నో స్మోకింగ్ – స్క్రీన్ ప్లే

no_smoking

హాలీవుడ్ లో అయితే ఒక సినిమా విడుదలవగానే ఆ సినిమా స్క్రిప్టు కూడా (most of the times) ఏదో ఒక వెబ్ సైట్ లో ప్రత్యక్షం అవుతుంది. అయితే మన దేశంలో ఇప్పుడిప్పుడే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్యాశన్ ఫర్ సినిమా వెబ్ సైటు ఈ మధ్యనే కొన్ని ఉత్తమ స్క్రీన్ ప్లే లను పాఠకులు డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కలుగచేసింది.

ఈ సీరిస్ లో వచ్చిన మరో స్క్రీన్ ప్లే నో స్మోకింగ్.

స్టీఫెన్ కింగ్ కథ ’క్విట్టర్స్ ఇంక్ (Quitters Inc.)’ అధారంగా ఈ స్క్రీన్ ప్లే రూపొందింబడింది. సర్రియల్ మరియు ఆబ్స్ట్రాక్ట్ గా నడిచే ఈ కథ మరియు స్క్రీన్ ప్లే చదవడం ద్వారా స్క్రీన్ ప్లే రచనలోని మెలుకవలు నేర్చుకునే అవకాశం ఉంది.

‘అనురాగ్ కశ్యప్’ రచించిన నో స్మోకింగ్ స్క్రీన్ ప్లే ఇక్కడ చదవండి.

వీలయితే త్వరలో నవతరంగలో కూడా అలాంటి సౌకర్యం కలుగచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నం లో మీరేమైనా సహాయం చేయగలిగితే navatarangam at gmail dot com కి మైల్ చేయండి.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

5 Comments to “నో స్మోకింగ్ – స్క్రీన్ ప్లే”

  • వెంకట్: చిన్న సవరింపు. ఈ స్క్రీన్ ప్లే “క్విటర్స్ ఇంక్” ప్రేరణతో (ప్రేరణ: దురదృష్ట వశాత్తు, మన తెలుగు రచయతల చేత అతి ఎక్కువగా దురుపయోగించబడ్డ పదం) వ్రాయబడినప్పటికీ దానికీ దీనికీ కథ సన్నివేశ పరంగా చాలా తేడా వుంది. అనురాగ్ వివరణకు ఈ లింకు చూడండి: http://passionforcinema.com/no-smoking-the-first-trailer/

  • తెలుగులో రాసుకున్న స్క్రిప్టు దొరికే అవకాశం ఉందా వెబ్బులో? అసలు మనాళ్ళు తెలుగులోనే రాసుకుంటారా?

  • చదువరి గారూ,
    అందరూ కాకపోయినా కొంతమందైనా రాసుకుంటారండీ.
    త్వరలో మన తెలుగు స్క్రీన్ ప్లే ఒకటి నవతరంగంలో పొందు పరుస్తాం.

  • google indic may help you do so. here is the link: http://www.google.co.in/transliterate/indic/Telugu
    bit you type in there copy and save somewhere else. Or try google blogspot to type in telugu and save as draft. I am using that for a script I am writing. It is slightly buggy though (the google blogspot telugu suport)

  • స్క్రిప్ట్ అనొచ్చో లేదో గాని కమలహసన్,అర్జున్ ల ద్రోహి సినిమా ను తెలుగు ఇండియాటుడే గతం లో ప్రచురించింది.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories