Menu

రామ్ చంద్ పాకిస్తానీ

హఠాత్తుగా మనని పోలీసులు అరెస్టు చేసారనుకోండి..అందులోనూ ఈ ఇనఫర్మేషన్ ఏదీ మనవాళ్ళకి పాస్ చేయలేదు. పోనీ మనవాళ్ళు మనం కనపడటం లేదని కంప్లైంట్ ఇచ్చినా ఎవరూ సమాధానం ఇవ్వటంలేదు.మనకేమో ఆ నరక కూపంలో ఎంత కాలం ఉండాలో తెలియదు… అప్పడుమన పరిస్ధితి ఏమిటి…ఇలాంటి పాయింట్ నే డీల్ చేస్తూ…భారత్-పాకిస్ధాన్ బోర్డర్ సమస్యను బ్యాక్ డ్రాప్ లో చేసుకుని ‘రామ్ చంద్..పాకిస్ధానీ’ అనే పాకిస్దానీ సినిమా రెండు వారాల క్రితం వచ్చింది.

ఎనిమిదేళ్ళ రామ్ చంద్ చాలా అల్లరి పిల్లాడు. అమ్మ చంప(నందితాదాస్) కాఫీ గ్లాస్ నిండా ఇవ్వలేదని,తాను పెద్ద వాడు అవుతున్నా వాళ్ళ నాన్నలా ట్రీట్ చేయటం లేదని ఎప్పుడూ గోల చేస్తూంటాడు. ఆ రోజు ఎప్పటిలాగే…వాళ్ళమ్మతో తగువుపడి ఆటలకు రోడ్డుపై పడ్డాడు. ఏం స్కూల్ కెళ్ళడా అంటే…అతనుండేది పాకిస్దాన్ లో …బోర్డర్ గ్రామంలో…అంతేకాక అతనో దళిత హిందువులు.

హిందువులే అక్కడ మైనార్టీలు. అందులో దళితులు అంటే…చెప్పేదేముంది. వాళ్ళ నాన్న వ్యవసాయ కూలీ. దాంతో స్కూల్,చదువు వంటి పట్టింపులు లేని వాడు ఆడుకుంటూ బోర్డర్ దాటేసాడు.ఇండియా వచ్చేసాడు. చూసుకోకుండా ఆ పరిణామం జరిగినా అనుకోనిదే జరిగిపోయింది.

బోర్డర్ సెక్యూరిటీ వారు కావాలనే శత్రువులు పంపిన గూఢచారి అని అనీఫిషయల్ గా అరెస్టు చేసేసారు. వెనుక అతని తండ్రి వెతుక్కుంటూ వచ్చాడు. అతన్నీ అలానే అనుమానించి గుజరాత్ జైలుకి తరలించేసారు. ఈ విషయం ఏ మీడియాలోనూ రాలేదు. ఎవరికైతే తెలియాలో ఆమెకసలే తెలియలేదు. దాంతో కనపించకుండా పోయిన భర్త,కొడుకు ని వెతకాలా లేక కుటుంబం కోసం భర్త చేసిన అప్పును తీర్చటానికి కట్టుబానిసలా తరలి పోవాలా అన్నది అర్ధం కాని స్ధితి ఆమెది. అందులోనూ డబ్బు,కులం లేని వాళ్ళు ఎక్కడున్నా ఒకటే అన్నట్లు ఆమెను పట్టించుకునే వారే కరువయ్యారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఆత్మహత్య చేసుకోబోయింది. కానీ కొడుకుబ్రతుకున్నాడేమో అన్న ఆశ బ్రతికించింది.

అక్కడ రామ్ చంద్ తన తండ్రితో కలిసి జైల్లో మొదట బెరుగ్గా,తర్వాత బరువుగా గడిపినా ఆనక అలవాటై పోయాడు. ఐదేళ్ళు అలా గడిచిపోయాయి. రామ్ చంద్ కీ పదమూడేళ్ళు వచ్చాయి. దానితో పాటే సిగెరెట్లు కాల్చటం, మాటిమాటికీ అద్దంలో చూసుకోవాలనే కోరిక కలగటం,సైకిలు తొక్కటం చేస్తున్నాడు. అంతేనా అతనిప్పుడు ఆ జైల్లో చిన్న దాదా. ఎవర్నయినా తిట్టగలడు…తన్నగలడు.

తండ్రి అర్ధం కాని స్ధితిలో ఈ మార్పులన్నీ చూస్తున్నాడు. అయితే జైల్లో పెరిగే వాడికి ఇంత కన్నా గొప్ప బుద్దులు,ఆలోచనలు అబ్బుతాయని అతనికీ నమ్మకం లేదు. మరో ప్రక్క రామ్ చంద్ తల్లి కాలం గాయాలని మానుస్తుంది అన్నట్లుగా మార్పుని ఆహ్వానిస్తూ…దుఖం నుండి బయిటపడుతోంది.

ఆమెకు ఈ మధ్య తన భర్త,పిల్లాడు గత జన్మ కి సంభందించిన వారేమో నని డౌట్ కూడా వస్తోంది. ఈ ఆలోచనలకి తగ్గట్లుగానే అక్కడుండే పెద్దాయనకు ఆమె నచ్చేసింది. మొదట్లో ఆయన్ని దూరం పెట్టినా …ఎక్కువకాలం ఒంటరితనం భరించటం కష్టంగానే ఉందామెకు. అందులోనూ ఎటువైపు నుంచి చూసినా ఆశనేదే లేని టైం లో వస్తున్న ఆఫర్ ఇది. మొల్లిగా అతనికి మనసులోనే చోటిస్తూ…మారు మనువు చేసుకుందామని ఆశపడుతోంది.

ఇవేమీ కాలానికి పట్టనట్లు రామ్ చంద్ విడుదలకు పైనుంచి ఫర్మిషన్ వచ్చింది.

మా నాన్న రానిదే నేనొక్కడినే బయిటకు వెళ్ళనన్నాడు. కానీ మనం తయారు చేసుకున్న చట్టాల్ని,కాగితాల్ని మనం మార్చటం కుదరని పని అని పోలీసులు చేతులెత్తేసారు. అప్పుడు మా అమ్మని దూరం చేసారు. ఇప్పుడు మళ్ళీ మా నాన్నని దూరం చేస్తున్నారు అని విరుచుకు పడదామనిపించింది. కానీ అప్పటికే గొంతు భాధతో పూడుకు పోయింది. అర్ధం చేసుకున్న ఆఫీసర్ త్వరలోనే మీ నాన్న బయిటకు వచ్చే ఏర్పాటు చేస్తానని ప్రామిస్ చేసాడు. దిగులుతోనే భవిష్యత్ వైపు చూస్తూ తల్లిని వెతుక్కుంటూ బయిలుదేరాడా బిడ్డ. జీవితం ఖచ్చితంగా సినిమాలా ఉండదు.కానీ సినిమాని జీవితంలా ఉన్నదున్నట్లు చూపించి అలరించవచ్చు అనే ధాట్ ని ఈ సినిమా ఇచ్చిందీ సినిమా. ఇక ఈ సినిమాని నేను ప్రివ్యూ చూడటం జరిగింది. దానికి ఈ సినిమా నిర్మాత …డైరక్టర్ తండ్రి అయిన జావేద్ జబ్బార్ అటెండయ్యారు. ఆయన వాస్తవిక సంఘటనలు ఆధారంగా తయారుచేసుకున్న ఈ కథని,తన కూతురు దర్శకత్వంలోనే తియ్యటం గొప్ప అనుభూతి అన్నాడు. నేను ఆయన్ని అసలీ సినిమా ఎందుకు తీయాలనిపించింది…మీరు రాసిన ఈ కథ ద్వారా ఏం చెపుదామనుకున్నారు అని ప్రశ్నించటం జరిగింది.

దానికాయిన నేను పాకిస్దాన్ గవర్నమెంట్ సెనెట్ మెంబర్ గా దాదాపు ఆరేళ్ళు పనిచేసాను. ఆ కాలంలో మరీ దగ్గరనుండీ ఈ దారుణాలు చూడటం జరిగింది…ఏం చేయలేని నిశ్శహాయ పరిస్ధితే కథ రాయించింది. ఇక ఈ సినీ ప్రయత్నం ఇరు దేశాల మధ్య పెరగాల్సిన నిర్మాణాత్మక సృజనాత్మక భంధం ఆవిష్కరింపచేయాలనేదే నా తాపత్రయం అన్నాడు. నిజానికి పాకిస్ధాన్ సినిమాల్లో చాలా భాగం మన భాలీవుడ్ కథలకు చీప్ అనుకరణేలేనట. అయినా అక్కడ మన సినిమాలుకున్నంత క్రేజ్ వాళ్ళ సినిమాలకు లేదు.

ఇక ఈ సినిమా దర్శకురాలు మొహరన్ జబ్బర్ గత పదమూడేళ్ళుగా టీవీ సీరియల్స్ లో బిజీగా ఉంది. తండ్రి చెప్పిన కథ మొదట వెండితెరమీదకు ఎక్కించటానికి ధైర్యం,ఆసక్తి లేకపోయిందిట. కానీ మీరా నాయర్ సలాం బోంబే, ఇరానీ పిల్లల చిత్రాలు చూసాక ఆ స్పిరిట్ దానంతట అదే వచ్చిందంటుందామె. అలాగే నిబద్దతతో రియలిస్టిక్ గా ఉండాలని కథ జరిగే ప్రదేశాల్లోనే షూటింగ్ పెట్టుకుంది.సెన్సిటివ్ ఏరియా అయినా …

ఇంతకీ ఈ కథ ద్వారా ఏం చెప్పాలన్న దానికాయన రెండు దేశాల్లో రాజకీయాలు,భధ్రత పేరుతో చాలామంది చేయని తప్పులకు జైళ్ళలో మగ్గిపోతున్నారు.ఇది చాలా పెద్ద సమస్య. కానీ గుర్తింపుకు నోచుకోవటం లేదు అన్నాడాయన. ఇక అక్కడికొచ్చిన ఒకావిడ ఈ సమస్యకి పరిష్కారం లేదంటారా అంది …దానికాయిన చాలా సింపుల్ …కాశ్మీర్ ని పాకిస్దాన్ కిచ్చేయటమే అని నవ్వేసాడు. ఎంత విషాధం!

ఇక నాకు రెగ్యులర్ రివ్యూలా ఈ సినిమా గూర్చి రాయబుద్ది కాలేదు. పెద్ద దయితే క్షమించండి. అయినా ఏ సినిమానైనా ప్రేమిస్తే ఇంతేనేమో …పదాలకు తడుముకోవక్కర్లేదు.

–సూర్య ప్రకాశ్

4 Comments
  1. chandramouli October 20, 2008 /
  2. కొత్తపాళీ October 20, 2008 /
  3. Pradeep February 2, 2009 /