Menu

Raiders of the Lost Ark-ఒక సమీక్ష

పరిచయం:అతనికి James Bond లాగా గాడ్జెట్స్ లేవు, వున్నదల్లా ఒక కొరడా ఒక చిన్న తుపాకి. తల పై ఒక తోపి, మాసిన గడ్డం, అంతకన్నా మాసిన దుస్తులు. అయనకి పాములు అంటే చాలా భయం, ఎప్పుడు చూసినా ఏదో  ఒక చిక్కు లో పడుతూ వుంటాడు.నేను ఎవరు గురించి చెప్తునానో మీకు అర్తం అయ్యుంటుంది ఈ పాటికి. 1981 లో అపర బ్రహ్మ స్టీవెన్ స్పీల్బర్గ్ దర్సకత్వం లో విడుదులై సినీ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన Raiders of the Lost Ark లో Indiana Jones పాత్ర. ఈ పాత్ర మీద మొత్తం 4 సినిమాలు వచ్చాయి,Raiders of the Lost Ark, Indiana Jones and Temple of Doom(1985), Indiana Jones and the Last Crusade(1989) ,ఈ సంవత్సరం విడుదులైన Indiana Jones and Kingdom of Crystal Skulls.

ఈ నాలుగింటి లోను హరిసన్ ఫొర్డ్ Indiana Jones భూమికను పొషించాడు. అసలు గమ్మత్తేంటంటే ఈ పాత్ర కి హారిసన్ ఫొర్డ్ మొదటి ఏంపిక కాదు. ఈ సినిమా నిర్మాత స్పీల్బర్గ్ కి స్నేహితుడు అయిన జార్జి లూకస్, హారిసొన్ ఫోర్డు ని ససేమిరా అంగీకరించలేదు. ఈ పాత్ర కి Tim Matheson, Peter Coyote, Tom Selleck వంటి నటులుని try చేసారు. అఖరికి Tom Selleck ఏంపిక అయ్యాడు కుడా, కానీ అప్పటికే అతను Magnum PI అనే TV series కి commit అవడం వలన, ఇక ఈ పాత్ర కి ఫొర్డ్ ని ఎంపిక చెయ్యక తప్పలేదు. ఇది వరకటికే ఫొర్డ్ జార్జి లూకస్ యొక్క Star Wars series లో Han Solo పాత్ర తో బాగా ప్రసిద్ధి చెందారు. ఈ సినిమా విడుదలయాక మాత్రం, ఈ పాత్ర ని హారిసన్ ఫొర్డ్ తప్ప ఇంకెవరూ చెయ్యలేరు అని అందరు ముక్తకంఠం తో అభిప్రాయపడ్డారు.

ఈ సినిమా ని నేను 1984 లో నా 10 వ తరగతి పరీక్షలు అయ్యాక చూసాను. కాని ఇప్పటికి, ఈ సినిమా మళ్ళీ మళ్ళీ చూడగలను. వినోదం పేరుతో చెత్త సినిమాలు తీసే మన సినీ పండితులు, ఒక నిజమైన వినోదాత్మక సినిమా ఎలా వుండాలి అనేది, ఈ సినిమా చూసి నేర్చుకొవచ్చు.

కథ:కధ విషయానికి వస్తే Indiana Jones ,ఒక విశ్వవిద్యాలయం లో చరిత్ర బోధించే Professor. అయినా దేశ దేశాలు తిరుగుతూ, తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి, ఏన్నో సాహసకార్యాలు చేస్తూ, వివిద విలువైన హిస్టొరికల్ యాంటిక్స్ ని సేకరిస్తుంటాడు. ఒకానొక సందర్భం లో అమెరికా ప్రభుత్వం అయన్ని, Ark of the Covenant ని కనుక్కోమని పంపుతుంది. బైబిలు ప్రకారం ఆ ఆర్క్ లో 2 రాతి పలకలు వున్నాయి.వాటి మీద క్రైస్తవ మతం అతి పవిత్రం గా బావించే 10 Commandments వ్ర్రాసి వుంటాయి.

ఈ రాతి పలకలు,అసలైన 10 commandments అని నమ్మకం. ఈ ఆర్క్ ఎవరి గుప్పెట్లో వుంటుందో, వారికి ఇక దాహం, ఆకలి అనిపించదు. వారిని ప్రపంచంలో ఎ శక్తి జయించలేదు. వారు ఇక ఈ ప్రపంచానికే మకుటంలేని మహారాజులు అవుతారు. అమెరికన్ గూఢచార విభాఘానికి, ఈ ఆర్క్ కొసం Nazi లు ప్రయత్నిస్తునట్టు సమాచారం అందుతుంది. Indiana Jones కి గురువైన Professor Ravenwood, ఆ Ark Tanis అనే నగరం లొ Well of Souls లొ దాచి వున్నది అని వివరిస్తాడు. ఆ నగరం ఇసుక తుఫాను లో కప్పబడిపొయింది అని కూడ వివరిస్తాడు.ఆ అర్క్ ఒక స్థానాన్ని చూపించడానికి, హెడ్ ఆఫ్ రా, అనే ఒక రాగి డిస్క్ ని ఒక కర్ర మీద పెట్టాలి. కాని ఇప్పుడు ఆ రాగి డిస్క్, Professor Ravenwood , కూతురైన మరియొన్(Karen Allen) దగ్గర వుంటుంది. మరియొన్, Indiana Jones కి మాజీ ప్రియురాలు కూడా.మరియొన్ ఇప్పుడు నేపాల్ లొ ఒక బార్ నడుపుతున్నది. Indiana Jones, అక్కడ మరియొన్ ని కలుస్తాడు, కాని మరియొన్ అ రాగి ఢిస్క్ ని ఇవ్వడానికి నిరాకరిస్తుది. కాని ఒక Nazi Agent, ఆ Disk ని ఆమె దగ్గర నుంచి బలవంతం గా తీసుకుపొవడానికి ప్రయత్నిస్తాడు. అ ఘర్షనలో మరియొన్ బారు కాలిపోతుంది, తన ప్ర్రాణాలని మాత్రం Indy కాపడతాడు. మరియొన్, Indy ఇద్దరు అక్కడ నుంచి ఈజిప్టు వెలతారు. Nazi ల తో పాటు, Indy కి తన పాత ప్రత్యర్థి ఐన రీని బెలొక్ ని కూడా ఎదురుకోవాలి. రినీ ఫ్రేంచి వాఢైనా తన స్వలాభం కోసం Nazi ల తో చేతులు కలుపుతాడు.ఇక Indiana Jones కి ఆర్క్ ఎలా దక్కుతుంది అనేది, తెర పై చూడాల్సిందే.

విశ్లేషణ:మొదటి రీలు నుంచి చివరి రీలు దాక, ఈ సినిమా అసక్తికరంగా సాగుతుంది. ఎక్కడ ప్రేక్షకుడుకి ఊపిరి తీసుకొవడానికి అవకాశం ఇవ్వలేదు. హాలీవుడ్ బ్రహ్మ గా కీర్తించబడిన స్పీల్బర్గ్ ఈ సినిమాలో తను, ప్రపంచం లో అత్యుతమ దర్శకుల్లో ఒకరిగా ఎందుకు పరిగణించబడతారో చూపించారు. సినిమా ప్ర్రారంభంలోనే హీరో ఒక పెద్ద బండరాయి తన వైపుకి దొర్లుకుంటూ వస్తే దానిని తప్పించుకునే సన్నివేశం, మనల్నీ గగ్గోలపరుస్తుంది.ఇక సినిమా అంతా హమయ్య ఇక కొంచం ఊపిరి పీల్చుకోవచ్చులే అనుకునే లోపు, మల్లి ఇంకొ Scene.సినిమా లో చిరకాలం గుర్తుండిపోయే ఎన్నో సన్నివేశాలు వున్నాయి.

ఉదాహరణకు:

  • Indy అర్క్ యొక్క స్థానాన్ని కనుక్కోవడం.
  • భయంకరమైన విష సర్పాలతో నిండి వున్న పాముల పుట్ట లో Indy , మరియొన్ పొరాటం(ఈ సీన్ ని మన తెలుగులో  హీరో అనే సినిమాలో  విజయ బాపీనీడు గారు మక్కి కి మక్కి కాపీ కొట్టేసారు).
  • Indiana Jones, Nazi సైన్యాని ఎదుర్కోవటం.
  • చివరి Climax Scene, అది మీరు తెర పై చూడల్సిందే.

ముగింపు:

అన్ని రుచులు సమంగా వున్న మసాల సినిమా లు తీయడంలో స్పీల్బర్గ్ తనకి సాటి లేదు అని మరో సారి చూపించాడు ఈ చిత్రం లో. ఇక ఆ సినిమా కి ఇంకో బలం Indiana Jones పాత్ర లో హారిసన్ ఫొర్డ్ నటన. పెదివిపైన ఒక చిన్న చిరునవ్వు, చక్కటి హావాభావాలు, ఇక Indiana Jones అంటే ఇతనే అన్న భావం కలుగుతుంది మనకి. అయనకి జోడీ గా కరెన్ ఆల్లెన్, చక్కగా సరిపొయింది. సాధారణంగా ఇలాంటి సినిమాలో హీరొయిన్ కి పెద్ద పాత్ర వుండదు. కాని,ఒక వైపు తను సొంతం గా బారును నడిే స్వేచ్ఛ గల యువతి గా, మరో వైపు ఇండీకి ప్రియురాలి గా, చక్కగా బ్యాలెన్స్ చేయగలిగింది.ఇక తెల్లటి నెగ్లిజీ వేసుకున్న సీన్ లో ఐతే, ఏ మగాడైనా ఆమె కి దాసోహం అంటాడు.

Indiana Jones ప్రత్యర్తి రీనీ గా పాల్ ఫ్రీమేన్, Nazi agent గా రొనాల్డ్ లాసీ, Indiana Jones అరబ్బు మిత్రుడు సల్లా గా జాన్ రైస్ డేవిస్ బాగా నటించారు. ఈ సినిమా కి ఇంకో ఆకర్షణ హాలివుడ్ స్వర బ్రహ్మ జాన్ విలియమ్స్ సంగీతం. స్పీల్బర్గ్ సినిమాలైన Jaws, Close Encounters of the 3rd Kind కి మరచిపోలేని సంగీతం అందించిన విల్లియమ్స్, ఈ సినిమాలోనూ తన సత్తా చూపించారు. ప్రతి స్పీల్బర్గ్ సినిమా లా దీనిలో కూడ కేమేరా వర్క్ అద్భుతం గా వుంది.ఇక చివరి సన్నివేశంలో Special Effects మనల్ని మంత్ర ముగ్దుల్ని చేస్తాయి. ఈ సినిమా ని చూస్తే మాత్రం తెర పైన అయినా లేక Home Theater లొ అయినా చూడలి, అప్పుడే మజా.

–రత్నాకర్ సదాస్యుల

9 Comments
  1. Sowmya October 16, 2008 /
  2. shree October 16, 2008 /
  3. shree October 16, 2008 /
  4. shree October 16, 2008 /
  5. అబ్రకదబ్ర October 20, 2008 /