లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు – 4

మూడో భాగం ఇక్కడ చదవండి.

16) W

అమెరికన్ ప్రెసిడెంట్ George W. Bush జీవితం ఆధారంగా ఓలివర్ స్టోన్ రూపొందించిన సినిమా. ఇందులో చూపించిన విషయాలు ఎంత వరకూ నిజమో తెలియదు కానీ నిజమయితే మాత్రం ఈ సినిమా టైటిల్లోని క్యాప్షన్లో ఉన్నట్టు “Anyone Can Grow Up to Be President” అని ప్రేక్షకులకూ అనిపిస్తుంది. నాకు మరీ అంత నచ్చలేదు సినిమా. ప్రపంచ రాజకీయాలు ఇష్టమున్న వాళ్ళు చూడొచ్చు.

ఈ సినిమా గురించి మరిన్ని విశేషాల కొరకు రమణగారి సమీక్ష చదవండి.

17) Genova

జో మరియు అతని ఇద్దరి కూతుర్ల కథ ఇది. సినిమా మొదట్లో జో భార్య ఒక కారు యాక్సిడెంట్ లో మరణిస్తుంది. అప్పట్నుంచి ఆ ఊర్లో ఉండలేక ఇటలీలోని జెనోవా అనే పట్టణానికి తరలివెళ్తారు ముగ్గురూ. జో పెద్ద కూతురు కెల్లీ టీనేజ్ లో వుంటుంది. సాధారణంగా టీనేజర్స్ లో వుండే లెక్కలేనితనం ఆమెలోనూ వుంటుంది.జో చిన్న కూతురు మేరీ. పదేళ్ళ లోపే. తల్లి మరణానికి తనే కారణమని నమ్ముతుంది. వీళ్ళు ముగ్గురూ ఆ కొత్త ప్రదేశంలో ఎలా కొత్త జీవితం ఆరంభించారనేది కథ.

ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు మగ్గురు కాకుండా మరో ఇద్దరు ముగ్గురు పాత్రధారులు ఉన్నప్పటికీ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించేది మాత్రం జెనోవా పట్టణమే.Place as a character గురించి చదవి తెలుసుకోవడం జరిగినా ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ ని రియలైజ్ చేసుకోగలిగాను. మరో విషయం ఏంటంటే కథ కంటే కథనం సినిమాకి ముఖ్యం అని తెలయచేస్తుందీ సినిమా. చూడదగ్గ సినిమా.

18) Two Lovers

Joaquin Phoenix,Gwyneth Paltrow లాంటి బడా హాలీవుడ్ స్టార్సున్న చిన్న సినిమా.  ఎంగేజ్ మెంట్ వరకూ వచ్చి ఆగిపోయిన పెళ్ళి కారణంగా డెప్రెషన్ లో ఉంటాడు Leonard. అత్మహత్యా ప్రయత్నం కూడా చేస్తాడు. అలాంటి సమయంలో అతనికి తన అపార్ట్మెంట్లో ఉండే Michelle తో పరిచయం అవుతుంది. ఆమె ని ప్రేమిస్తాడు. ఇదే సమయానికి తన తండ్రి బిజినెస్ పార్టనర్ కూతురు  Sandra తో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరంటే ఇష్టం అతనికి, కాకపోతే Michelle అంటే ఎక్కువ ఇష్టం. అవతల Michelle ఇది వరకే పెళ్ళయిన ఒకతనితో ప్రేమలో ఉంటుంది. వీళ్ళందరి మధ్య జరిగే డ్రామా ఈ సినిమా మూల కథ. రొటీన్ కథను చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. సినిమా నాకు నచ్చింది. మీకూ నచ్చుతుందనే నమ్మకం వుంది. వీలయితే చూడండి.

19) The Good The Bad and The Weird

కొరియన్ యాక్షన్ సినిమా. పేరు చూస్తేనే అర్థమయ్యుండాలి. ఇది వెస్టర్న్ సినిమా. The Good, The Bad and The Ugly లాంటి సినిమాలు తీసిన Sergio Leone కి ట్రిబ్యూట్ ఈ సినిమా. రెండు సినిమాలూ కథ పరంగా కొంచెం పోలికలు కలిగిఉన్నా ఈ సినిమాని ఆ సినిమాతో పోల్చలేము. సినిమా అంతా హడావుడి-గందరగోళం. యాక్షన్ సినిమా అభిమానులకు నచ్చొచ్చేమో! ఇప్పటికే కొరియా లో పెద్ద హిట్టట!

20) The lake

ఈ సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చూసాను. నాకేమి అర్థం కాలేదు :-)

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories