దోస్తానా

dostana-lead

తారాగణం:అభిషేక్ బచ్చన్,జాన్ అబ్రహం,ప్రియాంక చోప్రా,బొమన్ ఇరానీ,బాబిడయోల్,కిరణ్ ఖేర్ తదితరులు.
రచన-దర్శకత్వం:తరుణ్ మన్ సుఖాని
నిర్మాతలు: యాష్ జోహార్,కరణ్ జోహార్

ఏం..ఎప్పుడూ మూస కథలేనా కాస్త అప్పుడప్పుడూ సరదాకైనా ప్రయోగాలు చెయ్యచ్చుకదా…అని మనం విసుక్కోవటం బబుల్ గమ్ సినిమాలు తీస్తాడని పేరు పడ్డ కరణ్ జోహార్ చెవిన పడ్డట్టుంది. పాపం వాళ్ళన్నది కరెక్టే కదా అనుకుని వెంటనే రంగంలోకి దూకి దోస్తానా తయారు చేసి వదిలాడు. వెరైటీ అంటూ అంతలా తయారు చేసిన సినిమా స్పెషల్ ఏంటంటారా అదే…మనం ఊహించటానికి కూడా కాస్త సంశయించే గే కామిడి. అయితే ఈ సినిమా గ్యారంటీగా హాలీవుడ్ ఫ్రీమేక్ అయ్యుంటందని ఫిక్సవ్వద్దు..అది మన వాళ్ళ బుర్రల్లోంచి హండ్రడ్ పర్శంట్ పుట్టిందే. ఇలాంటి సినిమా ఇండియన్ జనాలికి నచ్చిందా అంటే పిచ్చపిచ్చగా నచ్చిందని భారీ కలెక్షన్స్ చెపుతున్నాయి.ఇలా అంతా ఆశ్చర్యపోతారనే…కథ నేపధ్యాన్ని తెలివిగా మియామి లో తీసుకున్నాడు. ఫారిన్ కంట్రి కాబట్టి అక్కడ ఇలాంటివి మామూలే అని మనకు అనిపించాలనే ఆయన ఉద్దేశం కావచ్చు.

కథలోకి వస్తే…సమీర్(అభిషేక్ బచ్చన్) మియామిలో ఓ మేల్ నర్స్. హ్యాపీగా పగలంతా సంపాదన,సాయింత్రం అయితే మియామి బీచ్ లో బికినీలమీద తిరిగే అమ్మాయులు అందాలు ఆశ్వాదించటం(ఇది రిజస్టర్ చేయటానికి టైటిల్స్ లో శిల్పాశెట్టి అందాలు ఆరబోసాడు కూడా),రాత్రి అయితే డిటో..పక్కమీద పడతి. అలాంటి సమీర్ కి తన లాంటి ఆలోచనలే ఉన్న కునాల్(జాన్ అబ్రహం) పరిచయమవుతాడు. కునాల్ అక్కడ మోడలింగ్ ఫొటో గ్రాఫర్. ఇక వీరిద్దరకూ సినిమా రూలు ప్రకారం ఒకే సమస్య వస్తుంది. అదే అద్దె ఇల్లు. రెగ్యులర్ స్కీమ్ లోనే అద్దె ఇల్లు పట్టడం కోసం ఓ అబద్దమాడాల్సి వస్తుంది. అయితే ఇక్కడే మన దర్శక,రచయిత తన క్రియేటివిటీ చూపాడు. వీళ్ళు నచ్చి చేరుదామనుకున్నఆ ప్లాట్ లో ఆల్రెడీ నేహ(ప్రియాంక చోప్రా) ని పెట్టాడు. ఆమెతో రూమ్ షేర్ చేసుకోవాలని వీరి కోరిక. అయితే నేహ అత్తకి..ఇద్దరు బ్యాచులర్స్ తో తన మేనకోడలు రూమ్ షేర్ చేసుకోవటం సుతారాము ఇష్టం ఉండదు. అప్పుడు వీళ్ళిద్దరూ అదేగా మీ ప్లాబ్లం…మీరిక దాన్ని మర్చిపొండి అంటారు. అదేం అని ఆమె తింగరి ముఖం పెట్టుకుని అడిగితే…వెంటనే ఇద్దరూ మేం గే లం కదా…మాకు ఆడవాళ్ళపై అటువంటి కోరికలుండవు అని క్లారిఫై ఇస్తారు. సర్వసాధారణంగా ఇలా ఇక్కడ చెబితే వెంటనే గెంటేస్తారు. అయితే అది మియామి కాబట్టి…మనం చూస్తున్నది కామిడీ కాబట్టి నొ ప్లాబ్లం. నేహా అత్త మొదట షాకయినా ఆ తర్వాత వారిని ఆహ్వానిస్తుంది. ఇక అక్కడ నుండి అమ్మాయిలు అంటే పడిచచ్చే వీళ్ళిద్దరూ నేహా వంటి అద్బుత అందంతో కలసి ఉండాల్సి వస్తుంది( అందులోనూ ఆమె బట్టలు అవీ ప్రవరాఖ్యుడుని సైతం రెచ్చకొట్టి కాపురం చేయించేలా ఉంటాయి.

ఇదిలా ఉండగా సమీర్ తల్లి(కిరణ్ ఖేర్) ఇండియా నంచి ఇక్కడుకు కొడుక్కు పెళ్ళి చేయాలనే తలంపుతో వస్తుంది.అసలే సంప్రదాయం అంటే ప్రాణమిచ్చే ఆ పంజాబి మాత కొడుకు ఇలా ఓ గే లా మారి మగవాడితో కలిసి ఉండటం తట్టుకోలేక పోతుంది. కానీ కాలం మారిందనుకుని సర్దిచెప్పుకుని వీళ్ళద్దరికే పెళ్ళి చేయటానికి నిర్ణయించుకుంటుంది. అంతే గాక కునాల్ తన కోడలు గా భావించి తరతరాలుగా తన కుటుంబంలో కోడళ్ళుకు గిప్ట్ గా ఇచ్చే గాజుల ప్రెజెంట్ చేసి మరీ నిష్కమిస్తుంది. హమ్మయ్య అనుకుని వీళ్ళిద్దరూ సీరియస్ గా నేహాతో ప్రేమలో పడతారు. పడిందే తడువుగా ఆమెను ఇంప్రెస్ చేయటానికి రకరకాల ప్రయత్నాలు ప్రారంభిస్తారు. స్క్రీన్ ప్లే రూల్స్ ఫాలో అవుతూ ఆ ప్రాసెస్ లో ఒకరికి ఒకరు శత్రువులుగా కూడా మారుతారు.అయితే నేహా మాత్రం ఇదేమి పట్టించుకోదు. ఆమె వీళ్ళిద్దరని చక్కగా ప్రెండ్స్ లాగే ట్రీట్ చేస్తుంది. వీళ్ళిచ్చే ట్రీట్స్ ని చక్కగా తీసుకుంటూంటుంది. ఎందుకు అలా అంటే ఆమె దృష్టిలో వీళ్ళిద్దరూ భయంకరమైన ప్రేమలో ఉన్న గే జంట. ఇదేం కర్మరా బాబు అని హీరోలిద్దరూ తలలు పట్టుకున్న టైమ్ లో నేహా కి కొత్త బాస్ అయిన అభిమన్యు సింగ్ (బాబిడయోల్) రంగంలోకి దూకుతాడు.
సింగిల్ మదర్ లా అతనో ఎనిమిదేళ్ళ కొడుకున్న సింగిల్ డాడ్. తొలిచూపులోనే నేహాతో ప్రేమలో పడతాడు.నేహా కూడా మొహమాటం పడకుండా ఐలవ్ యు టూ అన్నంత క్లోజ్ అయిపోతుంది. ఈ కొత్త సిట్యువేషన్ మన హీరోలిద్దరికి మింగుడు పడదు. దాంతో ఆ ప్రేమని చెడకొట్టడానికి రకరకాల ప్లాన్స్ వేస్తారు. అందుకోసం బాబిడయోల్ తో చనువుగా ఉంటారు. దాన్ని నేహా అపార్ధం చేసుకుంటుంది. అతన్ని గే లా మార్చటానికి ఇలా చేస్తున్నారనుకుంటుంది. అలా గందరగోళంగా మాటిమాటికి గే ప్రస్ధావన తెస్తూ…నడిచే ఈ రొమాంటిక్ కామిడిలో చివరకు నేహా ఎవరికి దక్కిందనేది సస్పెన్స్. ఆ క్లైమాక్స్ సీన్స్ చూసి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఫైనల్ లో డైరక్టర్ మరీ ముందుకెళ్ళి హీరోలిద్దరి చేతా లిప్ టు లిప్ కిస్ కి ట్రై చేసాడు.

చిన్న అవసరం కోసం ఒక అబద్దం ఆడితే దాని పర్యవసానం ఇంత భయంకరంగా ఉంటుందా అనే ధీమ్ తో తయారైన ఈ కథ దాన్ని ఎక్కడా ఎస్టాబ్లిష్ కానివ్వనుండా సాగటం విశేషం. అలాగే దోస్తానా అనే టైటిల్ చూస్తే..స్నేహం విలవను అపురూంగా చెప్పే సినిమా అనుకునే ప్రమాదం కూడా ఉంది. అయితే లక్కీగా మొదటనుంచి మా సినిమాలో హీరోలిద్దరూ గే లు అంటూ పబ్లిసిటీ చేయటం కలిసివచ్చింది. ఆ పబ్లిసిటి ఎంతలా వర్కవుట్ అయిందంటే సినిమా రిలీజ్ కి ముందు రోజే ప్రివ్యూ వేసి దాదాపు ఎనభై అయిదు లక్షలు సంపాదించారు. అలాగే ఎనభైల్లో వచ్చిన దోస్తానా టైటిల్ కరణ్ తండ్రి యాష్ జోహార్ తీసిన చిత్రంలో ది. అమితాబ్,శతృఘ్నసింహా,జీనత్ అమన్ నటించిన ఆ చిత్రం అప్పట్లో మంచి కలెక్షన్స్ వసూలు చేసి చరిత్రలో నిలిచిపోయింది. దాంతో ఆ పేరు ఈ గే సినిమాకు పెట్టడం కొంతమంది బాలివుడ్ ప్రముఖుల విమర్శలకు గురి చేసింది.

నిజానికి కరణ్ ఈ తరహా కామెడీ గతంలో కల్ హో నహో లో చేసాడు. ఆ సీన్స్ రవితేజ భధ్ర సినిమాలో కనిపింస్తాయి(ఝన్సీ…రవితేజని,దీపక్ ని గే లని అనుమానించటం).వాటి కొనసాగింపు ఈ దోస్తానా అనిపిస్తుంది. అయితే స్క్రీన్ ప్లే ఫెరఫెక్ట్ గా ఉండటం ఈ సినిమాకు కలసి వచ్చిన అంశం. అలాగే ఐ నౌ ప్రొనౌన్స్ యు చక్ అండ్ లారీ (ఆడమ్ శాండ్లర్) సినిమాలో కూడా ఇట్లాంటి కథే ఉండటం గుర్తు చేస్తూందీ ఈ సినిమా.

ఇక ఈ సినిమాలో హైలెట్స్ గా చెప్పుకోతగ్గవి అభిషేక్ బచ్చన్ తన గే ప్రేమ ఎలా మొదలైందంటూ ఓ స్టోరీ అల్లి చెపుతాడు. అది బాగా నవ్విస్తుంది. అలాగే జాన్ అబ్రహం,ప్రియాంకచోప్రా కలసి కుచ్ కుచ్ హోతా హై లోని ఓ పాటను తెరపై చూస్తూ అదే విధంగా స్టెప్స్ వేయటం బాగుంటుంది.క్లైమాక్స్ దగ్గరలో బాబి డయోల్ ని హీరోలిద్దరూ ట్రై చేస్తున్నారని ప్రియాంక అనుమానించే సన్నివేశాలు బాగా పండాయి. ఇక ఉన్నది కాస్సేపయినా బొమన్ ఇరాని …ప్రియాంక బాస్ గా అదరకొట్టాడు. అతను గే కావటం. హీరోలిద్దరితో అతను జతకట్టాలనుకోవటం మంచి ఫన్ని స్టఫ్. విశాల్ శేఖర్ సంగీతం కూడా బాగుంది.

మరీ సంప్రదాయవాదులైతే ఈ సినిమాకు వెళ్ళకుండా ఉండటం మేలు. ఫరవాలేదు కామిడి సినిమా చూద్దాం అనుకుంటే మంచి ఛాయిస్, నిరాశపరచదు.అయితే ఆ సీన్స్ తెరపై వస్తున్నప్పుడు ప్రక్కన ఎవరిదన్నా చెయ్యి పొరపాటున తగిలినా ఉలిక్కిపడతాం.జాగ్రత్త.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

6 Comments to “దోస్తానా”

  • “ఆ సీన్స్ తెరపై వస్తున్నప్పుడు ప్రక్కన ఎవరిదన్నా చెయ్యి పొరపాటున తగిలినా ఉలిక్కిపడతాం.జాగ్రత్త.” కేక!!!! కొసమెరుపులూ, అక్కడక్కడా చెళుకులతో సాగే మీ సమీక్షలు తెగనచ్చేస్తున్నాయి. ఐతే ఈ సినిమా చూసెయ్యాలన్నమాట.

  • మీ రివ్యూ బావుంది. నాకైతే ఈ సినిమాలో హస్యం వెగటు పుట్టించిందండీ..
    ఏమిటో ఈ మధ్య ‘గే’ క్యారక్టర్ లేని సినిమా లేదు బాలీవుడ్లో.

  • ఇలాంటి సినిమాలు భావదారిద్ర్యానికి పరాకాష్ట. దేశంలో గే సంస్కృతిని ప్రోత్సహించే హిడెన్ అజెండాతో కరణ్ జోహార్ సినిమాలు తీస్తున్నాడని నా అనుమానం. కరణ్ మాట్లాడే విధానం, నడక, హావభావాలు చూస్తే అతనూ ఆ రకమే అనిపిస్తుంది.

  • “గే” కామెడీ ని ఇంతగా ఎంజాయ్ చేస్తున్నరా మన వాళ్ళు?

    ప్రకాష్ గారు,మీ రివ్యూలు తెగ నచ్చేస్తున్నాయి! చాలా డబ్బు కూడా ఆదా చేస్తున్నారు నాకు!

    ఈ సినిమా గురించి ఫ్రెండ్స్ ఎవరో మాట్లాడుతుంటే మా పాపాయి మధ్యలో దూరి “దోసె తేనా, ఇడ్లీ తేనా ఏమిటి? అదేం సినిమా?” అనడిగింది.

  • “.అయితే ఆ సీన్స్ తెరపై వస్తున్నప్పుడు ప్రక్కన ఎవరిదన్నా చెయ్యి పొరపాటున తగిలినా ఉలిక్కిపడతాం.జాగ్రత్త.”
    - :) ) అన్నింటికంటే నాకు ఈ వ్యాసం లో ఈ వాక్యం చాలా నచ్చింది…. బాగా రాసారండీ వ్యాసం…

  • Sooper review andi.. Nijame chala money save avuthundi ade kaka inko help entante chetta movies nundi mammalni rakshisthunnarandi

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories