Menu

Monthly Archive:: October 2008

విలువల వలువలున్న సినిమా.

ఒకమ్మాయి ఉంటుంది. చాలా అందంగా. అంతే అందగాడుంటాడు. ఆ ఊళ్ళోనే. వంకీల జుట్టూ, చక్కని రూపం… అలా. అది ఒక అందమైన పల్లెటూరు. ఆ అమ్మాయి అతనిని ఒక పార్టీలో చూసి ప్రేమిస్తుంది. అతనూ ఆ పిల్లకు దాసోహమంటాడు. కొంతకాలానికి వీరి ప్రేమ ముదిరి పాకాన పడుతుంది. అన్నీ కుదిరి ఆ అమ్మాయిని ఆ అబ్బాయి చేసుకోవటం ఖాయం అనుకున్నా సమయాన విలన్లాగా ఆ అబ్బాయి అడ్డుపడుతాడు. అతని ఆస్తిపాస్తులన్నీ పోయి అప్పులే మిగులుతాయి. రెండు రోజుల్లో

Burn After Reading – Forget after watching

Coen brothers ఈ సారి meaningless comedyతో ముందుకొచ్చారు. గత సంవత్సరం ఆస్కార్ పంట పండించిన నో కంట్రీ ఫర్ ఓల్డ్ మన్ నే మసిపూసి మారెడుకాయచేసినట్టు ఉన్న ఈ Burn after reading సినిమా కాలక్షేపానికి ఒకసారి చూడొచ్చు. సినిమా అంతా చాలా ఆహ్లాదంగా నడిచినప్పటికీ ఎందుకో అనుకున్నంత స్ధాయిలొ లేదనిపిస్తుంది. ఒకవేళ హాలివుడ్ దీగ్గజాలందర్నీ పెట్టుకొని ఇలా spy comedy పేరుతో ప్లాట్‌ని పూర్తిగా మర్చిపోవడమే అందుకు కారణం కావచ్చు. కధలోకి వస్తే CIA

బెల్లా

సినిమాలు రకరకాలు. నచ్చేవి, నచ్చనివి, మళ్లీ మళ్లీ చూడాలనిపించేవి, ఒక్క సారికే విసుగెత్తించేవి, వెంటనే మర్చిపోయేవి, ఎన్నాళ్లైనా వెంటాడేవి. ‘బెల్లా’ (Bella, 2007 విడుదల) చివరి కోవకి చెందింది. ఇటువంటి సినిమాలు తీయటం కత్తిమీద సాము. మసాలాలు ఏవీ లేని ఈ కధని జనరంజకంగా మలచి విజయవంతం చేయటం దర్శక నిర్మాతల ప్రతిభ, ధైర్యం. చిన్న సంఘటనలు కొన్ని జీవితాలని ఎలా మలుపు తిప్పుతాయో ఈ చిత్రం చెబుతుంది. చిత్ర కధనం అంతా మూడు విలువల చుట్టూ

లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు -2

మొదటి భాగం ఇక్కడ చదవండి. గమనిక:నేను చూసిన వరుసక్రమంలో ఈ సినిమాల గురించి రాయటం లేదు.అసలు ఏది ముందు ఏది తర్వాత చూసానో గుర్తుంటే కదా! అన్ని సినిమాలూ చూసేసాక ఒక సినిమా కథను మరో సినిమా కథలో పెట్టేసి కలగాపులగం చేస్తానేమోనని వీలున్నప్పుడు గుర్తుకొచ్చిన సినిమా గురించి రాస్తున్నాను. 6)రాం చంద్ పాకిస్తానీ ఇది నేను చూసిన రెండో పాకిస్తానీ సినిమా. చాలా బావుంది. వేషంలో నందితా దాస్ పాత్ర కమలి సినిమాలానే వుంది. కథ

లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు -1

నవతరంగం పాఠకులకు నమస్కారం. ఈ నెల పదిహేనవ తేదీ నుంచి లండన్ లో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం గురించి మీకు తెలిసే వుంటుంది. ఈ చిత్రోత్సవంలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన 300 సినిమాలను ప్రదర్శిస్తున్నారు.పది పదిహేను రోజుల్లో అన్నీ సినిమాలు చూడడం కుదరకపోయినా కనీసం ఒక యాభై సినిమాలైనా చూడాలనే లక్ష్యం పెట్టుకుని నేనూ ఈ పండగ లో భాగం అయ్యాను.ఈ రోజు ఈ చిత్రోత్సవంలో ఆరవ రోజు. ఇప్పటి వరకూ ఈ చిత్రోత్సవం