Menu

సినిమాల్లొ మంచంటే ఏమిటి?

చలనచిత్ర సమీక్ష అన్నది సరిగ్గా ఎప్పుడు మొదలయ్యిందో చరిత్రకారులు చెప్పాల్సిన మాట.కానీ చిత్ర సమీక్షలు ఎన్నో రకాలు అన్నది అసలుసిసలు మాట కాగా,భారతదేశం లో చలనచిత్రాలు ప్రారంభమైన చోటే చిత్రసమీక్ష కూడా నిలిచిపోయిందనీ,పెద్దగా ఎదిగింది లేదని పలువురి అభిప్రాయం.అయితే సమీక్షలు సాధారణంగా తెలియజేసేవి అసలు మంచి సినిమాలు అంటే ఏమిటీ?చెడ్డసినిమాలు అనగా నేమి?అన్నది.కానీ సినిమాల్లొ మంచంటే ఏమిటి?చెడు ఎవరికి లేదా ఎవరికి చెడ్డ అని ప్రశ్నించే సమీక్షకురాలు,రచయిత్రి,నిర్మాత,దర్శకురాలు జుడిత్ విలియమ్సన్.బ్రిటన్ కు చెందిన జుడిత్ తనను తాను ఫెమినిష్టు,మార్క్సిస్టుగా చెప్పుకుంటారు,కానీ కొన్నిసార్లు ఆ పంధాకు కట్టుబడరని మరికొందరు విమర్సకులంటారు.జుడిత్ రచనలు చాలా కాలంగా పత్రికల్లో వెలువడుతూనే ఉన్నాయి.వాటిలో చాలా భాగం పుస్తకరూపంలొ కూడా వచ్చాయి.ఆమె రచనల్లో సినిమాప్రియులను,ముఖ్యంగా సినీసమీక్షకులు, విమర్శకులకు ఉపయోగపడేది,”డెడ్ లైన యట్ డాన్”అన్నది.

ఈ పుస్తకం లో ఆమె రచనలైన సినీసమీక్షలే కాక,ఇంటర్వ్యూలు,సినిమాపరిచయాలు,తను పాల్గొన్న వివిధ సమావేశాలలోని చర్చల సారాంశాలు,ఇలా అన్నిటినీ పొందుపరచారు.”సినిమా సమీక్ష అనేది చదివాక పాఠకుడికి సదరు సమీక్షతో పాటు అసలు సినిమా అన్న మాధ్యమం గురించి కూడా అవగాహన ఏర్పడాలి,ప్రతీ సమీక్షతో ఆ అవగాహన పెరిగుతుండేలా ఉండాలి”అన్నది జుడిత్ అభిప్రాయం.

కాకుంటే తరచూ ఆమె పదాలతో,వాక్యాలతో చేసే విన్యాసాలు పాఠకులను ఇబ్బంది పెడతాయనే అపప్రధ కూడా ఉంది.దానికి మారుతున్న కాలంతో పాటు సమీక్షా,ఆ సమీక్షను పఠితలకు అందించే పద్ధతీలోనూ మార్పు రావాలంటారు జుడిత్.

ఆవిడ స్వయంగా కొన్ని చిత్రాలు అంటే మామూలు వ్యాపారచిత్రాలు కాక ఇండిపెండెంట్,డాక్యుమెంటరీ సినిమా(లు) రూపొందించారు.వాటిలో “A Sign Is a Fine Investment” ప్రముఖమైనది.ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ వారి కోసం 1983 లో తీసిన ఈ46 నిమిషాల సినిమాకు రచనకూడా ఆమెదే.అలాగే కొన్ని టెలివిజన్ సిరీస్ లొ కూడా పాల్గొన్నారు.జుడిత్ రచనాశైలి ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ,”ఈ మధ్య పేదలకోసం, పేదలతరపునా మాట్లాదుతున్నామంటూ కొందరు బయలుదేరారు,కానీ పేదలు తమతరపున తాము మాట్లాదుకొగలరు,కాస్త ఈ పెద్దమనుషులు వాళ్ళకా అవకాశమివ్వనివ్వండీ “.,”డెడ్ లైన యట్ డాన్” పుస్తకాన్ని సమీక్షించిన ఒకపెద్దాయన,ఇవన్నీ సరే గాని,సినిమా చూసేటప్పుడు ఈ క్రిటిక్స్ కాస్త కళ్ళుతెరిచి చూస్తూ ఉంటే ఎంతబాగుండూ అన్నారు.

1980-1990 ల మధ్య కాలంలోవచ్చిన సినిమాలు,మీడియా పోకళ్ళు,పాపులర్ కల్చర్ లో వచ్చిన మార్పులు ఇలా కాస్త సాధికారతాపూర్వకమైన  పఠనం కోసం,అవసరమైనప్పుడు రిఫరెన్సు కోసం సంప్రదించాల్సిన పుస్తకం “,”డెడ్ లైన యట్ డాన్”.

Deadline at Dawn: Film Criticism 1980-1990
Hardcover: 368 pages
Publisher: Marion Boyars Publishers (January 1993)
Language: English
ISBN-10: 0714529648
ISBN-13: 978-0714529646
గమనిక:వీలైనప్పుడల్లా ఇలాంటి సినిమాలకు సంబంధించిన పుస్తకాలను పరిచయం చేద్దామన్నది నా భావన.ఇది పుస్తకసమీక్ష కాదు,కేవలం పరిచయం  మాత్రమే అని సహృదయులైన నవతరంగం పాఠకులు గ్రహించాల్సిందిగా మనవి.

2 Comments
  1. శంకర్ October 23, 2008 /
  2. shree October 24, 2008 /