ఇంతకు ముందే నేను ఫ్యాషన్ సినిమా చూశాను. దాని కోసం మా కజిన్ ని తీసుకెళ్ళాను. నాకేమన్నా పిచ్చి ఎక్కితే తిన్నగా ఇంటికి తీసుకెళ్తాడని. ఐతే ఆ అవసరం రాలేదు. నిజం గా మాథుర్ భండార్కర్ మాథుర్ భండార్కరే!
ఎంతో కాలంగా ఆ సినిమా గురించి వింటున్నాను. అతని గురించి కూడా వింటూనే ఉన్నాను. ‘చాందినీ బార్’, ‘ట్రాఫిక్’, ‘పేజ్ -౩’ మొదలైన సినిమాలతో ఖ్యాతి గడించిన అతను ఈ సారి Fashion world మీద దృష్టి పెట్టాడు. ఈ విషయం తెలిసినప్పటి నుండీ మా ఫ్రెండ్స్ అంతా లొట్టలేసుకుంటూ ఎదురు చూడ సాగారు. దాంతో నాకు ఆ సినిమా మీద ఒక వేరే అభిప్రాయం మొదలైంది.
ఎట్టకేలకు ఆ సినిమా రానే వచ్చింది. ఏదేమైనా సరే! చూసేద్దాం. ఐతే విజువల్ ఫీస్ట్, లేక పోతే మంచి సినిమా చూసిన అనుభవం దక్కుతుందని, మా ఫెండ్స్ కి చెప్పకుండా మా వాడితో వెళ్ళాను. వెళ్ళెటప్పటికే సినిమా మొదలైంది. ప్రియాంకా చోప్రా తెర మీద ఉంది. మా వాడి కళ్ళూ వెలిగాయి అనుకుంటా. చీకట్లొ కనపడలేదు. నాకు మాత్రం వెలిగినట్టు అనిపించింది. సుత్తిసరె! అసలు విషయానికి వస్తున్నాను.
మాథుర్ భండార్కర్ ఎందుకు అంత పేరు సంపాదించుకున్నాడో ఈ సినిమా చూస్తే అర్ధం అవుతుంది.
కథ: మోడెలింగ్ ని తన కెరియర్ గా ఎంచుకున్న ఒకమ్మాయి జీవితం లొని ఉద్ధాత పతనాలే ఈ చిత్ర కథ. ఒక కేస్ స్టడీ లాగా రెండు పార్శ్వాలకి గానూ ఇద్దరు హీరోయిన్లు. ఒకరు ‘ప్రియాంకా చోప్రా’ అయితే మరొకరు నటన కన్నా వివాదాలతోనే ఎక్కువ పాప్యులర్ ఐన ‘కంగనా రనౌత్.’
కథనం: బాగా సాగింది. మాథుర్ తను తీసుకున్న సబ్జెక్ట్ మీద ఉన్న పట్టును మనం గ్రహించవచ్చు. ఎక్కడా బిగి సడలకుండా, అసభ్యతలకి తావు ఇవ్వకుండా, వీలైనంత క్లుప్తంగా, ఎక్కువ మెలో డ్రామా లేకుండా, సూటిగా కథనాన్ని అల్లుకుని, మనకి మంచి (మరో మంచి) సినిమాని అందించాడు.
స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్: ప్రియాంకా చోప్రా నేరేషన్ లో సాగుతుంది. సినిమా రిచ్ గా ఉంది. అనవసర కెమేర జిమ్మిక్కులు లేకుండా టేకింగ్ బాగుంది.
మ్యూజిక్: బ్యాక్ గ్రౌండ్ కానీ, పాటలు కానీ సందర్భోచితం గా ఉండి, కథనానికి తోడ్పాటు నందించాయి. సలీం, సులైమాన్ లు బాగా పనిచెశారు. సినిమాకు ప్రాణంగా నిలిచారు.
సినిమాటోగ్రఫి: అద్భుతం. అంతే. ఎక్కువ చెప్పక్కరలేదు. మహేష్ లిమయే పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగానె సినిమాని ఒక విజువల్ ఫీస్ట్ గా మలిచాడు.
నటీనటులు: ప్రియాంకా చోప్రా బాగా నటించి నా అనుమానాలని పటాపంచలు చేసింది. కంగనా కూడా బాగా నటించింది.
ఇంకా: నితిన్ దేశాయ్ ఆర్ట్ వర్క్ మెచ్చుకోదగినది. దైలాగులు బాగున్నాయి. ప్రెత్యేకించి, “No wonder, we models are treated like hangers” అని ఒక మోడెల్ అంటుంది. hats – off అని అనుకొకుండా ఉండలేక పోయాను. ”Life, it’s like this” అని అర్ధం వచ్చే మరో డైలాగ్ సంధర్భోచితంగా ఉంది.
ఇప్పుడు సినిమా గురించి. సినిమాని ఒక కథలాగా కాకుండా ఒక మోడెల్ జీవితం లాగా ఉంది. కంగనా పాత్రలొ మనకి గీతాంజలీ నాగ్పాల్ ఛాయలు కనిపిస్తాయి. చివరికి రోడ్డు మీదకి వెళ్ళి ఎవరికీ కాకుండా అలా ఉండిపోవటం. కథలో మైన్ మేఘనా మాథుర్ పాత్రధారి ఐన ప్రియాంకా చోప్రా. ఆమె జీవితం లోని సంఘటనలే ఈ చిత్రం.
కొన్ని సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయి. కంగనా డ్రగ్స్ కి ఎడిక్ట్ కావటం, తాను తన కాంట్రాక్ట్ కోల్పోయి నప్పుడు ఆమె చూపిన నటన, ప్రియాంకా తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు ‘వినయ్’ పాత్రధారి ఆమెని అవమానించటం, (అప్పుడే No wonder… డైలాగ్ వస్తుంది). ఆ సన్నివేశంలో ప్రియాంకా నటన చక్కగా ఉంది. కంగనా జీవితం లో ఎలా పతనమైందీ చాలా అద్భుతంగా చూపెట్టాడు. ఆ సన్నివేశాలలో ఇమోషన్స్ ని బాగా capture చేశాడు. ఆఖరి సన్నివేశాలు వచ్చే కొద్దీ మనం లీనం అవుతాము.
ఐతే కొన్ని సన్నివేశాలని తట్టుకోలేము. అంతా రియాలిటీ. అదే సినిమాకి మైనస్ అయ్యింది. అందరికీ నచ్చకపోవచ్చు.
ఇతర నటీ నటులలో అశ్విన్ ముహ్రాన్ నటన నవ్విస్తుంది. అతను బాగా చేశాడు. మిగతావారు సందర్భోచితంగానే చేసినా అంత చెప్పుకో దగ్గట్టు లేదు.
దీపక్ అనుకుంటా, బాగా ఉన్నాడు. మన తెలుగు సినిమాల్లొ కన్నా బాగా నటించాడు.
చూడొచ్చా?: మంచి సినిమా ప్రేమికులంతా చూడొచ్చు. మోడెళ్ళ జీవితాలూ, ఆ ఫ్యాషన్ పరిశ్రమ లోగుట్టులూ, అసూయలూ, ద్వేషాలూ, ఒత్తిడికి తట్టుకోలేక డ్రగ్స్ కి అలవాటు పడటం, ప్రతీ దానికీ నవ్వు పులుముకోవటం, డిజైనర్ల గురించీ, రాత్రికి రాత్రే ఎలా ఎవరినైనా స్టార్ లు చేయవచ్చో అన్నీ కనిపిస్తాయి ఈ సినిమాలో.
గమనించదగ్గది: ర్యాంప్ మీద మోడెల్ దుస్తులు జారి పోతే జరిగే దానిని మనం ఈ సినిమాలో చూదొచ్చు. ఆ సన్నివెశం కంగనాది. అందరూ ఆ మోడెల్ ని ఎలా తప్పు బడతారో, పబ్లిసిటీ స్టంట్ అని ఎంత తేలిగ్గా అంటారొ మనం చూదొచ్చు. మోడెళ్ళకీ, మనసుంటుందనీ, వారికీ బాధలు ఉంటయి అనీ అక్కడ చూపిన విధానం బాగుంది. కంగనా నటన ఆ సన్నివేశంలొ హైలైట్.
రేటింగ్: 3.75/5.
I find an interesting children storypoint, as a comparison to the three female leads. I will write it soon.
P. S.: ‘N’ ఈ టపా శీర్షిక. ‘fashion is a passion’ tagline. ఆ అక్షరం ఎలాగైతే హెచ్చి, తగ్గి, మళ్ళీ ఎలా హెచ్చుతుందొ ‘మేఘనా మాథుర్’ జీవితం లొ కూడా అంతె. పడిలేచిన కెరటం తాను.
శిద్దారెడ్డి వెంకట్ says:
ఏమోనండీ ఆచార్య గారూ నాకైతే అరగంటకే బోరుకొట్టింది. మొదటి సీను నుంచే అంతా తేటతెల్లంగా తెలిసిపోయింది. ఇక పాత్రల స్టీరియోటైపింగ్ అస్సలు నచ్చలేదు. అయినా ఫ్యాషన్ అనేది పెద్ద జోకు. బాగా డబ్బున్నోళ్ళు విచ్చలవిడిగా డబ్బు తగలెయ్యడానికి మాత్రమ ఉపయోగపడే ఒక ఫార్స్. అదెప్పటికీ మూడో పేజీకే పరిమితమై వుంటుంది. దాని గురించి ఇప్పుడు మూడు గంటల పాటు చూడాలంటే చాలా చిరాకేసింది. ఇక అనుకున్నట్టుగానే ఒక వార్డ్ రోమ్ మాల్ ఫంక్షన్, మోడళ్ళ తాగుడూ తందనాలూ, ఇవన్నీ మనం రోజూ వింటున్నవే చూస్తున్నవే….ఇక అంత కష్టపడి మధుర్ బండార్కర్ రీసెర్చ్ చేసి తీయాల్సిన కష్టమేమీ కనబడలేదు. అయినా సొసైటీ లోని ఈ హైక్లాస్ వార బండారం బయటపెట్టెయ్యాలన్న బండార్కర్ ఆత్రుత నాకైతే అదొక ఫెటిష్ లానే అనపిస్తుంది. ఆయన కళ్ళు తెలిచి చూస్తే సొసైటీలో చూపించగలిగిన అంశాలు చాలానే ఉన్నాయి. మొత్తానికి నాకైతే ఒక గంట సినిమాని ఈజీగా ఎడిట్ చేసొయ్యచ్చానిపించింది.
అబ్రకదబ్ర says:
ఆన్‌లైన్‌లో సినిమాలు చూడటం నాకిష్టముండదు. ఈ రోజు తప్పనిసరి పరిస్థితిలో ఈ సినిమా అక్కడో సీను, ఇక్కడో సీను చూశా. మొత్తమ్మీద అరగంట చూసుంటా, కానీ నేనేమీ మిస్సయినట్లనిపించలేదు. పెర్‌ఫామింగ్ ఆర్ట్స్ రంగానికి సంబంధించిన కధలతో సినిమాలు తీస్తే అందులో ఒకటన్నా ‘గే్’ తరహా పాత్ర ఉండటం ఇప్పటి హిందీ సినిమాల్లో ఓ ట్రెండ్ లాగుంది. అది ఈ సినిమాలోనూ తప్పలేదు. మరీ ఇంత స్టీరియోటైపా?
Venkat says:
IT WAS WORTHY EFFORT BY MADHUR BANDARKAR…Problems r un edning in the society. As per as concern feataure film ..He again stamped his mark on dismoive also.I am always happy with his movies..b caz .he makes ..he tries to infer a responsibility to the Cinema..
Venkat Balusupati
ravi says:
“cinema anede oka joku… janala emotions ni manipulate chesi vichalavidiga dabbulu sampadinchadanike studiolu veetini nirmisthayi”…. ani nenante ikkadivariki entha kopamosthundo fashion industry vallaki kuda anthe vasthundhi…
గీతాచార్య says:
శిద్దారెడ్డి వెంకట్ గారు,
మీరు చెప్పిందీ పాయింటే! కానీ ఈరోజుల్లో వస్తున్న చావక బారు సినిమాలకన్నా ఇది చాలా నయం. చాలా సన్నివేశాల్లో నటీ నటుల ప్రదర్శన ప్రశంసనీయంగా ఉంది. technical aspects కూడా బాగా ఉన్నాయి.
మీరన్నట్టు ఫస్ట్ హాఫ్ లో కనీసం ఓ పావు గంట సెకండ్ హాఫ్ లో మరో పావుగంట ఎడిట్ చేయొచ్చు. ఇంత మంచి దర్శకుడు ముందు ముందు మీరు చెప్పిన కోణాల్లో సినిమాలు తీస్తాడేమో.
Let’s wait and see.
శిద్దారెడ్డి వెంకట్ says:
రవి
సినిమా అనేదే ఒక జోకు అని మీరంటే నేనది జోగ్గానే తీసుకుంటాను….మీకూ తెలుసు సినిమా అనేది జోకు కాదని….కొందరు దాన్ని ఒక జోకుగా తీసుకుంటే అది వాళ్ళ ఖర్మ….అలాగే నేను ఫ్యాషన్ ని జోకుగా తీసుకుంటే అది నా ఖర్మ…అందులో ఉన్న కళను నేను లోతుగా చూసే అవకాశం లేకపోయింది…బహుశా వేరే ఏవో ’లోతైన’ విషయాలు నా దృష్టిని మరల్చడం కారణ కావొచ్చేమో…
ravi says:
venkat garu
oka request… Bresson gurinchi, Godard gurinchi oka series rayandi..
శిద్దారెడ్డి వెంకట్ says:
ee month Andrez Wajda….next month Godard…..Bresson next year….
Why dont you try and write some reviews of Godard’d films…?
ravi says:
Venkat garu…
Ippatlo kadu gani definite ga edo oka roju rasta…Contempt , 8 1/2 , Mirror , Mullaholand drive , Aguire , Hana-bi , three colors , ozu meeda
Wajda…peru vintame kani okkati kuda chudaledu… article kosam waiting…
శిద్దారెడ్డి వెంకట్ says:
If you havent watched Wajda you havent seen the power of cinema…I think Wajda is the one and only director who used cinema, as a tool and a weapon, to its fullest potential….You can try Promised Land, Man of Iron, Man of Marble….Man of….films reviews NT lo unnaai…English lo…tvaralo Telugulo kudaa post chestaanu….I will wait for your articles on the list of films….Aguirre…chusaarantey…FITZCARRALDO kuda chusuntaaranukutunnaa….Isn’t FITZCARRALDO the greatest movie ever produced on earth?
ravi says:
yes …Fitzcarraldo is also a great movie…But I’ll go with Aguire…Probably article rasina taruvatha meeru nenu and some other friends kalisi akkada discuss cheddam(or kottukundam)
@ geethacharya garu…
thread divert chesinattunnane
శిద్దారెడ్డి వెంకట్ says:
రవి
ఎక్కడ్నుంచో Aguirre, Fitzacarraldo దగ్గరికొచ్చాము కాబట్టి ఇప్పుడు చెప్పండి ఈ రెండు సినిమాలు చూసాక కూడా ఎవరైనా సినిమా is a joke అనగలరా?
Purnima says:
Hmmm.. Interesting review. I liked the movie, though!
srikanth says:
@ravi
hi you said , you can write a review about 8 1/2….i have this movie in my PC for few months but i am not watching it….i know it is a film about film making….but can you tell me any specialty of this movie?
just tell me what can I see in this film…?
శిద్దారెడ్డి వెంకట్ says:
శ్రీకాంత్
81/2 ఓపెనింగ్ సీన్ చూసి చచ్చిపోవచ్చు
కొంచెం exaggeration అనుకోండి….బట్ 81/2 ఎందుకు చూడాలో చెప్పాలంటే ఒక పెద్ద వ్యాసమే అవుతుంది.ఫాంటసీ రియాలటిల మధ్య గీత చెరిపేసి ఒక కొత్త లోకం లోకి తీసుకెళ్తుందీ సినిమా. ఈ సినిమాతో పాటు La Dolce Vita కూడా చూడండి. ఈ సినిమాలో కూడా ఓపెనింగ్ సీన్ అద్భుతం. ముందు చూడండి. మీకేమైనా అర్థం కాకపోతే అప్పుడు డిస్కస్ చేద్దాం.
Priya Iyengar says:
S. fashion is a passion. The title N is appropriate.
శ్రీ లక్ష్మి కళ says:
ఓహ్! మీరు ఇలా కూడా రాస్తారా? బాగుంది రీవ్యూ. కంగనా నటన బాగుంది. ప్రియాంకా బాగా నటిస్తుందని మీకు తెలియదా? ‘క్రిష్’, చూడలేదా?
balayya fan forever says:
oye…! meeru cheppina sameeksalalo rendu sinimaaloo superhittu. munde teliste Pandurangadu mee chete review chepinchevaallam. ippatikee poindi edu. esari meere cheppandi.
ప్రవీణ్ గార్లపాటి says:
సినిమా నాకు బానే ఉందనిపించింది. కాకపోతే “గే” చేష్టల మోతాదు ఎక్కువయిందనిపించింది.
అదీ కాక ప్రియాంకా చోప్రా మోడల్‌గా అంతగా బాగుందని నాకనిపించలేదు. కంగన బెటర్‌గా ఉంది.
రాంప్ వాకులు బాగున్నాయి