IFFI – రిపోర్టు -1

iffi26th-lead

గోవా లో జరుగుతున్న 39వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈరోజు ప్రదర్శించిన కొన్ని సినిమాల వివరాలు:

భారతీయ సినిమాలు:

పులిజన్మం:మలయాళీ సినిమా. ప్రియనందన్ ఈ సినిమాకి దర్శకుడు. 54 వ జాతీయ చలనచిత్ర అవార్డుల లిస్టులో ఈ సినిమా ఉత్తమ సినిమాగా ఎన్నుకోబడింది.

Pulijanmam is about people who are haunted by justice and social good, people who can’t turn away from their world, life and times. At one level the film is about Prakasan, an educated and idealist youngster deeply committed to his society. He prefers to live in the village itself, earning his livelihood through farming, living close to nature and fighting against exploitation and injustice around him. But in this struggle he finds himself being isolated from everyone, his friends, the party he has pinned all his hopes on, and even family. Everything falls apart around him, but he has to make his journey like the legendary Kari Gurukkal, a local legend about whom he is performing a play.

ఈ సినిమా గురించి మరికొన్ని విశేషాల కొరకు ఇక్కడ చూడండి.

ముదల్ ముదల్ ముదల్ వరై: తమిళ సినిమా. కృష్ణ శేషాద్రి గోమటం ఈ సినిమాకి దర్శకుడు. ఇది తమిళంలో మొట్టమొదటి మెట్రో మూవీ (అంటే ఎమిటో?) అట.

Hayagreevan (Satyajit), an ad man, dreams of becoming a filmmaker. His sweetheart Sindhu (Anuja Iyer) suffering from a chronic disease tells him that they won’t get married unless he made a film of his own. The rest of the film, obviously, deals with whether Hayagreevan succeeded in his dreams and married Sindhu.

ఈ సినిమా గురించి మరి కొన్ని విశేషాల కొరకు ఇక్కడ చూడండి.

జోదా అక్బర్: ఈ సినిమా గురించి అందరికీ తెలిసే వుంటుంది. ఈ సినిమా పై నవతరంగంలో వచ్చిన సమీక్షలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

Oye Lucky Lucky Oye: అభయ్ డియోల్ ముఖ్య పాత్రలో ’ఖోస్లా కా ఘోస్లా’ చిత్ర దర్శకుడు దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమ ట్రైలర్ మరియు ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు గతంలో నవతరంగంలో ప్రచురించాం. చదవండి.

వీటితో పాటు ఠాగోర్ రచించిన ’చతురంగ’ నవల అధారంగా వచ్చిన బెంగాలీ సినిమా చతురంగమరియు వైదేహి రచించిన లఘు కథ అధారంగా వచ్చిన కన్నడ సినిమా గులాబీ టాకీస్ కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు.

ప్రపంచ సినిమా:

Waltz with Bashir: 1982 లో లెబనాన్ లో జరిగిన యుద్ధం ఈ సినిమాకి నేపథ్యం. దర్శకుడు Ari Folman ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఒక రోజు ఒక స్నేహితుడు తన వద్దకొచ్చి ప్రతి రాత్రి 26 కుక్కలు తనను వెంటాడుతున్నట్టు కల వస్తుందనీ, ఆ కలకీ తాము 1982 లో పాల్గొన్న లెబనాన్ యద్ధానికి దగ్గరి సంబంధం ఉండొచ్చని అంటాడు. Ari Folman కూడా ఆ యుద్ధంలో పాల్గొన్నప్పటికీ పాతికేళ్ళ తర్వాత ఆ జ్ఞాపకాలేవి తనకి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక విధంగా మనస్తాపానికీ గురిచేస్తుంది. అసలా యుద్ధంలో తన పాత్ర ఏంటి అని తెలుసుకోడానికి Ari Folman ఆ రోజుల్లో తన యూనిట్లో ఉండి యుద్ధంలో పాల్గొన్న మిగిలిన మాజీసైనికులను కలుసుకుని వారి జ్ఞాపకాల ద్వారా తన గతాన్ని reconstruct చేసుకోడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా.

ఈ సినిమా సమీక్ష ఇక్కడ చదవొచ్చు. అలాగే ఈ సినిమా కి సంబంధించిన కొన్ని వీడియోలు ఇక్కడ చూడొచ్చు.

ఈ సంవత్సరం ఇద్దరు దర్శకుల చిత్రాలు retrospective విభాగంలో ప్రదర్శిస్తున్నారు. ఆ ఇద్దరు దర్శకుల్లో ఒకరు వాంగ్ కర్ వై. (ఈయన గురించి నవతరంగంలో ఒక పరిచయ వ్యాసం ప్రచురించాము. ఆ వ్యాసం ఇక్కడ చదవొచ్చు.) వాంగ్ కర్ వై దర్శకత్వంలో వచ్చిన అత్యద్భుతమైన ప్రేమ కథా చిత్రం In the Mood for Love ఈ రోజు ఇక్కడ ప్రదర్శించారు.

వాంగ్ కర్ వై తో పాటు ఫిన్ లాండ్ కి చెందిన ప్రముఖ దర్శకుడు అకి కారుస్మకీ చిత్రాలను కూడా ఈ విభాగం ప్రదర్శిస్తున్నారు. ఈ రోజు ప్రదర్శించిన కారుస్మకీ చిత్రం Vie de bohème, La.

ఇక్కడ ప్రదర్శించే సినిమాల సమీక్షలతో పాటు, చిత్రోత్సవ విశేషాలతో త్వరలో మరి కొన్ని వ్యాసాలు ప్రచురిస్తామని మనవి చేసుకుంటూ ….శెలవు.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories