Menu

Monthly Archive:: October 2008

సాలూరు రాజేశ్వర రావు- ర’సాలూరు’ రాజే’స్వర’ రావు

“మెలొడీ” అనే మాట వినగానే సినీ సంగీతాభిమానులందరూ ఏకాభిప్రాయంతో తల్చుకునేది సాలూరు రాజేశ్వర రావు గారిని అంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. శాస్త్రీయ సంగీతంలో దిట్ట అయిన ఆయన శాస్త్రీయ, లలిత సంగీతాల సమ్మేళనంగా ఆణిముత్యాల్లాంటి మధుర సినీ గీతాలను అసంఖ్యాకంగా మనకి అందించారు. అనేక ప్రయోగాలను చేశారు. కొన్ని గీతాలను ఇంగ్లీష్ గీతాలనుంచి ప్రేరణ పొంది కొద్ది చాయలతో మాత్రమే వాటిని అచ్చ తెలుగు పాటలుగా మలిచారు. పాశ్చాత్య సంగీత ధోరణులను తొలిసారిగా తెలుగు సినీ

ఎనిమీ ఎట్ ది గేట్స్

‘రెండవ ప్రపంచ యుద్ధాన్ని మలుపు తిప్పిన రోజు ఏది’ అన్న ప్రశ్నకి కొందరు చరిత్రకారులు ‘జూన్ 6, 1944’ (నార్మండీ వద్ద జరిగిన డి-డే పోరాటం) అంటే మరి కొందరు ‘డిసెంబర్ 7, 1941’ (పెర్ల్ హార్బర్ మీద జపాన్ వైమానిక దాడి) అంటారు. ఎక్కువమంది మాత్రం ముక్త కంఠంతో ‘జూన్ 22, 1941’ అని చెబుతారు. హిట్లర్ ఆదేశాలతో జెర్మన్ దళాలు సోవియెట్ యూనియన్ మీద మెరుపు దాడి చేసిన రోజది; ఇష్ఠమున్నా లేకున్నా స్టాలిన్

Atticus Finch

Atticus ఒక పరమ బోరు తండ్రి. అతడు పుట్టుముసలి అని అతని పిల్లల అభిప్రాయం. పిల్లలతో Football ఆడడు, ఇతర తండ్రులలా వేటకి తీసుకువెళ్ళడు. తుపాకి పేలచడం కూడా వచ్చో రాదో! ఎన్ని సార్లు అడిగినా కొడుకు Jemకి తుపాకి కొనిపెట్టలేదు మరి! పిల్లలు ఎంత అల్లరి చేసినా కొట్టడు. కూతురు మగరాయడిలా overalls వేసుకు తిరుగుతుంది. అందరితోటి కొట్ట్లటలే ఆ అమ్మాయి కి, ఇంటి ఎ.దురుగా ఉండే ముసలావిడ దగ్గిరనించి పాఠశాలలొ పిల్లలు, ఉపాధ్యాయుల వరుకు.

సినిమాల్లొ మంచంటే ఏమిటి?

చలనచిత్ర సమీక్ష అన్నది సరిగ్గా ఎప్పుడు మొదలయ్యిందో చరిత్రకారులు చెప్పాల్సిన మాట.కానీ చిత్ర సమీక్షలు ఎన్నో రకాలు అన్నది అసలుసిసలు మాట కాగా,భారతదేశం లో చలనచిత్రాలు ప్రారంభమైన చోటే చిత్రసమీక్ష కూడా నిలిచిపోయిందనీ,పెద్దగా ఎదిగింది లేదని పలువురి అభిప్రాయం.అయితే సమీక్షలు సాధారణంగా తెలియజేసేవి అసలు మంచి సినిమాలు అంటే ఏమిటీ?చెడ్డసినిమాలు అనగా నేమి?అన్నది.కానీ సినిమాల్లొ మంచంటే ఏమిటి?చెడు ఎవరికి లేదా ఎవరికి చెడ్డ అని ప్రశ్నించే సమీక్షకురాలు,రచయిత్రి,నిర్మాత,దర్శకురాలు జుడిత్ విలియమ్సన్.బ్రిటన్ కు చెందిన జుడిత్ తనను తాను

క్రాక్..(కేక రివ్యూ)

తారాగణం: రాజా,ఇషానీ,అనూప్ కుమార్,రాళ్ళ పల్లి,ధర్మవరపు,దువ్వాసి మోహన్ మరియు కొత్త నటీనటులు ఛాయా గ్రహణం పి.సి.శ్రీరామ్ కథ,మాటలు,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: తేజ ఎడిటింగ్: శంకర్ పాటలు: సిరివెన్నెల,వేటూరి,చంద్రబోస్ సంగీతం:  చక్రి రిలీజ్ డేట్ 23 అక్టోబర్ 2008 ఈ సినిమా ప్రారంభం నుంచీ హీరోని హీరోయిన్ ముద్దుగా సన్నోసోడా అని పిలుస్తూంటుంది… సినిమా చివరకు వచ్చేసరకి హీరో కూడా పరిణితి చెంది హీరోయిన్ ని ప్రేమగా సన్నాసిదానా అని పిలుస్తాడు. ఇదంతా చూసిన ప్రేక్షకుడు కూడా ఏం చేయాలో అర్ధం