రాక్ ఆన్ – అభిమాని అభిప్రాయం

ఇప్పటికే నతలో రాకాన్ సమీక్ష రావడం జరిగింది. ముందు అది చదివి, దీనిని చదివితే మంచిది. దానికి నా అతికింపు ఈ టపా. ఇది సమీక్ష కాదు, ఇది ఒక అభిమాని అభిప్రాయం మాత్రమే.

హెచ్చరిక: మీరు సినిమా చూడకుంటే, ఇందులో కొన్ని స్పాయిలర్లు వున్నాయి. ఇది చదివినా సినిమాని అంతే ఆస్వాదించగలుగుతారు. కానీ ఇప్పటికే మీరు సినిమా చూడాలని నిశ్చయించుకుంటే, ఈ సమీక్షను చదువవద్దు.

అభిమాని అభిప్రాయం

నాలాగ మీకు ఇండియన్‌రాక్ లో ఏ కొంచెం ఆసక్తి వున్నా, ఈ సినిమా ‘GOD’ సినిమా అనిపించి తీరుతుంది. ఈ సినిమాలో లోట్లు వున్నాయి కానీ, నేను సినిమాలో ఎంత మైమరచి పోయానంటే, అవన్నీ ఏం తట్టలేదు.

ఇప్పుడు ఆలోచిస్తే, సినిమాలోని కొన్ని లోట్లు,
౧) జో నౌక ఎక్కడానికి వెళ్తూంటే, కారు సరిగ్గా వీళ్ళ కాంసెర్ట్ ముందు ఆగడం. ముంబాయి లాంటి మహానగరాల్లో ఇలాంటిది జరగడం, కొంత కష్టమే.
౨) రాబ్ కి బ్రెయిన్ ట్యూమర్ పెట్టడం కొద్దిగా పాత సినిమా తరహాలో వుంది. కానీ కథలో కాంప్లికేషన్ కోసం ఇలాంటిది చేయాల్సివుంది.

నాకీ రెండే తడుతున్నాయి. ఇంకా చిన్న చిన్నవి వున్నా, వాటిని పెద్దగా పట్టించుకోనక్కరలేదు.
ఇక ఫర్హాన్ , రాంపాల్ పాత్రల విషయమై,
ఫర్హాన్ పాత్ర ఆదిత్యలో కంటే, అర్జున్ పాత్ర  జోలోనే ఎక్కువ డెప్త్ వుంది. ఆదర్శాలు ఎక్కువ వున్న పాత్ర జో. కాబట్టి ఎప్పటికైనా ఆ పాత్రకే మంచి గుర్తింపు వస్తుంది. ఈ సినిమా అర్జున రాంపాల్ కి మంచి గుర్తుంపునివ్వాలి. ఫర్హాన్ కూడా మరీ అతిగా చేయకండా, మిగిలిన నటులకు తగిన ప్రాముఖ్యతనిచ్చాడు.

ఇక మంచి విషయాలు చెప్పవస్తే,
౧) ఇండియన్-రాక్ ఇష్టముంటే, ఈ సినిమాలో సంగీతం చాలా చాలా బాగుంటుంది (నా అభిప్రాయం – నేనైతే సీడి కొన నిశ్చయించాను), మీరు రెహమాను సంగీతమో, ఇళయరాజ సంగీతమో ఆశించివెళితే, కాస్తంటే కాస్త నిరాశ కలుగవచ్చు.
౨) స్క్రిప్టు – ఆదిత్యకి అతని భార్యకి మధ్య సంఘర్షన చాలా బాగుంది. అలానే, బ్యాండులో చిన్నచిన్న చీలికలు వచ్చి అవి పెద్దగా మారడాన్ని చాలా నెమ్మదిగా సహజంగా చిత్రీకరించారు. (మన అత్తకోడళ్ళ మధ్య ఒక పూటలో గొడవలు జరగడం లాంటిది కాకుండ.)
౩) కెడి, రాబ్ ల సంబంధం వారి పాత్రల చిత్రీకరణ చాలా బాగున్నాయి.
౪) మన తెలుగు సినిమాల్లో, హీరో గారు ఏదో వాయిస్తూవుంటారు, అక్కడ సంగీతం ఏదో వస్తూంటుంది. అలా కాకుండా, చాలా సహజంగా వుంది, రాంపాల్ గిటారు వాయించడం, మఱియు కెడి డ్రమ్ములు వాయించడం.
౫) నాన్ లీనియర్ కథనం – ఈ తరహా కథనం చాలా కష్టం, గమ్యంలో క్రిష్ ఇలాంటిది ప్రయత్నించాడు కాని, అంత సఫలమవ్వలేదు. అదీ పదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళడమంటే, ఇంకా కష్టమవుతుంది. (జుట్టూ మీసాలు పెంచేస్తే సరిపోదు). ఈ సినిమాలో ఈ టెక్నిక్ ని చాలా బాగా ఉపయోగించుకున్నారు.
౬) కాంసెర్ట్ సన్నివేశాలన్నీ చాల సహజంగా వచ్చాయి. ఇంగ్లీషు సినిమాల్లోలాగ (వాసు సినిమాలోలో కాకుండ).

స్థూలంగా చెప్పాలంటే,
ఈ సినిమాలోని సాంకేతికాంశాలను చాలా పటిష్ఠంగా ఉంచుతూనే, చాలా మంచి అనుభూతిని కలిగించింది. దీన్ని మాస్టర్ పీస్ అని అనలేమేమోగాని, ఒక కొత్త పుంత త్రొక్కి అందులో చాలా దూరం వెళ్ళవచ్చని నిరూపించిన సినిమా ఇది. ‘దిల్ చాహతా హైఁ’ కంటే ఒక పదడుగులు ముందుకు వేసింది.

వీలైతే ఈ సినిమా చూడండి, లేకుంటే డీవీడి కొనండి. సినిమాలో చెప్పినట్లు అక్రమంగా దిగుమతి చేసుకోవద్దు. (ఇది అష్టా-చెమ్మా కు కూడా వర్తిస్తుంది.)

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

5 Comments to “రాక్ ఆన్ – అభిమాని అభిప్రాయం”

  • ఇది నవతరంగంలో 2000th కామెంట్. :-)
    ఆ విషయం పక్కనపెడితే నాకీ సినిమా బాగానే వుంది కానీ, సంగీతమే సినిమా థీమ్ కి తగ్గట్టుగా లేదనిపించింది. బహుశా నాకు ఇండియన్ రాక్ గురించి పెద్దగా తెలియకపోవడమేమో కారణం అయ్యుండొచ్చు.

  • అరే! కామెంట్లు కూడా కౌంటుతున్నారన్నమాట. రెండువేలే!!!! సాధారణంగా మన బ్లాగులొకంలో చదివేవాళ్ళెక్కువా కామెంటేవారు బహుతక్కువా. అయినా ఈ సంఖ్యదాటిందంటే భలే..భలే.

    నాకూ రాక్ సంగీతమే తెలీదు, ఇక ఇండియన్ రక్ అనేదొకటుందని అస్సలు తెలీదు. కానీ సంగీతం సినిమాలో చూస్తుంటే బాగా అనిపించింది.

  • nenu kooda ee cinema ni chusanu…..superbga undhi .Songs international range lo unnayi..all credits to shankar ehsaan loy….. especially the song “zehreley”,,,,, super kakapothe aa song another band padutundhi….. but sure the song lights up the floor. As told above arjun rampal shows nice intensity which resembles akshay khanna in dil chahtha hai

  • నాకు కూడా బాగుందనిపించింది సినిమా. మరీ ఆర్భాటాలూ, ఆట్టహాసాలూ లేకుండా బాగా తీసారు.
    ఫరాన్ అక్తర్ ఇతరుల పాత్రలకి సరయిన నిడివి ఇవ్వడం బాగుంది.

    పాటలు వింటున్న కొద్దీ ఎక్కుతాయి. మొదటి సారి విన్నప్పుడు నాకూ పెద్ద గొప్పగా అనిపించలేదు.

  • nenu cinema chusanu nijamga chala bagundi, meeru kuda chudandi.appudu meeru kuda nenu cheppindi nijam ani cheptharu

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories