నటన గురించి రాస్తూ ‘లేడీస్ టైలర్’ సినిమా గురించి ఇలా రాసాను చూడండి.

    “ఇక ప్రత్యేకంగా చెప్పుకోవలసినది, “లేడీస్ టైలర్”. అసలే కొత్త అర్థాలు నేర్చుకుంటున్నతెలుగు కామెడీ కి “సెక్స్ కామెడీ” అనే కొత్త విధానాన్ని’వంశీ’ పరిచయం చేస్తే, దాన్నిజుగుప్స కలగకుండా పండించిన ఘనత మనవాడిదే. “జమ జచ్చ,జతో జడ” అనిఉన్న పోస్టర్ ని చదివే ప్రయత్నం చేసిన నన్ను అక్కడినుండి లాక్కెళ్ళిన మా అన్నయ్య చెయ్యి ఇంకాగుర్తే.

    ఆ సినిమా ప్రభావంతో సమస్తాంధ్రా ’క’ భాష, ’గ’ భాష ల హొరెత్తింది. మనలోఎంతమంది ఈ ప్రయోగాలు చేసామో ఒక్కసారి జ్ఙాపకం చేసుకుందాం. ఈ సినిమాని కొంత వయసు వచ్చేవరకు చూసేభాగ్యం నాకు కలగలేదు. కానీ, దీన్ని చూసినవెంఠనే నాకు “అబ్బా…ఇలాంటి సినిమాలు కూడా ఉంటాయా” అన్పించింది.

    ఇక మన హీరో అంటారా, తనుకాక ఈ పాత్రలో ఇంకెవరినైనా ఊహించగలరేమో చెప్పగలరా? చేతిలో కళ ఉండీ, పని చెయ్యటానికి బద్దకించే సోమరితనం. జాతకం పిచ్చితో, ఏంచెప్పినా నమ్మే భోళాతనం. తెలివిగా మాటలు చెప్పి అమ్మాయిల్ని ఇంప్రెస్ చెయ్యగల, మాటకారితనం. అప్పుడప్పుడు ప్రాణభయం తో గిజగిజ లాడే పిరికితనం, ఇలా ఎన్నెన్ని చాయలు,ఎన్నెన్ని భావాలు. వీటన్నింటినీ అవలీలగా చేసిన నటుడు ఎవరు? ముఖ్యంగా, సినిమాలొ అమ్మాయిల తోడలు (మచ్చ కోసం) తను తడుముతుంటే, ఆ ముఖం చూసి నవ్వుకున్నవాళ్ళే ఎక్కువగానీ, తొడల్ని చూసి ఉద్రేకపడిన వారు తక్కువే. ఈ చమక్కు,ఈ తరం లోని ఏ నటుడికి చేతనౌనో?”

  9. అయితే చివరి తెలుగు సినెమ మా ఊళ్ళోనే తీసారన్నమాట!

  10. శంకర్ గారు,క్ర్రాంతికుమార్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో అరుంధతి,రాజేశ్వరీకళ్యాణం చాలా మెరుగైన సినిమాలే.. ఆయన మొదటి చిత్రం (దర్శకుడిగా) స్వాతి ఒక సంచలనం.ఆ సద్దు ఇంకా సందడి చేస్తుండగానే జనం మీదకు వచ్చిపడిందో ‘అగ్నిగుండం’ చిరంజీవి,సుమలతలతో.చాలా కాలం క్రితమే ’ఇవ్వాళ తెలుగుసినీరంగంలో ప్రపోజల్ మేకర్స్ తప్ప దర్శకులంటూ లేరని చాలా సంచలనాత్మక ప్రకటన్ చేసిన వాడు ఆయన.సినిమారంగపు చలం అనేవారు ఆయన్ని.

  11. మహేష్,
    ఇక నేనేం రాయను, మొత్తం మీరే రాసేసారుగా!

  12. @సుజాత: హమ్మా! ఇలా చెప్పి తప్పించుకోలేరండోయ్. మీరు వ్యాసం రాయాల్సిందే.

  13. avatar kinear says:

    మహేష్, నీ విశ్లేషణ చెత్తలా ఉంది. తొడలు చూసి ఉద్రేకపడ్డానికి లేడీస్ టైలర్ కి వెళ్ళి నువ్వు నిరాశ పడ్డావని తెలుస్తూనే ఉంది. ఉద్రేకపడ్డానికేమీ లేదా సినిమాలో. అలా లేకపోవడానికి ఆ హీరో కారణమూ కాదు.
    సీతారామయ్యగారి మనవరాలు సినిమా రివ్యూలో తొడల గురించీ, సంబంధం లేని వషయాల్ని గురించీ రాయడం నీకే చెల్లింది.

  14. avatar bharaNi says:

    ఈ సినిమాలో నాకు అన్నిటికన్నా నచ్చినది ‘పాపా, చిన పాపా’ అన్న డైలాగు.

    ఈ సినిమా ఎంత దివాలాకోరు సినిమానో తనికెళ్ళ భరణి మీనాని రేప్ చెయ్యబోవడంలోనే తెలుస్తుంది. ఎంతో గొప్పవని పేరు పడిన తెలుగు సినిమాలు కూడా నికృష్టమైనవి అనడానికి అదో ఉదాహరణ.

  15. avatar Rani says:

    very nice article Murali garu.
    My favourite song from this cinema is ‘kaliki chilakala koliki maaku menatta’
    Its been a while since I watched this cinema, I have to find the dVd again

  16. very good article muraleeji,keep it up

  17. చాలా అద్భుతమైన సినిమా. నిజమే సాక్షి లో నేనూ చదివాను. అందులో ఒక జనాకర్షణ దృక్పథం ఉంది. మీరు చాలా చక్కగా విశ్లేషించారు. నాకు అర్ధం ఐన్దికూడానండి:-)

  18. avatar pappu says:

    సీతారామయ్య పాత్ర గాంభీర్యాన్ని దాసరి పాత్రతో చెప్పిస్తారు..మంచుకొండ సీతారామయ్య..మంచుకొండమ్మా అంటూ..గణేష్”పాత్రో”చితంగా..చక్కటి సినిమా

  19. avatar మురళి says:

    @శంకర్, kinear, rani, sriram, priya iyenger: ధన్యవాదాలు.
    @శంకర్: వంశీ, రాజేంద్రప్రసాద్ లు సాక్షి కి ఇచిన ఇంటర్వ్యూ ఈ లింక్ లో చదవండి:
    http://www.sakshi.com/Main/WeeklyDetails.aspx?Newsid=14843&categoryid=11&subcatid=25

  20. avatar chandru says:

    Manchi manchi cinema la gurinchi chakkaga visleshisthunnaru.. kaani madhya madhyana comments vrasevallu okasari thaamu raasindhi sari choosukuni post chesthe baguntundhi.. dhani vala evari mano bhavaalu debba thinakunda vuntaayi..

    Thanks alot @ Murali garu.. mee nundi marinni manchi cinemala visleshana gurinchi wait chesthuntam..

  21. avatar Sreeram says:

    manchi cinema gurumche emta rasina thagguvee avuthumdee. Hit ayina cinema lo manamu thomdaraga tappulu chudaleamu. adee cinema baga lekapotheyee enni karanalu ayina cheppachu, akkada baga leadu, yah pata baga leadu, etc., ellaga enni ayina manamau cheppachu. neenu rasedee first time ellaga, maku kuda emina tips evvamdee murali garu, meemu kuda rayadaniki..ellaga rayachoo neenu kuda try chaystanu.

  22. avatar మురళి says:

    శ్రీరామ్ గారు, ధన్యవాదాలు. తెలుగు లో రాయడానికి http://www.google.co.in/transliterate/indic/telugu లో ప్రయత్నించండి. కొద్దిగా ప్రాక్టీసు చేస్తే రాసేయగలుగుతారు.

  23. కృతజ్ఞతలు మురళి ,మీ భాష బాగుంది. నాకు నచ్చిన అంకురం సినిమా మీద కూడా ఒక మంచి సమీక్ష రాయండి .

  24. avatar balla sudheer chowdary says:

    చాలా బాగా చెప్పారు , నాకూ ఒక మరదలు వుంది అమెరికా లొ , అయితె నెను తనను ఎప్పుడూ , ఇంతవరకూ చూడ లెదు ఒక్కసారి కూడా , ఈ సీతా రామయ్య గారి మనవరాలు చూసాక , అంటె నా చిన్న తనం లొ , నా మరదలు కూద ఇలాగె వుంతుందెమొ అని అనుకుని కలలు కనెవాన్ని , అది తీపి గ్నాపకం గా ఎప్పుడూ మిగిలిపొతుంది

  25. avatar vinay says:

    just 2 dyas back choosanu film excellent music and acting particularga …….a.n.r ammo…….chaala baaga chesaaru

  26. avatar ప్రదీప్ says:

    చాలా బాగా చెప్పారు

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.

Powered By Indic IME