‘పడమటి సంధ్యారాగం’ సినిమాలో విజయశాంతి తండ్రి పాత్ర వేసిన గుమ్ములూరి శాస్త్రి గారిని మర్చిపోవటం కష్టం. ఆయన సోమవారం రాత్రి (Nov 24, 2008) నిద్రలో తుది శ్వాస వదిలారు. గుమ్ములూరు శాస్త్రి గారు గోదావరి జిల్లాలో గుమ్ములూరి సత్యనారాయణ గారికి జన్నించారు. ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఎమ్.ఎస్.సి ని పూర్తి చేసి అక్కడే లెక్చరర్ గా చేరారు. ఆ తర్వాత 1965 లో ఆస్ట్రో ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేయటానికి యు.ఎస్.ఎ వెళ్ళారు. అక్కడే పి.హె.డి కూడా కాలిఫోర్నియా యూనివర్శిటీ లో పూర్తి చేసారు.అలాగే ఐదేళ్ళపాటు అక్కడే ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసి నోయస్ అండ్ వైబ్రేషన్ స్పెషలిస్ట్ గా వాషింగ్టన్ మెట్రో లో చేరారు.
ఇక ఆ తర్వాత మీర్ అభ్దుల్లా అనే మిత్రునితో కలసి జంధ్యాల గారి దర్శకత్వంలో పడమటి సంధ్యారాగం(1986) చిత్రాన్ని నిర్మించి అందులో నటించారు. టామ్,విజయశాంతి జంటగా చేసిన ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ నే సాధించింది.ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అటు అమెరికా ఇటు ఇండియా అనే చిత్రాన్ని డైరక్ట్ చేసి నంది అవార్డ్ సాధించారు. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ ని మెప్పించలేకపోయింది. ఆ తర్వాత ఆయన మీర్ అభ్దుల్లా తో కలిసి మరో సారి పడమట సంధ్యారాగం కి సీక్వెల్ మరో సంధ్యారాగం ప్లాన్ చేసారు. అయితే ఆ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.కుటుంబపరంగా ఆయనకు భార్య కనకదుర్గ,ఓ కూతురు,ఇద్దరు మనవలు ఆయనకు ఉన్నారు.
శాస్త్రిగారు…బాల నటుడు
ఆయన చిన్నప్పటి నుండి(మూడో తరగతి) నాటకాల్లో వేషాలు వేస్తూండేవారు.చెన్నైలో ఉండటం వల్ల తెలుగు,తమిళ భాషలపై మంచి పట్టు ఆ వయస్సు నుండే ఉండేది. దాంతో అక్కడ నిర్మితమయ్యే ద్విబాషా చిత్రాల్లో ఆయన బాల నటుడుగా నటించారు. దాదాపు పదిహేను చిత్రాలు దాకా ఆయన నటించారు. వాటిల్లో భక్త శిరయాళ,దీక్ష(ఆత్రేయ) బాగా పాపులర్. తండ్రి ఎంకరేజ్ మెంట్ చేస్తున్నారని హెచ్.ఎమ్.రెడ్డి గారి రాజు-పేద సినిమాకు ఆడిషన్ కి వెళ్ళి సెలక్ట్ అయ్యారు. అయితే చదువుపై దృష్టి తగ్గుతుందని ఆయన ఒప్పుకోలేదని మానేసారు.
పెద్దయ్యాక…
ఆయన అమెరికాలో సైతం నాటకాలు రచించి నటించి,దర్శకత్వం వహిస్తూ నిర్మించేవారు. అందులో సామ్రాట్ చంద్రగుప్త మంచి పేరు తెచ్చుకుంది. అంతేగాక ఆనందభైరవి నిర్మాత Sandilya తో కలిసి వెండితెర అనే మ్యాగజైన్ ని సైతం ఆయన రన్ చేసారు.అప్పట్లో జంధ్యాల గారి దర్శకత్వంలో అన్నమయ్య సినిమాను తీద్దామని రీసెర్చి వర్క్ సైతం చేసారు.
పడమటి సంధ్యారాగం రూపుదిద్దుకున్న క్షణం:
1980లో శాస్త్రిగారు తెలుగు అశోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు శంకరాభరణం ఆర్టిస్టులను చికాగో ఆహ్వానించి ఆనందపరిచారు. అప్పుడు ఆయనకు తోడుగా ఉన్న ఆనంద భైరవి నిర్మాత Sandilya తర్వాత తన సినిమాలో నటించిన వారిని అమెరికా తీసుకొస్తాను తగిన ఏర్పాట్లు చేయమని శాస్త్రి గారిని అడిగారు. అప్పుడాయన ఆనంద భైరవిలో నటించిన నటులు గిరీష్ కర్నాడ్,హీరోయిన్ బెంగాళి అమ్మాయి మాళవిక ఎవరికి తెలియదు కుదురదన్నారు. అప్పుడాయన బాలు గారి సంగీత విభావరి ఏర్పాటు చేస్తానని హామి ఇచ్చి ఒప్పించారు. అలా బాగా దగ్గరగా పరిచయమయ్యారు జంధ్యాల గారు. ఆయన దగ్గర శాస్త్రి గారుఓ సినిమా అమెరికా నేఫద్యంలో చేయాలని అనే కోరిక వెళ్ళబుచ్చారు.
దానికాయన సంతోషించి బాలకృష్ణ,సుహాసిని జంటగా చేద్దామన్నారు. అలాగే ఆయన రెగ్యులర్ కామిడి ప్యాడింగ్ సుత్తివేలు,వీరభద్రరావు వంటి వారిని పెడదామన్నారు. అప్పుడు శాస్త్రిగారు అలా వద్దని అమెరికాలో జరిగే కథ కావాలని అదీ ఇక్కడి ఆర్టిస్టులతోనే అని చెప్పటం జరిగింది.దానికి జంధ్యాల గారు అలా చేస్తే చివరకు మా బావమరది కూడా చూడరని వేళాకోళం చేయటం జరిగింది. అయితేనేం శాస్త్రి గారు ఒప్పించి సినిమా తీయించి రిలీజ్ చేసారు.అయితే ఆ సినిమాలో శాస్త్రి గారి పాత్రకు మాత్రం డబ్బింగ్ వీరభద్రరావు చెప్పటం జరిగింది.ఇక బాలు గారితో పెరిగిన అనుభంధంతో ఆయన్ని సంగీత దర్శకుడుగా పెట్టుకోవటం జరిగింది.పిబరే రామ రసం పాటని మొదటగా రికార్డ్ చేసారు. ఆ పాటే మొదటసారిగా యు.ఎస్ లో రికార్డ్ చేసిన తెలుగు సినిమా పాట కావటం విశేషం.ఇక బాలుగారి రికెమండేషన్ తోనే డ్రమ్స్ శివమణిగారిని నీగ్రో పాత్రకు తీసుకున్నారు.అలా ఆ సినిమా ఎన్నో విశేషాలతో తెరకెక్కి మంచి విజయాన్ని నమేదు చేసి అందరికి ఆనందాన్ని కలుగచేసింది.
ఇక పడమటి సంధ్యారాగంలో ఓ డైలాగ్ ఉంటుంది. సంధ్య(విజయశాంతి) తన ఫ్యామిలీతో కలసి అమెరికా వస్తే అక్కడ ఆమె అంకుల్ రిసీవ్ చేసుకుని ప్రయాణం ఎలా సాగిందని అడుగుతాడు క్యాజువల్ గా…దానికి సంధ్య తండ్రి(శ్రీ గుమ్ములూరి శాస్త్రి గారు)సమాధానంగా “నా పిండాకూడు ప్రయాణం…ముష్టి వెధవ మూడు గంటలు ఆలస్యంగా దించి చచ్చాడు” అంటారు.
అదే పద్దతిలో మరో ముఫ్ఫై ఏళ్ళు లేటుగానయినా శాస్త్రి గారిని దేముడు తీసుకెళితే( ఆయన చేత దేముడు తిట్టుంచుకున్నా) మరో సంధ్యారాగం సినిమా పూర్తవను. మరో కొన్ని మంచి చిత్రాలయినా వచ్చేవేమో. ఏం చేస్తాం…
ఇక విధ్యాధికుడుగా,మంచి వ్యక్తిగా,వక్తగా,నిర్మాతగా,నటుడుగా తనకంటూ ఈ ప్రపంచంలో స్ధానం ఏర్పాటు చేసుకున్న శాస్త్రి గారి మరణం ఆయన మిత్రులకు,కుటుంబీకులకే కాక అభిమానించే అందరికీ తీరని లోటే. ఆయన మృతికి “నవతరంగం” మనసారా శ్రధ్ధాంజలి ఘటిస్తోంది.
Motorolan says:
Sivamani chEsiMdi tindipOthu paatrakaadu, neegrO paatra.
శిద్దారెడ్డి వెంకట్ says:
@Motorolan
ఇప్పుడు సరిదిద్దాం. తెలియచేసినందుకు ధన్యవాదాలు.
KRISHNA RAO JALLIPALLI says:
శాస్త్రి గారికి నివాళులు. వారి గురించి చాలా తెలియని విషయాలు తెలియ చేసారు. పడమటి సంద్యా రాగం లో వారి పాత్రకి సుత్తి వీరభద్ర రావు గారి డబ్బింగ్ … ఎందుకనో నాకు నచ్చలేదు. ఎందుకంటే ప్రాచుర్యం ఉన్నా వారితో డబ్బింగ్ చెప్పిస్తే వారే డామినేట్ అవుతారు. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. శాస్త్రి గారు కనపడలేదు. (ఇది నా అభిప్రాయం మాత్రమె)
j.suryaprakash says:
KRISHNA RAO JALLIPALLI గారు…
క్షమించండి…మీరు చక్రాయగూడెం జల్లిపల్లి బాలయ్య గారి అబ్బాయా?
సూర్య ప్రకాష్ జోశ్యుల
zallipalli laxmikanth says:
నా పెరు జల్లిపల్లి లక్ష్మికాత్ మీ అద్రస్స్ ఫొన్ no తెలుపగలరు
j.surya prakash says:
sir…
My E mail ID…
zedrjy@sify.com
pappu says:
నిజంగానేదేముడు తొందర పడ్డాడేమో..బహుశా అక్కడ ఆయన అవసరం ఉండి ఉండాలి..
శాస్త్రి గారి మృతికి శ్రద్ధాంజలి..
భమిడిపాటి ఫణిబాబు says:
శ్రీ శస్త్రి గారు మరీ తొందర పడి మనల్ని వదలి వెళ్ళిపోయారు
సుజాత!(మనసులో మాట) says:
పడమటి సంధ్యారాగం సినిమాని చాలా రోజులు గుర్తుంచుకున్నామంటే శాస్త్రి గారి పాత్ర కూడా ఒక కారణం! పిబరే రామ రసం పాట సన్నివేశం నాకు బాగా నచ్చుతుంది. అంత ఆర్ద్రత పండించారు ఆ సీన్లో! నాకైతే సుత్తి వీరభద్ర రావు గారి డబ్బింగ్ బాగా నచ్చింది. ప్రతి దానికీ చిరాకు పడుతూ, తిడుతూ ఉండే పాత్ర కదా! వీరభద్ర రావు గారి శైలే కరెక్టు ఈ పాత్రకి అనిపించింది.
ఆ తర్వాత ఆయన ఇంకే సినిమాలోనూ నటించినట్లు లేదు.
ankarao says:
ఈ మద్యనే రెండో సారి చుసాను.శా స్త్రీ గారు చాలా బాగా చేశారు.జయ ప్రకాష్ రెడ్డి కామిడి రోల్ చేశారు.పాటలు చాలా బాగున్నై.
Theja says:
Sasthri gaaru chanipoyina vishayam mana elugu patrikalu yendhuku veyyaledhu, very shame….
Chala manchi cinema theesaru, one of my all time favorite movie adhi….
శ్రీ లక్ష్మీ కళ says:
ఈ సినిమాని తీసేటప్పుడు నేను అమెరికాలోనే ఉన్నాను. అప్పట్లో వచ్చిన మంచి హాస్య, సున్నితమైన ప్రేమ కథ. విజయశాంతి నటనా, బాలూ సంగీతం ప్రాణమైన ఈ చిత్రానికి, శాస్త్రి గారి నటన వెన్నెముక లాంటిది. ఆయన హాస్య, చాదస్తపు నటనని మనం ఇంతకాలం గుర్తుపెట్టుకున్నామంటేనే ఆయన ఎంత ప్రతిభ కనపరిచారో తెలుస్తుంది.
మేడేపల్లి శేషు says:
‘పడమటి సంధ్యారాగం’ సినిమాలో గుమ్మలూరి శాస్త్రి గారి ‘పిబరే రామరసం’ కీర్తన పాడే సన్నివేశం బాగా గుర్తుంది. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక.
srikanth says:
He became immortal playing a single role!! God Bless!!