Menu

లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు -1

నవతరంగం పాఠకులకు నమస్కారం.

ఈ నెల పదిహేనవ తేదీ నుంచి లండన్ లో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం గురించి మీకు తెలిసే వుంటుంది. ఈ చిత్రోత్సవంలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన 300 సినిమాలను ప్రదర్శిస్తున్నారు.పది పదిహేను రోజుల్లో అన్నీ సినిమాలు చూడడం కుదరకపోయినా కనీసం ఒక యాభై సినిమాలైనా చూడాలనే లక్ష్యం పెట్టుకుని నేనూ ఈ పండగ లో భాగం అయ్యాను.ఈ రోజు ఈ చిత్రోత్సవంలో ఆరవ రోజు. ఇప్పటి వరకూ ఈ చిత్రోత్సవం లో నేను చూసిన సినిమాల గురించి తెలియచేసే మొదటి రిపోర్టు ఇది.ఈ చలనచిత్రోత్సవంలో నేను చూసిన సినిమాల వివరాలు.

Note:ఈ సినిమాల గురించి పూర్తి  స్థాయి సమీక్షలు ఇక్కడ పొందు పరచడం లేదు. చలనచిత్రోత్సవం తర్వాత, అన్నీ కాకపోయినా కొన్ని ముఖ్యమైన సినిమాల గురించి పూర్తి స్థాయి సమీక్షలు వ్రాసే ప్రయత్నం చేస్తాను.

1)Once Upon a Time in the West

ఈ చలనచిత్రోత్సవం లో నేను మొదటిగా చూసిన సినిమా Once Upon a Time in the West. Sergio Leone అనే ఇటాలియన్ దర్శకుడు రూపొందించిన వెస్టర్న్ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా గురించి చాలా మందికి తెలిసే వుంటుంది. నటీ నటుల నటన, సంగీతం, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ అన్నీ సినిమాకి హైలైట్స్. మళ్ళీ మళ్ళీ చూసి ఆనందిచగలిగే సినిమా. ఈ సినిమాని ఈ చలన చిత్రోత్సవం సందర్భంగా డిజిటల్ గా restore చేసి చాలా ఏండ్ల తర్వాత వెండి తెరపై ప్రదర్శించారు. చాలా సార్లు చూసిన సినిమా అయినప్పటికీ వెండి తెరపై చూసిన అనుభూతి చాలా బావుంది.

2)Kala

ఇది ఇండోనేసియా నుంచి వచ్చిన సినిమా. హారర్ సినిమాలా మొదలయ్యి ఫాంటసీ సినిమాగా ముగుస్తుంది. ఇలాంటి సినిమాలనే Genre Benders అంటారట! సినిమా ఎత్తుగడ బావుంది. కథ, కథనం ఆసక్తిగొలిపేలా ఉన్నాయి. ఇండోనేసియాలోని ఒక పట్టణం. అనుకోని పరిస్థుతుల్లో ప్రజలు మరణిస్తుంటారు. ఆ కేసు పరిశోధించే ఇన్స్పెక్టర్, మరియు ఒక వార్తా పత్రిక రిపోర్టర్ ఇందులో ప్రధాన పాత్రలు.

జపనీస్ సినిమా రింగ్ ఈ సినిమాకి తప్పకుండా ప్రేరణ అనిపించింది. కథ కథనం రెండూ కూడా దానిలాగే ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని really scary moments ఉన్నాయి.

గొప్ప సినిమా కాదు. అలా అనీ మరీ తీసెయ్యాల్సిన సినిమా కూడా కాదు. కాకపోతే ఇలా చలనచిత్రోత్సవంలో చూసీ తరించాల్సిన సినిమా మాత్రం కాదు.

3)Welcome to Sajjanpur

ఈ సినిమా గురించి ఇప్పటికే నవతరంగం పాఠకులకు తెలిసేవుంటుంది. శ్యాం బెనగల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఫర్వాలేదనిపించే సినిమా. కానీ గతంలో వచ్చిన శాం బెనగల్ సినిమాలతో పోల్చదగ్గది కాదు. ఇది నా మాట కాదు. ఇక్కడ చాలా మంది విమర్శకుల మాట 🙂

4)Frozen River

అమెరికా లోని ఒక కుటుంబం కథ ఇది. క్రిస్టమస్ దగ్గరకొస్తుంటుంది. ఆ కుటుంబానికి ఆధారమైన భర్త ఇంట్లోని డబ్బులన్నీ దొంగలించి ఎటో పారిపోతాడు. తనకున్న చిన్న ఉద్యోగంతో ఎలాగో కుటుంబాన్ని నడిపించే ప్రయత్నం చేస్తుంది భార్య. ఇలాంటి పరిస్థుతుల్లో ఆమెకి మరో యువతి పరిచయం అవుతుంది. ఇద్దరూ కలిసి కెనడా నుంచి illegal immigrants ని తీసుకొచ్చి డబ్బు సంపాదిస్తుంటారు. ఈ మహిళలిద్దరి కథ ఇది.

ఇండిపెండెంట్ సినిమా. Sundance చలనచిత్రోత్సవం విజేత. హాలీవిడ్ సినిమాలకి లాగ భారీ నిర్మాణ విలువలు లేవు. ఉన్నదల్లా ఆసక్తి గొలిపే కథనం, మంచి నటన. మంచి సినిమా తప్పక చూడొచ్చు.

5)The Class
ఫ్రెంచ్ సినిమా. ఈ మధ్యనే జరిగిన Cannes చలనచిత్రోత్సవంలో అత్యుత్తమ సినిమా పురస్కారం అందుకుంది. ఇప్పటి వరకూ ఈ చిత్రోత్సవంలో నేను చూసిన అత్యుత్తమ సినిమా.

కథంటూ పెద్దగా ఏమీ లేదు. పారిస్ లోని ఒక పాఠశాల. శెలవుల తర్వాత ఆ పాఠశాల మొదలయిన రోజు సినిమా మొదలవుతుంది, ఆఖరు రోజున ముగుస్తుంది. మొత్తం ఆ పాఠశాలలోనే నడుస్తుంది. అదీ కూడా మొత్తం పాఠశాలలో కాకుండా ఆ పాఠశాలలోని ఒక క్లాస్ రూం లో మొత్తం సినిమా నడుస్తుంది.

ఒక క్లాస్ రూం లో నాలుగు గోడల మధ్య ఒక టీచర్ మరియు ఆ క్లాసు విద్యార్థుల మధ్య జరిగే రోజువారీ సంఘటనలే ఈ సినిమాలోని సన్నివేశాలన్నీ కూడా.

దాదాపు అందరూ కొత్త నటులు.హ్యాండ్ హెల్డ్ కెమెరా.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక అసలే లేదు.ఎడిటింగ్, సినిమాటొగ్రఫీ సూపరు.రియలిస్టిక్ సినిమా.  యాక్టింగ్ గురించి చెప్పలేను. చూసి తీరాల్సిందే. వివిధ జాతులనుంచి వచ్చిన టీనేజ్ విద్యార్థులు, వారి ఆలోచనలకు అద్దం పట్టిన సినిమా.

ఈ సంవత్సరంలో వచ్చిన అత్యుత్తమ సినిమాల్లో ఒకటి. తప్పక చూడాల్సిన సినిమా.

Sorry for the delay (If any one was waiting!)

4 Comments
  1. chandramouli October 20, 2008 /