అక్టోబర్లో నవతరంగం…

navatarangam-andhrajyothi

నవతరంగం పాఠకులకు నమస్కారం.

ఎప్పటిలాగే ఈ నెలకూడా నవతరంగం మీకు మరిన్ని మంచి సినిమాలనూ, దర్శకులనూ పరిచయం చేయనుంది. గత నెలలో మొదలుపెట్టిన బాపు గారి “మా సినిమాలు” వ్యాస మాలికలోని మిగిలిన వ్యాసాలన్నీ త్వరలో ప్రచురిస్తాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వ్యాసాలు ప్రచురించడం ఆలస్యమవుతున్నందుకు మన్నించాలి.

ఫోకస్

గత నెలలో మొదలు పెట్టిన తపన్ సిన్హా ఫోకస్ శీర్షిక ఈ నెల కూడా కొనసాగుతుంది. తపన్ సిన్హా అన్ని సినిమాలు కాకపోయినా ఆయన సినిమాల్లో అత్యుత్తమమైన రెండు సినిమాలు (ఏక్ డాక్టర్ కి మౌత్, వీల్ చైర్) జమన్ లో లభ్యమవుతున్నాయి. జమన్ లో సభ్యులుగా చేరితే ఈ రెండు సినిమాలూ  ఉచితంగా చూసే అవకాశం ఉంది కాబట్టి పాఠకులూ, సభ్యులూ ఈ సినిమాలు చూసి వాటి గురించి విశ్లేషణాత్మకమైన వ్యాసాలు పంపవలసిందిగా మనవి.

ఈ నెల ఫోకస్ శీర్షిక లో మేము పరిచయం చేయబోయే దర్శకుడు డేవిడ్ లీన్. ఈ సంవత్సరం ఆయన శతజయంతి సంవత్సరం కూడా కాబట్టి ఆయన సినిమాల గురించి వీలైనన్ని వ్యాసాలు ప్రచురించాలని అనుకుంటూన్నాము. డేవిడ్ లీన్ సినిమాల గురించి మీ వ్యాసాలు ఈ నెలాఖరులోగా పంపించాలని మనవి.

డిశెంబరు నెలల ఫోకస్ శీర్షికలో ఏ దర్శకుణ్ణి పరిచయం చేయాలో పాఠకులకే వదిలేశాం. ఇప్పటివరకూ Godard కి ఒక ఓటు హిచ్‍కాక్ కి ఒక ఓటు వచ్చాయి. నవంబర 15 లోగా ఏ దర్శకుడికి ఎక్కువ ఓట్లు వస్తాయో వారి గురించి డిశెంబరు ఫోకస్ శీర్షిక నడుస్తుంది.

ఈ నెల సినిమా

ఇక ఈ నెల సినిమా శీర్షికలో ’కాలిఫోర్నియా డ్రీమింగ్’ అనే రొమానియన్ సినిమాను పరిచయం చేయదలచుకున్నాము. మీరు చూసిన మంచి సినిమాల గురించి కూడా మాకు తెలియచేస్తే వాటిని రాబోయే నెలల్లో ఈ శీర్షికలోచేర్చడానికి ప్రయత్నం చేస్తాము.

లండన్ చలనచిత్రోత్సవం

ఈ నెల పదిహేనవ తేదీ నుంచి లండన్ చలనచిత్రోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. నేనీ చిత్రోత్సవంలో పాల్గొనబోతున్నాను.  ఇప్పటికే ప్రెస్ స్క్రీనింగ్స్ మొదలయ్యాయి. కొన్ని మంచి సినిమాలు చూశాను. ఈ చిత్రోత్సవంలో నేను చూసిన సినిమా సమీక్షలు, సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు మొదలుగునవి అక్టోబరు20 నుంచి ప్రచురిస్తాను.

ఇవి కాకుండా నవతరంగంలో ఎప్పటిలానే ప్రపంచ సినీ ఉద్యమాల గురించి వ్యాసాలు, సత్యజిత్ రే మేకింగ్ మూవీస్ అనువాదాలు, కొత్త పాత సినిమా సమీక్షలు/విశ్లేషణలు ప్రచురింపబడతాయి.

చివరిగా…

గత ఆదివారం(సెప్టెంబరు 28) న అంధ్రజ్యోతి లో ’బ్లాగ్ లోకం’ లో నవతరంగం గురించి ఒక ఆర్టికల్ ప్రచురించారు. ఈ ఆనందసమయంలో ఆ వ్యాసం మీ అందరితో పంచుకోవాలని ఆ పేపర్ కటింగ్ ఈ క్రింద ప్రచురిస్తున్నాము.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

6 Comments to “అక్టోబర్లో నవతరంగం…”

  • @వెంకట్: నిబద్దత, వైవిధ్యం ఎక్కడున్నా (కొంత ఆలస్యమైనా) గుర్తింపబడుతుంది. నవతరంగంలో ఆ రెండూ ఉన్నాయిగనకనే వెబ్ ప్రపంచంలో తనదంటూ ఒక ప్రత్యేకస్థానం సంపాదించుకుంది. ఆలోచనవచ్చి ఆచరించిన నువ్వు. నీ ఆచరణని అందిపుచ్చుకున్న నవతరంగం సభ్యులు. నవతరంగాన్ని ఆదరించే పాఠకులూ అందరి ఆశయం “మంచి సినిమా”. ఆ ఆశయపూర్తి అయ్యేంతవరకూ ఈ తరంగం ‘నవ’తరంగమే!

    TV వచ్చినప్పుడు సినిమాలని అయిపోయిందన్నారు. కానీ ఇప్పుడు TV,సినిమా స్వయంపూరకాలుగా వెలుగొందుతున్నాయి. బ్లాగులు మొదలైనప్పుడు, “వీటికేం విలువ…printed word ఉండగా!” అనుకున్నవాళ్ళూ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రముఖ పత్రికలు బ్లాగుల సమాచారం ఇవ్వడం చూస్తుంటే…this is an indication of future అనిపిస్తోంది. ఈ మధ్యనే ఒక ఆగ్లబ్లాగర్ పుస్తకాన్ని, ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ ప్రచురించారుకూడా!

  • ఆంధ్ర జ్యోతి వారు తమంతట తామే మన గురించి వ్రాయడం సంతోషదాయకం.

  • వెంకట్: ఆ… ఏముంది… సినిమాలమీద మరోబ్లాగు… అని కాకుండా – చిన్న చిన్న మాటల్లో, సినిమాల్లోని విషయాలు – సామాన్యులకు అర్ధంకాక, అందుబాటులోలేక అస్పష్టంగా ఉండిపోయిన విషయాలు – అందంగా, అచ్చతెలుగులో, విడమరిచి, వినిపించే ఈ నవతరంగపు ఇక్షురసాన్నీ – ఇందులో ఈది సేదతీరే అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్నీ – ఇష్టపడని ఆంధ్రుడుండడు – ఇది నిజం! మీ జట్టుకి అభినందనలు, మీ బ్లాగు కి ఆశీస్సులు.

  • @WB
    నవతరంగం చూసినందుకు ధన్యవాదాలు. మీ అభినందనలు, ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్తాం.

  • అభినందనలు. మన నవతరంగానికి ఇదే విధంగా మరింత గొప్ప పేరు రావాలని ఆశిస్తూ…

    నవతరంగం లో నేనూ వ్రాస్తున్నందుకు నాకు గర్వంగా ఆనందం గా ఉంది.

  • శభాష్! నవతరంగానికి అభినందనలు.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories