నవ ’నవతరంగం’ కోసం: ఒక అభ్యర్థన
నవతరంగం మొదటి జన్మదినోత్సవ సందర్భంగా పాఠకులకూ, సభ్యులకూ నమస్కారం.
గత సంవత్సరం నవంబరు 28 న ఈ సైటుకి నవతరంగం అనే నామకరణం చేసి, డొమైన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత జనవరి 1,2008 న పదిమంది సభ్యులతో మెదలుపెట్టిన నవతరంగం సంవత్సరం తిరక్కుండానే ఎన్నో మెట్లు అధిరోహించింది. పాఠకులను ఆకట్టుకునే పేరుతో గాసిప్స్, స్పైసీ పిక్స్ లాంటివి లేకుండానే సినిమాల గురించి విలువైన సమాచారం అందిస్తూ అతికొద్ది సమయంలోనే ఒక మంచి తెలుగు అంతర్జాల సినిమా పత్రికగా పేరుగాంచింది. దీని వెనుక ఎంతో మంది సభ్యుల కృషి, మరెంతో మంది పాఠకుల ప్రోత్సాహం వుంది.
ఈ రోజుతో నవతరంగం తెలుగు సినీ చరిత్రలో తన స్థానాన్ని పొందినట్లే లెక్క. ఫలానా 2008 వ సంవత్సరంలో నవతరంగం అనే అంతర్జాల పత్రిక ఉండేది అని చెప్పుకోగలిగేంతగా నవతరంగం ప్రాచుర్యం పొందిందనే చెప్పాలి. అయితే అది చరిత్ర. మరి భవిష్యత్తు మాటేంటి?
మరో కొన్నాళ్ళు నవతరంగం ఎలాగో నడిచిపోతుంది. ఎప్పటిలాగే సభ్యులు వ్యాసాలు ప్రచురిస్తారు.మరో ప్రముఖ దర్శకుని గురించి, ఆయన సినిమాల గురించి ఫోకస్ శీర్షికలో వ్యాసాలూ వస్తాయి, ఈ నెల సినిమా అంటూ ఒక సినిమా పరిచయమూ అవుతుంది, మరో సినిమా ఉద్యమం గురించి వ్యాసాలు వస్తాయి. ఈ సంవత్సరంలో నవతరంగం ఇన్ని హిట్లొచ్చాయి, వందలకొద్దీ వ్యాసాలొచ్చాయి, వేలకొలదీ వ్యాఖ్యలొచ్చాయనీ సంబరపడిపోవచ్చ. కానీ సంవత్సరం పాటు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే కొత్త సంవత్సరంలో మన ప్రణాళిక ఏంటి? అనేది పెద్ద ప్రశ్న.
ఈ ప్రశ్న కు సమాధానం మీ అందరి దగ్గరా వుంది. ఈ నెల లో మనమంతా కలిసి నవతరంగం భవిష్యత్తును తీర్చిదిద్దవచ్చు. నవతరంగం మరింతగా ఎదగడానికి తోడ్పడవచ్చు. అందుకు మీ అందరి సహాయం కావాలి. నవతరంగం అభివృధ్ధికొరకు మీరు మూడు విధాలుగా సహాయం అందించవచ్చు.
- ప్రచారం:నవతరంగం సైటుకి ఈ రోజున సరాసారిన మూడువందల్మంది సందర్శిస్తున్నారు. ఈ నెలలో మీకు తెలిసిన వారందరికీ నవతరంగం గురించి తెలియచేయండి. వీలైతే మీకు నచ్చిన వ్యాసాలను వారికి మైల్స్ పంపండి. నవతరంగం గురించి మీ ఆఫీసుల్లో కరపాత్రాలు పంచండి. లేదా మీరు ఎన్నుకున్న మరే పద్ధతి ద్వారా అయినా నవతరంగం గురించి మరింత మందికి తెలియచేయండి.
- ఫీడ్ బ్యాక్: నవతరంగంలో మీకు నచ్చిన ముఖ్యంగా నచ్చని అంశాల గురించి మాకు మైల్ (navatarangam at gmail dot com) ద్వారా తెలియచేయండి. అలా మీరు పంపించిన అభిప్రాయాలు/సలహాలూ/విమర్శలూ సమీకరించి నవతరంగంలో పోస్టు చేస్తాము. ఇదే విధంగా నవతరంగం సభ్యులు కూడా ఈ సంవత్సరంలో నవతరంగంలో తమ అనుభవలను కూడా ప్రచురించాలని మనవి చేసుకుంటూన్నాను. ఈ సమాచారం ద్వారా మన భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవచ్చు.
- సహాయం:నవతరంగం ఎప్పటిలాగే సజావుగా నడవడానికి మీ సహాయం కావాలి. గత సంవత్సర కాలం పాటు నవతరంగం నిర్వహణలో బాగానే సమయమూ ధనమూ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. నవతరంగంలో ప్రచురించడానికి కావలసిన కంటెంట్ సేకరించడంతో పాటు, చాలా వరకూ ప్రింట్ లో ఉన్న వ్యాసాలను టైపింగ్ చేయడం లోనూ, నవతరంగం రోజు వారీ ఆడ్మిన్స్ట్రేషన్ పనులు నిర్వహించడానికీ, నవతరంగం డొమైన్ రిజిస్ట్రేషన్, హోస్టింగ్, వర్డ్ ప్రెస్ థీం కోసం ఇలా చాలా విధాలుగా సమయమూ ధనమూ ఖర్చయింది. రాబోయే సంవత్సరంలో పైన చెప్పిన వాటన్నిటి కోసం కావల్సిన ధనసహాయం చేయదలచిన వారు ఇక్కడ నుంచి ఆ పని చెయ్యవచ్చు.
మీరు నవతరంగానికి సహాయం చేయాలనుకుంటే మీరు ధనసహాయమే చెయ్యనక్కర్లేదు. మరెన్నో విధాలుగా కూడా మీరు సహాయపడవచ్చు.
- మీరు నవతరంగంలో సభ్యులుగా చేరి వ్యాసాలు వ్రాయవచ్చు.
- మీకు తెలిసిన వారెవరైనా నవతరంగంలో ప్రకటనలు ఇవ్వాలనుకుంటే అలాంటి సమాచారం మాకందివ్వవచ్చు.
- ఆసక్తి ఉన్నవాళ్ళు తెలుగు సినీ ప్రపంచంలోని ఉత్తమ దర్శకులు, సాంకేతిక నిపుణులనూ కలుసుకును వారి వద్దనుండి చలనచిత్ర ప్రక్రియలోని వివిధ అంశాల గురించి సేకరించిన విలువైన సమాచారం నవతరంగంలో ప్రచురించవచ్చు.
- లేదా మీకు తోచిన మరే విధంగానైనా కూడా మీ సహాయ సహకారాలు అందివ్వవచ్చు.
మీకు తోచిన సహాయం చేయండి.నవతరంగం అభివృద్ధికి తోడ్పడండి.
Update: ’నవతరంగం’ లో కోసం సేకరించిన విరాళాలు కేవలం నవతరంగం అభివృద్ధి కోసమే ఉపయోగిస్తామని తెలియచేస్తున్నాము. ఈ విరాళాలను ఈ క్రింది పనుల కోసం ఉపయోగించాలనుకుంటున్నాము.
- రోజువారీ అడ్మినిస్ట్రేషన్ మరియు సంపాదకత్వం కొరకు ఒక అడ్మిన్/ఎడిటర్ నియమించడం.
- ప్రింట్ లో ఉన్న ఎంతో మెటీరియల్ ని యూనికోడ్ లోకి మార్చి ప్రచురించడం.
- మన దేశంలోని ప్రముఖ దర్శకులను కలుసుకుని వారి చేత ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించిన అంశాలతో కూడిన ’మాస్టర్ క్లాసెస్’ నిర్వహించడం.
- హైదరాబారు/కరీంనగర్ చలనచిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రాలకు అవార్డులు అందివ్వడం.
- ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించిన వివిధ అంశాల గురించి ట్యుటోరియల్స్ తో కూడిన వ్యాసాలు రూపొందించడం.
- సినిమా రంగంలోకి ప్రవేశించాలనే ఆసక్తి ఉన్న వారి కోసం ఒక నెట్ వర్క్ రూపొందించడం.
- వీలైతే కొన్ని లఘు చిత్రాల నిర్మాణం.
- హైదరాబాదు ఫిల్మ్ క్లబ్/కరీంనగర్ ఫిల్మ్ క్లబ్ ల సహకారంతో ’ఫిల్మ్ అప్రెషియేషన్’ గురించి ఒక చిన్న కోర్సు రూపకల్పన చేయడం.
- నవతరంగంలో వచ్చిన వ్యాసాలను పుస్తక రూపంలోకి తేవడం
- ఇవి మాత్రమే కాకుండా నవతరంగం ద్వారా ఇంకా ఏమేం చెయ్యొచ్చో మీరూ తెలియచేయవచ్చు.
డొనేట్
Filed Under: featured • lead • వార్తలు-ప్రకటనలు
ఇప్పుడే ‘నవతరంగం’ పుట్టినరోజు వార్త తెలుసుకున్నాను. ముందుగా ‘నవతరంగానికి’ శుభాకాంక్షలు. ‘నవతరంగం’ ఇలా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలి. సహకారం విషయంలో, ప్రస్తుతానికైతే వ్యాసాలు, సమీక్షలు పంపగలను (నిజానికి నాకంటే బాగా, విశ్లేషణాత్మకంగా రాసేవారెంతమందో ఉన్నారు). కొన్ని, ప్రత్యేకమైన దేశ, విదేశ సినిమాల గురించి వచ్చిన ఉత్తమ సమీక్షలు ఎంపిక చేసి ఒక పుస్తకంగా ప్రచురిస్తే, దానికి కావలసిన ఆర్ధిక సహాయంలో నేనూ పాలు పంచుకోగలను (తెలుగులో మన సినిమాలను గురించిన పుస్తకాలు తప్ప, ఇతర భాషల సినిమాల గురించిన పుస్తకాలు, నాకు తెలిసినంతవరకూ లేవు)
- శేషు, కొత్త డిల్లీ
@శేషు గారూ,
ధన్యవాదాలు. మీ వ్యాసాలు సమీక్షల కోసం వేచివుంటాం.అలాగే వచ్చే సంవత్సరం నవతరంగంలోని కొన్ని మంచి వ్యాసాలను పుస్తక రూపంలో తెచ్చే ప్రయత్నం తప్పకచేస్తాము.
నవతరంగానికి జన్మదిన శుభాకాంక్షలు..
నవతరంగానికి శుభాకాంక్షలు. నవతరంగం ద్వారా నేను సినిమాకి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకోగలిగాను. మా ఫ్రెండ్సందరికీ ఈ సైటు గురించి వీలైనప్పుడల్లా చెబుతుంటాను. వ్యాసాలు రాయడం ద్వారా సహకరించగలనేమో గానీ ఖచ్చితంగా చేస్తానని చెప్పలేను.
navatarangamaniki janmadina subhakankshalu
Congrats on the first birth day.
Having said that – - I might be wrong with the impression I got….But let me say this – I was NOT (NOT AT ALL) hoping navatarangam to go for donations. It will be a pity to see a website which was born out of passion, hobby heading towards MONEY….
Vamsi
నాకు చేతనైనంత విరాళం ఇప్పుడే ఇచ్చాను. తొందర్లో సభ్యత్వం కూడ తీస్కుంటాను.
ధన్యవాదాలు
@మురళి,శ్రీనివాస్, చంద్రమౌళి
ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలతో నవతరంగం విజయవంతంగా ముందుక సాగుతుందనే నమ్మకం ఉంది.
@మాగంటి గారూ,
ధన్యవాదాలు.
విరాళాల గురించి మీరు చెప్పిన మాటలు అర్థం చేసుకున్నాను. అందుకే నా పోస్టులో నవతరంగం సేకరించిన విరాళాలు ఏ విధంగా ఉపయోగిస్తామో తెలియచెస్తూ అప్ డేట్ చేసాను. రాబోయే రోజుల్లో నవతరంగం తరుపున మరిన్ని కార్యాలు తలపెట్టాలనే ఆలోచన తప్పితే డబ్బు సంపాదించాలనే ఆలోచన అసలు (అస్సలంటే అస్సలు) లేదు.
@భాస్కర్ గారూ,
ధన్యవాదాలు. మీ విరాళం అందింది. మీరు ఇచ్చిన సొమ్ములో ప్రతి పైసా కూడా నవతరంగం అభివృధ్ధి కీ మాత్రమే ఉపయోగిస్తానని తెలియచేస్తూ మీరూ నవతరంగం సభ్యులుగా చేరాలని కోరుకుంటున్నాను.
@వెంకట్: I am with u.
శుభాకాంక్షలు
@మహేష్, చాలా సంతోషం
@శివ, ధన్యవాదాలు.
వెంకట్ గారూ…
నాకు చేతనయినంత…
శుభాకాంక్షలతో.
@వీబీ గారూ,
మీ విరాళం అందింది. ధన్యవాదాలు.
hello all,
I am sorry to say that I am visiting this site only on the first birthday.I am happy to know that there is a site in Telugu that writes such analytical articles on films.
I dont know if it is the right forum to discuss but can any one explain the meaning of “will not appeal to an average moviegoer”? I was reading a review by our famous jeevi on IB.com and he says that Oye Lucky! Lucky Oye! is different and unappealing and yet he gives 3/5 also he goes on to say “Screenplay of the film is alright. Direction is good. But the selection of story and the treatment will not appeal to an average moviegoer. Narration of the film is slow.” and “f you go to the movie with regular orientation, you will get disappointed because the film follows no popular style/screenplay to narrate the story.”…..what I dont understand is what qualifies this moron to write a film review. He says screenplay is alright. What does that mean? And he poses a question about the screenplay not following any popular style….who is this man to define what a film should be and what a screenplay should be…
I am sad to say that this man and another man called Sira Sri have made film criticism a BIG JOKE.
mitrama..
first of all one year patu ..determination tho site ni non profit ga run cheyadam..antha suluvu ayina vishayam kadu…andhuku miku hrudayaka purvaka abinandanalu..Chala interest tho vyasalu rase e team members andhariki kuda dhanya vadalu….E site ni popular cheyadam lo na vanthu ga E mail sadupayani use chesukuni ..sincere ga try chesthanani teliya chesthunna..Financial aid kuda cheyalani undi..konchem time paduthundi .. E navatarngam ..enthatai ..vatudinthai annatlu ga ..O CLASSIC SITE GA MIGILI POVALANI asisthunanu..
Venkat Balusupati
hello Big joke,
your doubt are right but not in the correct place. to discuss about some other websites and their writing styles,judgments etc navatarangam.com is not a forum to discuss.and you are free to express your doubts regarding the articles being published here always.
నవతరంగం వెంకట్ గారు,
నేను ఎప్పటిలాగే లేటుగానే వచ్చాను. కానీ నవతరంగం లే తే అని అందరినీ ఆకర్షించి రచయితలలోని భావాలను లేవదీసి (బయటకు తెచ్చి) నవతరంగానికి తెచ్చి (తే) జనులను రంజింప చేస్తున్నది.
నవతరంగానికి నా అభినందనలు. చక్కని సైటుని ప్రారంభించి, ఎన్నో, ఎన్నో విలువైన విషయాలని అందించటం ఆనందంగానూ, ఆశ్చర్యం గానూ ఉంది.
Wish a goood road ahead to (y)our site.
గీతాచార్య.
the site is pretty good informative and has introduced me to lot of foreign language films…..thx….and cmin to the telugu font on dis site….it could be more legible and easy on the eye than it is now….
నిజమా!
నచ్చింది…. పీకల్లోతు ప్రేమలో పడిపోయా… ఉక్కిరి బిక్కిరి అయ్యే పనిలో కూడా వారంలో అయిదు రోజులు నవతరంగం నా ఊపిరిగా నిలిచింది. చాలా కొద్ది రొజుల్లోనే Office లో WebSense దూరి విరహం మొదలు. ఇప్పుడు ఇలా అమెరికా ఇంట్లో Internet యమ speed ది కావటంతో మళ్ళీ పొద్దులో link తో గుర్తొచ్చిన Girl Friend వయసు ఒక సంవత్సరం అని తెలిసి జీర్ణించుకోలేని ఓ భగ్న ప్రేమికుడు…
నవతరంగం ఇంకా ఏడాది పాపాయేనా?
చాన్నాల్ల క్రితం బెంగుళూరు లో ఉన్నప్పుడు “My dinner with Andre” సమీక్ష చదవటంతో పరిచయమయింది.
On a seroius note నవతరంగానికి నా అభినందనలు. I have been forwarding review links to my friends.. Will contribute more in bettering OUR site.
నవతరంగం కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం. సినిమా మీడియా లోని పలు కోణాలను నవతరంగం స్పృజించింది. ఉత్తమ చిత్ర పరిచయాల వెబ్సైట్ గా మిత్రులకు పరిచయం చేస్తున్నాను. ఇందులో ప్రచురితమైన కొన్ని ప్రత్యేక వ్యాసాలు, పుస్తక రూపంలో రావాలసిన అవసరం ఉంది. భారత దేశం లో చాలా మందికి ఇంటర్నెట్ చూసే అలవాటు లేదు. ఇంటర్నెట్ తరచుగా చూసే యువతరం కు అచ్చు పుస్తకాలు చదివే సమయం వుండదు. అచ్చు, వెబ్ దేని పాఠకులు దానికి వేరే ఉన్నారు.
Venkat,
You do not need to request, its our pleasure to support a worthy cause and great effort.
Great achievement.
@బిగ్ జోక్,
సంవత్సరానికైనా నవతరంగాన్ని కనుక్కొన్నారుగా అది చాలు. ఇక వేరే సైట్ల సంగతి మాకు తెలియదండి. అవన్నీ బాగానే ఉండుంటే నవతరంగం పుట్టిండేది కాదు.
@వెంకట్ గారూ
ఒక సంవత్సరంపాటు లాభాపేక్ష లేకుండా నడిపిన మాట నిజమే.కానీ మా ఈ ప్రయత్నం విజయం సాధించడంలో ఎంతో మంది సభ్యుల పాత్ర ఉంది. వారంతా వ్యాసాలు ప్రచురించకపోతే, అలాగే మీలాంటి వారు ప్రతిరోజూ నవతరంగం దర్శించకపోతే నవతరంగం ఈ రోజు ఇంత విజయం సాధించేది కాదు. ఇలానే మనమందరం కలిసి ఇంకా ఎంతో సాధించగలమనే నమ్మకం కలుగుతోంది.
@గీతాచార్య గారూ
ధన్యవాదాలు. మీరు మరిన్ని వ్యాసాలు రాసి నవతరంగాన్ని మరింత ముందుకు నడిపిస్తుంటే రోడ్ అహెడ్ సాఫీగానే ఉంటుంది.
@బాబీ గారూ
నవతరంగంకి స్వాగతం. మీకు తెలుగు ఫాంట్స్ డిస్ప్లే లో ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ చూడండి. http://navatarangam.com/font-help/
@యువ గారూ
వెబ్ సెన్స్ నవతరంగం పాఠకున్నొకడ్ని తగ్గించిదన్నమాట. ఇప్పుడు చూస్తున్నానన్నారుగా. సంతోషం. మీ సహకారానికి ధన్యవాదాలు.
@రావు గారూ
మీ సలహా మరో మూడు నాలుగు నెలల్లో అమలు పెట్టే ప్రయత్నం చేస్తాం. మీ ఆదరాభిమానాలతో నవతరంగం మరింత అభివృధ్ది చెందుతుందనే నమ్మకం వుంది.
@హరి గారూ
పెద్ద మనసుతో మీరు చేసిన సహాయం మర్చిపోలేను. మీరు చూపిన ఈ అభిమానం మమ్మల్ని మరింత బాధ్యతాయుతంగా పనిచేసేలా చేస్తుంది.ధన్యవాదాలు.
హల్లొ వెంకట్ గారు……..
నెను లేటుగ స్పంధిస్తునంధుకు చాల చింతిస్తునాను.నవతరంగం ఇంత త్తకువ సమయం లొ ఘన విజయం సధించినందుకు ముందుగా మీకు నా ధన్యవాధములు.ప్రస్థుతం నెను నవతరంగాం కి నావంతు ప్రచారం చేస్తునాను. నాధి ఒక్క చిన్న విన్నపం అది ఎంటి అంటె నవతరంగం లొ మీరు ప్రచురించై వ్యసములు యొక్క “FONT SIZE” ని కొంచం పెంచవల్సిందిగా నెను మరియు మా మిత్రులు కూడ కొరుతునారు .
@Vishnu Vardhan Reddy
font size గురించి గతంలో కూడా ఎవరో అడిగినట్టూ గుర్తు. ప్రస్తుతానికి ఒక చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి. మీరు కనుక firefox వడుతున్నాట్టైతే CTRL hold చేసి మౌస్‍ని scroll చేస్తే font size ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది firefox application కాబట్టి మీరు ఏసైట్ చూసేప్పుడన్నా ఈ టూల్ వాడుకోవచ్చు.
ముంధుగా మీ సలహ కి నా ధన్యవాధములు శంకర్ గారు…నాకు చిన్న సంధెహం ఉంది అధి ఎమిటి అంటె నవతరంగం లొ “CINEMA REVIEW” రాయలి అంటె ఎమి చెయాలి కొంచం చెప్ప గలర..?
విష్ణు,
మీ రివ్యూ navatarangam at gmail dot com కి పంపించాలి.మీరు రెగ్యులర్ గా రాయాలనుకుంటే మీకు మెంబర్ షిప్ కావాలని మైల్ చెయ్యండి. దాంతోపాటు మీ రివ్యూ ఒకటి పంపించండి.
ధన్యవాధములు వెంకట్ గారు ……ముంధు నెను నవతరంగం@జిమైల్.కం కి మైల్ చేస్తను….మీకు నా రీవ్య్ నచినట్ట్ల్ల్ల్లు ఐతె నెను నవతరంగం లొ సభ్యత్వం తీసుకుంటాను.
‘ఏడాది’ తిరక్కుండానే, ‘రెండు’ లక్షల హిట్లతో, ‘ఐదు’ సెంచరీలు చేసిన ‘నవతరంగాని’కి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఉడత సాయం కూడా. ఏదో ఒక రోజు ఈ నవతరంగాల నుంచి ఓ ఉధృత కెరటం మన తెలుగు సినీసీమను ఫెళ్లుమని తాకుతుంది. ఆ చప్పుడుకి చప్పట్లతో తాళం వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సిద్దారెడ్డీ! {శుభాకాంక్షలు లేటుగా చెప్పినా లేటెస్టుగా చెప్పాలని ఈ వృధా ప్రయాస:-)}
ఇస్మాయిల్ గారూ,
మీ అభిమానానికి మరియు ప్రోత్సాహానికి ధన్యవాదాలు.మీ విరాళం అందినది.చాలా సంతోషం.
ఆ రోజుల్లో మీరు నన్ను మీరు దేశీ పండితుడిని చెయ్యకుండా ఉండుంటే ఈ రోజు నవతరంగం ఉండుండేది కాదేమో…
ఆ రోజు మీరు నన్ను ప్రోత్సాహించబట్టే నేను బ్లాగింగ్ ని సీరియస్ గా తీసుకున్నాను. దేశీ పండీట్ లో ఇప్పుడు నేను రాయటం లేదు కానీ అక్కడ నా ప్రొఫైల్ చూసి ఆ మధ్య వావ్ హైదరాబాదు వాళ్ళు, ఈ మధ్యనే ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు. చెప్పొచ్చేదేమిటంటే ఈ విజయం వెనుక మీ ప్రోత్సాహం ఎంతో ఉందని తెలియచేయడమే….
నవతరంగం మిత్రులకి,
నేను క్రితం సంవత్సరం వెంకట్ గారి 24 ఫ్రేంస్ బ్లాగు తొ మొదలుపెట్టి ఇప్పుడు నవతరంగం పాఠకుడిని/అభిమానిని అయ్యాను. నవతరంగం మిత్రులకి, పాఠకులకి ప్రధమ వార్షిక శుభకాంక్షలు. మీరు లులు డాట్ కాం (www.lulu.com) లాంటి సైటు వుపయోగించి నవతరంగం 2008 లోని ఉత్తమ రచనలతో పుస్తకం ముద్రించవచ్చని నా అభిప్రాయం.
ఆభినందనలతో,
రాజేంద్ర ఆలపాటి
hardika modati janmadina subakaksalu…………………………………