Menu

నవ ’నవతరంగం’ కోసం: ఒక అభ్యర్థన

నవతరంగం మొదటి జన్మదినోత్సవ సందర్భంగా పాఠకులకూ, సభ్యులకూ నమస్కారం.

గత సంవత్సరం నవంబరు 28 న ఈ సైటుకి నవతరంగం అనే నామకరణం చేసి, డొమైన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత జనవరి 1,2008 న పదిమంది సభ్యులతో మెదలుపెట్టిన నవతరంగం సంవత్సరం తిరక్కుండానే ఎన్నో మెట్లు అధిరోహించింది. పాఠకులను ఆకట్టుకునే పేరుతో గాసిప్స్, స్పైసీ పిక్స్ లాంటివి లేకుండానే సినిమాల గురించి విలువైన సమాచారం అందిస్తూ అతికొద్ది సమయంలోనే ఒక మంచి తెలుగు అంతర్జాల సినిమా పత్రికగా పేరుగాంచింది. దీని వెనుక ఎంతో మంది సభ్యుల కృషి, మరెంతో మంది పాఠకుల ప్రోత్సాహం వుంది.

ఈ రోజుతో నవతరంగం తెలుగు సినీ చరిత్రలో తన స్థానాన్ని పొందినట్లే లెక్క. ఫలానా 2008 వ సంవత్సరంలో నవతరంగం అనే అంతర్జాల పత్రిక ఉండేది అని చెప్పుకోగలిగేంతగా నవతరంగం ప్రాచుర్యం పొందిందనే చెప్పాలి. అయితే అది చరిత్ర. మరి భవిష్యత్తు మాటేంటి?

మరో కొన్నాళ్ళు నవతరంగం ఎలాగో నడిచిపోతుంది. ఎప్పటిలాగే సభ్యులు వ్యాసాలు ప్రచురిస్తారు.మరో ప్రముఖ దర్శకుని గురించి, ఆయన సినిమాల గురించి ఫోకస్ శీర్షికలో వ్యాసాలూ వస్తాయి, ఈ నెల సినిమా అంటూ ఒక సినిమా పరిచయమూ అవుతుంది, మరో సినిమా ఉద్యమం గురించి వ్యాసాలు వస్తాయి. ఈ సంవత్సరంలో నవతరంగం ఇన్ని హిట్లొచ్చాయి, వందలకొద్దీ వ్యాసాలొచ్చాయి, వేలకొలదీ వ్యాఖ్యలొచ్చాయనీ సంబరపడిపోవచ్చ. కానీ సంవత్సరం పాటు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే కొత్త సంవత్సరంలో మన ప్రణాళిక ఏంటి? అనేది పెద్ద ప్రశ్న.

ఈ ప్రశ్న కు సమాధానం మీ అందరి దగ్గరా వుంది. ఈ నెల లో మనమంతా కలిసి నవతరంగం భవిష్యత్తును తీర్చిదిద్దవచ్చు. నవతరంగం మరింతగా ఎదగడానికి తోడ్పడవచ్చు. అందుకు మీ అందరి సహాయం కావాలి. నవతరంగం అభివృధ్ధికొరకు మీరు మూడు విధాలుగా సహాయం అందించవచ్చు.

 1. ప్రచారం:నవతరంగం సైటుకి ఈ రోజున సరాసారిన మూడువందల్మంది సందర్శిస్తున్నారు. ఈ నెలలో మీకు తెలిసిన వారందరికీ నవతరంగం గురించి తెలియచేయండి. వీలైతే మీకు నచ్చిన వ్యాసాలను వారికి మైల్స్ పంపండి. నవతరంగం గురించి మీ ఆఫీసుల్లో కరపాత్రాలు పంచండి. లేదా మీరు ఎన్నుకున్న మరే పద్ధతి ద్వారా అయినా నవతరంగం గురించి మరింత మందికి తెలియచేయండి.
 2. ఫీడ్ బ్యాక్: నవతరంగంలో మీకు నచ్చిన ముఖ్యంగా నచ్చని అంశాల గురించి మాకు మైల్ (navatarangam at gmail dot com) ద్వారా తెలియచేయండి. అలా మీరు పంపించిన అభిప్రాయాలు/సలహాలూ/విమర్శలూ సమీకరించి నవతరంగంలో పోస్టు చేస్తాము. ఇదే విధంగా నవతరంగం సభ్యులు కూడా ఈ సంవత్సరంలో నవతరంగంలో తమ అనుభవలను కూడా ప్రచురించాలని మనవి చేసుకుంటూన్నాను. ఈ సమాచారం ద్వారా మన భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవచ్చు.
 3. సహాయం:నవతరంగం ఎప్పటిలాగే సజావుగా నడవడానికి మీ సహాయం కావాలి. గత సంవత్సర కాలం పాటు నవతరంగం నిర్వహణలో బాగానే సమయమూ ధనమూ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. నవతరంగంలో ప్రచురించడానికి కావలసిన కంటెంట్ సేకరించడంతో పాటు, చాలా వరకూ ప్రింట్ లో ఉన్న వ్యాసాలను టైపింగ్ చేయడం లోనూ, నవతరంగం రోజు వారీ ఆడ్మిన్స్ట్రేషన్ పనులు నిర్వహించడానికీ, నవతరంగం డొమైన్ రిజిస్ట్రేషన్, హోస్టింగ్, వర్డ్ ప్రెస్ థీం కోసం ఇలా  చాలా విధాలుగా సమయమూ ధనమూ ఖర్చయింది. రాబోయే సంవత్సరంలో పైన చెప్పిన వాటన్నిటి కోసం కావల్సిన ధనసహాయం చేయదలచిన వారు ఇక్కడ నుంచి ఆ పని చెయ్యవచ్చు.

మీరు నవతరంగానికి సహాయం చేయాలనుకుంటే మీరు ధనసహాయమే చెయ్యనక్కర్లేదు. మరెన్నో విధాలుగా కూడా మీరు సహాయపడవచ్చు.

 • మీరు నవతరంగంలో సభ్యులుగా చేరి వ్యాసాలు వ్రాయవచ్చు.
 • మీకు తెలిసిన వారెవరైనా నవతరంగంలో ప్రకటనలు ఇవ్వాలనుకుంటే అలాంటి సమాచారం మాకందివ్వవచ్చు.
 • ఆసక్తి ఉన్నవాళ్ళు తెలుగు సినీ ప్రపంచంలోని ఉత్తమ దర్శకులు, సాంకేతిక నిపుణులనూ కలుసుకును వారి వద్దనుండి చలనచిత్ర ప్రక్రియలోని వివిధ అంశాల గురించి సేకరించిన విలువైన సమాచారం నవతరంగంలో ప్రచురించవచ్చు.
 • లేదా మీకు తోచిన మరే విధంగానైనా కూడా మీ సహాయ సహకారాలు అందివ్వవచ్చు.

మీకు తోచిన సహాయం చేయండి.నవతరంగం అభివృద్ధికి తోడ్పడండి.

Update: ’నవతరంగం’ లో కోసం సేకరించిన విరాళాలు కేవలం నవతరంగం అభివృద్ధి కోసమే ఉపయోగిస్తామని తెలియచేస్తున్నాము. ఈ విరాళాలను ఈ క్రింది పనుల కోసం ఉపయోగించాలనుకుంటున్నాము.

 • రోజువారీ అడ్మినిస్ట్రేషన్ మరియు సంపాదకత్వం  కొరకు ఒక అడ్మిన్/ఎడిటర్ నియమించడం.
 • ప్రింట్ లో ఉన్న ఎంతో మెటీరియల్ ని యూనికోడ్ లోకి మార్చి ప్రచురించడం.
 • మన దేశంలోని ప్రముఖ దర్శకులను కలుసుకుని వారి చేత ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించిన అంశాలతో కూడిన ’మాస్టర్ క్లాసెస్’ నిర్వహించడం.
 • హైదరాబారు/కరీంనగర్ చలనచిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రాలకు అవార్డులు అందివ్వడం.
 • ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించిన వివిధ అంశాల గురించి ట్యుటోరియల్స్ తో కూడిన వ్యాసాలు రూపొందించడం.
 • సినిమా రంగంలోకి ప్రవేశించాలనే ఆసక్తి ఉన్న వారి కోసం ఒక నెట్ వర్క్ రూపొందించడం.
 • వీలైతే కొన్ని లఘు చిత్రాల నిర్మాణం.
 • హైదరాబాదు ఫిల్మ్ క్లబ్/కరీంనగర్ ఫిల్మ్ క్లబ్ ల సహకారంతో ’ఫిల్మ్ అప్రెషియేషన్’ గురించి ఒక చిన్న కోర్సు రూపకల్పన చేయడం.
 • నవతరంగంలో వచ్చిన వ్యాసాలను పుస్తక రూపంలోకి తేవడం
 • ఇవి మాత్రమే కాకుండా నవతరంగం ద్వారా ఇంకా ఏమేం చెయ్యొచ్చో మీరూ తెలియచేయవచ్చు.

డొనేట్

గమనిక: Paypal ద్వారా విరాళాలు ఇవ్వడం కష్టమైతే navatarangam at gmail dot com కి మైల్ చేస్తే మీకు బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలియచేయగలము.
32 Comments
 1. మేడేపల్లి శేషు November 28, 2008 /
 2. మురళి November 28, 2008 /
 3. srinivas November 28, 2008 /
 4. chandramouli November 28, 2008 /
 5. Vamsi M Maganti November 28, 2008 /
 6. Bhaskar Ramaraju November 28, 2008 /
 7. శివ బండారు November 28, 2008 /
 8. వీబీ November 28, 2008 /
 9. BIG JOKE November 28, 2008 /
 10. venkat November 29, 2008 /
 11. గీతాచార్య November 29, 2008 /
 12. bobby November 29, 2008 /
 13. Yuva November 30, 2008 /
 14. cbrao December 1, 2008 /
 15. Hari Charana Prasad December 3, 2008 /
 16. Vishnu Vardhan Reddy December 11, 2008 /
 17. శంకర్ December 11, 2008 /
 18. Vishnu Vardhan Reddy December 12, 2008 /
 19. Vishnu Vardhan Reddy December 12, 2008 /
 20. Rajendra Alapaty December 26, 2008 /
 21. mvraman April 20, 2009 /
 22. బి. పవన్ కుమార్ June 23, 2017 /