Atticus Finch

atticus-lead

Atticus ఒక పరమ బోరు తండ్రి. అతడు పుట్టుముసలి అని అతని పిల్లల అభిప్రాయం. పిల్లలతో Football ఆడడు, ఇతర తండ్రులలా వేటకి తీసుకువెళ్ళడు. తుపాకి పేలచడం కూడా వచ్చో రాదో! ఎన్ని సార్లు అడిగినా కొడుకు Jemకి తుపాకి కొనిపెట్టలేదు మరి! పిల్లలు ఎంత అల్లరి చేసినా కొట్టడు. కూతురు మగరాయడిలా overalls వేసుకు తిరుగుతుంది. అందరితోటి కొట్ట్లటలే ఆ అమ్మాయి కి, ఇంటి ఎ.దురుగా ఉండే ముసలావిడ దగ్గిరనించి పాఠశాలలొ పిల్లలు, ఉపాధ్యాయుల వరుకు. అయినా పిల్లకు అతడు Hero. అవును మరి, ఆ పిల్లకి అతడే ప్రపంచం.

ఇవన్ని చదివి Atticus పరమ మెతక మనిషి అనుకునేరు. మహ మొండి మనిషి! లేకపోతే ఎవరైన నల్ల జాతి వ్యక్తి గురించి కోర్తులొ వాదిస్తారా? వాదించినా అతని నిర్దోషిగా నిరూపించాడానికి ప్రయత్నిస్తారా? ఆ నల్లజాతి వ్యక్తి ప్రాణాలకి ప్రమాదం ఏర్పడినప్పుడు రాత్రంతా ఒక పుస్తకం(తుపాకి కాదు) పుచ్చుకుని కాపలా కాస్తారా?

Atticus ఒక వ్యక్తి:
1930sలో depression eraలో అమెరికాలో దక్షిణ రాష్ట్రాలలో నల్లజాతి వారికి పెద్దగా హక్కులు ఉండేవికావు. ఆ సమ్యంలో ఒక నల్లజాతి బ్యక్తి తరఫున వాదించడం ఒక సామాన్య విషయంకాదు. తను నమ్మిన సత్యాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించే పాత్ర Atticus. అతడు అబద్ధం చెప్పడు. ప్రపంచంలో వ్యక్తులందరు సమానులే అని అతడి అభిప్రాయం. నలుగురికి సాయపడే మనిషి. ఎవరిని తన point of view నించి judge చెయ్యకూడదు అని అతడి ఉద్దేశం. బహుశా అందుకనే చాల మంచి వేటగాడయినా ఎప్పుడు వేటాడడు.

Atticus తండ్రి:
అతడు పిల్లలకి ఎంత చనువిచ్చినా, వారిని మంచి మనుషులు గా తీరిచి దిద్దలని తపన పడతాడు. పిల్లకి విడమరిచి చెపితే అర్ధం అవుతుందని అతని అభిప్రాయం. ఇతరులని ఏమాత్రం బాధపెట్టనివ్వడు. తండ్రి ప్రమాదస్తితిలో ఉన్నప్పుడు పిల్లలు అక్కడే నిలబడతారు తండ్రికి సాయంగా.

ఒకసారి Atticusని Scout అడుగుతుంది నువ్వు ఎందుకు ఎవ్వరికి ఇష్టం లేని పని చేస్తున్నావని. దానికి అతడు చెప్పే సమాధనం, నీకు ఇప్పుడు చెప్పినా అర్ధంకాదు,. నేను ఈ పని చెయ్యకపోతే నేను ఎప్పటికి మీకు చెడు చెయ్యవద్దని చెప్పె హక్కుని కోల్పొతానని. అది ఆ పాత్ర ఉదాత్తత.

AFI 100 years 100 charactersలో అత్త్యుత్తమ పాత్ర కింద ఎంపికయిన పాత్ర ఇది. Gregory Peck ఈ పాత్రకి జీవం పోసాడు.

నేను చిత్రం గురించి పెద్దగా చెప్పలేదు. అది వేరే వ్యాసం.

—-మంజుల

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

5 Comments to “Atticus Finch”

  • ఈ పాత్ర ఏచిత్రంలోనిదో మీరు “ట్యాగులు” లో పెట్టారుగానీ, వ్యాసంలోకూడా చెప్పాల్సింది. మంచి పాత్ర గురించి పరిచయం చెసారు. ఇలా ఉత్తమ పాత్రల గురించి చెప్పడం ఆసక్తికరంగా వుంది.

  • Thank you!!

  • నేను తర్వాత ఈ చిత్రం గురించి వ్యాసం కూడా రాయదలిచాను. ఒక విషయం రాయడం మరిచాను. Atticus Finch పాత్ర ఒక typical southern Intellectual పాత్ర.
    నా ఉద్దేశంలో చిత్రాన్ని నడిపిచేవి పాత్రలు. ఇలా అప్పుడప్పుడూ పాత్ర పరిచాయాలు రాయదలిచాను, నా లిస్టులొ తర్వాతది Micheal Corleone.

  • Micheal Corleone…. వావ్,రాయండి రాయండి,ఇన్ని సంవత్సరాల నాప్రేక్షకజీవితములో కత్తిలాంటి నటుడు అనుకున్నది కుర్ర డినీరోని ,అలాగే మైఖేల్ గా అల్పసినో వావ్ ఎదురుచూస్తున్నాం మంజులగారు…

  • ఇది సినిమా చూశాను, నవల చదవలేదు. సినిమా చాలా బావుంటుంది.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories