ప్రముఖ నటుడు నంబియార్ మృతి

ప్రముఖ తమిళ నటుడు మంజరీ నారాయణన్ నంబియార్  (ఎమ్.ఎన్.నంబియార్)(89) ఈ రోజు మధ్యాహ్నం(బుధవారం) చెన్నై లోని ఆయన స్వగృహంలో మరణించారు.గత కొంతకాలంగా అస్వస్ధతగా ఉన్న ఈయన కొద్ది రోజుల క్రిందటే ఆసుపత్రి నుండి డిస్ఛార్చ్ అయ్యారు. నంబియార్ మార్చి ఏడు,1919 లో కేరళలోని కన్నూరులో జన్మించారు.ఆయన మొదటి సినిమా భక్త రామ్ దాస్(1935) హిందీ,తమిళ్ లో చేసారు. తమిళ సినిమాకు మొదటి విలన్ గా ఆయనను చెపుతూంటారు. ఆయన తెరమీదకు రాగానే అప్పట్లో టప్పుట్లు పడేవంటారు.స్టేజి ఆర్టిస్టుగా ప్రూవ్ అయి సినిమాల్లోకి రావటంతో పెద్ద పెద్ద నటులు సైతం ఆయన సలహాలు కోరేవారని చెప్పుకుంటూంటారు. ఎమ్.జి.ఆర్ ఫార్ములా సినిమాలు ఈయన విలన్ గా లేకపోతే పూర్తి కానట్లు ఫీలయ్యేవారుట.

ఆ తర్వాత కాలంలో ఆయన కాలంతో పాటే మారి క్యారెక్టర్ పాత్రలుకు ప్రాణం పోసారు.రజనీకాంత్,కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్స్ తో సహా దాదాపు అందరి సినిమాల్లో లీడింగ్ రోల్స్ చేసి పేరు చేసి డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ వెలిగారు. సినిమాల్లో విలన్ గా చేసినా నిజజీవితంలో గొప్పమనిషిగా,అజాత శత్రువుగా,ఓ ఆధ్యాత్మిక వేత్తగా, పెద్ద మనిషిగా పేరు పొందారు.ఇప్పటికి తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో దాదాపు వెయ్యవరకూ సినిమాల్లో జీవించిన ఆయన సినిమా పరిశ్రమకు ఎనలేని సేవ చేసారు.

ఎమ్.జి.ఆర్ తో చేసిన ‘Aayirathil Oruvan’ చిత్రం,శివాజి గణేషన్ తో చేసిన `Ambikapathi ‘ఆయన కెరీర్లో క్లాసిక్స్ గా చెబుతూంటారు. ఈ విషయమై ప్రముఖ దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ…నంబియార్ ని ఎవరు మర్చిపోగలరు..ఆయన విలనిజం ఇప్పటికీ నా కళ్ళ ముందు ఆడుతోంది అంటూ సంతాపం వ్యక్తం చేసారు.ఆయనకి సుకుమారన్ నంబియార్ అనే కుమారుడు,ఓ కూతరు ఉన్నారు. సుకుమారన్ సీనియర్ బి.జే.పి లీడర్. ఇక ఆయన మృతికి చిన్నా పెద్దా తేడా లేకుండా తమిళ పరిశ్రమ మొత్తం దుఖం సాగరంలో మునిగిపోయారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని నవతరంగం మనసారా కోరుకుంటూ…

స్వర్గీయ నంబియార్ గురించి మరిన్ని వివరాలు:

A legend in his own right-హిందూ దినపత్రికలో వ్యాసం

Filed Under: leadవార్తలు-ప్రకటనలు

Tags: , , , ,

Comments (3)

Trackback URL | Comments RSS Feed

  1. తమిళనాట సినిమా హీరో ఎవరైనా విలన్ మాత్రం నంబియారే,సుధీర్ఘచలనచిత్ర ప్రస్థానం లో కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకున్నాక,శంకర్ దర్శకత్వం వహించిన జంటిల్ మెన్ సినిమాతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు,తర్వాత చాలా సినిమాల్లో నటించారు,చురకత్తుల్లాంటి కళ్ళు నంబియార్ నటనా వైదుష్యానికి పెద్ద ఎస్సెట్ అని చెప్పొచ్చు.అంతిమశ్వాస విడిచిన నంబియార్ కు నా శ్రద్ధాంజలి.

  2. అయ్యో నంబియార్ పోయాడా? నేను వరస బెట్టి యెంజీఆర్ శివాజీల సినిమాలు చూసే రోజుల్లో ఈయనకి పెద్ద పంకానైపోయాను. రాజేంద్ర అన్నట్టు హీరో ఎవరైనా విలన్ ంఆత్రం నంబియారే. నంబియార్ విలనీకి ఒక ప్రత్యేకత ఉంది. మనిషి సహజంగా అందగాడు (ఎంజీ ఆర్, శివాజీలకంటే కచ్చితంగా). భారీ కాయం కాదు సరిగదా, కొంచెం పొట్టిగా కూడా ఉంటాడు. అందుకని, చూడంగానే అస్సలు విలన్ లాగా అనిపించడు. అతను వేసిన పాత్రలు కూడా క్రౌర్యాన్నీ పశుబలాన్నీ కుమ్మరించే విలనీ కాదు. కొంత మానసిక సౌకుమార్యం, మృదుత్వం కలిసిన పాత్రలే ఎక్కువ. అంతేఈకాక, కథాకథనంలో హీరో పాత్రకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, నంబియార్ వేసిన విలన్ పాత్రకీ అంత ప్రాముఖ్యత ఉంటుంది. తెలుగులో పోల్చడానికి జగ్గయ్య గుర్తొస్తాడు.

  3. అయ్యో! హిందీలో ప్రాణ్, తెలుగులో రాజనాల, తమిళ్ లో నంబియార్ వీళ్ళే హీరోలకితగ్గ విలన్లు.

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.