Menu

విలువల వలువలున్న సినిమా.

ఒకమ్మాయి ఉంటుంది. చాలా అందంగా. అంతే అందగాడుంటాడు. ఆ ఊళ్ళోనే. వంకీల జుట్టూ, చక్కని రూపం… అలా. అది ఒక అందమైన పల్లెటూరు.

ఆ అమ్మాయి అతనిని ఒక పార్టీలో చూసి ప్రేమిస్తుంది. అతనూ ఆ పిల్లకు దాసోహమంటాడు. కొంతకాలానికి వీరి ప్రేమ ముదిరి పాకాన పడుతుంది. అన్నీ కుదిరి ఆ అమ్మాయిని ఆ అబ్బాయి చేసుకోవటం ఖాయం అనుకున్నా సమయాన విలన్లాగా ఆ అబ్బాయి అడ్డుపడుతాడు.

అతని ఆస్తిపాస్తులన్నీ పోయి అప్పులే మిగులుతాయి. రెండు రోజుల్లో వస్తానని చెప్పి రెండు నెలలైనా రాక పోయేసరికి ఆ అమ్మాయి అతని గురించి ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడు తెలుస్తుంది నిజం.

అప్పుడా అమ్మాయి అతని వద్దకెళ్ళి నీ అప్పులని నేనే తీరుస్తాను. మనం పెళ్లి చేసుకుందామని అంటుంది. ఆ అమ్మాయి చెప్పిన దానితో కన్విన్స్ అయ్యి అతను ఒప్పుకుంటాడు. అలా వారి ఎడబాటు తీరి మళ్ళీ కలుస్తారు.

కానీ అసలు కథ అప్పుడే మొదలవుతుంది. వాళ్లు  ఆనందంగా గడుపుతుంటారు. ఎంతో ఆనందంగా. ఒకరోజు ఆ ఊరికి ఒక డబ్బు, అందం ఉన్న డైవోర్సీ వస్తుంది. అతను ఆమె మోహం లో పడుతాడు. క్రమంగా ఆమీకీ దాసోహం అవుతాడు. కానీ ఆమెని అతడు ఎవోయిడ్  చేస్తూనే ఉంటాడు. కానీ ఆ విరహ బాధని అతని భార్య కనిపెట్టేస్తుంది.

ఈ మధ్యలోనే మరో సంపన్న ప్లేబోయ్ లాంటి మధ్య వయస్కుడు ఆమెకి ప్రోపోస్ చేస్తాడు. ఆమె అతనిని తిరస్కరిస్తుంది. ఒకరోజు ఆమె ఒక పార్టీకి వెళుతుంది. అక్కడ అమ్మలక్కలు గుసగుసలు ఆడుకోవటం గమనించి అటుగా ఒక చెవి వేస్తుంది. ఆ అమ్మలక్కల గుసగుసలు తన మొగుడి గురించే!

“అతను ఆమెనీ వదలలేడూ, ఆ ప్రియురాలినీ వదలలేడూ” ఒక అమ్మలక్క.

“అంతేలే మరి. అతను ఆమె కొనుక్కున్న మొగుడు కదా!” రెండో అమ్మలక్క.

“అదేంటే అలా అంటావ్?” మూడో అమ్మలక్క.

“అవునే! అతను అప్పుల్లో  ఉంటే తన సొమ్ముతో అతన్ని వదిలించి కట్టుకుందిగా!” మొదటి అమ్మలక్క.

“అంతేగా మరీ! ఇక అతనేం చేస్తాడు. కట్టు బానిసలాగా పడున్నాడు. వెళ్ళా లేదూ! ఉండాలేడూ.” రెండో అమ్మలక్క.

ఆమెకి విషయం అర్ధమయ్యింది. “నేను కొనుక్కున్న మొగుడు. నేను కొనుక్కున్న మొగుడు?” ఆమె ఆలోచనలన్నీ ఆ అమ్మలక్కల మాతలగురించే! తల తిరుగుతున్నట్టుంటే ఇక అక్కడుండలేక ఆమె ఇంటికి వెళుతుంది. అక్కడ మరో దృశ్యం. భర్తా, ఆ ప్రియురాలూ! వారి డ్రాయింగ్ రూములో. వారి సంభాషణ వింటుంది. అతని మానసిక సంఘర్షణని గుర్తిస్తుంది. దీనికి పరిష్కారం ఎలా?

తన రూములోకి వెళ్లి ఆమె దిండులో మొహం దాచుకుని ఎంత సేపుంటుందో తెలీదు. ఆ మర్నాడు లేవగానే ఒక నిర్ణయానికి వస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్న ప్లేబోయ్ నడివయస్కుడిని తనతో క్లబ్బుకి రమ్మంటుంది. అతను ఆనందంగా ఒప్పుకుని అలాగే వెళుతాడు. అదే క్లబ్బుకి ఆమె భర్తా అతని ప్రియురాలూ వస్తారని ఆమెకి తెలుసు. అక్కడ వారి కంట తన కొత్త బోయ్ఫ్రెండ్ తో పడుతుంది.
ఈ విషయాన్ని అడిగిన భర్తని బలవంతంగా విడాకులకి ఒప్పిస్తుంది. కానీ ఆమె భర్తకి ఆ కనిపించిన విషయం మీద నమ్మకం ఉండదు. భార్యని అనుమానించడు. అవమానించడు. ఇండిఫెరెంట్ గానే ఆమెకి విడాకుల విషయంలో సహకరిస్తాడు. విడాకులు మంజూరయ్యాయి.

ఆమె తన కొత్త బోయ్ఫ్రెండ్ ని వేరే ఊరికి వెళ్ళిపోయి సంతోషంగా బ్రతుకుదామని అంటుంది. అతను ఆమె మాటని కాదనడు. ఆ రాత్రికే టిక్కెట్లు బుక్ చేయిస్తాడు. తన భర్త వద్ద కడసారి వీడుకోలు తీసుకుని, ఇకనైనా తన భర్త తనకి నచ్చిన అమ్మాయితో సంతోషంగా ఉంటాడని తృప్తిగా వెళుతుంది స్టేషన్కి.

అక్కడ ఆ ప్లేబోయ్ కాచుకుని ఉంటాడు. అతను ఆమెని సగౌరవంగా తన జీవితం లోకి ఆహ్వానించి రైలు లో కూచోపెడుతాడు. మొదటి స్టేషన్ రాగానే ఆమె అతనితో అంటుంది కదా! “నేను నా భర్తని తప్ప వేరెవరినీ ప్రేమించను.. అతను నాతో సంతోషంగా ఉండలేక పోతున్నాడు. అందుకే నిన్ను సాకుగా పెట్టి అతను నాకు విదాకులిచ్చేలా చేశాను. నేను నీతో ఉండలేను. అతనే నా అత్యుత్తమ విలువ అతనిని తప్ప నేను వేరే ఎవరినీ ప్రేమించలేను. ప్రేమ లేని చోట నేనుండలేను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి. నేను ఇక్కడ దిగిపోతున్నాను.”

అతనూ ఒక జంటిల్మన్ లా బిహేవ్ చేసి ఆమెకి సాదరంగా వీడుకోలు పలుకుతాడు. ఆమె వెళ్ళిపోతుంది అతనికి నెనెర్లు చెప్పి.

######                     ######                #######

మనం చిన్నప్పుడు చూసి పరమ బోరింగు సినిమాగా బ్రాండ్ వేసిన “సుమంగళి” సినిమాని గుర్తు తెచ్చుకోండి. ఆ సినిమాని నేను చాలా చిన్నప్పుడే చూశాను. నేనూ అలాగే బ్రాండ్ కొట్టి మళ్ళీ చూడలేదు. ఇక ముందూ చూడను కూడా. కానీ ఆ సినిమా గురించి నేను ఆలోచించాను. అలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే విలువల వలువలున్న సినిమా అది.

కథంతా అందరికీ తెలుసు. (అనుకుంటున్నాను). అందుకే నేరుగా విషయమ్లోకి వస్తున్నాను. నాగేశ్వరరావు సావిత్రిని మళ్ళీ పెళ్లి చేసుకోమంటాడు. ఒప్పుకోదు. అయినా అతను ఆమెని బలవంతంగా ఒప్పిస్తాడు. ఆమె అయిష్టంగానే ఒప్పుకుంటుంది. పెళ్లి మొదలవుతుంది. ఆమె మెల్లగా వచ్చి నాగేశ్వరరావు కాళ్ళకి నమస్కారం చేస్తూనే అలా పడిపోతుంది. ఆమె విషం తీసుకుని మరణిస్తుంది.

కంక్లూషన్ ౧: ఇదో పిచ్చి మెలో డ్రామా. మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వస్తున్నదని ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇంత ఒవరాక్షనా? మేము భరించలేము బాబోయ్. అసలెలా తీసే వాళ్లు అలాంటి సినిమాని? చూసేవాళ్ళు ఎలా భరించేవారు? ఈ ముసలోల్లున్నారే! (మనకి మాత్రం డైలాగు కొట్టటం కూడా రాదు.).

కంక్లూషన్ ౨: ఎంత మంచి సినిమా? ఇలాంటి సినిమాలు ఇప్పుడు వస్తున్నాయా? ఆ ఎగురుళ్ళు ఏంటి? ఆ వెకిలి హాస్యాలు ఏంటీ? సినిమాల్లో విలువలు పడిపోయాయి. వలువలూదిందే గొప్ప నటి! ప్చ్. మా రోజుల్లోనైతేనా? (అప్పుడూ వచ్చాయి. తిక్క సినిమాలు. పెద్దవాళ్ళు ఎందుకు గుర్తించరు?)

కంక్లూషన్ ౩: సావిత్రి కథనీ పైన నేను చెప్పిన కథనీ పోల్చండి. కొంచం ఆలోచించండి. నా ముగింపు మళ్ళీ చెపుతాను. రెండు లేదా మూడు రోజుల్లోనే.

నోట్: ఆ కథ నాది కాదు. ఎవరిదో ఎవరన్నా గుర్తు పడుతారా? నా ముగింపు తో పాటూ ఆ కథ గురించి చెపుతాను. కొంత కుదించటం వల్ల కథ అదోలా ఉండొచ్చు. కానీ ఇప్పటికే ఎక్కువ వ్యాసం వచ్చింది.

9 Comments
  1. జస్ట్ ఫర్ జాలీ October 23, 2008 /
  2. గీతాచార్య October 23, 2008 /
  3. గీతాచార్య October 23, 2008 /
  4. నీషీ నిష్ October 24, 2008 /
  5. గీతాచార్య October 24, 2008 /
  6. గీతాచార్య October 24, 2008 /
  7. ravi October 24, 2008 /
  8. Priya Iyengar October 27, 2008 /
  9. manibhushan July 16, 2013 /