ఈ సీరీస్ లో మొదటి వ్యాసం “విజయ విశ్వనాథం”: శంకర శాస్త్రి ఆంధ్రా Roarkaa? ఇక్కడ చదవండి
నిన్నే టీవీలో చూశాను. విశ్వనాధ్ కి అవార్డు ఇచ్చారు. హ హ హ. నిజం చెప్పాలంటే అవార్డుకి విశ్వనాధ్ ని ఇచ్చారు.
Ayn Rand తరచుగా అంటుంటుంది. “Art and entertainment could be integrated and with great effect too.” పూర్తిగా ఈ మాటలు కాదు. కానీ దాదాపుగా ఇలాంటివే. ఆర్టు సినిమా లంటే పరమ బోరింగ్ టైపు అని అందరూ అనుకుంటారు. అలాగే కమర్షియల్ సినిమా అంటే ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. (అందరికీ కాదు. కొందరు ఆర్టోళ్ళకి).
ఆర్ట్ సినిమా అంటే సీరియస్సు గా రీళ్ల కొద్దీ సాగుతుంతుందనీ ఒదో రకంగా బ్లాంకు గా హీరో హీరోయిన్లు చూస్తూనే గడిపేస్తుంటారనీ మన వాళ్ల అపోహ. (సంతోషం సినిమాలో డయలాగు గుర్తుందా? నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను ఆ డయలాగుని). అలాగే కమర్షియల్/ఎంటర్టైనింగ్ సినిమా లో ఆర్టు ఉండదనీ అపోహ. నిజమే. ఈ రెంటినీ మిక్స్ చేయటం కష్టమే. కానీ అసాధ్యం కాదు.
చక్కని హాస్యాన్ని అద్భుతమైన పాటలనీ, ఆసక్తి గొలిపే కథనాన్నీ, అంతర్లీనంగా ఒక ఫిలాసఫీ ని కలిపి మూడు గంటలపాటూ జనాన్ని కట్టి పడేయవచ్చని కే విశ్వనాధ్ నిరూపించారు. కళాత్మకమైన సినిమాలు ఆడవనే అపోహ ని పటాపంచలు చేస్తూ ఆయన తీసిన “శంకరాభరణం” ఒక ప్రభంజనం. ఆ శంకరుని ధమరుక నాదం వలె, శ్రీకృష్ణ భగవానుడి మురళీ గానం వలె, ఆ సినిమా ముందు మెల్ల గా, ఆ తర్వాత మనో వేగంగా జనానికి చేరింది. తీసే వారికి శ్రద్ధ ఉండాలే కానీ అలాంటి సినిమాలను ఎందుకు చూడమని జనం ప్రభన్’జన’మై విశ్వనాథునికి విజయాభిషేకాలను చేశారు.
“Throughout the centuries there were men who took first steps down new roads armed with nothing but their own vision.” – Ayn Rand.
The Fountainhead అన్న తన నవల లో వ్రాసింది. ఖచ్చితంగా విశ్వనాధ్ అలాంటి వారే. తను అనుకున్న విధంగానే సినిమాలని తీసి జనానికి వాటిని అలవాటు చేశారు. జనానికి ఏమి ఇయ్యాలి అని ఆయన అనుకున్టం కాదు. జనమే ఆయన మాకు ఏమి ఇస్తారనే ఆసక్తి తో ఎదురు చూసేలా చేయటం ఆయనకే చెల్లింది. అందుకే ఆయన “The greatest of the South Indian directors in the last quarter and half century” అని అన్నా అతిశయోక్తి కాదు.
తెలుగులో కూడా గొప్పగా ఆలోచించ గలిగిన వారున్నారు అని నిరూపిస్తూ ఎన్నో కళాఖండాలని తీసి
తెలుగు వారి గౌరవాన్ని ఇనుమడింప చేసిన విశ్వనాధ్ కి అవార్డు మనం ఇవ్వలేం. ఆయనే అవార్డుని అనుగ్రహిస్తారు.
P. S.: The next post in this series is “గురు శిష్యుల స్వాతి కి’రణం’”.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
గీతాచార్య గారు,మీ ప్రవాహానికి అడ్డు రావటం నా అభిమతం కాదు.The Fountainhead తదితరాల గురించి నాకు తెలీదు,విశ్వనాధ్ సినిమాలు మాత్రం దాదాపు అన్నీ చూసా.మీ ధారావాహికలో ఆయన దర్శకత్వం వహించిన కాలాంతకులు,అల్లుడు పట్టిన భరతం కూడా ఉన్నాయా?
గీతాచార్య says:
రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారికి,
“గీతాచార్య గారు,మీ ప్రవాహానికి అడ్డు రావటం నా అభిమతం కాదు” మీరంతా మాట అననక్కరలేదు. మీరు అడగటం నాకు సంతోషాన్నే కలిగించింది. నా ఈ ధారావాహికలో మీరు చెప్పిన సినిమాలు లేవు. కవళం నాలుగు సినిమాలగురించే ఉన్నది. అవి ఎందుకు నేను తీసుకున్నానో, నా వ్యాస పరంపర లక్ష్యమేమిటో మీకుతెలియాలంటే దయ చేసి శ్రమ అనుకోకుండా ఈ క్రింది లింకును చదవ గలరు.
“విజయ విశ్వనాథం” వ్యాస పరంపర నాకు కొంచం కఠిన పరీక్షే. అందుకే తగు జాగ్రత్తలు తీసుకుంటా వీలైనంత వేగంగానే వ్రాసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు అన్నట్టు The Fountainhead గురించి తెలియని వారికోసం కొంత background నీ ఇవ్వాల్సిన బాధ్యతా నాకు ఉంది. లేనిదే నా వ్యాసాలూ కొందరికి అర్ధం కాకపోవచ్చు. మరి రెంటినీ తయారు చేసుకునేటందుకు నా బిజీ షెడ్యూల్ లో కాస్త లేటవవచ్చు. మాన్యులు అర్ధం చేసుకోగలరని…
ధన్యవాదాలతో,
గీతాచార్య.
గీతాచార్య says:
లింకు ఇవ్వటం మరిచాను. క్షమించండి.
http://annisangathulu.blogspot.com/2008/09/blog-post_06.html
Priya Iyengar says:
జనానికి ఏమి ఇయ్యాలి అని ఆయన అనుకున్టం కాదు. జనమే ఆయన మాకు ఏమి ఇస్తారనే ఆసక్తి తో ఎదురు చూసేలా చేయటం ఆయనకే చెల్లింది.
RIGHT!!!