Menu

Monthly Archive:: October 2008

మరీ అంత ‘కొత్త బంగారులోకం’ కాదు.

ఈ మధ్య కాలం లో అంతగా సినిమాలు చూడలేదు కదాని ఇవాళ రెండు సినిమాలు చూశాను. ఒకటి సగం, రెండోది పూర్తిగానూ. సగం చూసింది ‘కష్టా చెమ్మా’. రెండోది ‘కొత్త బంగారు లోకం’. మొదటి దాని గురించి మాట్లాడి నా మూడ్ చెడగొట్టుకోలేను కానీ రెండోదే కొంచం విషయం ఉన్న సినిమా. (నిజంగానే కొంచెం విషయం. పూర్తి విషయం కాదు). సినిమా కథ గురించి చెప్పేందుకు అంత ఏమీ లేదు కానీ కథనం మాత్రం కొన్ని చోట్ల

సుబ్రమణ్యపురం (2008)

ఎదురుచూసి, ఎదురుచూసి నేను కూడా “సుబ్రమణ్యపురం” చూసేసాను. దీనిపై వెంకట్ గారు రాస్తానన్న వివరమైన వ్యాసం ఇంకా రానేలేదు కనుక, పెద్ద వివరాలేమీ చెప్పకుండా నా స్పందన మాత్రం ఇక్కడ పెట్టేస్తున్నా. సుబ్రమణ్యపురం ఏమిటీ? అంటారా? రెణ్ణెల్ల క్రితం వచ్చిన ఓ తమిళ సినిమా. దీని గురించి నవతరంగంలో ఇదివరలో వచ్చిన వ్యాసం ఇక్కడ. కథ విషయానికొస్తే, 1980 లో మధురై ప్రాంతాల్లోని సుబ్రమణ్యపురం లో నడుస్తుంది కథ. ఐదుగురు అల్లరి చిల్లరగా తిరిగే నిరుద్యోగపు స్నేహితులు,

రాజకీయ చిత్రాలు

రాజకీయం మన జీవితంలో ఒక భాగం మాత్రమే. కాని ఆ భాగమే మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తున్నది. నియంత్రిస్తున్నది. అంతటి ప్రధానమైన రాజకీయాంశాల్ని, అత్యంత ప్రభావవంతమైన సినిమా రంగం ఏ మేరకు ప్రతిబింబించిందని ప్రశ్నించుకుంటే సమాధానం నిరాశాజనకంగా వుంటుంది. సజీవ రాజకీయ సమస్యలపైన గానీ, రాజకీయ తాత్వికతలపైన గానీ దృష్టి సారించి నిర్మితమైన భారతీయ చలనచిత్రాలు అతి స్వల్పమే. వాస్తవానికి సర్వవ్యాపితమైన రాజకీయమూ, సర్వజనావళికి చేరగలిగిన సినిమా అందరికీ సంబంధించిన అంశాలు. కానీ నాటి నుంచి నేటి

నో స్మోకింగ్ – స్క్రీన్ ప్లే

హాలీవుడ్ లో అయితే ఒక సినిమా విడుదలవగానే ఆ సినిమా స్క్రిప్టు కూడా (most of the times) ఏదో ఒక వెబ్ సైట్ లో ప్రత్యక్షం అవుతుంది. అయితే మన దేశంలో ఇప్పుడిప్పుడే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్యాశన్ ఫర్ సినిమా వెబ్ సైటు ఈ మధ్యనే కొన్ని ఉత్తమ స్క్రీన్ ప్లే లను పాఠకులు డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కలుగచేసింది. ఈ సీరిస్ లో వచ్చిన మరో స్క్రీన్ ప్లే నో స్మోకింగ్.

అ .. ఇ .. మీ .. మూడు తెలుగు సినిమాలు!

అనసూయ ఇదీ మంత్రా ఇంచుమించు ఒకేసారి విడుదలయ్యాయి అనుకుంటా. మంత్రా గురించి నా అభిప్రాయం ఇక్కడ చదివే ఉంటారు. మొదటి అరగంట చూసి, వార్నీ, అనసూయ దానికంటే చాలా బెటరు అనుకున్నా. తొందర్లోనే తెలిసింది ఇదీ తలకాయ నొప్పేనని. కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఇంకా చాలా బాగా తీసి ఉండొచ్చు. భూమిక ఉన్నంతలో బానే చేసింది కానీ, ఆఖరి అరగంట ఏక్షను దృశ్యాల్లో ఆమె అస్సలు నప్పలేదు. హంతకుడి నేపథ్య కథ, తద్వారా అతను ఇప్పుడు