IFFI – 2008

iffi-lead

పోయిన ఆదివారం (అనగా 23 నవంబరు, 2008) నుంచి గోవాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మొదలైన సంగతి పాఠకులకు తెలిసేవుంటుంది.భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన చలనచిత్రోత్సవం ఇది. గతంలో ఒక్కో సంవత్సరం ఒక్కో పట్టణంలో ఈ చిత్రోత్సవం జరుగుతుండేది. కొన్నేళ్ళ క్రితం ఈ చిత్రోత్సవానికి గోవాని పర్మనెంట్ వేదికగా నిర్ణయించారు. అప్పటినుంచీ ఈ చిత్రోత్సవం ప్రతి సంవత్సరం నవంబరులో గోవాలో జరుగుతూ వస్తుంది.

మూడు రోజుల క్రితం మొదలైన ఈ 39 వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భారతదేశం లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్తమ సినిమాలను ప్రదర్శించడంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వివిధ దేశ/బాషల సినిమాలను ప్రదర్శిస్తారు.

ఈ చిత్రోత్సవంలో చూడదగ్గ కొన్ని సినిమాల వివరాలు:

ఇండియన్ పనోరమా విభాగం:

గులాబీ టాకస్ – గిరీశ్ కాసరవెల్లి దర్శకత్వంలో వచ్చిన సరి కొత్త సినిమా. వైదేహి వ్రాసిన ఒక లఘు కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ మధ్యనే ఓసియన్ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా ఎన్నుకోబడింది.

చతురంగ - ఠాగోర్ రచించిన ఒక నవలిక ఆధారంగా సుమన్ ముఖోపాధ్యాయ్ రూపొందించిన బెంగాలీ సినిమా.

వాలు – ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మంచి మరాఠీ సినిమా. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడింది.

ఒరు పెన్నుమ రండానుమ్ – అదూర్ గోపాల కృష్ణన్ దర్శకత్వంలో వచ్చిన మలయాళి సినిమా. ఈ సినిమా ప్రముఖ మలయాళీ రచయిత తక్కాళి శివశంకర్ పిళ్ళై రచనల అధారంగా రూపొందించబడింది. గత ఏడాది అదూర్ దర్శకత్వంలో వచ్చిన నాలు పెన్నుంగళ్ సినిమా కూడా తక్కాళీ రచించిన లఘు కథల అధారంగానే నిర్మించబడింది.

Yarwng (Roots)- ఈ సినిమా త్రిపుర రాష్ట్రం నుంచి వచ్చింది. త్రిపుర రాష్ట్ర ప్రజలు మాట్లాదే ’కోక్ బొరోక్’ బాషలో వచ్చిన మొట్టమొదటి సినిమా ఇదే. త్రిపురలో డుంబుర్ డ్యామ్ నిర్మాణం నేపథ్యంలో జలావరణం, స్థానికుల వలసలు లాంటి అంశాలతో నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు జోసఫ్ పులింతనాథ్.

అదయళంగల్ - మలయాళి సినిమా. గత సంవత్సరం జాతీయ ఉత్తమ చలనచిత్రంగా ఎన్నికైన సినిమా. ఎం.జి.శశి ఈ సినిమాకి దర్శకుడు.

ఇవి మాత్రమే కాకుండా ఉంబర్తా లాంటి క్లాసిక్ సినిమాలతో పాటు, ఈ సంవత్సరం కన్నడ సినిమా పరిశ్రమ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఎన్నో ఉత్తమ కన్నడ చలనచిత్రాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు.

ఈ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తున్న మరికొన్ని సినిమాల వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి.

ఈ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తున్న భారతీయ సినిమాలు మరియు వాటి షెడ్యూల్ కోసం ఇక్కడ మరియు విదేశీ చిత్రాల కొరకు ఇక్కడ చూడండి.

గమనిక:ఈ చిత్రోత్సవానికి నవతరంగం తరపున ఒక సభ్యునికి ప్రెస్ అక్రెడిటేషన్ లభించినందుకు ఆనందంగా వుంది. ఈ సందర్భంగా నవతరంగం  సభ్యులకు ఒక మనవి.  మీరుంటున్న పట్టణంలో కానీ లేదా దగ్గర్లో కానీ ఏదైనా చలనచిత్రోత్సవం జరుగుతుంటే ఆ చిత్రోత్సవానికి నవతరంగం తరపున మీరు హాజరవ్వొచ్చు.ఆయా చలనచిత్రోత్సవాల్లో మీకు ప్రెస్ మెంబర్ గా గుర్తింపు కోసం కావల్సిన పత్రాలు నవతరంగం తరపున మేము అందచేయగలము. కావున మీరు హాజరవ్వాలనుకున్న చలనచిత్రోత్సవ వివరాలు, ప్రెస్ అక్రెడిటేషన్ కోసం కావలసిన పత్రాల వివరాలు తెలుపుతూ navatarangam at gmail dot com కి మైల్ చెయ్యగలరు.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

4 Comments to “IFFI – 2008”

  • వ్యాసం మొత్తంలో ఎక్కడైనా తెలుగు సినిమా అని కనిపిస్తుందేమోనని రెండుసార్లు చదివా.. ప్చ్… ఆరోజులెప్పుడొస్తాయో..
    చిన్న సందేహం, గిరీష్ కాసరవెల్లి తెలుగు పేరులా ఉంది. ఇది కానీ తెలుగు సినిమానా ????

  • ఇక్కడ మీ శ్రేయోభిలాషి అని మన సినిమా కూడా ఒకటి ప్రదర్శిస్తున్నారు. గిరీశ్ మనవాడు కాదు కన్నడిగ.

    మన సినిమాలంటే గుర్తొచ్చింది, మన సినిమా వజ్రోత్సవాల సందర్భంగా గోవాలో మనవాళ్ళ ఫోటోలు పెట్టలేదనీ చాలా బాధపడ్డారు మన వాళ్ళు ఇప్పుడు అదే గోవాల్లో కన్నడ సినిమా వజ్రోత్సవలనిచెప్పి అక్కడ ఎన్నో కన్నడ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. కారణమేమయ్యుంటుందో?

  • అప్పటికి తెలుగు ఇంకా ప్రాచీన హోదా పొందలేదు, కానీ ఇప్పుడు కన్నడకి ఆ హోదా వచ్చింది ;) … ఒకవేళ ఈసారి ప్రదర్శించడానికి పెద్దగా సినిమాలు లేవేమో…

  • dear siddareddy venkat g..

    mari mana film correspondent..every day rieviews ivvadam leda?..
    i am literally waiting to know the reviews and higlights of the IFFI..

    Vekat Balusupati

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories