Menu

గమ్యం సినిమా – నా అభిప్రాయం

ఎంతోవిన్నాను ఈ సినిమా గురించి. ఈ మధ్య నే చూసా. చాల నిరాశ పరిచింది. ఈ సినిమా కి ప్రేరణ Walter Salles గారి Diarios de motocicleta (మోటార్ సైకిల్ డైరీసు). ఆ సినిమా ఒక విజువల్ ఫీస్ట్. అందులో నాయకుడు అతని మిత్రుడు మోటార్ సైకిల్ మీద సౌత్ అమెరికా పర్యాటనం చేస్తారు. ఇది Che Guevara గురించిన సినిమా. Che Guevara ని ప్రపంచం ఎలా మార్చింది , ప్రపంచాన్ని అతను మార్చే ముందు అన్నది ప్రధాన అంశం. ఈ సందర్భం లో Che గురించి రెండు ముక్కలు.

అతను argentina నించి. మార్క్స్ సిద్ధాంతలని అనుసరించే లీడర్. క్యూబన్ తిరుగుబాటు లో కీలక పాత్ర ధారి. మీరు ఇతని చిత్రం (photo) చూసే ఉంటారు. జల్సా సినిమా చూసి ఉంటే అందులో యూనివర్సిటీ పాటల లో ఒక పెద్ద కట్ ఔట్ ఇతని బొమ్మే. (ఇది Che గురించి తెలియని వారకి రెండు ముక్కలు. నా ఉద్దేశ్యం మీకు Che తెలియదు అని మాత్రం కాదు సుమా). ఇంతకీ, Motor Cycle Diaries కూడా నాకు cinematography బాగుండటం వలన నచ్చింది. కధ, కధనం- మనం తెలుగు లో ఇలాంటివి చాల చూసేసాం.

ఇక మన గమ్యం కి చేరితే ….

ఒకప్పుడు ప్రతీ తెలుగు సినిమా ని దుయ్య బట్టే వాడిని. నేను సినిమా చూస్తే entertainment value కి చూడటం నేర్చుకున్నాను. కాని ఆ విధం గా చూసుకున్న ఈ సినిమా లో entertainment value కొద్దిగా తక్కువే. బాగో లేదని చెప్పటానికి ఏమీ లేదు. బాగుంది అని చెప్ప దానికి లేదు.

మోటార్ సైకిల్ , ఇద్దరు మెయిన్ లీడ్స్ , హీరో లో వచ్చే మార్పూ, సాంఘిక మరియు ఆర్ధిక వ్యత్యాసాలు – ఈ అంశాలు మోటార్ సైకిల్ డైరీస్ కి గమ్యానికి ఉన్నా పోలిక. మన సినిమా లో motorcycle ఖరీదు ఇరవై లక్షలు. అందులో ఒక డొక్కు పాత బైకు.

హీరోయిన్ హీరో కారులో హీరో అనుమతి లేకుండా , హీరోతో పరిచయం లేనప్పుడు ఎవరో తెలియనావిడకు  డెలివరీ చేయటం అనేది Che Marxist సిద్ధాంతం అని సర్ది పెట్టుకోవాలి మరి. అలాగే ఒక naxalite సీన్. చాల superficial గా. అంత కన్నా లోతు వెళితే అది ఆర్ట్ అని తిప్పి కొడతాం. హీరో medicine లో ఏ విధమైన ప్రవేశం లేకుండా బేబీ ని డేలివేర్ చెయ్యటం లాంటివి dramatization అంటే under statement అవుతుందేమో! ఇలాటివి overlook చెయ్యటం తెలుగు ప్రేక్షకుడు గా అలవాటు చేసుకున్న విషయం.

నరేష్ , శర్వానంద్ ఇద్దరూ పర్వాలేదు. నరేష్ కి ఎటువంటి రోల్ ఇచ్చిన ఇంతే నాటు గా మాత్రమే చెయ్యగలడనినా నమ్మకం . కమలిని కూడా ok. cinematography average. dialogues కూడా మరీ అంత పంచ్ ఉన్నవి కాదు. కామెడి కి నరేశ్ నే నమ్ముకున్నాడు రాధ కృష్ణ బ్రాకెట్ లో క్రిష్. నరేష్ ఒక మాదిరి కామెడి అందించినా ఇంకా కొద్దిగా ఎక్కువ మోతాదు ఉంటే బాగుండేది. after all ఇది ఆర్ట్ మూవీ కాదు కనుక. మొత్తానికి ఈ సినిమా కి వచ్చిన హైప్ కి తగ్గట్టు గా లేదు. విదేశి సినిమా లని telugize చెయ్యటం లో మన వాళ్లు సిద్ధ హస్తులు. ఈ సినిమా డైరెక్టర్ రాధ కృష్ణ బ్రాకెట్ లో క్రిష్ ఆవలీల గా Motorcycle Diaries ని తెనుగీకరించాడు. మొదటి సినిమా కి రాధ కృష్ణ బ్రాకెట్ లో క్రిష్ చాల చక్క గా చేసాడు.

-సుబ్బు

P.S: రాధ కృష్ణ బ్రాకెట్ లో క్రిష్ ఎందుకో నాకు కొరుకుడు పడని విషయం. ఐతే రాధ కృష్ణ గా చలామణి కావాలి లేదా క్రిష్ గా.

29 Comments
 1. veeraswamy October 15, 2008 /
 2. Subbu October 15, 2008 /
 3. Subbu October 15, 2008 /
 4. Praveen Nimma October 15, 2008 /
 5. Swathi October 15, 2008 /
 6. Swathi October 15, 2008 /
 7. Subbu October 15, 2008 /
 8. రవి October 16, 2008 /
 9. veeraswamy October 16, 2008 /
 10. teja October 16, 2008 /
 11. teja October 16, 2008 /
 12. Kiran October 16, 2008 /
 13. గోపీ చంద్ October 16, 2008 /
 14. Nishanth October 16, 2008 /
 15. Sandhya Reddy October 19, 2008 /
 16. swamy October 20, 2008 /
 17. swamy October 20, 2008 /
 18. swamy October 20, 2008 /
 19. swamy October 20, 2008 /
 20. Swapna October 30, 2008 /
 21. శంకర్ November 6, 2008 /
 22. Sudhakar December 15, 2008 /
 23. శాంతి December 22, 2008 /
 24. vinay April 15, 2009 /
 25. viswanath Goud April 15, 2009 /
 26. Jagadeesh April 20, 2009 /