Menu

కాపీ కొట్టడమూ కళే..(సినీ వ్యంగ్యం)

ఏదైనా చుట్టడమే కదా

అనగనగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పచ్చి పల్లెటూరు. అక్కడో చుట్టల చుట్టించి అమ్మే వ్యాపారం చేసుకునే ఇద్దరు క్లోజ్ ప్రెండ్స్. వాళ్ళకు సొంత ఆస్దులు,పెళ్ళాలు,పిల్లలుతో పాటు కొన్ని నమ్మకాలు,అభిప్రాయాలు ప్రతీ విషయంపైనా ఉన్నాయి. దాంతో తమ తెలివిని,డబ్బుని మరో వ్యాపారం పై పెట్టయాలనే ఆలోచన వాళ్ళిద్దరినీ  రోజూ పీకేసేది. ఆలోచించగా ..చించగా వారికి సినిమా తీద్దాం అనే అధ్బుతమైన ఐడియా వచ్చింది. అందులోనూ సినిమా కూడా ఒక రకంగా చుట్టడమే అని వాళ్ళు చాలా సార్లు విని ఉండటంతో సర్లే అనుకుని మద్రాస్ బయిలుదేరారు.

ఎ గ్రేట్ గైడ్

అప్పుడు మధ్యలో ఒక వ్యక్తి  తగిలి నేనూ మీ వాడ్నై…మనూరూడ్నే,అంతేకాదు సినిమా వాడ్ని అన్నాడు. సర్లే ఏంటి అనుమానంగా అన్నారు. మీ వాలకం చూస్తూంటే ఎక్కడో మోసపోయేటట్లు ఉన్నారు. ఎందుకంటే సినీ పరిశ్రమ మద్రాస్ వీడి హైదరాబాద్ వచ్చి చాలా కాలమయింది. అది కూడా మీకు తెలియక బయిలుదేరారు అన్నాడు. అబ్బ ఎంత తెలివి…ఎంత అప్ డేట్..అందులోనూ తనకి అవసరం లేకపోయినా తన తెలివిని మనకు వినియోగించాడని ముచ్చపడి..మెచ్చుకుని ఏం చేద్దాం ఇది విషయం అన్నారు. ఏ వ్యాపారం ఎంత ముదిరినా సినిమా ఫీల్డ్ కొచ్చేసరికి అంతా అయోమయమే అని అర్దం చేసుకున్న అతను..

డైరక్టర్ అక్రమన్ పరిచయం

ఓస్ ఇంతేనా…నేను చాలా మందికి లైఫిచ్చాను(ఇన్నర్ వాయిస్ లో ముంచాను) అని ధైర్యం చెప్పి అక్రమన్ అనే మహా తమిళ దర్శకుడు ఉన్నాడు. ఆయన తల ఊపితే చాలు హీరోల డేట్స్ దొరుకుతాయి. ముందు ఆయన్ని పట్టుకుందాం అన్నాడు. సర్లే అని ముగ్గురూ ఆయనింటి ముందు వాలారు. అప్పటికే ఆయన ఇంటి ముందు చాలా పెద్ద క్యూ ఉంది. ఆశ్చర్యంతో ఏంటి ఈయన గొప్ప అన్నారు. తమిళ సినిమా ను అటు ఇటు అచ్చ తెలుగులా మార్చి హిట్టు కొట్టగలడు. అంతేకాదు అడ్వాన్స్ ఇస్తే చాలు అన్ని ఆయనే చూసుకుంటాడు. అలాగే అన్ని విభాగాలు స్వయంగా చెయ్యగల సత్తాఉంది ఆయనకే అన్నారు. అలా ఆయన గొప్పతనం ఓ మూడు గంటలు తనివితీరా చెప్పుకునే సరికి వీరి వంతు వచ్చింది.

ఫ్రీమేకే మేలు…

లోపలికి వెళ్ళాక…డీవిడి చెప్పండి…అడ్వాన్స్ ఇవ్వండి అన్నాడు. ఇద్దరూ కంగారు పడ్డారు. అప్పుడు వీళ్ళ అమాయకత్వాన్ని అర్ధం చేసుకున్న ఆ డైరక్టర్ అసెస్టెంట్ …సారు మీరు ఏ సినిమా కథను తెలుగులో చెయ్యాలనుకుంటున్నారో చెప్పినా,డీవీడీ ఇచ్చినా చాలు అంటున్నారని తెలుగుని తెలుగులో ట్రాన్స్ లేట్ చేసాడు. వెంటనే ఇద్దరూ కూడబలుక్కున్నట్లుగా సారి మేం కాపీ కధలు చెయ్యం. మేం మొదటనుంచి నిక్కాసయిన వర్జీనియా పుగాకే చుట్టలకు వాడుతూ వచ్చాం అట్లానే ఒర్జినల్ కథనే మేం సినిమా తీద్దామని వచ్చామని చెప్పారు.

కాపీనే నా ప్రాణం

అప్పుడా డైరక్టర్ అయ్యా నేను ఒక వెర్షన్ లేనిదే చెయ్యలేదు. అందులోనూ కాపీ కొట్టకపోతే నా క్రియేటివిటీ పోతుంది.చిన్నప్పుడు నుంచీ నేనింతే అని తేల్చేసాడు. ఇద్దరూ మొహమొహాలు చూసుకుని బయిలుదేరబోయారు. మంచి సౌండ్ పార్టీ వదులుకోకూడదని అక్రమన్ అంతరాత్మ అదే పనిగా ఘోషించసాగింది. దాంతో ఆగమని చెప్పి మధ్యే మార్గంగా ఓ పరిష్కారం ఉందని చెప్పాడు.

రీమేక్…ఓ రకంగా కాపీనే

ఏంటని అడిగేతే…రీమేక్ రెట్స్ ఏ సినిమాదన్నా కొనండి.మీకూ డబ్బు ఖర్చు పెట్టి నిజాయితీగా సినిమా చేస్తున్న ఫీల్ ఉంటుంది. నాకూ కాపీ కొట్టిన ఫీలింగ్ ఉంటుందన్నాడు. కాస్సేపు ఆలోచిస్తే అదీ కరెక్టే అనిపించింది. వ్యాపారంలో అట్నుంచి కాకపోతే ఇట్నుంచి నరకాలన్నారు కదా..అలాగే కానీయ్ అని అడ్వాన్స్ ఇచ్చి సినిమాల కోసం చెన్నై బయిలు దేరారు.

చెన్నై లో చెదిరిన సీన్

చెన్నై లో పేరున్న హిట్టయిన సినిమా నిర్మాతలందరి దగ్గరికీ తిరిగారు. అయ్యా రాబోయే పదేళ్ళ దాకా మొదలయ్యే ప్రతీ సినిమా రైట్స్ అమ్ముడయిపోయాయి. కావాలంటే ఆ తర్వాత విషయం మాట్లాడుకుందాం అని అచ్చ తమిళంలో చక్కగా చెప్పారు. ఎందుకంటే తెలుగు నిర్మాతలంటే వారికి అంతులేని గౌరవం. తమ ఫీల్డ్ ని సగం వీరే బ్రతికిస్తున్నారనే ఫీలింగ్ . అదీ సంగతి అందుకే ..ఇవన్నీ ఆలోచించే నేను చక్కగా ఫ్రీమేక్ చేద్దాం అన్నానన్నాడు. కాదు కేరళ వెళదాం అన్నారు.

కట్ చేస్తే కేరళ

అక్కడ కూడా  పాపం మనవాళ్ళిద్దరూ చెడ తిరిగారు. చెప్పులరిగి పోవటమంటే వారికి లైఫ్ లో ఫస్ట్ టైమ్ తెలిసివచ్చింది. అక్కడా సేమ్ సిట్యువేషన్. ఎక్కడ ఎవర్ని కదిపినా సినిమాలన్ని తెలుగు నిర్మాతలుకు బేరం అయిపోయిందనే మాటే. ఏం చేయాలి.ఫస్ట్ టైమ్ ఆ డైరక్టర్ తో కలసి మందు కొట్టారు.

జ్ఞానోదయం అయింది

డైరక్టర్ చెప్పిన మాట విన్నారు. ఓ పాత మళయాళ సినిమాను సెలెక్టు చేసారు. ఆ దర్శక,రచయిత,నిర్మాతలను పట్టుకోవటం కష్టం అనవసరం అనే నిర్ణయానికి వచ్చారు. అందులోనూ అదో ఇంగ్లీష్ సినిమాను అనుకరిస్తూ చేసిన సినిమా అని డైరక్టర్ గారు చెప్పారాయే. ఓకే అనుకున్నారు.

మళయాళ మేజిక్

ఆ మళయాళ చిత్ర కథ ఏంటంటే ఓ పిల్లిని యజమాని చాలా ప్రేమగా పెంచుతూంటాడు. ఓ  రోజు రౌడీలు ఆ పిల్లి ఎదురుగానే ఆ యజమానిని అంతం చేస్తారు. అప్పటికే ఆ పిల్లి రాజేంద్రుడు గజేంద్రుడు వంటి సినిమాలు చూసి ఉండటంతో ఆ హంతకులను పోలీసులకు పట్టించాలనుకుని ప్లాన్ చేసి కష్టపడి ఆ పని క్లైమాక్స్ లో చేస్తుంది. ఇన్నాళ్ళూ మనుషులు పగ తీర్చుకోవటం చూసాం గానీ ఇలా పిల్లి పగ తీర్చుకోవటం గ్యారింటీగా కొత్త పాయింట్ అవుతుందని వారికనిపించింది.

డైరక్టర్ సజెషన్

పిల్లి ముఖ్యంగా మీ తెలుగు వాళ్ళకి యాంటి సెంటిమెంట్ కాబట్టి దాన్ని పాము గా మారుస్తారు. మిగతా కథ మామూలే. అలాగే పాముని హీరో చేస్తే ధియోటర్స్ వద్ద పుట్టలు పెట్టుకోవచ్చు హ్యాపీగా. అన్నాడు. ఏం కమర్షియల్ ఆలోచన అంటూ మరింత డబ్బు ఆయన చేతిలో పోసారు. ఆయన సినిమా భారీగా ప్రారంభించాడు.

సినిమా రిలీజ్

మన సినిమా మన ఊళ్ళో మన ధియోటర్ లో రిలీజ్ చేసి మన వాళ్ళ మధ్యన చూద్దమని ప్లాన్ చేసారు.

ఫస్ట్ డే ఫస్ట్ టాక్

సినిమా పూర్తయ్యక తామెవరో గుర్తు పట్టని ఓ ప్రేక్షకుడుని పట్టుకుని అతని టాక్ అడిగారు.(తెలిసున్న వాళ్ళయితే భయింకరంగా పొగిడేస్తారని భయం). ఆ ప్రేక్షకుడు తుపుక్కున ఉమ్మసి…ఎవరయ్యా ఈ చెత్త సినిమా తీసింది అన్నాడు.

ఉమ్మటానికి బలమైన రీజన్

అంతగా నీకు నచ్చనిదేముంది …పాములంటే నీకు  పడదా లేక పాములు పగ పట్టడం నీకు నచ్చదా అని నిలదీసారు. అవేం కాదు అన్నాడు వాడు. మరి నీకేం నచ్చలేదు అన్నారు పట్టువదలని విక్రమార్కుడిలా.దానికతను విచిత్రంగా వీళ్ళదిరి వంకా చూసి అయ్యా పాము పగపట్టినప్పుడు మొదటే విలన్స్ ని కాటేసి చంపేయవచ్చుగా…చివరి దాకా వెంబడించి వెంబడించి పోలీసులకు పట్టివ్వటమెందుకు అన్నాడు.

అర్దమైంది అసలు కీలకం

డైరక్టర్ కంగారుగా కాపీ కొట్టే ప్రక్రియలో పిల్లిని యాంటి సెంటిమెంట్ గా ఫీలియ్యి ఆ ప్లేస్ లోకి పాముని తెచ్చి కట్ అండ్ పేస్ట్ స్క్రీమ్ ఫాలో అయ్యాడే కాని బుర్ర పెట్టి ఆలోచించి లాజిక్ పట్టుకోలేదని అర్దమైంది. కాపీ కొట్టడం కూడా ఒక కళే అని వారికి పూర్తి స్ధాయిలో అర్ధమైంది.

నీతి

సినిమా కాపీ కొట్టడానికి కూడా అమోఘమైన ఆలోచనలు కావలెను. ఒరిజనల్ ఐడియా డెవలప్ చేయటం కన్నా కాపీ ఐడియాని మేకప్ చేయటమే కష్టము.

7 Comments
  1. శంకర్ November 23, 2008 /
  2. శ్రీ లక్ష్మీ కళ November 23, 2008 /
  3. శివ బండారు November 24, 2008 /
  4. srikanth November 24, 2008 /
  5. pappu November 24, 2008 /
  6. sriharsha December 19, 2016 /