Menu

Monthly Archive:: October 2008

రామ్ చంద్ పాకిస్తానీ

హఠాత్తుగా మనని పోలీసులు అరెస్టు చేసారనుకోండి..అందులోనూ ఈ ఇనఫర్మేషన్ ఏదీ మనవాళ్ళకి పాస్ చేయలేదు. పోనీ మనవాళ్ళు మనం కనపడటం లేదని కంప్లైంట్ ఇచ్చినా ఎవరూ సమాధానం ఇవ్వటంలేదు.మనకేమో ఆ నరక కూపంలో ఎంత కాలం ఉండాలో తెలియదు… అప్పడుమన పరిస్ధితి ఏమిటి…ఇలాంటి పాయింట్ నే డీల్ చేస్తూ…భారత్-పాకిస్ధాన్ బోర్డర్ సమస్యను బ్యాక్ డ్రాప్ లో చేసుకుని ‘రామ్ చంద్..పాకిస్ధానీ’ అనే పాకిస్దానీ సినిమా రెండు వారాల క్రితం వచ్చింది. ఎనిమిదేళ్ళ రామ్ చంద్ చాలా అల్లరి

Monsoon Wedding

బిగ్ ఫేట్ పంజాబ్బీ  వెడ్డింగ్ నేపధ్యంలో న్యూ ఢిల్లీ లో తీసిన సినిమా.. మీరా నాయర్ దర్శకురాలు ! వెడ్డింగ్ అన్న మాట పేరులో చూసి, ఇదేదో డాన్సూ, పాటలూ, సరదా, సంబరం లాంటి ఎలిమెంట్స్ మాత్రమే నింపకుండా, మంచి కధ  లా తీసిన, చెక్కగా, సున్నితంగా సాగిపోయే సినిమా ఈ మోన్సూన్ వెడ్డింగ్ ! సాధారణంగా పెళ్ళిళ్ళను ఎంతో రొమాంటింక్ గా.. ఎంతో సంతోషంతో – అందరు పాత్రలూ, పాత్రధారులూ సంబరంగా జరుపుకునే ఈవెంట్ లాగా

అవమానపరిచే సినిమాలు

ఆర్టు సినిమాలు,హార్టు సినిమాలు, సమాంతర సినిమాలు,బూతుసినిమాలు, బాగుండే సినిమాలు, బాగలేని సినిమాలు, మంచి సినిమాలు, చెడ్డసినిమాలు అని మనం చాలా సినిమాల పేర్లువిన్నాం. చూసాం. చర్చించాం. విశ్లేషించాం. విస్తృతంగా సమాచారాల్ని పంచుకున్నాం. కానీ, గత రెండు వారాలలో నేను ఒక విభిన్నతరహా సినిమాల బారినపడి, ధియేటర్ల నుంచీ నిర్ధ్వందంగా “వాకౌట్లు” చేసాను. అవే…అవమానపరిచే సినిమాలు. ఈ తరహా కొత్తేమీ కాకపోయినా, ఈ మధ్యకాలం హాలీవుడ్డూ,బాలీవుడ్డూ,కోలీవుడ్డూ, హైదరాబాదుడ్డూ…… గాడిదగుడ్డూ ఆన్నీ నిర్లజ్జగా మనమీదకి వొదులుతున్న వందలాది చిత్రాలు ఈ

నేను cinema of the year ను చూశాను!

నిజం! నేను సినిమా ఆఫ్ ది యియర్ ను చూశాను. ఒక టీవీ చానెల్ వాళ్ళు వారం రోజులు వరుసగా ఈ ప్రకటనతో ఊదరగొట్టేసారు. ఆ సినిమా కూడా భయంకరంగా హిట్ అయి బోలెడన్ని అవార్డులు కొట్టేసి, అందరి పొగడ్తలూ, ప్రశంసలూ పొందటంతో నేను కూడా ఆ అద్భుతమయిన సినీరాజాన్ని చూడాలని కడలిదాటిన మహోత్సాహంతో అన్ని పనులూ మానుకుని టీవీ ముందు కూచున్నాను. సినిమా మధ్య వచ్చే ప్రకటనల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఒక పుస్తకం ప్రూఫులు

52 వ లండన్ చలనచిత్రోత్సవం-లైనప్

52 వ లండన్ చలనచిత్రోత్సవం నిన్నటి (అక్టోబరు, 15) నుంచీ మొదలయింది. Frost/Nixon అనే సినిమాతో ఈ చలనచిత్రోత్సవం ప్రారంభమైంది. అమెరికాలో రిచర్డ్ నిక్సన్ ప్రెసిడెంట్ గా వుండగా జరిగిన వాటర్ గేట్ స్కాండల్ నేపథ్యంలో బ్రిటిష్ టెలివిజన్ వ్యాఖ్యాత డేవిడ్ ఫ్రాస్ట్ మరియు రిచర్డ్ నిక్సన్ల మధ్య నడిచిన టి.వి టాక్ షో ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. బ్యూటిఫుల్ మైండ్, డావిన్చి కోడ్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన Ron Howard ఈ సినిమాకి