Menu

Monthly Archive:: November 2008

శుభ సంకల్పం (1995)

నేను ఎట్టకేలకి “శుభసంకల్పం” సినిమా చూసాను. సినిమా రిలీజైంది 1995 లో. అప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. చూసినట్లు గుర్తు ఉంది కానీ, సినిమా పూర్తిగా గుర్తు లేదు. ఇప్పుడు చూశాక సినిమా గురించి తప్పకుండా రాయాలనిపించింది, ఈ సినిమాని గురించి నేను చెప్పాలనుకున్నవి చాలా ఉండటంతో. 🙂 మొదట కథ క్లుప్తంగా – రాయుడు గారి నమ్మిన బంటు దాసు. రాయుడి మనవరాలు సంధ్య. దాసు, గంగల ప్రేమ తెలుసుకున్న రాయుడు వాళ్ళకి వివాహం జరిపిస్తాడు.

‘మనసు’మంగళి – ఇక నా ముగింపు

గమనిక:ఇది నేను గతంలో ప్రచురించిన విలువల వలువలున్న సినిమా అనే వ్యాసానికి కొనసాగింపు. సినిమా మెలో డ్రామానా లేక ఇంకోటా అనే విషయాన్ని ప్రక్కన పెడితే, మనం తప్పక అర్ధం చేసుకోవలసిన పాయింట్ ఈ సినిమాలో ఉంది. అదే మనిషి జీవితం లో విలువలు. వాటి ప్రాధాన్యం. అలాగే మరో పాయింట్ ‘మాన్/హీరో వర్షిప్’. ప్రేమ అంటే ఏంటనే  దానికి  చాలా అర్ధం ఈ సినిమాలో వెతుక్కోవచ్చు. నాకు దర్శకుడెవరో తెలీదు. ఎందుకంటే ఆ సినిమా చూసి పదిహేనేళ్ళు అయింది.

జగదేకవీరుని కథ

అనగనగా ఒక రాజు. .. ఇలా సాగిపోయే జానపద కథలు సినిమాలు నచ్చని తెలుగువారెందరు? ఈ జానపద కథలలోని మలుపులు, కథానాయకుడి వీరవిహారం, అందమైన నాయిక, దుష్టుడైన మాంత్రికుడు. ఇలా చూస్తుంటే ఎంత పెద్దవాళ్లైన మైమరచిపోతారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా అలనాటి ఆ మధురమైన, మరపురాని జానపద చిత్రాలు ఇప్పటికీ అందరిని అలరిస్తాయి. అందునా విజయావారు తెలుగులో తీసిన జానపద చిత్రాలు ఒక దాని మించిన మరొక ఆణిముత్యాలు అని చెప్పవచ్చును.

N – fashion is a passion.

ఇంతకు ముందే నేను ఫ్యాషన్ సినిమా చూశాను. దాని కోసం మా కజిన్ ని తీసుకెళ్ళాను. నాకేమన్నా పిచ్చి ఎక్కితే తిన్నగా ఇంటికి తీసుకెళ్తాడని. ఐతే ఆ అవసరం రాలేదు. నిజం గా మాథుర్ భండార్కర్ మాథుర్  భండార్కరే! ఎంతో కాలంగా ఆ సినిమా గురించి వింటున్నాను. అతని గురించి కూడా వింటూనే ఉన్నాను. ‘చాందినీ బార్’, ‘ట్రాఫిక్’, ‘పేజ్ -౩’ మొదలైన సినిమాలతో ఖ్యాతి గడించిన అతను ఈ సారి Fashion world మీద దృష్టి

మనము సినిమాలెందుకు చూస్తాం?

ఇది పనికి రాని ప్రశ్నలా అనిపిస్తుంది, వినగానే. అవును, సినిమాలెందుకు చూస్తాము? టైం పాస్ కి అన్నది ఒక సమాధానం. వినోదానికి అన్నది ఇంకో సమాధానం. నిజ జీవితం నుంచి కొన్ని గంటలయినా దూరం పారిపోయి, కలల ప్రపంచంలో విహరించటానికి అన్నది కాస్త తెలివయిన సమాధానం. వినోదాత్మకంగా విఙ్నానాన్ని గ్రహించటానికి అన్నది ఆశాభావంతో కూడుకున్న ఆదర్శవాది సమాధానం. వ్యాపారులను బ్రతికించటానికి అన్నది గడుసు సమాధానం. పనిలేక అన్నది విసుగు సమాధానం. మనము చేయలేని పనులు వేరేవారు సాధిస్తూంటే,