Menu

Monthly Archive:: November 2008

Oye Lucky Lucky Oye

Oye Lucky Lucky Oye త్వరలో విడుదల కానున్న ఒక బాలీవుడ్ సినిమా. ఈ సినిమా దర్శకుడు దిబాకర్ బెనర్జీ. ఈ దర్శకుడు గతంలో Khosla ka Ghosla అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అభయ్ డియోల్ (Manorama Six Feet Under) మరియు నీతూ చంద్ర (గోదావరి, ట్రాఫిక్ సిగ్నల్) తో పాటు పరేష్ రావల్ (ట్రిపుల్ యాక్షన్), అనుపమ్ ఖేర్, రణవీర్ షోరేలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్స్

‘మరో చరిత్ర’ కు ముప్ఫైయ్యేళ్ళు

గత ముప్పైసంవత్సరాలుగా తెలుగు జీవితాలలో, తెలుగు సినిమాలలో ప్రేమకథల్ని ప్రభావితం చేసిన చిత్రం కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మరో చరిత్ర’. 1978 లో విడుదలైన ఈ చిత్రం సృష్టించిన సంచలనం ఇంతా అంతాకాదు. ఈ ఏటితో ఈ చిత్రానికి ముప్ఫైఏళ్ళూ నిండుతాయి. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొంత తలుచుకుందాం. నటుడిగా అభివృద్ధి చెందుతున్న దశలోవున్న కమల్ హాసన్, ఆ సినిమాతో పరిచయమైన ‘నల్లపిల్ల’ సరిత, మాధవి, జయవిజయ, శ్యామల, పి.ఎల్.నారాయణ, రమణ మూర్తి ఇందులో

Katyn-by Andrzej Wajda

’చరిత్ర ఎప్పుడూ విజేతల చేతే వ్రాయబడుతుంద’ని ఒక నానుడి. అందుకే రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆధారం చేసుకొని వచ్చిన చిత్రాల్లో సామాన్యంగా  ఎప్పుడూ హిట్లర్ అనుయాయులైన నాజీలనే దోషులుగా చూస్తాం. ఏమాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నా చరిత్రని వక్రీకరించారని నింద వేస్తారు. ఎన్నో లక్షలమంది ప్రాణాలు బలిగొన్న రెండవ ప్రపంచ యుద్ధంలో చరిత్ర పేజీల్లోకి ఎక్కని నిజాలెన్నో. కేవలం విజేతల విజయగాధలు, నాజీల అకృత్యాలతో నిండిపోయిన ఈ చరిత్ర పుస్తకంలో మరుగున పడిపోయిన భయంకరమైన మూకుమ్మడి హత్యల్ని

లండన్ చలనచిత్రోత్సవం-చూడదగ్గ చిత్రాలు

గతవారం ముగిసిన లండన్ చలనచిత్రోత్సవంలో  చూసిన కొన్ని సినిమాల గురించి ఇప్పటికే కొన్ని రిపోర్టులు ప్రచురించిన సంగతి తెలిసిందే. పదిహేను రోజుల పాటు జరిగిన ఈ చిత్రోత్సవంలో నేను దాదాపు 50 పూర్తి నిడివి చిత్రాలు, మరో పది లఘు చిత్రాలు, కొన్ని చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా కొంతమంది సినీ ప్రముఖులనూ కలుసుకొని ఇంటర్వ్యూలూ తీసుకున్నాను. వాటిని త్వరలోనే నవతరంగంలో ప్రచురిస్తాను. ఇకపోతే ఈ చిత్రోత్సవంలో నేను చూసిన చిత్రాల్లో నాకు నచ్చిన చిత్రాల వివరాలు:

బి.ఆర్ చోప్రా-ఒక నివాళి

భారత సినీ పరిశ్రమ గర్వించతగ్గ ప్రముఖులలో ఒకరైన బి.ఆర్ చోప్రా(94) ఈ ఉదయం 8.15 నిముషాలకు ముంబయి, జుహు లోని తన స్వగృహంలో మరణించారు. గత కొంత కాలంగా అస్వస్ధతకుతో బెడ్ రెస్ట్ లో ఉన్న ఈ సిని కురు వృధ్ధుడు మరణానికి బాలీవుడ్ మొత్తం నీరాజనాలు అర్పిస్తోంది. ఆయన తన బి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్ పై కెరీర్ లో క్లాసిక్ లుగా పరిగణించతగ్గ నయా దౌర్,ఏక్ హి రిస్తా,కానూన్,ధూల్ క ఫూల్,గుమ్రాహ్ వంటి చిత్రాలును