Menu

Burn After Reading – Forget after watching

Coen brothers ఈ సారి meaningless comedyతో ముందుకొచ్చారు. గత సంవత్సరం ఆస్కార్ పంట పండించిన నో కంట్రీ ఫర్ ఓల్డ్ మన్ నే మసిపూసి మారెడుకాయచేసినట్టు ఉన్న ఈ Burn after reading సినిమా కాలక్షేపానికి ఒకసారి చూడొచ్చు. సినిమా అంతా చాలా ఆహ్లాదంగా నడిచినప్పటికీ ఎందుకో అనుకున్నంత స్ధాయిలొ లేదనిపిస్తుంది. ఒకవేళ హాలివుడ్ దీగ్గజాలందర్నీ పెట్టుకొని ఇలా spy comedy పేరుతో ప్లాట్‌ని పూర్తిగా మర్చిపోవడమే అందుకు కారణం కావచ్చు.
కధలోకి వస్తే CIA ఎనాలసిస్ట్ గా పనిచేసే Cox(John Malkovich)ని తాగుబోతు ముద్రవేసి వేరే సెక్షన్లోకి ట్రాన్స్ఫర్ చేసే తంతుతో మొదలవుతుంది. Cox మాత్రం అసలు కారణం చెప్పకుండా తనను తాగుబోతుగా చిత్రీకరిస్తున్నారని ఫీలైపొయి ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాడు. తన CIA అనుభవాలతో ఒక memoir రాద్దామని నిర్ణయం తీసుకుంటాడు. మరోవైపు Cox భార్య Katie(Tilda Swinton) Harry(George cloony) అనే ట్రెజరీ ఏజెంట్‌తో ప్రేమాయణం సాగిస్తూ ఉంటుంది. Cox నుండి విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్న Katie లాయర్ ఆజ్ఞ ప్రకారం Cox లేని సమయం చూసి అతని కంప్యూటర్‌లోని పర్సనల్ డేటా అంతా ఒక CDలోకి కాపీ చేసిస్తుంది. ఆ లాయర్‌గారి సెక్రటెరీ ఆ CDని ఒక gym lockerలో పెట్టి మర్చిపోతుంది. అంతకుముందే హార్డ్ డ్రైవ్ మీద ఒక కాపీ ఉందడంతో మరో కాపీ రెడీ చేసి సమస్య తీరిపోయిందనుకుంటుంది. కానీ ఆ CD gymలో పనిచేసే Chad(Brad Pitt) కంటబడడంతో అనుకోకుండా అందరి లైఫ్‌లోనూ పెద్ద గందరగోళం ఏర్పడుతుంది. అదే gymలో పనిచేసే స్నేహితురాలి Linda (Francis McDormand)తో కలిసి ఆ CDని Coxకి అప్పగించి రివార్డ్ పొందాలనుకొని అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు. అసలే కొంచం తిక్క మనిషి అయిన Cox వీళ్ళని బ్లాక్ మెయిలర్స్ అంటాడు. Linda కూడా బ్లాక్ మెయిలింగ్ ద్వారానే త్వరగా పని అవుతుందనీ ఆ వచ్చే డబ్బుతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనీ తహతహలాడిపోతుంది. ఆ బ్లాక్మెయిలింగ్ కూడా ఫెయిల్ అవ్వడంతో ఆ CDని రష్యన్ ఎంబసీలో ఇచ్చి తమదగ్గర ఇంకా చాలా ఇంఫర్మేషన్ ఉందనీ డబ్బిస్తే అది కూడా ఇస్తామనీ అంటారు. అయితే ఆ CD తప్ప తమ దగ్గర మరే ఆధారం లేకపొవడంతో Cox ఇంట్లో నుండి సంపాదించేందుకు Chadని పంపిస్తుంది Linda. కాని అప్పటికే Katie Coxని ఇంట్లో నుండి తరిమేయడం Harry ఆ ఇంట్లోకి అనఫీషీయల్ ఎంట్రీ ఇచ్చేయడం కూడా జరిగిపోతాయి. ఎవరూ లేని సమయంలో ఆ ఇంట్లోకి ప్రవేసించిన Chadకు జాగింగ్ నుండి వెనక్కి తిరిగొచ్చేసిన Harry తలుపు తీయడం కనిపించి వార్డ్ రొబ్ లో దాకుంటాడు. ఆ సమయంలో అనుకోకుండా జరిగిన ఒక సంఘటనతో మొత్తం అందరూ చాలా క్రిటికల్ పరిస్ధితుల్లోకి వెళ్ళిపోటారు. అదేమిటో… వీళ్ళు చివరికి ఏమయ్యరో, ఇన్ని జరుగుతుంటే CIA ఏమి చేసిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

జార్జ్ క్లూనీ,ఫ్రాన్సిస్ మెక్‍డొర్మెన్డ్, జాన్ మల్కోవిచ్,టిల్డా స్విన్టన్ అందరూ గతంలో ఏదో ఒకసారి ఆస్కార్‍కి నామినేట్ అయిన నటులే. వీళ్ళకి తోడు బ్రాడ్ పిట్ కలవడంతో భరీతారాగణంతో నిండిపోయి చాలా రిచ్‍గా కనిపిస్తుంది సినిమా. అన్ని పాత్రలు కొంచెం తిక్క కలిగినవే కావడంతో వాళ్ళ మధ్య అపోహలు నవ్విస్తూంటాయి. Coen brothers బ్రాండెడ్ హింసాత్మక దృశ్యాలు కూడా ఉన్నప్పటికీ వాటిని కామెడీతో కప్పిపుచ్చేసారు. యధావిధిగా స్టన్నింగ్ ట్విస్టులూ ఉన్నాయి. బ్రాడ్ పిట్‍ని చూస్తే చాలు నవ్వొస్తుంది ఈ సినిమాలో.  కధేమీ లేకుండా అంత పెద్ద పెద్ద స్టార్లను ఏం చెప్పి ఒప్పించగలిగారో అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.  టిల్డా స్విన్టన్‍కి మైఖెల్ క్లేటన్ మత్తు ఇంకా దిగనట్టుగా ఉంది. చాలా సీరియస్‍గా ఆ సినిమాలో పాత్రనే తిరిగి పోషించినట్టుంది. జార్జి క్లూనీ,జాన్ మల్కోవిచ్‍ల స్ధాయికి ఏమాత్రం సరిపడని పాత్రలు అవి. వాటిని ఎవరు చేసినా అలానే ఉంటుంది. ఏం అంత నటించే స్కోప్ ఉందని వాళ్ళిద్దరూ ఒప్పుకున్నరో. ఇంతకు ముందు కూడా coen brothers సినిమాల్లో జార్జి క్లూనీకి ఇలాంటి పాత్రలే ఇచ్చారు, అందులోని మర్మమేంటో వాళ్ళకే తెలియాలి. ఏ పనీ లేనప్పుడు టైంపాస్‍కి చూసి వదిలేయాల్సిన సినిమా. బోర్ కొట్టదు కానీ, చూసిన తర్వాత వేంటాడే సన్నివేశం ఒక్కటి కూడా లేకపోవడం ఓ చిన్న వెలితి.

10 Comments
  1. మంజుల October 22, 2008 /
  2. అబ్రకదబ్ర October 22, 2008 /
  3. నీషీ నిష్ October 22, 2008 /
  4. కొత్తపాళీ October 23, 2008 /
  5. కొత్తపాళీ October 23, 2008 /
  6. అబ్రకదబ్ర October 23, 2008 /
  7. Jonathan October 23, 2008 /
  8. ravi October 23, 2008 /
  9. గిరి October 23, 2008 /
  10. Srinivas October 24, 2008 /