Menu

Monthly Archive:: November 2008

మనసు ముంగిట్లో వెలిగిన ప్రేమ దీపం-‘చిత్ చోర్’

అతడు కళ్ళూ, మనసూ చెదిరే అందగాడు కాదు. ఆరడుగుల ఆజానుబాహుడూ కాదు. ఆరుపెట్టెల దేహముదురూ కాదు! ఆమె తళుకుబెళుకుల మెరుపు తీగా కాదు. అందం కుప్ప బోసిన సౌందర్య రాశీ కాదు. అతడు మృదుస్వభావి, సంగీత ప్రియుడు, ప్రకృతి ప్రేమికుడు! ఆమె పల్లెటూరి ముగ్ధ! అయినా సిగ్గుపడి తలుపు చాటుకి తప్పుకునే సిగ్గరి కాదు. అతడు మన పక్కింటబ్బాయి! ఆమె మన ఎదురింటమ్మాయి. వారిద్దరి నిర్మలమైన ప్రేమ కథే “చిత్ చోర్ ” బాసు చటర్జీ చేతిలోంచి

శుభలేఖ (1982)

విశ్వనాథ్ సినిమాల్లో నాకు విపరీతంగా నచ్చిన సినిమాల్లో శుభలేఖ మొదటి ఐదింటిలో ఉంటుంది. ఇప్పటికీ ఈ సినిమా చాలాసార్లే చూసాను కానీ, ఈ మధ్యే మళ్ళీ చూసాను. చూసాక, ఈసారైనా దీని గురించి నా అభిప్రాయాలు రాయాలనిపించింది. నేను ఇంజినీరింగ్ చేసేరోజుల్లో మా కాలేజీ విద్యార్థుల్లో రచనాసక్తి ఉన్నవారికి ఓ వెబ్సైటు ఉండేది. అందులో దీని గురించి ఇంగ్లీషులో రాసానోసారి. కానీ, ఇప్పుడాసైటూ లేదు, ఆ వ్యాసం ఏమైందో అంతకంటే తెలీదు. సరే, విషయానికొస్తే, వరకట్నానికి వ్యతిరేకంగా

లక్కీ లక్కీ….

మూడు విషయాలు: 1)మీరు న్యూయార్క్ లో ఉంటారా? త్వరలో విడుదల కానున్న ఓయ్ లక్కీ ఒయ్ సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ చూడండి. టికెట్లు ఫ్రీ గా ఇస్తున్నారు త్వరగా తెచ్చుకోండి. ఆలసించిన ఆశాభంగం. అసలీ సినిమా గురించే మీరు వినలేదా? అయితే ఇదీ మరి ఇదీ చూడండి. 2)ఈ మధ్యనే విడుదలయిన దోస్తానా, దస్ విధానియా,ఆవకాయ బిర్యానీ, సూర్య సన్ ఆఫ్ కృష్ణ సినిమాలు చూశారా? అయితే ఈ సినిమాల్లో మీకు నచ్చిన నచ్చని అంశాలతో

మన సినిమాలెందుకు మూస దాటవు?

తెలుగు సినిమాలేకాదు, భారతీయ సినిమాలు చూసేవారెవరినయినా వేధిస్తూన్న ప్రశ్న ఇది? ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో సినిమాలు నిర్మించే మన దేశం సినిమాలు నాణ్యత విషయంలోకానీ, సాంకేతికామ్షాలలో కానీ, కథామ్షాలలో కానీ ఇతర చిన్న చిన్న దేశాల సినిమాలతో పోలిస్తే తేలి పోతాయి. మన దగ్గర మెగా స్టార్లున్నారు. సూపర్ స్టార్లున్నారు. పవర్ స్టార్లున్నారు. కానీ చెప్పుకోటానికి ఒక్క మంచి అంతర్జాతీయ స్థాయి సినిమా లేదు. ఎంత సేపూ, మల్లీశ్వరి, మాయా బజార్, మూగ మనసులు లాంటి కొన్ని

తారే జమీన్ పర్ కు అస్కార్ వచ్చే అస్కారం ఎందుకు లేదంటే….

ఈ సంవత్సరం జూన్ లో ఆస్కార్ అకాడెమీ ప్రపంచంలోని 95 దేశాలనుంచి ’Best Foreign Language Film’ విభాగం లో అవార్డు ఇచ్చేందుకు గానూ నామినేషన్స్ కోరుతూ చేసిన ప్రకటనకు 67 దేశాలు స్పందించి తమ తమ నామినేషన్స్ పంపించాయి.మన దేశం నుంచి ఈ నామినేషన్స్ కు ’తారే జమీన్ పర్’ ని పంపించారు. ఈ 67 సినిమాలతో పోటీపడి ’తారే జమీన్ పర్’ చివరి ఐదు సినిమాల లిస్టులో నిలవగలదా అంటే అనుమానమే. అందుకు కారణం