ఆవకాయ బిర్యాని-సమీక్ష

avakaya-biryani-lead

బ్యానర్:అమిగోస్ క్రియోషన్ (ప్రై) లిమెటెడ్.
నటీనటులు: కమల్ కామరాజు,బిందు మాధవి,రావు రమేష్,వరుణ్ జొన్నాడ తదితరులు.
కెమెరా:శ్యామ్ దత్
ఎడిటింగ్: ప్రవీణ్ బోయిన
సంగీతం: మణికాంత్ కద్రి
నిర్మాతలు :శేఖర్ కమ్ముల,చంద్రశేఖర్ కమ్ముల
రచన-దర్శకత్వం:అనీష్ కురువెళ్ళ
రిలీజ్ డేట్ 14 నవంబర్ ,2008.

టైటిల్ వినగానే…ఏదో ఫీలింగ్ ..అందులో శేఖర్ కమ్ముల బ్యానర్ నుండి వస్తున్న సినిమా అనగానే మరికొంత ఎట్రాక్షన్..ఊ…చూసేద్దాం అని థియేటర్ లోకి దూకితే అర్దమైంది నేనెంత తప్పుచేసానో. పరిష్కారం చూపని ఓ ముస్లిం-హిందు(తెలంగాణ-ఆంధ్రా) ప్రేమ కథను చూస్తానని ఊహించలేకపోయాను. పోని అదన్నా స్టైయిట్ గా చెప్పాడా అంటే…మధ్యలో తెలంగాణ ఊరి సమస్యలు అంటూ ప్రభుత్వ ప్రకటనలా టార్చర్ స్టార్ట్ చేసాడు. ఇదీ ధియోటర్ ఫస్ట్ డే ఫస్ట్ టాక్.

మహ్మద్ అక్బర్ కలామ్(కమల్ కామరాజు) దేవరకొండ అనే తెలంగాణ పల్లెలో సెవన్ సీటర్ ఆటో నడుపుతూంటాడు. లక్ష్మి(బిందు మాధవి) ఆవకాయ అమ్ముకుని కుటుంబానికి సహకరించాలనుకుని పోలవరం (ఆంధ్రా)నుంచి వలస వచ్చిన అమ్మాయి. లక్ష్మి వికారబాద్ కి వెళ్ళటానికి అక్బర్ ఆటో ఎక్కుతుంది. ఇద్దరి మధ్య మీరూహించినట్లే కామన్ గా ప్రేమ చిగురిస్తుంది. ఈ మధ్యలో మాస్టర్జీ(రావు రమేష్),బబ్బర్ ఖాన్(వరుణ్ జొన్నాఢ) అనే ఇద్దరు పల్లె విలన్స్. వీరి నుండి ఈ ప్రేమ జంట తప్పించుకుని లక్ష్మి మతానికి విలువ ఇచ్చే తండ్రిని ఎలా ఒప్పించి పెళ్ళి చేసుకున్నారనేదే మిగతా కథ.

నిజానికి పైన రాసినట్లుగా ఎలా ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడనేదే ఇలాంటి కథల్లో హైలట్ అవ్వాల్సింది…అదే మిస్సయింది. సమస్యకు ఏం పరిష్కారం చూపాలో అర్ధం కాక..రెండేళ్ళ తర్వాత అని వేసాడు. అనంతరం అక్బర్ మండల ప్రెసెడెంట్ అయ్యాడని చూపాడు. అది చూసిన లక్ష్మి తండ్రి(అంటే ఆయన దృష్టిలో మనిషి సోషల్ స్టేటస్ పెరిగితే చాలు అన్న ఆలోచన ఉందేమో) పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఇక సమస్యే క్లైమాక్స్ లో వస్తే ఫస్టాఫ్ అంతా ఏం చూపెట్టాడు అనే సందేహం రావచ్చు. మొదటి భాగం అంతా కథకు సంభందం లేని ఊరి సమస్యలు(సబ్ ప్లాట్స్ అనుకున్నారమో),హీరో డిగ్రీ పాసవటం కోసం గజనీలా ఇయుధ్ధాలు, మాస్ కోసం ఆటో పందాలు,విచిత్రమైన విలనిజం చూపెడుతూ స్క్రీన్ టైం వేస్ట్ చేసారు. అలాగే ప్రతి ఇరవై నిముషాలకు సబ్ ఫ్లాట్స్ ఓ ఎపిసోడ్ లా స్టార్టయి దాని క్లైమాక్స్ వస్తూంటాయి. ఇదంతా వాస్తవానికి స్క్రీన్ ప్లే లోపమేనని అర్ధమవుతూంటుంది.

అయినా హీరోయిన్ చక్కగా బి.కామ్ చదువుకుంది కదా..ఏ ఉద్యోగమో చేసి కుటుంబానికి సాయపడుతుందేమో అనుకుంటాం..అలాంటిదేం జరగదు.దాంతో ఏ టెన్త్ ఫెయిల్ అమ్మాయో అని పెడితే బాగుండుననిపిస్తుంది. అలాగే హీరోతో ఆమె ఇకనుంచి ఇంగ్లీష్ లోనే మాట్లాడుదాం అంటుంది.కానీ అది తర్వాత సీన్ కే మర్చిపోతుంది. అంతేగాక హీరోయిన తండ్రి ఆమె పెళ్ళి చేసి చచ్చిపోతాను అన్నట్లు మాట్లాడుతూంటాడు గాని తనకు మరో కూతురు,కొడుకు ఉన్నారన్న ఫీలింగే ఎక్కడా కనిపించదు. ఇక బొంబాయి..సినిమాని మణిరత్నం అలానే ఎందుకు తీసాడో ఈ సినిమా చూస్తే…మరింత స్పష్టంగా అర్ధమవటం ఈ చిత్రానికున్న ఏకైక ప్లస్.

ఇక నటీనటుల దగ్గరకొస్తే…కొత్త అమ్మాయి బిందుమాధవి కళ్ళు పెద్దవే అయినా వాటితో చూపాల్సిన ఎమోషన్స్ చిన్నవి చేసింది.ఇక హీరోగా చేసిన కామరాజు…డ్రస్,హెయిర్ స్టైయిల్,మేకప్ చూస్తే ఏ సాప్ట్ వేర్ ఇంజనీరో అనిపిస్తుంది. పొరపాటున కూడా తెలంగాణ ఆటో డ్రైవర్ అనిపించదు. మిగతా పాత్రధారులందరూ..ఆఖరకు గెస్ట్ గా మెరిసిన శేఖర్ కమ్ములతో సహా అంతా సోసో. సంగీతం చాలా హోరులా ఉంది. శేఖర్ సినిమాల్లో కనిపించే లాలిత్యం పొరపాటున కూడా లేదు. ఇక కథలో ఫెయిలయిన రచయిత,దర్శకుడు డైలాగుల్లో కూడా ఫీల్ మిస్సయ్యాడు. ఫస్టాఫ్ మొత్తం డైలాగులతో నింపి గోల గోలగా మార్చేసాడు. డైలాగులు తగ్గించి విజువల్స్ చూపెడితేనే నిండుతనం వచ్చేది.ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. కెమెరా,ఎడిటింగ్ దర్శకుడు సెన్స్ కి తగినట్లే ఉన్నాయి.

ఏదైమైనా బ్రాండ్ నేమ్ చూసి సినిమాకెళితే మోసపోతారు అని నిక్కార్సయిన సత్యం చెప్పిన ఈచిత్రం ఇది. అలాగే ఈ సినిమాని ఆర్.కె.నారాయణ్ మాల్గుడి డేస్ తోను,శ్యామ్ బెనగల్ చిత్రాలతోనూ పోల్చటం అనవసరం. ఇక మరీ పురాతన కాలంనాటి సమస్యను భుజాన వేసుకుని వచ్చిన ఈ చిత్రం తీయకుండా ఉంటే మంచి టైటిల్ మిగిలి ఉండేదనిపిస్తుంది.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

16 Comments to “ఆవకాయ బిర్యాని-సమీక్ష”

  • “హీరోయిన తండ్రి ఆమె పెళ్ళి చేసి చచ్చిపోతాను అన్నట్లు మాట్లాడుతూంటాడు గాని తనకు మరో కూతురు,కొడుకు ఉన్నారన్న ఫీలింగే ఎక్కడా కనిపించదు. ఇక బొంబాయి..సినిమాని మణిరత్నం అలానే ఎందుకు తీసాడో ఈ సినిమా చూస్తే…మరింత స్పష్టంగా అర్ధమవటం ఈ చిత్రానికున్న ఏకైక ప్లస్.”

    పై రెండు లైన్లూ ఈ రివ్యూకే హైలైటు. :) :)

    రివ్యూ అద్భుతం. చాలా నిజాయితీగా వ్రాశారు.

  • బొంబాయి సినిమా – విషయం అర్ధం కాలేదు. ఆ సినిమా బానే ఉంటుంది కదా ?!

  • idi nijangaa disappoint chesina anubhavam. Anish nunchee ekkuva expect cheyaledu kanee bore kottistaadu anukoledu. Melbourne lo oka 20 mandi madhyana kalsi choostunte anipinchindi edo preview show choostunnana evaroo emee response ivvatledu ani…kanee nijanga response teppinche points emee levu ee movie lo.

    Visuals baagunnayi…telangana lo palletoollu enta nirmalanga untaayo baaga cover chesaadu. Visual ga chaala shots impressive gaa unnayi( naakite shekhar visuals kante better anipinchaayi). Lighting and camera work is kool. Editing koncham better ga undochunemo…director influence ekkuvaga undi than a professional editor(who would have had better suggestions). Music baaga nirasaparichindi…songs anna relief gaa untaayemo anukunte ledu, lyricist vanamaali ki director inputs enta importanto artham autundi ee movie chooste, production values are good and Anish’s experience in making 4 films was very handy anipistundi.Konni shots composition simple ga fresh gaa unnayi, magic hours lo shooting is good, chaala shots ki panaromic view istaadu anduvalla devarakonda ki kootavetu dooram lo unna oollu kooda kanipistaayemo anipistundi.

    Bindu ni choodagaane silk smitha sister emo anipistundi, kanee freshers lo unde oka energy miss ayyindi, aame chamak manadu ee movie lo,body language, dailogues, facial expressions, ease emee kanapadavu, chaala chotla co artostes to aame coordination chooste movie ki rehearsals choostunnama ane feel vastundi, ikkada director gaa anish ki strong learning points unnayi…

    Kamal oka honest effort pettadu anipistundi…atani performance kosamenin ee cinema choodochu ananta undadu kanee atanu kastapaaddadu annadi kanipistundi screen meeda. Atani back story koncham work out cheyatam valla konta believeability vastundi kanee span of character chaala ekkuva almost biographic sktech laaga atani chinnatanam(montage anukondi) nunchee atanu mandala president ayyedaa saaga teeta oka 2-3 movies choosina feel testundi.

    tookeega ee movie choodakapote emee miss kaamu ane anipinchindi.

  • sujatha garu,
    బొంబాయి సినిమాలో హీరోయిన్ పాత్ర ముస్లిమ్,హీరో పాత్ర హిందూ పెట్టడానికి కారణం…ఏంటా అనేది అర్ధమవుతుంది …ఎందుకంటే ఇండియాలో ముఖ్యంగా తమిళ,తెలుగు వాళ్ళలో ఎక్కువ శాతం డామినేటడ్ రెలిజియన్ హిందు కదా… ..వాళ్ళ ఇగోలు వాళ్ళకుంటాయి కదా….అని సమీక్షుడి భావం అయ్యుండవచ్చు
    సూర్య ప్రకాష్ జోశ్యుల

  • పాఠకులు, రచయిత నన్ను క్షమించాలి.
    హడావుడిలో నా పేరు తో పబ్లిష్ చేసాను వ్యాసం.
    ఈ సమీక్ష రాసినది జోస్యుల సూర్యప్రకాశ్ గారు
    క్షమించాలి

  • వెంకట్ గారు…
    ఎవరన్నా తిడితే మీకే పోతాయి…అని నేను ఆనందంగా అనుకుంటుంటే…కంగారు పడ్డారెందుకు…కాస్సేపు ఆగచ్చు కదా…
    సూర్య ప్రకాష్ జోశ్యుల

  • జోశ్యుల గారూ,
    మీరలా వచ్చారా?
    నేను పొగడ్తలు నాకొచ్చేస్తాయని అర్జెంటుగా (మీ మైల్ చూడగానే) మీ పేరు మార్చేశా :-)

  • నిజమే! ఈ మాత్రం సినిమాకి ఇంతమంచి టైటిల్ వేస్టు చేసేశాడు. నాకు ఈ సినిమా శీర్షిక తెగనచ్చింది. దానికోసమైనా సాహసించి ఈ సినిమా ఒకసారి చూడాల్సిందే. ఆశీర్వదించండి.

  • అబ్బ, చాలా థాంక్సండి! నేనింకా చూద్దామనుకుంటున్నా!

  • సినెమా ఎలా వున్నా climax లొ third class లొ నుంచి వచిన response అమోగం…

  • @శ్రీకాంత్
    ఏమవుతుందీ క్లైమాక్స్ లో…

  • క్లైమాక్ష్ లో క్లాస్ ఆడియన్స్ ఎందుకొచామా అని వెలుథుంటారు…క్రింద నుంచి మాత్రం విపరీతంగా whistles and claps వినిపిస్థుంటాయి…
    ఇంథకి క్లైమక్ష్ లో వాల్ల నాన్న hero ki heroine ki two years tharvaatha పెల్లి చెస్థాడు…

    అంతకు ముందే వాల్ల నాన్న “నీ పుట్టుకను మార్చుకోగలవా? అని అడుగుతాడు”…ముస్లిం అయిన hero ని

  • క్లైమాక్ష్ లో క్లాస్ ఆడియన్స్ ఎందుకొచామా అని వెలుథుంటారు………………..

  • నాకు చిరాకు పుట్టించిన రెండు సీనులు….
    1.ముఖ్య మంత్రి తో మీటింగు…

    ముఖ్య మంత్రి అని కాకుండ..ఎ యం యెల్ ఎ అనొ అంటే బాగుండేది..

    ముఖ్య మంత్రి మీటింగు… అని చెప్పి…పెల్లిల్లకెసే సెట్టింగ్ వెసారు…

    2.ఆటొ పందాలు ….

    ఓక్కడు కూడా ఎంజొయ్ చెయలెదు…

    నాకు నచిన విషయలు

    1.వాస్థవికత: చాలా వరకు realistic గ చూపించ దానికి ప్రయత్నించారు…

  • i dont know why you said that music was loud and noisy,but the music was good clear nad not at all noisy,but “Maamidi kommaki……” song lyrics were great,how could you not mention VANAMAALI lyrical contribution.you havenot mentioned some plus points.I think that song would bag some awards for the lyricist(vanamaali).

  • Hmm…. I would say the film was OK for me. But then, I felt it will be over – at several points of time. Theres something wrong with the direction angle of the film….. I am unable to explicitly say what it is, though. Perhaps, I too wil write on it soon….

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories